సాక్షి, అమరావతి: మురుగు నీరు శుద్ధి చేయడంతో పాటు పునర్ వినియోగంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు నివేదిక స్పష్టం చేసింది. ఏపీలో 15 శాతం మేర మురుగు నీటిని శుద్ధి చేస్తుండగా ఇందులో 22 శాతాన్ని తిరిగి ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మరుగునీటి శుద్ధి 21 శాతంగా ఉంటే.. ఇందులో 9 శాతాన్ని మాత్రమే మళ్లీ వినియోగిస్తున్నట్లు పేర్కొంది.
14 పట్టణ స్థానిక సంస్థల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించడాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించింది. ఇలా శుద్ధి చేసిన నీటిని ఆక్వాకల్చర్, పశుగ్రాసం సాగుకు, భూగర్భ జలాల రీచార్జ్‌కు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మురుగు నీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 పట్టణ స్థానిక సంస్ధల్లో రోజుకు 535.45 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యం ఉండగా.. పునర్ వినియోగం రోజుకు 119.96 మిలియన్ లీటర్లుగా ఉందని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు నివేదిక పేర్కొంది.
(చదవండి: ఆన్‌లైన్‌లో నోటరీల సమాచారం)
Comments
Please login to add a commentAdd a comment