
యశవంతపుర: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేది జైలు నుంచి బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మొదటిసారిగా ఆదివారం సీసీబీ ఆఫీసులో హాజరయ్యారు. 15 రోజులకు ఒకసారి సీసీబీ ముందు హాజరు కావాలని బెయిలు షరతుల్లో ఉంది. దీంతో చామరాజపేటలోని సీసీబీ ఆఫీసుకు వచ్చి అధికారులు సూచించిన పుస్తకంలో సంతకం చేసినట్లు ఆమె విలేకర్లకు తెలిపారు.
త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment