Mud roads
-
మెదక్: వెళ్లిపోయావా అక్షర!
మెదక్ : జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తీవ్ర వర్షాలు.. గుంతలు, బురదతో అధ్వానంగా మారిన రోడ్డు ఓ పదేళ్ల బాలిక జీవితాన్ని బలిగొంది. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రోడ్డు కారణంగా ఆలస్యమై ఆ చిన్నారి కన్నుమూసింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహ్మద్‌నగర్ తండా పంచాయతీ పరిధిలోని అందుగులపల్లి(పెద్దమ్మగడ్డ తండా)లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు తండాకు వెళ్లే మట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి బురదతో నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సోమవారం తండాకు చెందిన కులబాబు, రేణుక దంపతుల కూతురు అక్షర (10) తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను బైక్‌పై ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో బురదలో బైక్ ముందుకు కదలలేదు. దీంతో పాపను ఎత్తుకుని ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారి మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. అధ్వానంగా మారిన తండా రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: రీల్స్ కోసం ఎచ్చులకు పోయి.. విషాదం -
మట్టి రోడ్లే దిక్కు..!
► డ్రెయినేజీలు లేక అవస్థలు ► సమస్యల వలయంలో భగత్‌నగర్ కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఎటు చూసినా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. అందమైన భవనాలు, పెద్ద అపార్టుమెంట్లు ఉండే ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు బూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. శివారు ప్రాంతం కావడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. 30వ డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ కాలనీ పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అసంపూర్తి పనులతో డ్రెరుునేజీలు ఉండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డివిజన్ ప్రధాన రహదారితో పాటు గల్లీ రోడ్లు సైతం మట్టి రోడ్లుగానే మిగిలిపోయారుు. పక్కనున్న కాలనీలలో ఒక్క మట్టి రోడ్డు కూడా లేకపోవడం, భగత్‌నగర్‌లో ఒక్క సీసీ రోడ్లు కనిపించకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకుల వివక్షపై ప్రశ్నిస్తున్నారు. రోడ్లు లేకపోవడం ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉండగా, ఇరుకు సందుల్లో ఉన్న ప్రధాన డ్రెరుున్లు ప్రమాదకరంగా మారారుు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నారుు. వర్షం పడిన ప్రతీసారి వరదనీరంతా ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండ కాలం వచ్చిందంటే రోడ్లు దుమ్మెత్తిపోతున్నారుు. గుంతలతో కుదుపులు భగత్‌నగర్‌లో ఎటు చూసినా గతుకుల రోడ్లే కనిపిస్తారుు. ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో స్కూల్ బస్సులు, వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారుు. గతుకుల రోడ్లతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నగరం అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పటికీ ఈ డివిజన్లో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారుు. ఇన్నాళ్లు యూజీడీ పనులు జరుగుతున్నాయనే సాకుతో అభివృద్ధి పనులు వారుుదా వేసిన అధికారులు, యూజీడీ పనులు ఈ ప్రాంతంలో పూర్తరుునప్పటికీ నూతన సీసీ రోడ్లు చేపట్టడం లేదంటున్నారు. డ్రెరుున్లు లేకపోవడం, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో పందులు, దోమలకు అడ్డాగా మారుతున్నారుు. దుర్వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన డ్రెయన్లు, సీసీరోడ్లు నిర్మించాలని కోరుతున్నారు. శివారుపై పట్టింపు కరువు భగత్‌నగర్ ఎన్జీవోకాలనీలోని ఇళ్లలోకి వెళ్లాలంటే అధ్వాన్న రహదారులే కనిపిస్తారుు. ఇళ్ల యజమానులే మట్టి పోసుకొని, బండరాళ్లు వేసుకొని దారిని చదును చేసుకున్నారు. ప్రారంభించిన డ్రెరుున్లు ఎక్కడా పూర్తిచేయలేదు. ఎటు వైపు నీళ్లు ఎటు వైపుకు వెళ్తాయే కూడా తెలియన పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాలతో మరింత ఇబ్బందులు అవుతున్నాయని ఎన్జీఓ కాలనీలో 50 వరకు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు.పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని, వెంటనే రక్షించాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భగత్‌నగర్ కాలనీవాసుల సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. -
నరకం ... నరకం
పెద్దశంకరంపేట:గ్రామాల్లోని మట్టి రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా సిమెంటు రోడ్లకు నోచుకోవడం లేదు. చిన్నపాటి వర్షాలకే బురదమయంగా మారి నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని మాధవ నగర్‌కు వెళ్లే దారే ఇందుకు నిదర్శనం. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలు పడితే నడక కూడా కష్టమే. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలవడం, వాహనాల రాకపోకల వల్ల దారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో రోడ్డు పక్క ఉన్న పొలాల్లో నడవాల్సి వస్తోంది. వర్షం పడిన పది పదిహేను రోజులు తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని పాదచారులు తెలిపారు. ఈ సమస్య పంచాయతీ సిబ్బంది, అధికారులకు తెలిసినా వారు రోడ్డు బాగు కోసం కృషి చేయడం లేదని ఆరోపించారు. గతంలో సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను కోరినట్లు ప్రజలు తెలిపారు.] ప్రతి రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది ఈ మార్గంలో కాలి నడకన రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కూడా బురద కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని వివరించారు. అంతేకాకుండా బురదలో వాహనం ఇరుక్కుపోతే దాన్ని బయటికి తీయడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి రోడ్డును సీసీగా మార్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.