
రాయికల్: ఇవి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామస్తులు పరిస్థితి ఉదాహరణలు మాత్రమే. పేరులో ‘చింత’మాదిరిగానే ఆ ఊరిలోని ప్రతి ఇంటా రోగాలు ‘చింత’పెడుతున్నాయి. పరిస్థితి విషమిస్తే మరో ‘ఉద్దానం’అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో 280 మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మరో 40మంది టీబీ, 20 మందికిపైగా మంది ఎముకల బలహీనత వ్యాధులతో నరకయాతన అనుభవిస్తున్నారు.
చాలామంది వృద్ధులు ఎముకల బలహీనతతో మంచానపడ్డారు. యువకుల్లో సైతం శరీరంలో ఎముకల అరిగిపోవడం శాపంగా మారింది. వెయ్యి మంది జనాభా.. 280 ఇళ్లు ఉన్న ఈ పల్లెలో ఇంటికొకరి చొప్పున కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మట్లగాజం నాగయ్య, ఎండ్లగట్ట పోచయ్య టీబీ వ్యాధితో మృతిచెందారు. వైద్య చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఎందరో మంచానికే పరిమితమయ్యారు.
నీటిలో క్యాల్షియం ఎక్కువ..
గ్రామస్తులు తాగే నీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్లే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటంతోపాటు తగిన మోతా దులో నీరు తాగకపోవడంతో ఈ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు సైతం సరిగా వైద్యం అందించకపోవడంతో ఒకరినుంచి మరొకరికి సోకి మృతి చెందుతున్నారని గ్రామంలో ఆందోళన నెలకొంది.
చలనం లేని వైద్యారోగ్యశాఖ..
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని పట్టిపీడిస్తున్నా ఈ వ్యాధుల గురించి వైద్యాధికారులకు తెలియకపో వడం గమనార్హం. వ్యాధుల విజృంభణకు కారణం తెలుసుకోవడంలో విఫలమయ్యారు.
వెలుగు చూసిందిలా..
ఒడ్డెర కాలనీకి చెందిన వారు అనారోగ్యం బారిన పడటమే కాకుండా, రెండేళ్లలో ఏడు గురు చనిపోయారు. అయితే, అనారోగ్యాలకు.. చావులకు మంత్రాలే కారణమని కాలనీవాసులు నమ్మారు. ‘సాక్షి’గ్రామస్తులతో మాట్లాడగా కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. జిల్లా వైద్యాధికారిణి సుగంధిని వివరణ కోరగా మంచినీళ్లు తాగక పోవడం, ఆహారం లోపంతో ఇలాంటి సంభవిస్తాయని చెప్పారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఎక్కువ
గ్రామంలో కిడ్నీలో రాళ్లవంటి వ్యా« దులతో చాలా మంది బాధపడుతున్నాం. అసలు ఈ వ్యా« ది ఎలా వస్తుందో అర్థమయితలేదు. గతంలో ఆపరేషన్‌కు నాకు రూ. 40 వేలు ఖర్చు అయ్యాయి. వైద్యంకోసం భూమి అమ్ముకున్న. టీబీ, ఎముకల అరుగుదల వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. –సబ్బినేని రాజం, గ్రామస్తుడు
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా
గ్రామంలో చాలా మంది కిడ్నీలో రాళ్లవంటి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేసుకుంటున్నా నొప్పి పదేపదే రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా సమస్య ఎవరు పట్టించుకోవడంలేదు. –అనుపురం శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment