బిడ్డను చావు తరుముతోంది.. చక్రం అడ్డేయరూ!
► పేద తల్లిదండ్రుల కన్నీటి వేడుకోలు
► రెండు కిడ్నీలూ చెడిపోయిన బాలుడు
► కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన నానమ్మ
వీరవల్లిపాలెం (అయినవిల్లి) : ఓ నిరుపేద బాలుడిపై మృత్యువునీడ పరుచుకుంటోంది. 14 ఏళ్లకే నిండునూరేళ్ల జీవితానికి తెరపడే ముప్పు ముంచుకొస్తోంది. ‘ఇంటికో పువ్వు.. ఈశ్వరునికో మాల’ అన్నట్టు.. కరుణ కలిగిన వారు తలో కొంత పైకం వితరణ చేస్తే తమ బిడ్డ బతుకుతాడని, వారికి బతుకంతా రుణపడి ఉంటామని చేతులు జోడించి అర్థిస్తున్నారు అతడి అమ్మానాన్నలు. మండలంలోని వీరవల్లిపాలేనికి చెందిన మామిడికుదురు సత్యనారాయణ, శ్రీదేవి దంపతుల కుమార్తె విజయలక్ష్మి 8 ఏళ్ల క్రితమే కామెర్లతో మరణించింది. ఆ విషాదంతో కుంగిపోరుున దంపతులు కుమార్తెను కూడా కుమారుడు మణికంఠలోనే చూసుకుంటూ తేరుకున్నారు.
ముక్తేశ్వరం కోనసీమ విద్యాశ్రమ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మణికంఠకు రెండు నెలల క్రితం సుస్తీ చేయగా వైద్యులకు చూపించారు. వైద్యపరీక్షల్లో అతడి రెండు కిడ్నీలూ చెడిపోరుునట్టు తేలింది. కిడ్నీ మార్పిడి చేయకపోతే మణికంఠ దక్కడని వైద్యులు చెప్పారు. బాలుడి నానమ్మ సత్యవతి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యూరు. అరుుతే ఆమె కిడ్నీని మనుమడికి అమర్చే ఆపరేషన్‌కు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించే సత్యనారాయణ అప్పటి వరకూ అయిన వైద్యానికే పుట్టిన చోటల్లా అప్పులు చేశారు.
రూ.5 లక్షలు సమకూర్చుకోవడం తమకు కలలోని మాటని, ఉదారులు స్పందించి, సహాయహస్తం అందించి, తమ బిడ్డకు పునర్జీవితాన్ని ఇవ్వాలని సత్యనారాయణ, శ్రీదేవి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. దాతలు తోచిన సాయూన్ని ‘మామిడికుదురు సత్యనారాయణ, ఖాతా నం: 32868328153, ఎస్‌బీఐ ముక్తేశ్వరం బ్రాంచి (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్ 0002759)’కి జమ చేయూలని, ఏమైనా వివరాలు కావలస్తే 9666976566 సంప్రదించాలన్నారు. మార్పిడి ఆపరేషన్ ఖర్చు రూ.5 లక్షలు