వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి కష్టాలు తీవ్రం
2030 నాటికి ప్రపంచంలో నీటి కొరతను ఎదుర్కోనున్న 560 కోట్ల మంది
భారత్, చైనాలకు తప్పని తీవ్ర కష్టాలు
పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
ఆహార కొరతతో ఆకలి చావులు
మురుగునీటిని శుభ్రపరచి పునర్ వినియోగంలోకి తేవడం, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే జలభద్రత
ప్రపంచ జలభద్రత నివేదికలో ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం హెచ్చరిక
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడమే కాక.. వ్యర్థజలం మురుగునీటిని శుభ్రపరిచి పునర్‌వినియోగంలోకి తేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యూఎన్‌యూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనాసహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి.
పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జలసంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలిచావులు పెరిగే అవకాశముందని కూడ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 195 దేశాలుండగా.. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది.
ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (ఒక మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదిక (గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్)ను ఇటీవల విడుదల చేసింది.నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..
కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..
⇒ పపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం.
⇒ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భజలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది.
⇒ పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటమూ నీటి ఎద్దడికి దారితీస్తోంది.
ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం..
రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాçÜ్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాతి్వయా తదితర దేశాల్లోని వంద కోట్ల మంది 49 దేశాల్లోని వంద కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.
⇒ ప్రపంచ జలభద్రత నివేదిక ప్రకారం 2030 నాటికి నీటి కష్టాలు ఇలా..
⇒నీటి కష్టాలు చుట్టుముట్టనున్న దేశాలు 113
⇒113 దేశాల్లో నీటి కష్టాలు ఎదుర్కోనున్న జనాభా 560 కోట్లు
⇒గుక్కెడు పరిశుభ్రమైన తాగునీరు కూడా లభించని దేశాలు 24
⇒ఈ 24 దేశాల్లో జనాభా 6.42 కోట్లు
⇒ ఒక మనిíÙకి రోజుకు కనీసం కావాల్సిన పరిశుభ్రమైన నీరు 50 లీటర్లు
⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న దేశాలు 49
⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న జనాభా 100 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment