Sewage
-
కాల‘నీళ్లు’!
సాయం చేసే దిక్కు లేదు..నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రామ్పోలిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీప్రాంతం: వైఎస్సార్ జక్కంపూడి కాలనీ అపార్ట్మెంట్ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్‌లో 32 ప్లాట్లు) జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్‌తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు. ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్ గంట సౌండ్ కూడా వినిపించట్లేదు. పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటేవరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధివిజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు.. కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్‌ఆర్‌పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు. డ్రోన్ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్ ట్యాంక్‌పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్ ట్యాంక్‌లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు. జలయుద్ధాలు తప్పడం లేదు.. పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.కూడబెట్టుకున్నదంతా పోయింది.. కూలినాలి చేసుకుని సంపాదించుకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది. ఎలా ఉన్నారని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది. – భార్గవి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఒక్క వస్తువు కూడా మిగల్లేదు.. మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది. – నాగమణి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.నిత్యావసరాలు కరవై.. 50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభుత్వం గాలికొదిలేసింది. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.జీవనాధారం కకావికలంబుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికలమయ్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్ పక్కనే చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ రాంబాబు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహేశ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నగరంలోని ఓ సెలూన్ షాపులో రోజువారీ కూలీకి వెళుతుంటాడు. డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్‌లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్‌లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకున్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్ కూడా దెబ్బతింది. రిపేర్ చేయించాలి. ట్రిమ్మర్లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. -
జల సంక్షోభం ముంచుకొస్తోంది!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడమే కాక.. వ్యర్థజలం మురుగునీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యూఎన్‌యూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనాసహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జలసంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలిచావులు పెరిగే అవకాశముందని కూడ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 195 దేశాలుండగా.. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది.ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (ఒక మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదిక (గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్)ను ఇటీవల విడుదల చేసింది.నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..⇒ పపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం.⇒ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భజలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. ⇒ పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటమూ నీటి ఎద్దడికి దారితీస్తోంది.ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం..రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాçÜ్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాతి్వయా తదితర దేశాల్లోని వంద కోట్ల మంది 49 దేశాల్లోని వంద కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.⇒ ప్రపంచ జలభద్రత నివేదిక ప్రకారం 2030 నాటికి నీటి కష్టాలు ఇలా..⇒నీటి కష్టాలు చుట్టుముట్టనున్న దేశాలు 113⇒113 దేశాల్లో నీటి కష్టాలు ఎదుర్కోనున్న జనాభా 560 కోట్లు⇒గుక్కెడు పరిశుభ్రమైన తాగునీరు కూడా లభించని దేశాలు 24⇒ఈ 24 దేశాల్లో జనాభా 6.42 కోట్లు⇒ ఒక మనిíÙకి రోజుకు కనీసం కావాల్సిన పరిశుభ్రమైన నీరు 50 లీటర్లు⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న దేశాలు 49⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న జనాభా 100 కోట్లు -
మురుగునీటి శుద్ధిలోనూ ఏపీ టాప్
సాక్షి, అమరావతి: మురుగు నీరు శుద్ధి చేయడంతో పాటు పునర్ వినియోగంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు నివేదిక స్పష్టం చేసింది. ఏపీలో 15 శాతం మేర మురుగు నీటిని శుద్ధి చేస్తుండగా ఇందులో 22 శాతాన్ని తిరిగి ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మరుగునీటి శుద్ధి 21 శాతంగా ఉంటే.. ఇందులో 9 శాతాన్ని మాత్రమే మళ్లీ వినియోగిస్తున్నట్లు పేర్కొంది. 14 పట్టణ స్థానిక సంస్థల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించడాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించింది. ఇలా శుద్ధి చేసిన నీటిని ఆక్వాకల్చర్, పశుగ్రాసం సాగుకు, భూగర్భ జలాల రీచార్జ్‌కు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మురుగు నీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 పట్టణ స్థానిక సంస్ధల్లో రోజుకు 535.45 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యం ఉండగా.. పునర్ వినియోగం రోజుకు 119.96 మిలియన్ లీటర్లుగా ఉందని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు నివేదిక పేర్కొంది. (చదవండి: ఆన్లైన్లో నోటరీల సమాచారం) -
హైదరాబాద్‌లో నిత్యం ఎంత మురుగు వస్తుందంటే...
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మురుగు శుద్ధి ప్రహసనంగా మారింది. దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వెలువడుతోన్న వ్యర్థజలాల్లో కేవలం 28 శాతమే శుద్ధి జరుగుతోందని ఇటీవల నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. ఈ నేపథ్యంలో మన నగరంలో రోజువారీగా సుమారు 2000 మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో కేవలం వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాల శుద్ధి జరుగుతోంది. మిగతా సగం ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్, జంటజలాశయాలు, చారిత్రక మూసీ నదిని ముంచెత్తుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాటుకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా దుస్థితి ఇదీ... నీతిఆయోగ్ ఇటీవల ‘అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా..ఇందులో 13 శాతం తీవ్రంగా..మరో 17 శాతం మధ్యస్థ కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఆయా జలాశయాల నీటిలో భారలోహాలు, ఆర్సినిక్, ఫ్లోరైడ్స్ విషపూరిత రసాయనాలు, ఫార్మా అవశేషాలున్నట్లు గుర్తించారు. సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం కలుషితమైనట్లు గుర్తించారు. గ్రేటర్ సిటీలో పరిస్థితి ఇలా... ► గ్రేటర్ పరిధిలో నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమౌతున్నాయి. ► ఇందులో సుమారు వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను సుమారు 25 మురుగు శుద్ధి కేంద్రాల్లో జలమండలి శుద్ధి చేస్తోంది. ► మిగతా మురుగు నగరవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో కలుస్తోంది. కాగా భవిష్యత్‌లో మురుగు నగరాన్ని ముంచెత్తుతోందన్న అంచనాతో మిగతా వెయ్యి మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు దశలవారీగా మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించాలని సంకల్పించింది. రాబోయే ఐదేళ్లలో నగరంలో మూడు ప్యాకేజీలుగా 31 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు జలమండలి ప్రకటించింది . ► తొలివిడతగా రూ.1280 కోట్లతో నగరంలో పలు చోట్ల 17 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవ కాశాలున్నాయి. ఇక మరో 14 ఎస్టీపీలను దశలవారీగా నగరంలో నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మొత్తంగా 31 ఎస్టీపీలను రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని.. వీటిలో రోజువారీగా 1000– 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయవచ్చని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి) -
బెంగాల్ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ.3,500 కోట్లు జరిమానా
కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలో ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అయితే.. పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి చూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలు నిర్వర్తించటంలో ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలి‘ అని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నిర్వహణపై ఇకనైనా బెంగాల్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్ షా ఆరోపణలు -
రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి హానికరంగా మారిన మానవవ్యర్థాలు, మురుగునీటి శుద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయా వ్యర్థాలను వదిలించుకునేందుకు ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలతో నేల, నీరు, గాలి కలుషితమవుతుండడంతో.. ఇకపై ఆయా వ్యర్థాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్మెంట్ చేసి సాధ్యమైనంత మేరకు ఎరువులుగా, పునర్ వినియోగానికి అవసరమయ్యే రీతిలో మార్చనున్నారు. దాదాపు రూ.1,445.07 కోట్లతో రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభత్వం నుంచి అనుమతి రావడంతోపాటు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఇటీవల సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ రెండోదశ ప్రాజెక్టులో చేపడుతున్న ఈ యూనిట్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గడమేగాక కొన్నేళ్లపాటు నిర్వహణను ఆయా సంస్థలే చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా ఆయా ప్రాంతాల్లో రెండు విభాగాలుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మొదటి విభాగంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)కి అనుసంధానం చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చే వ్యర్థజలాలు ఎస్టీపీకి చేరతాయి. ఇక్కడ ఆ నీటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి మలినాలను వేరుచేసి బయో ఎరువుల తయారీకి తరలిస్తారు. జలాలను తాగడానికి మినహా ఇతర అవసరాలైన గార్డెనింగ్, పరిశ్రమల్లో వినియోగిస్తారు. రెండో విభాగంలో ప్రతి స్థానిక పట్టణ సంస్థలో ఒక ఫెకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిర్మించి, సెప్టిక్ ట్యాంకుల్లోని మలాన్ని ఆ ప్లాంట్‌లో శుద్ధిచేసి ఘనవ్యర్థాన్ని బయో ఎరువుగా మారుస్తారు. నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించి శుద్ధిచేసి పరిశ్రమలకు వినియోగిస్తారు. ఈ రెండు విభాగాలు అనుసంధానమై ఉంటాయి. రెండు విభాగాలను ఏకకాలంలో చేపట్టి, వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం రావడంతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను స్థానికంగా ఉండే చెరువులు, నదులకు అనుసంధానించేవారు. ఇక మానవవ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో పారబోయడం లేదా అండర్‌గ్రౌండ్ వ్యవస్థలు ఉన్నచోట నదులకు అనుసంధానం చేయడం వంటి విధానాలు అనుసరించేవారు. దీనివల్ల నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయని, ప్రజారోగ్య సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మురుగును రీసైక్లింగ్ చేయడమే ప్రత్యామ్నాయంగా భావించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పట్టణాలకు తాగునీటి వనరుగా ఉన్న నదులు, చెరువులను కాలుష్యం నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసేదిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లలో రసాయనాలను ఉపయోగించి 95 శాతం పర్యావరణానికి అనుకూలంగా, వినియోగానికి అనువుగా మార్చడంతోపాటు అడుగున ఉన్న బయోసాలిడ్ (బురద)ను వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఎరువుగా మారుస్తారు. -
పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు నియోజకవర్గాల్లో మరో రెండేళ్లలో మురుగు అవస్థలు తీరనున్నాయి. మూసీకి ఉత్తరం వైపున మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ పనులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. జలమండలి పరిధిలో జోన్– 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి మురుగు తిప్పలు తప్పనున్నాయి. సుమారు రూ.297 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. పాతనగరంలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ (ముంబై) రూపొందించింది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. ► జోన్– 3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉంటాయి. మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్ 1 నుంచి ఎన్ 7 వరకు, ఎన్ 11, ఎన్ 31 పరీవాహక ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్ నెట్వర్క్ ఉంది. ►ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.297 కోట్లు. ►నెట్వర్క్ మొత్తం పొడవు: 129.32 కి.మీ. ► ఆర్సీసీ ట్రంక్ సీవర్స్ పైప్లైన్లు: 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ. ►ఎస్‌డబ్ల్యూజీ నెట్వర్క్ 200–300ఎంఎం డయా: 93.18 కి.మీ. ►మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి: 127.42 ఎంఎల్డీ. ► 2051 నాటికి : 153.81 ఎంఎల్డీ. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్ (కొంత భాగం), మెహిదీపట్నం, నానల్‌నగర్, ఆసిఫ్ నగర్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్. ప్రయోజనాలు: సీవరేజీ వ్యవస్థ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది. నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు. మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సివరేజ్ పనులను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ మేం జీతాలు పెంచాం.. మోదీ ధరలు పెంచారు బహదూర్‌పురా: పాతబస్తీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మీరాలం ట్యాంక్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. దీంతో వారు తమ జీతాలు పెంచాల్సిందిగా ఆయనను కోరారు. స్పందించిన కేటీఆర్.. రాష్ట్రం వచ్చేనాటికి రూ.8 వేలున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని సీఎం కేసీఆర్ దఫదఫాలుగా రూ.17 వేలకు పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని వారు చెప్పగా, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. మేం జీతాలు పెంచుతూ ఉంటే.. మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సివరేజీ పనులకు శ్రీకారం గోల్కొండ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకిలో రూ. 297 కోట్లతో చేపట్టిన సివరేజీ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సివరేజ్ లైన్ పనులు పూర్తయితే ఎన్నో బస్తీలకు వరద ముంపు తప్పుతుందన్నారు. షేక్‌పేట్‌లో రూ. 333 కోట్లతో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు చెప్పారు. సెవన్ టూంబ్స్ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు రోప్‌వే కోసం ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తాము ప్రతిపాదించిన పనులకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మహ్మద్ నసీరుద్దీన్, రాషెఫ్ ఫరాజుద్దీన్, టీఆర్ఎశ్ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి టి.జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక చెత్త కనిపించదు: మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్, అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ (అమృత్) పథకాల రెండో దశను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు చెత్త నుంచి విముక్తి కలిగించడంతో పాటు, తాగునీటి భద్రత కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ దశలో మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలమని చెప్పారు. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఎం 2.0, అమృత్ 2.0ను ప్రారంభించిన ప్రధాని అంబేడ్కర్ కలలు సాకారం అవడానికి కూడా ఈ పథకాల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.సమాజంలో అసమానతలు తొలగించడానికి పట్టణాభివృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుందని దాదాసాహెబ్ భావించేవారని, అలాంటి చోట ఈ కార్యక్రమం జరగడం హర్షించదగిన విషయమని అన్నారు. మెరుగైన జీవితం కోసం ఎన్నో కలలతో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారని, వారికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ జీవన ప్రమాణాలు దక్కడం లేదని అన్నారు. ఇళ్లకి దూరంగా వచ్చిన వారు ఇలాంటి పరిస్థితుల్లో నివసించడం చాలా దారుణమైన విషయమని అందుకే పట్టణాల్లో పరిస్థితులు మారాలని అన్నారు. రోజుకి లక్ష టన్నుల వ్యర్థాలు: దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోందని, పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. 2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టామని ఆ దశలో 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యమని ప్రధాని చెప్పారు. అమృత్‌లో భాగంగా మురుగునీరు నదుల్లోకి కలవకుండా చూస్తామని, పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తామని ప్రధాని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ప్రచారాన్ని యువతరం అందిపుచ్చుకుందని మోదీ చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాలు విసిరివేయొద్దని, జేబులో ఉంచుకొని తర్వాత చెత్త బుట్టలో వెయ్యాలన్నారు. చిన్న చిన్న పిల్లలే రోడ్లపై ఉమ్మి వేయొద్దని పెద్దలకి చెబుతున్నారని అన్నారు. ఇదేదో ఒక్క రోజో, ఒక ఏడాదో చేసే కార్యక్రమం కాదని, ప్రతీ రోజూ చేయాలని, ఒక తరం నుంచి మరో తరానికి స్వచ్ఛభారత్ ప్రయాణం కొనసాగించాలని అన్నారు. 70% చెత్త శుద్ధి చేస్తున్నాం 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పుడు దేశంలో పేరుకుపోయే చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేదని, ఇప్పుడు 70% చెత్తను శుద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతామని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. అర్బన్ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ మిషన్‌ని మూడు ఆర్లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ద్వారా ముందుకు తీసుకువెళతామని ప్రధాని మోదీ వివరించారు. ఇక అమృత్‌లో భాగంగా భూగర్భ జల సంరక్షణకు చర్యలు చేపడతారు. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగిం చుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. -
డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్‌లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. -
‘సాగు’తున్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు
సాక్షి, మచిలీపట్నంటౌన్: పట్టణంలోని 42వ వార్డు గుమస్తాల కాలనీ సమీపాన చేపట్టిన మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయనే వాదలను వినవస్తున్నాయి. ఈ పనులు ప్రారంభానికి గత మే నెల 21వ తేదీన ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకు పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ ఈ పనులను వేగవంతంగా కాకుండా నత్త నడకన చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. శంకుస్థాపన జరిగి ఆరు నెలలు గడిచినా ఇంకా గ్రౌండ్ పనులే జరుగుతున్నాయే తప్ప పూర్తి స్థాయి పనులు చేపట్ట లేదంటున్నారు. పట్టణంలోని ఈడేపల్లి మేజర్ డ్రెయిన్ ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు గాను ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ పథకం ఫేజ్–2 నుంచి విడుదలైన రూ. 16.76 కోట్లతో ఈ పనులను చేపట్టారు. ఆరు నెలలుగా ఈ పనులు ఇంకా పునాదుల స్థాయిలోనే ఉన్నాయే తప్ప పూర్తి స్థాయికి చేరుకోలేదని అంటున్నారు. కొద్ది నెలలుగా పనులను ఆపేసి ఇటీవలే పనులు ప్రారంభించారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై సంబంధిత పబ్లిక్‌హెల్త్ అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోందనే చెబుతున్నారు. నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది, కార్మికులు వారి ఇష్టానుసారంగాపనులు చేస్తున్నారంటున్నారు. నాణ్య తపై అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఇప్పటిౖనా పాలకులు, అధికారులు దృష్టి సారించి మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు వేగవంతంగా, నాణ్యతగా నిర్మించేలా చూడాల్సి ఉంది. -
‘నాడా’ అప్పీల్ ప్యానెల్లో సెహ్వాగ్
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో అరుదుగా క్రికెటర్లకు లభించే అవకాశం భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దక్కింది. ‘నాడా’కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్– ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. అయితే ఆశ్చర్యకంగా 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించడం విశేషం. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు. -
మురుగునీరు.. బోలెడు ప్రయోజనాలు
హైదరాబాద్‌కు మూసీ.. ముంబైకి మీఠీ.. చెన్నైకి అడయార్, ఢిల్లీకి యమునా.. కోల్‌కతాకు హూగ్లీ.. మహానగరాల్లో కాలుష్య కాసార నదులివీ..! ఈ సమస్యకు పరిష్కారం తమ వద్ద ఉందని సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము న్యూ జనరేటర్‌ను అభివృద్ధి పరిచామని, ఇది మురుగునీటితో పాటు మానవ వ్యర్థాలను కూడా శుద్ధి చేస్తుందని పేర్కొంటున్నారు. మంచి నీటితో పాటు విద్యుత్, ఎరువు కూడా దీని ద్వారా లభిస్తుందని చెబుతున్నారు. బయోరియాక్టర్‌లో ఉండే బ్యాక్టీరియా ఘన వ్యర్థాలను విడగొట్టి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన ద్రవాన్ని సూక్ష్మస్థాయి ఫిల్టర్ ద్వారా పంపించి బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఘన పదార్థాలను వేరు చేస్తుంది. ఇలా మిగిలిపోయిన నీటిని క్లోరిన్‌తో శుద్ధి చేస్తే.. మంచినీరు సిద్ధమైపోతుంది. మిగిలిపోయిన ఘన వ్యర్థాలను ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొత్తం మూడు దశల్లో రసాయనాల వాడకం తక్కువ కాబట్టి న్యూజనరేటర్ వాడకం సులువుగా జరిగిపోతుందన్న మాట. అంతేకాదు.. వీటిని సులభ్ కాంప్లెక్స్ వంటి కమ్యూనిటీ మరుగుదొడ్లకు అనుసంధానించుకుని అక్కడికక్కడే లబ్ధి పొందొచ్చు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ న్యూజనరేటర్లను మన దేశంతో పాటు దక్షిణాఫ్రికాలో ప్రయోగాత్మకంగా వాడేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
మట్టి రోడ్లే దిక్కు..!
► డ్రెయినేజీలు లేక అవస్థలు ► సమస్యల వలయంలో భగత్‌నగర్ కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఎటు చూసినా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. అందమైన భవనాలు, పెద్ద అపార్టుమెంట్లు ఉండే ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు బూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. శివారు ప్రాంతం కావడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. 30వ డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ కాలనీ పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అసంపూర్తి పనులతో డ్రెరుునేజీలు ఉండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డివిజన్ ప్రధాన రహదారితో పాటు గల్లీ రోడ్లు సైతం మట్టి రోడ్లుగానే మిగిలిపోయారుు. పక్కనున్న కాలనీలలో ఒక్క మట్టి రోడ్డు కూడా లేకపోవడం, భగత్‌నగర్‌లో ఒక్క సీసీ రోడ్లు కనిపించకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకుల వివక్షపై ప్రశ్నిస్తున్నారు. రోడ్లు లేకపోవడం ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉండగా, ఇరుకు సందుల్లో ఉన్న ప్రధాన డ్రెరుున్లు ప్రమాదకరంగా మారారుు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నారుు. వర్షం పడిన ప్రతీసారి వరదనీరంతా ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండ కాలం వచ్చిందంటే రోడ్లు దుమ్మెత్తిపోతున్నారుు. గుంతలతో కుదుపులు భగత్‌నగర్‌లో ఎటు చూసినా గతుకుల రోడ్లే కనిపిస్తారుు. ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో స్కూల్ బస్సులు, వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారుు. గతుకుల రోడ్లతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నగరం అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పటికీ ఈ డివిజన్లో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారుు. ఇన్నాళ్లు యూజీడీ పనులు జరుగుతున్నాయనే సాకుతో అభివృద్ధి పనులు వారుుదా వేసిన అధికారులు, యూజీడీ పనులు ఈ ప్రాంతంలో పూర్తరుునప్పటికీ నూతన సీసీ రోడ్లు చేపట్టడం లేదంటున్నారు. డ్రెరుున్లు లేకపోవడం, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో పందులు, దోమలకు అడ్డాగా మారుతున్నారుు. దుర్వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన డ్రెయన్లు, సీసీరోడ్లు నిర్మించాలని కోరుతున్నారు. శివారుపై పట్టింపు కరువు భగత్‌నగర్ ఎన్జీవోకాలనీలోని ఇళ్లలోకి వెళ్లాలంటే అధ్వాన్న రహదారులే కనిపిస్తారుు. ఇళ్ల యజమానులే మట్టి పోసుకొని, బండరాళ్లు వేసుకొని దారిని చదును చేసుకున్నారు. ప్రారంభించిన డ్రెరుున్లు ఎక్కడా పూర్తిచేయలేదు. ఎటు వైపు నీళ్లు ఎటు వైపుకు వెళ్తాయే కూడా తెలియన పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాలతో మరింత ఇబ్బందులు అవుతున్నాయని ఎన్జీఓ కాలనీలో 50 వరకు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు.పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని, వెంటనే రక్షించాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భగత్‌నగర్ కాలనీవాసుల సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. -
మురుగునీళ్లే ‘మహా’భాగ్యం!
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కలుషిత నీరే దిక్కు సాక్షి, హైదరాబాద్: ‘ఈ నీళ్లను పొరపాటున నోట్లో పోసుకున్నా నోరంతా పొక్కుతోంది.. రోగాలపాలవుతున్నాం..’ చేతిలోని మురికినీళ్ల బాటిల్ చూపిస్తూ ఎన్టీఆర్నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ ఆవేదన.. నీళ్లను పరీక్షించే వాళ్లే లేరు.. ఈ మురికి నీళ్లకు కూడా ట్యాంకర్‌కు రూ.1,500 తీసుకుంటున్నారు..’ సైదప్పకాలనీలో ఓ సగటు నగరజీవి గోడు.. ...వీరిద్దరే కాదు మహానగరంలోని అనేక బస్తీల్లో లక్షలాది మంది అభాగ్యులది ఇదే దుస్థితి! ముఖ్యంగా శివారుల్లోని బస్తీలు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నాయి. వందలు పోసి ట్యాంకర్ నీళ్లను కొంటున్నా తాగేందుకు ఏమాత్రం పనికి రావడం లేదు. ఆ మురికి నీళ్లను స్నానానికి, బట్టలు ఉతికేందుకు, కాలకృత్యాలకు వాడుకుంటూ.. తాగునీళ్ల కోసం గత్యంతరం లేక మళ్లీ ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. మండు వేసవిలో బోరుబావులు వట్టిపోవడం, జలమండలి నల్లా కనెక్షన్లు లేకపోవడంతో శివారు ప్రాంతాలకు మురుగునీరే దిక్కవుతోంది. ఈ నీటిని వాడుతున్న బస్తీవాసులు చర్మ, గొంతు సంబంధ రోగాలతో సతమతమవుతున్నారు. నగరంలో చివరికి మురుగునీరు కూడా వ్యాపారులకు కాసుల పంట కురిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిజాంపేట్‌లోని తుర్కచెరువులో నిల్వ ఉన్న వ్యర్థ జలాలను మోటార్లతో తోడి నిత్యం వందలాది ట్యాంకర్లలో అమ్ముతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ఈ నీటిని ట్యాంకర్‌కు రూ.1,500 చొప్పున సమీప బస్తీలైన ఎన్టీఆర్ నగర్, సైదప్ప కాలనీలతోపాటు పలు అపార్ట్మెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని నోట్లో పోసుకుంటే పొక్కులు, స్నానం చేస్తే దద్దుర్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడే కాదు... పలు శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మురుగు నీటిని ట్యాంకర్లలో నింపి విక్రయిస్తున్న ముఠాలను కట్టడి చేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమౌతోంది. మణికొండ, పుప్పాల్‌గూడ, నిజాంపేట్, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ, తెల్లాపూర్, అమీన్పూర్, మియాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ల దందా మాఫియాను తలపిస్తోంది. కూకట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంపేట్రోడ్, ఎల్లమ్మబండ చౌరస్తాల్లో బారులు తీరిన ట్యాంకర్లు, బహిరంగంగా మురుగు నీటిని నింపుతున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి.! ఎక్కడిది ఈ మురుగు? ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో శివారు ప్రాంతాల్లో సుమారు 14 లక్షల బోరుబావులు వట్టిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు విధిగా ట్యాంకర్ నీళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక నిజాంపేట్ తుర్కచెరువు వంటి చోట్ల సమీప కాలనీలు, బస్తీల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) లేదు. దీంతో ఓపెన్ నాలాల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలు ఈ చెరువులను ముంచెత్తుతున్నాయి. ఈ నీటినే తోడుతూ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జేబులు గుల్ల చేస్తున్నారు ప్రైవేటు ట్యాంకర్ మాఫియా మా జేబులు గుల్ల చేస్తోంది. మురుగు నీటికి సైతం ట్యాంకర్‌కు (5 వేల లీటర్లు) రూ.1,500 నుంచి రూ.2,000 వరకు దండుకుంటున్నారు. ట్యాంకర్ నీళ్ల నాణ్యతను పరీక్షించే నాథుడే లేడు. -శ్రీధర్, మియాపూర్ నోట్లో పోసుకుంటే అంతే బోరుబావులు వట్టిపోవడంతో విధిలేక ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొంటున్నాం. ఈ నీటిని పొరపాటున నోట్లో పోసుకుంటే నోరంతా పొక్కి రోగాల బారిన పడుతున్నాం. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి. - వర్ష వర్మ, అమీన్పూర్ -
బ్యాక్టీరియాతో మురుగుకు చెక్!
- మూసీ ప్రక్షాళనకు సరికొత్త ప్రయోగం - సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న జలమండలి - ముందుకొచ్చిన మహారాష్ట్ర కంపెనీ సాక్షి, సిటీబ్యూరో: మురుగుతో కాలుష్యమవుతున్న మూసీ జలాలను ప్రక్షాళన చేసేందుకు జలమండలి వినూత్న ప్రయోగంపై దృష్టిపెట్టింది. జీవ,రసాయన వ్యర్థాలను హరించే ‘మైక్రో ఆర్గానిజం కల్చర్ బ్యాక్టీరియా’తో మురుగు నీటిని శుద్ధిచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అమెరికా, జపాన్ తదితర దేశాల్లోనే అమల్లో ఉన్న ఈ విధానాన్ని త్వరలో నగరంలోని నల్లచెరువు సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్‌లోనూ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. నీటిలో ఉన్న ఆర్గానిక్ వ్యర్థాలను ఈ బ్యాక్టీరియా ఆహారంగా స్వీకరించి క్రియారహితంగా మారుతుంది. సూపర్‌బగ్ తరహాలో పనిచేస్తుంది. ఈ విధానం పర్యావరణానికి కూడా హానికలిగించదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ బ్యాక్టీరియాను పౌడర్ రూపంలో అందజేసేందుకు మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్’ (ఎఫ్బీఎల్) ముందుకొచ్చింది. ఈ బ్యాక్టీరియా పనితీరుపై సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, జలమండలి అధికారులకు ఇటీవల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ విధానం అమలు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల సలహాలను కూడా స్వీకరించనున్నారు. పౌడర్ బ్యాక్టీరియా... తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న మిశ్రమంలో ఈ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. దీనిని సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ప్రవేశిస్తున్న వ్యర్థ జలాలపై పెద్ద మొత్తంలో చల్లుతారు. దీంతో బ్యాక్టీరియా క్రియాశీలమవుతుంది. మురుగులోని వ్యర్థాలను తిని సరళ పదార్థాలుగా విడగొడుతుంది. అనంతరం ఇది క్రియారహితంగా మారుతుంది. మురుగు ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దీని జీవితకాలం తక్కువగానే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పర్యావరణానికి మేలు చేస్తుందే తప్ప కీడు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది తిరిగి చైతన్యం అయ్యే వీలులేదని తెలిపారు. ప్రస్తుతానికి నో ఛార్జ్.... నల్లచెరువు ఎస్టీపీలో ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టినందుకు సదరు సంస్థకు ప్రస్తుతం నిధులు కేటాయించబోమని జలమండలి స్పష్టంచేసింది. ఈ బ్యాక్టీరియా పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే అంబర్పేట్, అత్తాపూర్ ఎస్టీపీల్లో ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తామని జలమండలి ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈవిషయంలో పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఉపయోగాలివీ.. - మురుగునీటిలో వ్యర్థాల నుంచి మీథేన్ గ్యాస్‌ను రిలీజ్ చేస్తాయి. - ఈ గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. - మురుగు శుద్ధి కేంద్రంలో ఉన్న ఏరేటర్స్, టర్భైన్స్పై వత్తిడి బాగా తగ్గుతుంది. - మురుగు ప్రవాహానికి ఆటంకాలు తొలగుతాయి. - ఎస్టీపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గించవచ్చు. - శుద్ధిచేసిన వ్యర్థజలాల్లో బీఓడీ, సీఓడీ స్థాయిలను ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడవచ్చు. అనర్థాలూ ఉంటాయి.. మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాతో భవిష్యత్‌లో మనుషులు, జంతువులు, భూగర్భ జలాలపై దుష్ర్పభావం చూపే అవకాశాలుంటాయి. ఈ బ్యాక్టీరియా కేవలం ఆర్గానిక్ కాలుష్యాలను మాత్రమే తొలగిస్తుంది. మురుగు నీటిలోని నైట్రోజన్, పాస్ఫరస్, అమ్మోనియా వంటి మూలకాలు, భారలోహాలు, రసాయనాలను తొలగించే అవకాశం ఉండదు. పర్యావరణ వేత్తల పర్యవేక్షణలోనే ఇలాంటి బ్యాక్టీరియాను వినియోగించాల్సి ఉంటుంది. -డాక్టర్ వెంకటేశ్వర్, ఓయూ జంతుశాస్త్ర విభాగాధిపతి -
సిటీ..పిటీ
-ముంచెత్తుతున్న మురుగు - కొద్దిపాటి వర్షానికే నగరం జలమయం - టెండర్ల దశ దాటని బుడమేరు - స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి విడుదల కాని నిధులు - నగరవాసులకు తప్పని తిప్పలు విజయవాడ సెంట్రల్ : పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది నగరం పరిస్థితి. చిన్నపాటి వర్షాలకే నగరం తటాకాన్ని తలపిస్తోంది. మురుగు ముంచెత్తుతోంది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం జలమయమైంది. రోడ్లపై దారితెలియక పలువురు వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఏళ్లతరబడి కొనసా...గుతున్న నిర్మాణ పనులు, అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ నగర వాసుల పాలిట శాపంలా పరిణమించాయి. డ్రెయిన్లలో డీ సిల్టింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. బుడమేరు ముంపు నివారణకు సంబంధించి రూ.47.59 కోట్లు విడుదలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.462 కోట్లలో తొలి విడత రూ.110 కోట్లను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. పూర్తికాని పూడికతీత నగరపాలక సంస్థ అధికారులు ఈ ఏడాది రూ.1.28 కోట్లతో డీ సిల్టింగ్ పనులు చేపట్టారు. ప్రజారోగ్య, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. జూన్ ఒకటి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 34 మేజర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. మీడియం, మైనర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లలో మురుగు రోడ్లపై పొంగిపొర్లుతోంది. వన్‌టౌన్, వించిపేట, కొత్తపేట, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, మొగల్రాజపురం, పటమట, ఆటోనగర్ ప్రాంతాల్ని మురుగు ముంచెత్తింది. భవానీపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్ఎస్సీ బోస్ నగర్ (కండ్రిక), జక్కంపూడి కాలనీ ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడక తప్పడం లేదు. అస్తవ్యస్తం నగరంలో మురుగు పోయేందుకు నగరంలో సరైన ప్రణాళిక లేదు. భూగర్భ డ్రెయినేజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఓపెన్ డ్రెయిన్ల నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. డ్రెయిన్ల ద్వారా వచ్చే మురుగునీటిలో కొంత భాగాన్ని బుడమేరు, కృష్ణానదుల్లో కలుపుతున్నారు. మిగిలిన నీటిని బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లోకి మళ్లిస్తున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా భూగర్భ డ్రెయినేజీని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.271.48 కోట్లు కేటాయించారు. 2015 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాాగా, అనేక ప్రాంతాల్లో ఇంకా పనులు కొన..సాగుతూనే ఉన్నాయి. భూగర్భ డ్రెయినేజీకి అనుసంధానమైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. పనులు జరిగితేనే.. బుడమేరు ముంపు నివారణ, స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులు పూర్తయితే కానీ నగర వాసులకు వరద కష్టాలు తప్పవు. బుడమేరు ముంపు నివారణకు సంబంధించి రూ.47.59 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.9 కోట్లను స్థల సేకరణకు సంబంధించి రైల్వే అధికారులకు చెల్లించారు. మిగిలిన మొత్తంతో సర్కిల్-1, 2 ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నారు. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్రం రూ.461.04 కోట్లు మంజూరు చేసింది. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి 100 కి.మీ. మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ. మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. మూడేళ్లలో నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ఏడాది రూ.110 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే నగరానికి వరద ముంపు తిప్పలు తప్పినట్లే. -
కాలనీళ్లు
- ఇళ్లను ముంచెత్తుతున్న మురుగునీరు - కాలనీ వాసులకు ఏటా తప్పని కష్టాలు - గ్రేటర్లో 4600 కి.మీ. మేర మురుగునీటి పైప్లైన్లు - సరిగా సాగని పూడికతీత పనులు - చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు సాక్షి,సిటీబ్యూరో: వాన పేరు వింటే నగరంలోని బస్తీ జనాలు హడలిపోతున్నారు. చినుకు పడితే వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ఏ నాలా పొంగి ఇళ్ల మీదకు వస్తుందోనని భీతిల్లుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ పరిధిలోని మురుగునీటి కాల్వలు, నాలాలు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి. గత పక్షం రోజుల్లో మహా నగర పరిధిలో 138.2 మిల్లీమీటర్ల (దాదాపు 13.8 సెంటీమీటర్ల) వర్షపాతం నమోదైంది. నాలాల్లో పూడికతీత సరిగా లేకపోవడంతో ఈ నీరు వర్షపునీటితో కలసి ఇళ్లలోకి చేరుతోంది. మహా నగర వ్యాప్తంగా 4600 కి.మీ. మేర ఉన్న డ్రైనేజీ పైప్లైన్లు, 1500 కి.మీ. విస్తరించిన నాలాలు, మరో 1.85 లక్షలు ఉన్న మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన మట్టి, చెత్తా చెదారం, పూడికను 60 శాతమే తొలగించారు. దీంతో ఈ దుస్థితి తలెత్తింది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎక్కడి మురుగు అక్కడే వివిధ ప్రాంతాల్లో మూతలు లేని మ్యాన్‌హోళ్లలో తినుబండారాల దుకాణాల యజమానులు, బిల్డర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు, నిర్మాణ సామగ్రి, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ పేపర్లు, గ్లాసులు, చెత్తా చెదారం, మట్టితో నింపేస్తున్నారు. దీంతో డ్రైనేజీ లైన్లు పూడుకుపోయాయి. వర్షాలకు ఆయా ప్రాంతాల్లో మురుగు ముంచెత్తుతోంది. ఈ వేసవిలో సుమారు 1840 కి.మీ. మురుగునీటి పైప్లైన్లలో పూడికతీత పనులు అరకొరగా చేపట్టడంతో పరిస్థితి విషమించింది. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, జలమండలి క్షేత్రస్థాయి అధికారులకు, అత్యవసర కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతమాత్రమేనని శివారు వాసులు గగ్గోలు పెడుతున్నారు. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని వందలాది కాలనీలు, బస్తీల్లో డ్రైనేజి ఔట్లెట్ సదుపాయాలు లేవు. దీంతో వర్షం పడిన ప్రతిసారీ వాన నీటితో కలిసిన మురుగునీరు నివాసాలను ముంచెత్తుతుండడం గమనార్హం. ఇదీ నాలాల దుస్థితి నగరంలో వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గం లేకపోవడం. నాలాలపైనే అంతస్తులకు అంతస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. వీటి అభివృద్ధికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఏళ్లకేళ్లుగా పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో జనం ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా మూసీ కాలువలో పడి తరుణ్(7) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇటీవల సీఎం నగర పర్యటనలో, స్వచ్ఛ కమిటీ సమీక్షలో సైతం నాలాల దుస్థితినే ప్రజలు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో నష ్టనివారణకు స్వల్ప, దీర్ఘకాలికంగా వీటి అభివృద్ధి పనులు చేయాలని భావించారు. దీనిపై స్వచ్ఛ కమిటీ చేసిన సిఫారసులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇవీ కమిటీ సిఫారసులు - నాలాల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికి నష్ట పరిహారం తగినంత ఇవ్వాలి. - ఇల్లు పూర్తిగా కోల్పోయే వారికి కొత్త ఇల్లు ఇవ్వాలి. - ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలి. - ప్రైవేటు భూములకు కొత్త చట్టం మేరకు నష్ట పరిహారం చెల్లించాలి. - సత్వర భూసేకరణకు డిప్యూటీ కలెక్టర్ నేతత్వంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగం ఏర్పాటు. - 26 కి.మీ. మేర ఉన్న మేజర్ బాటిల్ నెక్స్‌ను గుర్తించి ప్రథమ ప్రాధాన్యంతో పనులు చేపట్టాలి. ఆస్తులు కోల్పోయే వారికి దాదాపు రూ.223 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. - సివరేజి నాలాల్లోకి చేరకుండా వాటర్ బోర్డు చర్యలు తీసుకోవాలి. - ఏటా నాలాల్లో డీసిల్టింగ్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితి షరా మామూలే. చెత్తను నాలాల్లో వేస్తుండటంతో పరిస్థితులు మొదటికొస్తున్నాయి. - బల్కంపేట్, గ్రీన్‌పార్క్ హోటల్, ధరమ్‌కరణ్ రోడ్, మహబూబ్ కాలేజ్, బైబిల్ హౌజ్, ఫీవర్ ఆస్పత్రి, అంబర్పేట్, మిశ్రీగంజ్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు సమీప కాలనీలు, బస్తీలు, రహదారులను ముంచెత్తుతోంది. - చెత్త, మురుగునీరు నాలాల్లో చేరకుండా చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నాలాల వద్ద ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయాలి. - నాలాలను ఏడాది పాటు సక్రమంగా నిర్వహించేలా కాంట్రాక్టు ఇవ్వాలి. వాటిని తగినంత వెడల్పు చేయాలి. ఇవన్నీ అమలైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని స్వచ్ఛ కమిటీ తేల్చింది. నదిని తలపించేలా... ఖైరతాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేటు ప్రధాన రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లడంతో రోడ్డు పొడవునా నీరు నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నీరు నిలవడంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి ఖైరతాబాద్ ప్రధాన రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ కూరుకుపోవడంతో వాటర్‌వర్క్స్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉదయం చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని అటువైపు వె ళ్లకుండా రైల్వేగేటు సమీపంలోని మరో మ్యాన్‌హోల్ వద్ద అడ్డుకట్ట వేశారు. దీంతో నీరు రోడ్డుపై నిలిచిపోయింది. ఎట్టకేలకు ఆ నీటిని ఇంకో మ్యాన్‌హోల్ ద్వారా మళ్లించారు. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని మెరుగుపరచాలనివైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్.బ్రహ్మయ్య కోరారు. -
‘కాలుష్యం’పై కొరడా
సిద్దిపేట జోన్: పరిశ్రమల కాలుష్యంపై సర్కార్ నిఘా పెంచింది. కాలుష్యంతో జనజీవనం అతలాకుతలం అవుతున్న వైనంపై దృష్టి సారించిన ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వీర్యంపై స్థానిక మున్సిపాలిటీలు అనుసరిస్తున్న విధానాన్ని సునిశితంగా పరిశీలిస్తోంది. అందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఇటీవల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక నగర పంచాయతీలకు నోటీసులను జారీ చేసింది. రాజధానికి సమీపంలో ఉన్న జిల్లాలో కాలుష్య నియంత్రణ చర్యలపై పీసీబీ గట్టి చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాలుష్య నివారణ చర్యల గురించి వివరాలను వెల్లడించడమే కాకుండా వారం రోజుల్లో బోర్డు ఎదుట హాజరు కావాలంటూ ఆయా మున్సిపాలిటీ, నగర పంచాయతీల కమిషనర్లకు ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలోని మురికినీటి వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్య నియంత్రణ చర్యలు, పట్టణ ప్రజల నుంచి సేకరించిన వ్యర్థ పదార్థాల సమగ్ర వివరాలు, కబేళా నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల నియంత్రణ ప్రక్రియ, మురికి నీటి ప్రవాహ స్థితి గతులు, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ విధానం, ప్రాసెసింగ్ యూనిట్ అమలు లాంటి ప్రధాన ఐదు అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు పీసీబీ నోటీసులను జారీ చేసింది. దీంతో వారం రోజులు క్రితమే జిల్లా అధికారులు పీసీబీ బోర్డ్ హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులు ఆరు నెలల క్రితమే సిద్దిపేటను క్లీన్ అండ్ గ్రీన్ చేయాలన్న నినాదంతో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తరూపంలో రీసైక్లింగ్ చేసి కంపోస్ట్ ప్రక్రియకు వినియోగిస్తున్న తీరును వివరించగా, పీసీబీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇవే అంశాలను జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారా లేదా అనే అంశంపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. కాలుష్య నియంత్రణ చర్యలను విస్మరించిన మున్సిపాలిటీలకు కొద్దిరోజులు గడువిచ్చిన అధికారులు ఆ తర్వాత మెమోలు జారీ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. -
ఏళ్లకేళ్లుగా అవస్థలే..
‘డ్రెయినేజీల నీళ్లు నిండిపోతే వాసన భరించలేక పోతున్నం. దోమలు ఎక్కువైపోయి నిద్ర కూడా పడుతలేదు. మురుగు కంపుతోటి సచ్చిపోతున్నం. డ్రెయినేజీ కోసం కట్టిన కాల్వల నుంచే మంచినీళ్ల పైపులైన్లు వేసిండ్లు. పైపులు లీకైనప్పుడల్లా ఆ నీళ్లు మంచి నీళ్లలో కలుస్తున్నయ్. మురికి కాల్వలు కూడా తక్కువ వెడల్పుతో కట్టడంతో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ముందుకు వెళ్లక ఇళ్లలోకి వస్తున్నయ్. ఎంతకని చెప్పుడు! పదేండ్ల నుంచి మాది ఇదే గోస. సింగరేణికి చెందిన నీళ్ల ట్యాంకు కాడ చెత్తపోత్తండ్లు. మేం పేదోళ్లం. ఏం చేయలేక ఈ మురికి కూపంలోనే బతుకుతున్నం’ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజల ఆవేదన ఇది... కొంకటి లక్ష్మీనారాయణ : అమ్మా నమస్కారములు. ఎలా ఉన్నారమ్మా? లక్ష్మీకాంతం : ఎలా ఉంటాం సారూ. మురుగు కంపుతోటి సచ్చిపోతున్నం. డ్రెరుునేజీ కుండీలు కట్టినట్టేకానీ.. ఏం పాయిదా లేదు. కుండీలు నిండిపోయి మురికినీళ్లన్నీ ఇండ్లల్లకత్తన్నయ్. రోగాలపాలైతన్నం. లక్ష్మీనారాయణ : మీరు చెప్పండమ్మా..? సరస్వతీ : డ్రెయినేజీల నీళ్లు నిండిపోతే వాసన భరించలేక పోతున్నం. ఇంటికి తలా కొంత డబ్బు పోగేసి కుండీలళ్ల జామైన మట్టిని తీపిచ్చుకుంటున్నం. ఎవలకు చెప్పినా పట్టించుకుంటలేరు. మా గోసైతే తీరుతలేదు. లక్ష్మీనారాయణ : కార్పొరేషన్ నల్లాలున్నాయా? సుశీల : కార్పొరేషన్ పైపులైన్లు ఉన్నా... సంవత్సరం నుంచి నీళ్లు వస్తలేవు. పక్కింటికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నం. లక్ష్మీనారాయణ : మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తా. లక్ష్మీనారాయణ : ఎలా ఉన్నారండి..? మే పేరేంటి? రవీందర్ : నా పేరు రవీందర్. ఆటో డ్రైవర్‌ను. లక్ష్మీనారాయణ : మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? రవీందర్ : మా ఇంటి ముందు కరెంటు తీగలు కిందకి వేలాడుతున్నయ్. ట్రాక్టర్ రావాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రమాదముందని అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. లక్ష్మీనారాయణ : ఏమమ్మా.. బాగున్నారా..? లక్ష్మి : ఏం బాగుంటాం సార్. ఇంటి ముందట మురుగునీళ్ల కోసం కుండీలను కట్టిళ్లు. దానిమీద మూతలే పెట్టలేదు. దోమలు ఎక్కువైపోయి నిద్ర కూడా పడుతలేదు. ఇంట్లో అందరం ఇబ్బంది పడుతన్నం. లక్ష్మీనారాయణ : ఎలా ఉన్నారు..? మీకేమైనా సమస్యలున్నాయా..? పూర్మ శ్రీనివాస్ : నేను న్యాయవాదిగా పనిచేస్తున్నా. ఈ ప్రాంతం మున్సిపాలిటీకాకముందు నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుతం అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్(యూఏసీ) కింద ఆస్తి విలువలో 10 శాతం ఎక్కువ పన్ను విధిస్తున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించారు. మేం ఎందుకు ఈ అదనపు పన్ను చెల్లించాలి. లక్ష్మీనారాయణ : అధికారుల దృష్టికి తీసుకెళ్తా. లక్ష్మీనారాయణ : ఏం తాత.. బాగున్నావా..? బాలయ్య : ఏం బాగుంటామయ్యా. ఇరువై ఏండ్ల కిందట సింగరేణిలో పనిచేసి రిటేరైన. వయసు మీదపడి వచ్చిన రోగాలకు సింగరేణి ఆస్పత్రికిపోతే మందులిత్తలేరు. గవర్నమెంట్ ఆస్పత్రికి పోదామంటే ఆటో చార్జీలకే యాభై రూపాయలైతన్నయ్. అందుకే ఇంటికాన్నే ఉంటన్న. సింగరేణిల పింఛన్ వత్తలేదు. కేసీఆర్ వచ్చినంక ఇత్తమన్నరు. ఇంకా ఇత్తలేరు. జల్ది ఇప్పియ్యండ్రి. లక్ష్మీనారాయణ : పింఛన్ కోసం కార్పొరేషన్లో దరఖాస్తు పెట్టుకున్నవా..? పెట్టుకోకుంటే ఎవరితోనైనా దరఖాస్తు రాపిచ్చి ఇయ్యి. నేను పింఛన్ ఇప్పిస్తా. ఆనందం : సార్... నీళ్ల పైపులు లీకైతన్నయ్. ఆ నీళ్లనే తాగుతన్నం. లక్ష్మీనారాయణ : తాగునీటి పైపులైన్ల లీకేజీలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. లక్ష్మీనారాయణ : ఏం అన్నా... బాగున్నావా. మీ ఏరియాలో ఏమైనా సమస్యలున్నాయా..? మామిడి లింగయ్య : ఇంటిముందటున్న సింగరేణికి చెందిన నీళ్ల ట్యాంకు కాడ చెత్తపోత్తండ్లు. కుళ్లిపోయినై తీసుకొచ్చి అక్కడేత్తండ్లు. వాసనతో సచ్చిపోతున్నం. ఇంకేం బాగుంటం. లక్ష్మీనారాయణ : రోజూ వచ్చి చెత్తతీత్తలేరా..? మామిడి లింగయ్య : వారం రోజులకొక్కసారి కూడా చెత్త తీత్తలేరు. ఎన్నిసార్లు చెప్పినా ఎవలు పట్టించుకుంటలేరు. లక్ష్మీనారాయణ:ఈ ఇండ్లల్ల ఎట్ల ఉంటున్నరమ్మా మధునమ్మ : మా బతుకు ఏం చెప్పుడు సారూ. ఎంతకని చెప్పుడు! పదేండ్ల నుంచి మాది ఇదే గోస. ఇంతకుముందు మురుగునీరు, వాన నీ ళ్లు సాపుగా ఎల్లిపోయేటివి. కాల్వకు మధ్య సెప్టిక్‌ట్యాంక్ కట్టి మమ్మల్ని అరిగోస పెట్టిళ్లు. రోజూ నరకమే చూస్తున్నం. చుట్టుపక్కల ఇండ్ల ల్ల నుంచి వచ్చిన డ్రెయినేజీ నీళ్లన్నీ ఇండ్ల పక్కకే వత్తున్నయ్. నీళ్లు ఎక్కువైతే ఇంట్లోకి వస్తయి. వాన కాలంల మురికినీళ్లతో ఇండ్లన్నీ నిండిపోతయ్. దోమలబాధ భరించలేపోతున్నం. రోగాలకే పైసలన్నీ ఖర్చయితన్నయ్. అసలు నిద్ర కూడా పడుతలేదు. ఇల్లు ఖాళీ చేసి వేరే కాడ కిరాయికి ఉంటే బాగుండు అనిపిస్తంది. లక్ష్మీనారాయణ : మీరు చెప్పండమ్మా..? శిరీష : సార్... మేం పేదోళ్లం. ఏం చేయలేక ఈ మురికి కూపంలోనే బతుకుతున్నం. వానకాలంల ఇళ్లలోకి వచ్చిన నీళ్లను బయటకు పంపించాలంటే మా తరం అయితలేదు. ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎందరో లీడర్లు వచ్చి చూసిం డ్రు. పరిష్కరిస్తామని చెప్పి పోయిండ్రు. వాళ్లు వచ్చుడు... పోవుడు వరకే కానీ, మా సమస్య మాత్రం తీరలేదు. మా బాధను ‘సాక్షి’ పేపర్ గతంలో చాలా సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చింది. (‘సాక్షి’ ప్రచురించిన కథనాలను కొంకటి లక్ష్మీనారాయణకు చూపించారు.) కనకలక్ష్మి : మేమీ ప్రాంతంలో ఉంటున్నామనే విషయాన్ని కూడా అధికారులు గుర్తిస్తలేరు. అందరిలెక్కనే పన్నులు కడుతున్నం. మమ్మలెందుకు ఈ రకంగా ఇబ్బందిపెడుతున్నారు. శ్రీనివాస్ : డ్రెయినేజీ కోసం కట్టిన కాల్వల నుంచే మంచినీళ్ల పైపులైన్లు వేసిండ్లు. పైపులు లీకైనప్పుడల్లా ఆ నీళ్లు మంచినీళ్లలో కలుస్తున్నయ్. మురికి కాల్వలు కూడా తక్కువ వెడల్పుతో కట్టడంతో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ముందుకు వెళ్లక ఇళ్లలోకి వస్తున్నయ్. కాల్వ వెడల్పు చేయాలె. లక్ష్మీనారాయణ : అమ్మా బాగున్నారా..? భాగ్య : నమస్కారం సార్. రమేశ్‌నగర్ చౌరస్తా ఇవతల రోడ్డు అధ్వానంగా తయారైంది. వాహనాలు నడిరోడ్డు నుంచి వెళ్లకుండా పక్కనుంచి వస్తుండడంతో పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నరు. లక్ష్మీనారాయణ : రోడ్డు మీద నీళ్లు చాలానే పారుతున్నయ్ కదా? సరోజన : కార్పొరేషన్ మంచినీటి పైప్‌లైన్ లీకై ఇలా రోడ్డు మీద మొత్తం నీళ్లే సార్. నీళ్లు నిలిచి రోడ్డు కూడా పాడైపోయింది. పంపు వచ్చినప్పుడల్లా ఇదే గోస. ఎవలు పట్టించుకుంటలేరు. మేయర్ హామీలు... ఎల్బీనగర్లో అండర్‌గ్రౌండ్ పైపులైన్ సరిగ్గా వేయకపోవడంతో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. దీన్ని సరిచేసేందుకు కార్పొరేషన్ అధికారులతో అంచనాలు తయారు చేయిస్తున్నా. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. కిందికి వేలాడే విద్యుత్ తీగల విషయమై వెంటనే ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడుతా. లూజ్లైన్లు లేకుండా చూస్తాం. సింగరేణిలో పనిచేసి 20 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సంస్థ నుంచి పెన్షన్ రావడం లేదు. వారికి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా. రూ.2 లక్షల్లోపు ఆదాయం ఉన్న వృద్ధులకు పెన్షన్ తప్పకుండా ఇస్తాం. మేం అధికారంలోకి రాకముందు 295 చోట్ల తాగునీటి పైప్లైన్ల లీకేజీలుండేవి. అధికారంలోకి వచ్చాక 230 లీకేజీలు అరికట్టాం. లీకేజీలు శాశ్వతంగా అరికట్టేందుకు రూ.2.20 కోట్లతో టెండర్లు పిలిచాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. 24వ డివిజన్లో ఇళ్ల మధ్య ఉన్న మురికి గుంటను తొలగించి అక్కడ కాల్వ నిర్మిస్తాం. రీజినల్ ఆస్పత్రి రోడ్డు నుంచి ఎల్బీనగర్కు వెళ్లే రహదారి సింగరేణికి సంబంధించింది. ఈ రోడ్డును నిర్మించాలని సింగరేణికి లేఖ రాస్తాం. -
బెండంత అండ!
అనువైన నేలలు సారవంతమైన నీరు నిలిచే తేలికపాటి నేలలు, మురుగు నీరు నిల్వని నల్లరేగడి నేలలు అనుకూలం. సాగు భూమిని 2 నుంచి 4 సాళ్లు మెత్తగా దున్నుకోవాలి. ఎకరాకు రబీ సీజన్లో 7 నుంచి 8 కిలోలు, ఖరీఫ్‌లో అయితే ఐదు కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన రకాలు పర్బనీ క్రాంతి అనే రకం మొక్కలు కొమ్మలు వేయకుండా ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. అర్క అనామిక రకం విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది. అర్క అభయ రకం విత్తనాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. సంకర జాతికి చెందిన వర్ష, విజయ్, మహికో హైబ్రిడ్ నంబరు 10, 64, ప్రియ, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, సింజెంటా ఓహెచ్ 597, తులసి తదితర రకాల విత్తనాలు వేసుకోవచ్చు. ఈ రకాల విత్తనాలు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. విత్తనశుద్ధి, నాటే విధానం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌తో తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నేలను 4 నుంచి ఐదు సార్లు దున్నిన తర్వాత బోజెలు వేసుకోవాలి. వీటి మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక్కో మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండాలి. విత్తనం విత్తిన వెంటనే నీటి తడి పెట్టాలి. అనంతరం నాలుగు రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఎరువుల యాజమాన్యం రబీలో సాగు కోసం ఆఖరి దుక్కిలో ఎకరాకు ఆరు టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అలాగే భాస్వరం వేసుకుంటే పంట బాగా ఎదుగుతుంది. ఎకరాకు 48 కిలోల నత్రజనిని రెండు విడతలుగా 30 నుంచి 45 రోజుల మధ్యలో వేయాలి. విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలో నత్రజని ఎరువును వేసుకోవాలి. పంట పూత దశలో లీటరు నీటిలో 10 గ్రాముల యూ రియా కలిపి పిచికారీ చేయాలి. తద్వారా 25 శాతం వరకు నత్రజని ఆదాతోపాటు అధిక దిగుబడి పెరుగుతుంది. మొవ్వ, కాయ తొలుచు పురుగు విత్తిన 30 రోజుల నుంచి ఈ పురుగు మొక్కలను ఆశిస్తుంది. మొవ్వు, పూత, కాయలను తొలిచి వేయడం ద్వారా నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు మొవ్వు, పూత కాయలకు రంధ్రాలు చేసి లోనికి వెళతాయి. అక్కడి పదార్థాన్ని తినేయడం వల్ల కొమ్మలు వాలిపోవడం, కాయలు పుచ్చులుగా మారడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతాయి. నివారణ చర్యలు... మొవ్వు పురుగుల నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, ప్రొఫెనోఫాస్ మందును కలిపి 10 రోజల వ్యవధిలో రెండు సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. శంకు లేదా పల్లాకు తెగులు బెండ పంటపై ఆశించే తెగుళ్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనిని వైరస్ తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారి కాయలు గిడసిబారి తెల్లగా మారిపోతాయి. ఆకులు చిన్నవిగా ముడతపడి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నివారణ చర్యలు... తెగుళ్లను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాల విత్తనాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్ల దోమను అరికట్టవచ్చు. మచ్చతెగులు ఇది సోకితే ఆకుల అడుగు భాగాన నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనినే మచ్చతెగులు అంటారు. ఈ తెగులు పెరినోస్లిరోపారా అనే శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఎరిసావిటిల్లా అనే రెక్కల పురుగు ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. ఈ పురుగు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకులపై మచ్చలు వచ్చినట్లు గుర్తిస్తే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తెల్లదోమ, బూడిద తెగులు తెల్లదోమ ఆశిస్తే బెండ రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇవి ఆకులు అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకితే ఆకుల పైభాగంలో, కింది భాగంలోను బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్, 2 మి.లీ. హెక్సాకోనజోల్ స్ప్రే చేయాలి. -
‘చెత్త’శుద్ధి ఏదీ?
మొయినాబాద్ రూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురుగు కాలువలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. అధికారులకు ‘చెత్త’శుద్ధి లోపించింది. ఏదో తూతూమంత్రంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించి వదిలేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్, హిమాయత్‌నగర్, బాకారం, ముర్తజా గూడ, కాశింబౌళి, నదీంమ్‌పేట్, ఎన్కేపల్లి, మొయినాబాద్ గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దశాబ్దాల క్రితం నిర్మించిన మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మురుగుకాలువలు శుభ్రం చేయాలనే లక్ష ్యంతో ఏటా చేపట్టే పారిశుద్ధ్య వారోత్సవాలను అధికారులు 20రోజుల క్రితం నిర్వహించారు. అయినప్పటికీ ఒనగూరిన ప్రయోజనం శూన్యం. రోడ్లపై ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా ఏటా పంచాయతీలకు రూ.10వేలు మంజూరు చేసేవారని, ఈసారి అవి కూడా రాలేదని ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. రోగాలు దరిచేరకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.