
యశవంతపుర: రౌడీ సైకిల్ రవితో సంబంధాలపై పోలీసులు శ్యాండల్‌వుడ్ హాస్యనటుడు సాధుకోకిలను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు.ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. దీనిపై వివరాలను వెల్లడించటానికి సాధుకోకిల నిరాకరించారు. సైకిల్ రవికి సాధుకోకిల ఏడెనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు కాల్ లిస్టులో తేలడంతో ఆయనను సీసీబీ పోలీసులు విచారించారు. కాల్ లిస్టు ఆధారంగా అనేకమందిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.