కైసర్
హిమాయత్‌నగర్: షేక్ కైసర్.. విలేకరిగా రెండు దశాబ్దాల నుంచీ పనిచేస్తున్నారు.. విలువలను పాటిస్తూ భార్య,పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కైసర్ ఆరోగ్యం దెబ్బతినింది. రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండటంతో చికిత్సకు ఇబ్బంది ఏర్పడుతోంది.జీవన్‌దాన్‌లో కిడ్నీ మార్పిడికి అవసరమైన డబ్బులేక సతమతమవుతున్నాడు. దీంతోభార్య, భార్య, ముగ్గురు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఖైరతాబాద్‌లోని గుమ్మద్ గల్లీలో నివాసం ఉండే షేక్ కైసర్(40) నివాసముంటున్నాడు.
విధి నిర్వహణలో భాగంగా సమయానికి తిండి తినకపోవడంతో నాలుగేళ్ల క్రితం హైపర్‌టెన్షన్‌కు గురయ్యాడు. తరువాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా డయాలసిస్ చేసుకుంటున్నాడు. జీవన్ ద్వార్ ద్వారా కిడ్నీ మార్పిడికి ఇప్పుడు అవకాశమొచ్చింది. కిడ్నీ మార్పిడికి డబ్బు లేకపోవడంతో ఇబ్బందులెదురవుతున్నాయి. ఆదుకునే దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు కైసర్.
Comments
Please login to add a commentAdd a comment