మట్టి రోడ్లే దిక్కు..!
► డ్రెయినేజీలు లేక అవస్థలు
► సమస్యల వలయంలో భగత్‌నగర్
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఎటు చూసినా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. అందమైన భవనాలు, పెద్ద అపార్టుమెంట్‌లు ఉండే ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు బూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. శివారు ప్రాంతం కావడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. 30వ డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ కాలనీ పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అసంపూర్తి పనులతో డ్రెరుునేజీలు ఉండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డివిజన్ ప్రధాన రహదారితో పాటు గల్లీ రోడ్లు సైతం మట్టి రోడ్లుగానే మిగిలిపోయారుు. పక్కనున్న కాలనీలలో ఒక్క మట్టి రోడ్డు కూడా లేకపోవడం, భగత్‌నగర్‌లో ఒక్క సీసీ రోడ్లు కనిపించకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
పాలకుల వివక్షపై ప్రశ్నిస్తున్నారు. రోడ్లు లేకపోవడం ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉండగా, ఇరుకు సందుల్లో ఉన్న ప్రధాన డ్రెరుున్‌లు ప్రమాదకరంగా మారారుు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నారుు. వర్షం పడిన ప్రతీసారి వరదనీరంతా ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండ కాలం వచ్చిందంటే రోడ్లు దుమ్మెత్తిపోతున్నారుు.
గుంతలతో కుదుపులు
భగత్‌నగర్‌లో ఎటు చూసినా గతుకుల రోడ్లే కనిపిస్తారుు. ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో స్కూల్ బస్సులు, వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారుు. గతుకుల రోడ్లతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నగరం అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పటికీ ఈ డివిజన్‌లో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారుు. ఇన్నాళ్లు యూజీడీ పనులు జరుగుతున్నాయనే సాకుతో అభివృద్ధి పనులు వారుుదా వేసిన అధికారులు, యూజీడీ పనులు ఈ ప్రాంతంలో పూర్తరుునప్పటికీ నూతన సీసీ రోడ్లు చేపట్టడం లేదంటున్నారు. డ్రెరుున్‌లు లేకపోవడం, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో పందులు, దోమలకు అడ్డాగా మారుతున్నారుు. దుర్వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన డ్రెయన్‌లు, సీసీరోడ్లు నిర్మించాలని కోరుతున్నారు.
శివారుపై పట్టింపు కరువు
భగత్‌నగర్ ఎన్‌జీవోకాలనీలోని ఇళ్లలోకి వెళ్లాలంటే అధ్వాన్న రహదారులే కనిపిస్తారుు. ఇళ్ల యజమానులే మట్టి పోసుకొని, బండరాళ్లు వేసుకొని దారిని చదును చేసుకున్నారు. ప్రారంభించిన డ్రెరుున్‌లు ఎక్కడా పూర్తిచేయలేదు. ఎటు వైపు నీళ్లు ఎటు వైపుకు వెళ్తాయే కూడా తెలియన పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఖాళీ స్థలాలతో మరింత ఇబ్బందులు అవుతున్నాయని ఎన్జీఓ కాలనీలో 50 వరకు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు.పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని, వెంటనే రక్షించాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భగత్‌నగర్ కాలనీవాసుల సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు.