భార్య వెంకటేశ్వరిదేవితో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న విజయ్‌కుమార్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు రామచంద్రానగర్‌కు చెందిన పుల్లెల విజయ్ కుమార్ వేడుకున్నారు. ఈ మేరకు వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన తన భార్య వెంకటేశ్వరిదేవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడేళ్లుగా తన భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని, ఏడాదిన్నర కిందటి వరకు డయాలసిస్, మందులతోనే రక్షించుకుంటూ వచ్చానని చెప్పారు. ప్రస్తుతం డయాలసిస్ కూడా కష్టమవుందన్నారు.
వెంటనే కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశానన్నారు. జీవన్‌దాన్ పథకానికి దరఖాస్తు చేశామని, దాతలు ఆదుకొని తన భార్య ప్రాణాలు నిలపాలని విజ్ఞప్తి చేశారు. సాయం చేసే దాతలు ఎస్‌బీఐ అకౌంట్ నంబరు 20072722127, రామలక్ష్మి బ్రాంచ్, శ్రీకాకుళానికి జమ చేయాలని, లేదా ఫోన్ నంబర్ 97037 84077లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment