
గుజ్జు మోహనరావు(ఫైల్)
ఇచ్ఛాపురం రూరల్: ఆ కుటుంబంపై కిడ్నీ వ్యాధి మహమ్మారి పగబట్టింది. ఒక్కొక్కరూ ఈ వ్యాధిబారిన పడుతూ తొలుత తల్లిదండ్రులు చనిపోగా, రెండేళ్ల క్రితం తమ్ముడు నాగరాజు(35) మృతిచెందాడు. తాజాగా ఈయన అన్నయ్య గుజ్జు మోహనరావు(45) ఈ వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాస విడిచాడు. ఈ విషాద ఘటనతో మండలంలోని కేశుపురం గ్రామంలో గురువారం కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన ఐదేళ్లుగా విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్షలాది రూపాయలు అప్పుల పాలయ్యాడు. అయితే డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న కిడ్నీ బాధితుల పింఛన్‌కు సైతం నోచుకోలేకపోయాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య పద్మ, కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. వీరికి బీమా పథకం ద్వారా ఎంపీపీ ఢిల్లీరావు ఐదు వేల రూపాయలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment