save child
-
ఆ బాలుడు మృత్యుంజయుడు.. అయిదు రోజులు బోరుబావిలో ఉండి..
జనిగిరి: చుట్టూ చిమ్మ చీకటి, 68 అడుగుల లోతైన బోరుబావిలో పాము, తేళ్లు, కప్పలు తిరుగుతూ ఉంటే మానసిక వికలాంగుడైన 11 ఏళ్ల బాలుడు దాదాపు 5 రోజులు గడిపాడు. బావిలో ఆడుకుంటూ పడిపోయిన రాహుల్ సాహు అనే బాలుడు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎట్టకేలకు 104 గంటల సేపు శ్రమించిన 500 మంది సహాయ సిబ్బంది రోబో సాంకేతికతో బయటకు తీసుకువచ్చారు. బావిలో ఉన్న పాము ఆ బాలుడిని ఏమీ చేయలేదని సహాయ సిబ్బంది వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జహ్నగిరి–చంపా జిల్లాలోని పిర్హిడ్ గ్రామంలో రాహుల్ సాహు బోరు బావిలో పడిపోయిన ఘటన ఈ నెల 10న జరిగింది. రామ్‌కుమార్, గీతాసాహుల కుమారుడైన రాహుల్ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాడు. బోరు తవ్వి నీళ్లు పడకపోవడంతో దానిపై ఒక షీట్ కప్పి ఉంచారు. రాహుల్ సాహు మానసికంగా పూర్తిగా ఎదగకపోవడంతో ఆ షీట్ చూసుకోలేదేమో ఏమో బావిలోకి జారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సమాంతరంగా మరో బోరు తవ్వినా మొదట్లో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అయిదు రోజులు శ్రమించి రోబో టెక్నాలజీ సాయంతో ఆ బాలుడిని మంగళవారం అర్ధరాత్రి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్‌కి ప్రథమ చికిత్స చేసిన అనంతరం బిలాస్‌పూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మానసిక వికలాంగుడైనప్పటికీ రాహుల్ సాహు మొదట్నుంచి పోరాటపటిమ ప్రదర్శించేవాడు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేసేవాడు. తబలా కూడా బాగా వాయిస్తాడని తల్లిదండ్రులు చెప్పారు. -
మృగాడి నుంచి కాపాడినందుకు 15 ఏళ్లు శిక్ష
మాస్కో: ఓ కారు మెకానిక్ కోసం ఉఫా ప్రజలు ఏకమయ్యారు. అతడికి విధించిన శిక్ష అన్యాయమైనది అని.. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 70 వేల మంది సంతకాలు చేసిన లెటర్ని ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం కారు మెకానిక్ వ్లాదిమిర్ సంకిన్ అక్కడి ప్రజల దృష్టిలో హీరోగా నిలిచాడు. ఇంతకు జనాలు ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారు.. అసలు కోర్టు అతడికి ఎందుకు శిక్ష వేసిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. రష్యా ఉఫా నగరంలో నివసిస్తున్న వ్లాదిమర్ సంకిన్ కారు మెకానిక్‌గా పని చేస్తూ, భార్య, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఆనందంగా సాగిపోతున్న అతడి జీవితాన్ని ఓ సంఘటన మలుపు తిప్పింది. ఉన్నట్టుండి అతడు హంతకుడిగా మారాడు. అది కూడా ఒకరికి సాయం చేయబోతూ. ఏం జరిగింది.. ఓ రోజు వ్లాదిమర్ సంకిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ పదిహేనేళ్ల కుర్రాడు సాయం చేయాల్సిందిగా కేకలు వేయడం సంకిన్‌కు వినిపించింది. దాంతో వెంటనే కేకలు వచ్చిన అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లాడు. అక్కడ దృశ్యం చూసి అతడి రక్తం మరిగిపోయింది. ఓ పశువు ఇద్దరు మైనర్ కుర్రాళ్లపై అత్యాచారానికి ప్రయత్నిస్తున్నాడు. బాలురిద్దరికి ఒంటి మీద బట్టలు లేవు. నిందితుడు వారి చేత బలవంతంగా మద్యం తాగించినట్లున్నాడు. దాంతో పిల్లలు ఎటు పారిపోలేని స్థితిలో ఉన్నారు. ఈ దృశ్యాలు చూడగానే సంకిన్ ఆలస్యం చేయకుండా నిందుతుడిని చితకబాదాడు. ముఖం, తల మీద బలంగా దాడి చేశాడు. సంకిన్ దెబ్బలకు తాళలేక నిందితుడు కింద పడిపోయాడు. ఇక పిల్లల్నిద్దర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిన సంకిన్ అంబులెన్స్‌కి కాల్ చేశాడు. దురదృష్టం కొద్ది ఆస్పత్రికి తీసుకెళ్తుండగా నిందితుడు మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంకిన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడికి 15 సంవత్సరాల శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు చెప్పింది. (చదవండి: అమానుషం.. పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది) సంకిన్‌కు మద్దతుగా.. అయితే కోర్టు తీర్పును జనాలు వ్యతిరేకిస్తున్నారు. ఓ మృగాడి బారి నుంచి పిల్లల్ని కాపాడాడు. అలాంటి వ్యక్తికి శిక్ష విధించడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితుడు వ్లాదిమిర్ జైట్సేవ్ ఒక పెడోఫిలె (చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడేవాడు). గతంలో ఇదే నేరం కింద పోలీసులు రెండు సార్లు అతడిని అరెస్ట్ చేశారు. జైలు జీవితం కూడా అనుభవించాడు. కానీ అతడిలో మార్పు రాలేదు. మరో సారి ఇలాంటి దారుణానికి పాల్పడుతుండగా.. సంకిన్ అతడి నుంచి చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నిందితుడు జైట్సేవ్ మరణించాడు. దాంతో జనాలు సంకిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అతడు రియల్ హీరో పిల్లలను కాపాడి న్యాయం చేశాడు. కానీ కోర్టు అతడికి శిక్ష విధించి అన్యాయం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మాల్లో ప్రముఖ నటికి లైంగిక వేధింపులు) ఇక దీనిపై సంకిన్ స్పందిస్తూ.. ‘ఆ కుర్రాడు సాయం కోరినప్పుడు నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నా దారిన నేను వెళ్లడం.. రెండు వారిని కాపడటం. నేను రెండోదాన్ని ఎంచుకున్నాను. నా స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు’ అని తెలిపాడు. ఇక వ్లాదిమర్ తరపు న్యాయవాది అతడి శిక్షను రద్దు చేయాలని లేదా తగ్గించాలని కోరుతున్నాడు. -
మహిళ సాహసం
-
బీరూట్ బీభత్సం : మహిళ సాహసం
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నెత్తురోడింది. మంగళవారం సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగు వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీంతో బీరూట్ నగరమంతా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శన మిస్తున్నాయి. ఈ పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వివినిపించినట్టు తెలుస్తోంది. బీరూట్ నగరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసరాల ప్రాంతాల భవనాల కిటికీల అద్దాలు పగిలి పోవడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే.. ఒక్క క్షణం నిశ్చేష్టులవడం ఖాయం. [ చదవండి: బీరట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? ] ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బాంబు దాడి కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన దాడిలా ఉందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. అయితే పోర్ట్‌సైడ్ గిడ్డంగిలో కొన్నేళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల వ్యవసాయ ఎరువు అమ్మోనియం నైట్రేట్ కారణంగా పేలుడు సంభవంచి ఉంటుందని ప్రధాని హసన్ డియాబ్ అన్నారు. ఇలా నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదంటూ లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు. అయితే పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిడ్డను చావు తరుముతోంది.. చక్రం అడ్డేయరూ!
► పేద తల్లిదండ్రుల కన్నీటి వేడుకోలు ► రెండు కిడ్నీలూ చెడిపోయిన బాలుడు ► కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన నానమ్మ వీరవల్లిపాలెం (అయినవిల్లి) : ఓ నిరుపేద బాలుడిపై మృత్యువునీడ పరుచుకుంటోంది. 14 ఏళ్లకే నిండునూరేళ్ల జీవితానికి తెరపడే ముప్పు ముంచుకొస్తోంది. ‘ఇంటికో పువ్వు.. ఈశ్వరునికో మాల’ అన్నట్టు.. కరుణ కలిగిన వారు తలో కొంత పైకం వితరణ చేస్తే తమ బిడ్డ బతుకుతాడని, వారికి బతుకంతా రుణపడి ఉంటామని చేతులు జోడించి అర్థిస్తున్నారు అతడి అమ్మానాన్నలు. మండలంలోని వీరవల్లిపాలేనికి చెందిన మామిడికుదురు సత్యనారాయణ, శ్రీదేవి దంపతుల కుమార్తె విజయలక్ష్మి 8 ఏళ్ల క్రితమే కామెర్లతో మరణించింది. ఆ విషాదంతో కుంగిపోరుున దంపతులు కుమార్తెను కూడా కుమారుడు మణికంఠలోనే చూసుకుంటూ తేరుకున్నారు. ముక్తేశ్వరం కోనసీమ విద్యాశ్రమ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మణికంఠకు రెండు నెలల క్రితం సుస్తీ చేయగా వైద్యులకు చూపించారు. వైద్యపరీక్షల్లో అతడి రెండు కిడ్నీలూ చెడిపోరుునట్టు తేలింది. కిడ్నీ మార్పిడి చేయకపోతే మణికంఠ దక్కడని వైద్యులు చెప్పారు. బాలుడి నానమ్మ సత్యవతి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యూరు. అరుుతే ఆమె కిడ్నీని మనుమడికి అమర్చే ఆపరేషన్‌కు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించే సత్యనారాయణ అప్పటి వరకూ అయిన వైద్యానికే పుట్టిన చోటల్లా అప్పులు చేశారు. రూ.5 లక్షలు సమకూర్చుకోవడం తమకు కలలోని మాటని, ఉదారులు స్పందించి, సహాయహస్తం అందించి, తమ బిడ్డకు పునర్జీవితాన్ని ఇవ్వాలని సత్యనారాయణ, శ్రీదేవి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. దాతలు తోచిన సాయూన్ని ‘మామిడికుదురు సత్యనారాయణ, ఖాతా నం: 32868328153, ఎస్బీఐ ముక్తేశ్వరం బ్రాంచి (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0002759)’కి జమ చేయూలని, ఏమైనా వివరాలు కావలస్తే 9666976566 సంప్రదించాలన్నారు. మార్పిడి ఆపరేషన్ ఖర్చు రూ.5 లక్షలు