శుద్ధ ప్రచారమే! | only for free publicity on udhanam kidney villages | Sakshi
Sakshi News home page

శుద్ధ ప్రచారమే!

Published Mon, Sep 18 2017 11:45 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

శుద్ధ ప్రచారమే!

శుద్ధ ప్రచారమే!

ఉద్దానంలో ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటులో కనిపించని వేగం
కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు అందని శుద్ధజలం
హామీలు నెరవేర్చకపోవడంపై ఉద్దానం వాసుల ఆగ్రహం


కంచిలి, సోంపేట : జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి శుద్ధజలం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు నిజం కావడానికి ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది. కిడ్నీవ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఉత్సాహంగా ప్ర కటించిన నేతలు పనుల్లో ఆ ఊపు చూపించడం లేదు. ఒకచోట పనులు చేసి వంద చోట్ల చేసినట్లు ప్రచారం మాత్రమే జరుగుతోంది. మండలానికి ఒక యూనిట్‌ ప్రాతిపదికన పనులు చేపడతామని వారు చేసిన ప్రకటనకు, క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులకు పొం తన కుదరడం లేదు. మంత్రి నారా లోకేష్‌ చేతులమీదుగా పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని స్థానిక టీడీపీ నేతలు చాలా సార్లు చెప్పారు. తీరా లోకేష్‌ జిల్లా పర్యటనకు వచ్చి పలాస వరకు తిరిగి ఇచ్ఛాపురం ని యోజకవర్గానికి వెళ్లకపోవడంతో అ క్కడి ప్రజలు, పార్టీ క్యాడర్‌లో అనుమానాలు
మొదలయ్యాయి. ఇక ఆర్‌ఓ ప్లాంట్ల పథకాన్ని సోంపేటలో ప్రారంభిస్తామనే అంశం కూడా అడుగున పడింది.  

ప్రాణాలు పోతున్నాయి..
కిడ్నీ వ్యాధి మూలాన ఉద్దానంలో ఎంతో మంది కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణాలను కనుగొనలేకపోయారు. అయితే కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో గల నీటిలో ఏదో సమస్య ఉందనే అనుమానంతో చా లా వరకు ఉద్దాన ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ కార్పొరేట్‌ కంపెనీల ద్వారా ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటి సరఫరాను చేపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా ఈ ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. టెక్కలి డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో మం డలానికో ఆర్‌ఓ ప్లాంటు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీరందించటానికి ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణ పరిధి బిరుసువాడ వద్ద ఆర్‌ఓ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయ్యింది.  నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో పరిశీలిస్తే.. కంచిలి మండలంలో మండపల్లి పంచాయతీ పరిధి ఒరియా నారాయణపురం గ్రామంలోను, కవిటి మండల కేంద్రంలోను, ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామంలో ఇప్పటి వరకు కేవలం బోర్ల తవ్వటం మాత్రమే అయ్యింది. దీంతో టీడీపీ నేతల ప్రకటన ఆరంభ శూరత్వమేనా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది.

సోంపేటలో రూ.1.88కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 16 హేబిటేషన్లలో, కంచిలిలో రూ.1.95కోట్లతో ప్లాంటు ఏ ర్పాటు చేసి 21 హేబిటేషన్లలోను, ఇచ్ఛాపురం మండలం లో రూ.1.47కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 13 హేబిటేషన్లలోను, కవిటిలో రూ.2.93కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 38 హేబిటేషన్లలో సబ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం మండలానికో ఆర్‌ఓ ప్లాంటు ప్రధానమైనది ఏర్పాటు చేసి, అక్కడ నుంచి కిడ్నీవ్యాధుల ప్రభావం ఉండే హేబిటేషన్‌ గ్రామాలకు 5వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్లను ట్రాక్టర్ల సహాయంతో సరఫరా చేసి, అక్కడే సబ్‌పాయింట్లు పెట్టి 20 లీటర్ల నీటిని రూ.2లు చొప్పున స్వైపింగ్‌ కార్డులతో అమ్మకాలు జరుపుతామని సన్నాహాలు చేస్తున్నారు. అయితే పనుల్లో వేగం లేకపోవడం స్థానికులను అసహనానికి గురి చేస్తోంది.    

సమాధానాలు ఏవీ?
ప్రభుత్వం తరఫున మండలానికో చోట ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి హేబిటేషన్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా తీసుకెళ్లి, అక్కడ సబ్‌పాయింట్ల వద్ద సరఫరా చేసే ప్రక్రియ ఎన్నాళ్లు సాగుతుందో అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. ఒక్కో హేబిటేషన్‌కు 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్‌ నీళ్లు సరిపోతాయా లేదా సరిపోకపోతే అవసరమైనన్ని నీళ్లు సరఫరా చేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ దీనికి సమాధానం చెప్పేవారే లేకపోయారు.

మందస : మందస మండలంలోని ఉద్దాన ప్రాంతానికి శుద్ధజలం అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన హామీ గాల్లో కలి సిపోయింది. ఉద్దాన ప్రాంతానికి కేంద్రం హరిపురం కావడంతో రివర్స్‌ ఆస్మాసిస్‌(ఆర్‌ఓ)ప్లాంట్‌ను హరిపురంలో ని ర్మించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. హరిపురంలో ఆక్రమణ భూములు, ప్రభుత్వ భూములుండగా వాటి ని వదిలేసిన అధికారులు శ్మశానం పక్కన ఉన్న భూమిని ఎంచుకున్నారు. అయితే ఆ నీటిని ఎలా తాగుతామని ఉద్దా నం వాసులు ముందు నుంచీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ లోగా ఏమైందో ఏమో ఈ స్థలాన్ని కాదని పాత ఆర్‌ అండ్‌ బీ ప్రాంతంలో ఆర్‌ఓ ప్లాంట్‌ నిర్మించాలని నిర్ణయించారు. అధికారులు, సర్వేయర్లు వెళ్లి ఈ ప్రాంతంలోనే ఆర్‌ఓ ప్లాం ట్‌ నిర్మించాలని సర్వే కూడా చేశారు. కానీ పనులు ముం దుకు కదల్లేదు. ప్రభుత్వం తలచుకుంటే స్థల సమస్య పెద్దదేం కాదు. కానీ వారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఉద్దానానికి శుద్ధజలం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement