గత మేనెలలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులకు వేసిన శిలాఫలకం
సాక్షి, మచిలీపట్నంటౌన్: పట్టణంలోని 42వ వార్డు గుమస్తాల కాలనీ సమీపాన చేపట్టిన మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయనే వాదలను వినవస్తున్నాయి. ఈ పనులు ప్రారంభానికి గత మే నెల 21వ తేదీన ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు.
అయితే శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకు పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ ఈ పనులను వేగవంతంగా కాకుండా నత్త నడకన చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. శంకుస్థాపన జరిగి ఆరు నెలలు గడిచినా ఇంకా గ్రౌండ్ పనులే జరుగుతున్నాయే తప్ప పూర్తి స్థాయి పనులు చేపట్ట లేదంటున్నారు.
పట్టణంలోని ఈడేపల్లి మేజర్ డ్రెయిన్ ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు గాను ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ పథకం ఫేజ్–2 నుంచి విడుదలైన రూ. 16.76 కోట్లతో ఈ పనులను చేపట్టారు. ఆరు నెలలుగా ఈ పనులు ఇంకా పునాదుల స్థాయిలోనే ఉన్నాయే తప్ప పూర్తి స్థాయికి చేరుకోలేదని అంటున్నారు.
కొద్ది నెలలుగా పనులను ఆపేసి ఇటీవలే పనులు ప్రారంభించారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై సంబంధిత పబ్లిక్‌హెల్త్ అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోందనే చెబుతున్నారు. నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది, కార్మికులు వారి ఇష్టానుసారంగాపనులు చేస్తున్నారంటున్నారు. నాణ్య తపై అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఇప్పటిౖనా పాలకులు, అధికారులు దృష్టి సారించి మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు వేగవంతంగా, నాణ్యతగా నిర్మించేలా చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment