
యశవంతపుర : హాస్య నటుడు మహేశ్ (మల్లేశ్) మృతి చెందారు. కిడ్నీ సమస్య కారణంగా అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వందకు పైగా సినిమాల్లో నటించిన మహేశ్ హాస్యనటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, మహేశ్ పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. హాస్య నటుడి మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ కుటుంబానికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment