CCB officers
-
డ్రగ్స్ కేసు: సీసీబీ ఆఫీసుకు నటి రాగిణి
యశవంతపుర: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేది జైలు నుంచి బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మొదటిసారిగా ఆదివారం సీసీబీ ఆఫీసులో హాజరయ్యారు. 15 రోజులకు ఒకసారి సీసీబీ ముందు హాజరు కావాలని బెయిలు షరతుల్లో ఉంది. దీంతో చామరాజపేటలోని సీసీబీ ఆఫీసుకు వచ్చి అధికారులు సూచించిన పుస్తకంలో సంతకం చేసినట్లు ఆమె విలేకర్లకు తెలిపారు. త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ఈ బాగోతంలో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్ఫోన్ల నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్ఫోన్లలో సెక్స్ రాకెట్ బయటపడినట్లు సీసీబీ వర్గాల కథనం. వారి మొబైళ్లలో నీలి వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కొందరు సీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో డ్రగ్స్ కథలో మరో మరో దందా వెలుగుచూసినట్లయింది. నీలి స్కాంతో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో నీలి దందా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉందని, డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్ చేశారని సీసీబీ కథనం. మరో ఇద్దరు అరెస్ట్ మత్తు బాగోతంలో మంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ బృందం వీరిని పట్టుకొంది. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) మరికొందరి విచారణ పరప్పన అగ్రహార జైల్లో ఉన్న నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు మూడు రోజుల నుండి కొందరిని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. వీరిద్దరూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాఫియా డాన్‌తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఇటీవల సస్పెండయిన ఒక ఏసీపీతో ఇతనికి సంబంధాలున్నట్లు తెలిసింది. -
రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే
సాక్షి, కర్ణాటక: డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో రిమాండులోనున్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్ పిటిషన్ల విచారణను బెంగళూరు ఎస్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. ఇద్దరికీ బెయిల్‌పై సీసీబీ న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. రాగిణి బెయిల్ అర్జీపై 12 పేజీల అభ్యంతరాలలో ఎన్నో అంశాలను కోర్టుకు వివరించారు. నిందితులు బలమైనవారు విచారణకు ఆటంకాలు ఎదురవుతాయి, కాబట్టి బెయిల్ ఇవ్వరాదు, రాగిణి ఐదేళ్ల నుంచి బెంగళూరుతో పాటు వివిధ నగరాలలో జరిగిన డ్రగ్స్ పాలలో పాల్గొన్నారు. ఆంధ్ర, గోవా, ముంబైతో పాటు విదేశాల నుంచి డ్రగ్స్‌ను కోనుగోలు చేశారు. ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసినప్పుడు సాక్ష్యాలను నాశనం చేశారు అని అందులో ఆరోపించారు. హోటళ్లు, రిసార్టులకు నోటీసులు శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పార్టీలు నిర్వహించిన హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌లకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అనేక ప్రతిష్టాత్మక హోటల్స్‌లో అర్ధరాత్రి వరకు నటి రాగిణి ద్వివేది, సంజన గల్రాని, ముఖ్య నిందితుడు వీరేన్ ఖన్నాలు నిర్వహించినట్లు సీసీబీ గుర్తించారు. ఆ విందు వినోదాల సీసీ కెమెరాల చిత్రాలను తమకు అందజేయాలని హోటళ్లను పబ్‌లను కోరారు. సీసీబీ అరెస్ట్ చేసిన పలువురు నిందితులు ఏయే హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లలో మజా చేసిందీ వెల్లడించారు. (డ్రగ్స్ కేసు: సీసీబీ ఎదుట గ్లామర్‌జంట) కింగ్‌పిన్ శివప్రసాద్ ఎక్కడ డ్రగ్స్ బాగోతంలో ప్రధాన నిందితుడు, ఎ1గా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న శివప్రసాద్ కోసం సీసీబీ గాలిస్తోంది. ఇతని గురించి ఆసక్తికరమైన విషయాలను సీసీబీ సేకరించింది. రాగిణికి చాలా సన్నిహితుడు. అతడు దొరికితే కేసు మిస్టరీ అంతా వీడిపోతుందని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. విచారణ బాగా లేదు: లంకేశ్ కాగా, డ్రగ్స్ కేసు విచారణ తూతూ మంత్రంగా జరుగుతోందని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ అన్నారు. ఈ బాగోతంలో నటీమణులేకాదు. నటులు, రాజకీయనాయకుల పుత్రులు ఉన్నారు. కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస సుబ్రమణ్యన్ విచారణ బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తున్న శ్రీనివాస సుబ్రమణ్యన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్, వైభవ్ జైన్‌లతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోలను అందజేశాడు. ఇక ఒక నటి అన్నా తమ్ముళ్లు, సంగీత దర్శకులను సీసీబీ విచారణకు పిలవనుంది. -
డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం నగరంలోని మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా బంగ్లాపై దాడి చేశారు. మరో విషయం ఏంటంటే ఈ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా సీసీబీ ఏజెంట్లు దాడుల ప్రారంభిన నాటి నుంచే కనిపించకుండా పోయాడు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిపై కేసులు నమోదు చేయగా, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక సెర్చ్ వారెంట్ పొందిన తర్వాతనే హెబ్బాల్ సమీపంలోని ఆదిత్య అల్వా 'హౌస్ ఆఫ్ లైఫ్' అని పిలువబడే ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం) నాలుగు ఎకరాలలో విస్తరించిన ఈ బంగ్లాను ఆదిత్య అల్వా పార్టీలు నిర్వహించడానికి ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వారిలో సినీ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్, ఆర్టీఓ గుమస్తా బి.కె.రవిశంకర్ ఉన్నారు. -
డ్రగ్స్ కేసు: నటికి నోటీసులు
బెంగళూరు: కన్నడ పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు నటి రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేశారు. నేడు రాత్రిలోగా సీసీబీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో నటి స్నేహితుడు రవిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నటి రాగిణికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లుగా సంకేతాలు అందడంతో ఆమెను విచారణకు ఆదేశించారు. దీని గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నేడు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. కాగా కన్నడ చిత్రపరిశ్రమలో నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఆగస్టు 20న ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి డైరీని స్వాధీనం చేసుకోగా అందులో సెలబ్రిటీలు, నటులు, మోడల్స్ లిస్టు పేర్లు రాసి ఉన్నాయి. (చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) మరోవైపు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్న సెలబ్రిటీల పేర్లు వెల్లడించేందుకు సిద్ధమేనని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ప్రకటించడం చర్చంనీయాంశంగా మారింది. దీంతో సీసీబీ అధికారులు ఆయనను పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. లంకేశ్‌కు తాము మరోసారి అవకాశం ఇస్తామన్నారు. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు అందిస్తే దానికనుగుణంగా సాక్ష్యాలను సేకరిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా ఆయన బయటపెట్టినట్లు పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని మరికొద్దిమంది నటులకు కూడా నోటీసులు అందించేందుకు సీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై బుధవారం సమావేశమైన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసులో దోషులుగా తేలిన నటులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. (చదవండి: తనను వ్యభిచారిగా చిత్రీకరించి..) -
బ్యాంకుల చేతికి రూ.37,000 కోట్లు!
ముంబై: దేశంలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ (సీసీబీ) నియమామళిని ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దీనితో బ్యాంకులకు దాదాపు రూ.37,000 కోట్ల మూలధనం అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రస్తుతం బ్యాంకుల సీసీబీ ప్రధాన క్యాపిటల్‌లో 1.875 శాతం. ఈ కనీస క్యాపిటల్ కన్షర్వేషన్ రేషియోను 2019 మార్చి నుంచి 2.5 శాతానికి పెంచాలి. తాజా నిర్ణయంతో ఈ నిర్ణయం 2020 మార్చి 31 నుంచీ అమల్లోకి వస్తుంది. సీసీబీ అనేది ఒక మూలధన నిల్వ. సాధారణ సమయంలో దీనిని బ్యాంకులు పెంచుకుంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవసరాలకు వినియోగించుకుంటాయి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇబ్బందికర సమయంలో ఆదుకునే మరో సాధనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) ప్రస్తుతం 9 శాతంగా ఉంది. విప్రో ఏరోస్పేస్ ఎగుమతులు ఆరంభం బెంగళూరు: విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) కంపెనీ విమాన విడిభాగాల ఎగుమతులు ఆరంభమయ్యాయి. విమాన విడిభాగాలను బోయింగ్ కంపెనీకి ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు విన్ కంపెనీ వెల్లడించింది. ఇక్కడకు సమీపంలోని దేవనహళ్లి ప్లాంట్‌లో ఈ విమాన విఢిభాగాలను తయారు చేస్తున్నామని విన్ సీఈఓ ప్రతీక్ కుమార్ చెప్పారు. బోయింగ్ 737 మ్యాజ్, నెక్స్ట్ జనరేషన్ 737 విమానాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసి, సరఫరా చేయడానికి బోయింగ్ కంపెనీతో తమ విప్రో ఏరోస్పేస్ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారాయన. విస్తరణ ప్రణాళికలో కర్లాన్ హైదరాబాద్: నూతన ఆవిష్కరణలు, సాంకేతికతపై వచ్చే రెండేళ్లలో రూ.200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రముఖ పరుపుల ఉత్పత్తి సంస్థ కర్లాన్ ప్రకటించింది. ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయడంలో భాగంగా ఈమేరకు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ సీఎండీ టీ సుధాకర్ పాయ్ తెలిపారు. గతేడాది అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించగా.. వచ్చే మూడేళ్లలో రూ.2000 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్‌లో ఏటీటీ సదస్సుకు సింగ్ సారథ్యం ముంబై: ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఈవో అజయ్ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22 నుంచి 25 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ఏవియేషన్, ట్రావెల్, టూరిజం (ఏటీటీ) గవర్నర్స్ సదస్సుకు ఆయన సారథ్యం వహించనున్నారు. 24న జరిగే ఈ సదస్సులో ఏటీటీ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అమలు చేయతగిన సంస్కరణలు తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు చైర్‌గా వ్యవహరించే అవకాశం ఒక భారతీయుడికి దక్కడం ఇదే ప్రథమం. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్‌తో పాటు లుఫ్తాన్సా చైర్మన్ కార్స్టెన్ స్పోర్, మారియట్ ఇంటర్నేషనల్ అర్నె సోరెన్సన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు. -
హాస్యనటున్ని ప్రశ్నించిన సీసీబీ
యశవంతపుర: రౌడీ సైకిల్ రవితో సంబంధాలపై పోలీసులు శ్యాండల్‌వుడ్ హాస్యనటుడు సాధుకోకిలను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు.ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. దీనిపై వివరాలను వెల్లడించటానికి సాధుకోకిల నిరాకరించారు. సైకిల్ రవికి సాధుకోకిల ఏడెనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు కాల్ లిస్టులో తేలడంతో ఆయనను సీసీబీ పోలీసులు విచారించారు. కాల్ లిస్టు ఆధారంగా అనేకమందిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. -
పాత నోట్లు.. కోట్లు కోట్లు
⇔ రూ.9.10 కోట్ల పాత సొమ్ము పట్టివేత ⇔ శాసనమండలి మాజీ అధ్యక్షుని అల్లుడే సూత్రధారి! ⇔ కొత్త నోట్ల మార్పిడికి ప్రయత్నం ⇔ సీసీబీ పోలీసుల మెరుపు దాడి సాక్షి, బెంగళూరు: పాత నోట్లకు కొత్త నోట్లు... దందా ఇంకా ఆగడం లేదు. కర్ణాటకలో సగటున వారానికి ఒక చోట ఏదో ఒకచోట ఈ అక్రమం వెలుగుచూ స్తూనే ఉంది. తాజాగా ఆదివారం బెంగళూరులో రూ.500, రూ.1,000 నోట్లతో కూడిన రూ.9.10 కోట్ల విలువైన నగదు పోలీసు దాడుల్లో పట్టుబడింది. 14 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ అధ్యక్షుడు వీరణ్ణమత్తికట్టి అల్లుడు ప్రవీణ్‌కుమార్ ప్రధాన ముద్దాయి కావడం గమనార్హం. సీసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు పాత నోట్లు తీసుకుని సొమ్ము మొత్తంలో 45 శాతం కొత్త నోట్లను తిరిగి ఇచ్చే దందా నడుస్తోందని సమాచారం అందింది. నగరంలోని జాన్సన్ టౌన్ ఒకటో క్రాస్ వద్ద ఉన్న ఇంటిపై అదనపు పోలీస్ కమిషనర్ రవి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు మహదేవప్ప, సుధాకర్, ఎం.సీ రవికుమార్, బీ.రాజు ఆర్. బానుప్రసాద్‌లు దాడి చేసి రూ.9.10 కోట్ల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఇక్కడ నగదు నిల్వచేయడానికి సహకరించిన ఎడ్విన్, ఉమేష్, అన్బళగన్, ఎస్.కిషోర్ కుమార్, ప్రభు, మోహన్, నారాయణభట్, చంద్రశేఖర్, శ్రీనివాస్, అరుణ్, మహ్మద్ ఇమ్రాన్, హ్యారిష్, శేఖర్‌లను అరెస్టు చేశారు. అంతేకాకుండా నిందితుల నుంచి 2 కార్లు, 2 ద్విచక్రవాహనాలు, వివిధ కంపెనీలకు చెందిన 15 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వదిలేయాలని హోంమంత్రిపై ఒత్తిళ్లు? ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించిన ఇంట్లోనే సొమ్ము దొరికినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన బయటికి రాకుండా వీరణ్ణ మత్తికట్టి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాము ఏమీ చేయలేమని చెప్పడంతో ఆయన హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌కు కూడా ఫోన్‌చేసి విషయం బయటికి రాకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. వ్యవహారం అప్పటికే తన చెయ్యి దాటిపోయిందని పరమేశ్వర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీసీబీ పోలీసులకు పట్టుబడ్డ ప్రవీణ్‌కుమార్ తన అల్లుడేనని వీరణ్ణమత్తికట్టే పేర్కొన్నారు. అయితే ఆరునెలల నుంచి అతనితో తనకు గాని, తన కుటుంబ సభ్యులకు కాని ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ శోభా ధ్వజం నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నడుస్తున్న బ్లాక్ అండ్ వైట్ దందాలో కాంగ్రెస్‌పార్టీ నాయకులే ఉన్నారని బీజేపీ నాయకురాలు శోభాకరంద్లాజే పేర్కొన్నారు. ఇందుకు తాజా ఉదంతమే ప్రత్యేక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని నంజనుగూడులో మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.