అవినీతిని ప్రోత్సహించే ప్రస్తకే లేదు : ఎమ్మెల్యే రక్షణ నిధి | Tiruvuru MLA Rakshana Nidhi meeting With Municipal officers | Sakshi
Sakshi News home page

అవినీతిని ప్రోత్సహించే ప్రస్తకే లేదు : ఎమ్మెల్యే రక్షణ నిధి

Published Thu, Aug 8 2019 2:37 PM | Last Updated on Thu, Aug 8 2019 2:37 PM

Tiruvuru MLA Rakshana Nidhi meeting With Municipal officers - Sakshi

సాక్షి, కృష్ణా : నియోజకవర్గంలో అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి స్పష్టం చేశారు.  తిరువూరు పట్టణ సమస్యలపై ఎమ్మెల్యే రక్షణనిధి మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా మున్సిపల్‌ అధికారులు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని, ప్రజలకు నాన్‌ అమృత్‌ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గతంలో పాలకులు పట్టణానికి కృష్ణాజలాలు తెస్తామని చెప్పి కేవలం శిలాఫలకాల పేర్లకే ప్రాముఖ్యత ఇచ్చారని, గత పాలనలో జరిగిన అవినీతినపై దర్యాప్తు చేపడతామని అన్నారు. వర్షాలకు ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మత్తులు చేపడతామని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నిర్మూలనకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉన్నత సేవలను అందించేలా మున్సిపల్‌ సిబ్బంది కృషి చేయాలని, మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న సిబ్బంది కొరతను తీర్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement