
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు తమని విమర్శించడం సిగ్గు చేటని వైఎస్పార్‌సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మండిపడ్డారు. శనివారం ఆయన తిరువూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ ప్రత్యేక హోదాకు మద్ధతుగా తెలంగాణ కేసీఆర్ నిలబడుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా వారి ఫెడరల్ ప్రంట్ కూడా మన ప్రత్యేక హోదాకు డిమాండ్ కు మరింతగా మద్దతు చేకూరుతుందనే వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అభిప్రాయం అని అన్నారు.
బాబు మీలాగా ప్రజలకు పూటకో మాట, గంటకో అబద్ధమాడటం ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మాకు చేతకాదని అన్నారు. ఏపీ ప్రయోజనాలు విషయంలో రాజీలేని పోరాటం చేయబట్టే జాతీయ పార్టీలకు ఏనాడు లొంగకుండా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 13 రాజకీయ కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జాతీయ పార్టీలతో లాలూచీ పడబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కేసులు లేకుండా, ఉన్న కేసులు ముందుకు కదలకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండానే ఒంటరిగానే వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని రక్షణనిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment