కృత్రిమ కాళ్లతో దీనస్థితిలో ఉన్న దుర్గ
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: ఆమెకు కిడ్నీ పాడైంది.. రెండు కిడ్నీలు పాడై భర్త మరణం.. భర్త మరణం నుంచి తేరుకుంటున్న ఆమెను ప్రమాదం వెంటాడింది. దీంతో రెండు కాళ్లు పోగొట్టుకోవడంతో జీవితం దుర్భరంగా మారింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. సరిగా మాటలు రాని 14 ఏళ్ల కుమారుడు సంపాదనపై ఆధారపడి జీవనం సాగి స్తోంది. వివరాల్లోకి వెళితే భీమడోలు మండలం కురెళ్లగూడేనికి చెందిన కెంగం దుర్గకు ఉంగుటూరుకి చెందిన శ్రీనివాసుతో 2000లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంపై కష్టాలు కన్నేశాయి. దీంతో కుటుంబం చిన్నాభిన్నమైంది. దుర్గకు బిడ్డ జన్మించిన ఏడాది తర్వాత అనారోగ్యానికి గురైంది. వై ద్యులు పరీక్షించి మూత్రపిండం దెబ్బతిందని నిర్ధారించి తొలగించారు.
పదిహేనేళ్లుగా ఒక కిడ్నీతో ఆమె బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో భార్యభర్తలిద్దరూ వ్యవసా య పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త శ్రీనివాసరావుకి 2016 మార్చిలో రెండు కిడ్నీలు పాడైపోవడంతో సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినా శ్రీనివాసరావు ప్రాణాలు ని లువలేదు. భర్త మరణ శోకాన్ని దిగమింగుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటుండగా మరోసారి విధి వక్రిం చింది. గత ఏడాది వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో దుర్గ తన రెండు కాళ్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆమె కుమారుడు గణేష్ పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగియగానే మోటార్ మెకానిక్ షెడ్డులో పనిచేసి గణేష్ తల్లిని పోషించుకుంటున్నాడు.
కృత్రిమ కాళ్లు ఏర్పాటు
పాలకొల్లుకి చెందిన శ్రీ చైతన్య కృత్రిమ అవయవ కేంద్రం నిర్వాహకుడు వేదాంతం సదా శివమూర్తి ఆమె దీనస్థితిని చూసి రూ.16 వేలు విలువైన రెండు కృత్రిమ కాళ్లు అందజేశారు. ప్రస్తుతం దుర్గ జీవితం రోజు గడవడం కష్టంగా మారింది. ప్రతి రోజూ మందులు మింగాలి, బలవర్ధక ఆహారం తీసుకోవాలి. మరోవైపు ఆమె కుమారుడు చదువుకోవాలి. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉందని దుర్గ ఆవేదన చెందుతోంది. దయగల దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు కెంగం దుర్గ, యూనియన్ బ్యాంక్, పూళ్ల, ఖాతా నం.329602120001383, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ యూబీఐఎన్ 0532967, సెల్ 96665 27734 సంప్రదించాలని ఆమె కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment