drinage
-
రోడ్లపై ఏరులై పారిన నెత్తురు
-
చేపలకు పొతే నోట్ల కట్టలు దొరికాయోచ్..
-
నాలా పనులకు ఆస్తుల సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాబోయే వర్షాకాలంలోగా వరదముప్పు సమస్యల పరిష్కారానికి సిద్ధమైన జీహెచ్ఎంసీకి ఆస్తుల సేకరణ సవాల్‌గా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముంపు ముప్పు తగ్గించేందుకు రూ.900 కోట్లకు పైగా పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిల్లో వీలైనన్ని పనుల్ని ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. నాలాల విస్తరణ, ఆధునికీకరణ, బాక్స్ డ్రెయిన్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 కోట్ల మేర పనులు పూర్తి చేయాలంటే 350కిపైగా ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఆస్తులు కోల్పోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలంటే వందల కోట్లు కావాలి. ► జీహెచ్ఎంసీ ఖజానాపై ఆస్తుల సేకరణల భారం పడకుండా ఉండేందుకు ఎస్సార్డీపీ ఫ్లైఓవర్లు, లింక్ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రాంతాల్లో ఆస్తుల సేకరణకు టీడీఆర్‌ను వినియోగించుకున్నారు. ఆస్తులు కోల్పోయే బాధితులకు తగిన విధంగా నచ్చచెబుతూ టీడీఆర్‌తో ఎక్కువ ప్రయోజనముంటుందని వివరించడం ద్వారా చాలా వరకు వారిని ఒప్పించగలిగారు. అలా వివిధ పనులకు చాలా ఆస్తులు సేకరించారు. ► ఇప్పుడు నాలాల పనులకు సైతం అదే విధానానికి సిద్ధమయ్యారు. కానీ.. పనులు వేసవిలోగానే పూర్తి చేయాల్సి ఉన్నందున ఎక్కువ సమయం లేకపోవడంతో వీలైనంత త్వరితగతిన సేకరించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మే నెలలోపే పనులు పూర్తిచేయాల్సి ఉన్నందున వీలైనన్ని ఆస్తులు సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆస్తుల సేకరణ అవసరం లేని, ఇతరత్రా ఆటంకాలు లేని ప్రాంతాల్లో పనుల వేగం పెంచారు. ఆస్తుల సేకరణ అవసరమైన చోట బాధితులు టీడీఆర్‌కు ఒప్పుకోకపోతే , నగదుగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే జీహెచ్ఎంసీ ఖజానాపై పెను ప్రభావం చూపనుంది. పనుల్లో కొన్ని.. ► బైరామల్‌గూడ జంక్షన్ నుంచి చెరువు వరకు బాక్స్ డ్రెయిన్ పనులకు సంబంధించి మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. పల్లె చెరువు నుంచి అలీనగర్ వరకు ముర్కి నాలా ఆధునికీకరణకు సంబంధించి రెండు ఆస్తులు, ఇదే నాలాకు సంబంధించి ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ నుంచి నిమ్రా కాలనీ వరకు లింక్ లేని ప్రాంతాల్లో పనులకు మరో మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. ► పాతబస్తీలో చోటా బ్రిడ్జి నుంచి తలాబ్ కట్ట బ్రిడ్జి వరకు రిటైనింగ్‌వాల్ నిర్మాణం చేయాలంటే 36 ఆస్తులు సేకరించాల్సి ఉండగా, మెజారిటీ ఆస్తు లు సేకరించినప్పటికీ, మరో అయిదారు ఆస్తులు సేకరించాల్సి ఉంది. కిషన్‌బాగ్ నాలాకు సంబంధించి దాదాపు 25 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ► సన్నీ గార్డెన్ నుంచి శివాజీ నగర్ వరకు ముర్కి నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వందకు పైగా ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో చేయాల్సిన పనులకు 65 ఆస్తులకు పై గా సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఆస్తుల్ని సేకరించాల్సి ఉంది. టీడీఆర్‌తో ప్రయోజనాలు.. ► అమలులో ఉన్న భూసేకరణ చట్టం మేరకు ఆస్తులు కోల్పోయేవారికి వారు కోల్పోయే భూమి/ఆస్తుల మార్కెట్ విలువకు 200 శాతం నగదు చెల్లించాలి. అదే టీడీఆర్ రూపేణా అయితే కోల్పోయే భూమికి 400 శాతం మేర విస్తీర్ణంతో నిర్మాణాలు చేసేందుకు అనుమతిస్తారు. అలా ఆస్తిహక్కు బదలాయింపు కోసం ఇచ్చే పత్రాలే టీడీఆర్ సర్టిఫికెట్లు. వాటిని పొందిన వారు స్వయంగా వాడుకోవచ్చు లేదా ఇతరులకు విక్రయించుకోవచ్చు. ► టీడీఆర్ హక్కులున్నవారి వివరాలు ఆన్లైన్లో అందుబాటులోకి ఉండటంతో వాటిని అమ్ముకోవాలనుకునేవారికి, కొనుక్కోవాలనుకునే వారికీ మార్గం సుగమమైంది. హక్కుల బదలాయింపు కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. నిర్మాణ అనుమతులకు సంబంధించి సెట్‌బ్యాక్స్‌లో కొన్ని మినహాయింపులున్నాయి. అదనపు అంతస్తు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది. (క్లిక్: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం) -
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
వికారాబాద్ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై సర్పంచ్ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
నీరు కలుషితం: నలుగురు మృతి, 72 మంది ఆస్పత్రిపాలు
అహ్మదాబాద్: తాగునీరు కలుషితమవడంతో ఆ నీరు తాగిన వారిలో నలుగురు మృతి చెందగా 72 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని కఠోర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలవడంతో ఆ నీరు తాగిన వారి ప్రాణం మీదకు వచ్చిందని తేలింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠోర్ గ్రామంలో ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. వాంతులు.. విరేచనాలు చేసుకోవడంతో వారంతా ఆస్పత్రి బాట పట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నాపెద్దా అందరూ ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు కన్నుమూశారు. మృతిచెందిన వారు గెమల్ వాసవ (45), హరీశ్ రాథోడ్ (42), మోహన్ రాథోడ్ (70) విజయ్ సోలంకి (38). చిన్నారులు అకస్మాత్తుగా నీరసంతో కిందపడిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో పాటు ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఓఆర్ఎస్ పాకెట్లు పంపించారు. వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించారు. డ్రైనేజీ నీటి పైపును తొలగించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. -
దారుణం: వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత
ముంబై: మహిళపై అత్యారానికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేశారు. అంతటితో వదలకుండా ఆమె మృతదేహాన్ని ఏకంగా భూగర్భ డ్రైనేజీ సమీపంలో పారవేసిన సంఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో సంపన్నులు నివసించే బాంద్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చౌరస్తా మధ్యలో ఉన్న డ్రైనేజీ వద్ద కొందరు మహిళ శవాన్ని గుర్తించారు. ముంబైలోని ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న డ్రైనేజీ వద్ద స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించగా మహిళ అత్యాచారంతో పాటు హత్యకు గురయ్యిందంటూ వైద్యులు నిర్ధారించారు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయాలైనట్టు వైద్యులు తమ నివేదికలో తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 376 (అత్యాచారం), 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన ఆమె వేశ్య అని తెలిసింది. నగదు సంబంధించిన విషయంలో గొడవ జరిగి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఆమెను పిలిపించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే ఇది క్షణికావేశంలో చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: మృగాళ్లకు బాలిక బలి: నిందితుల్లో మైనర్లు చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య -
డ్రైనేజీ సంపులో పడ్డ విద్యార్థినులు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: డ్రైనేజీ సంపు పైనున్న మూత విరిగిపోవడంతో దానిపై ఉన్న ముగ్గురు విద్యార్థినులు డ్రైనేజీలో పడిపోయిన సంఘటన జిల్లాలోని గోపాలపురం బాలయోగి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. మ్యాట్రిస్ రాణి ఆదేశాల మేరకు విద్యార్థినులు పాఠశాల ఆవరణలో మొక్కలు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంపు సుమారు ఆరు అడుగుల లోతు ఉండడంతో విద్యార్థినులు అందులో మునిగిపోయారు. దీంతో పక్కనే ఉన్న తోటి విద్యార్థినులు సెక్యూరిటీ గార్డు సహాయంతో వారిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. పిల్లలతో పనులు చేయించడమేంటని వార్డెన్‌ను నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం విద్యార్థినిలను ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మురుగు.. ముప్పు
వీపనగండ్ల : మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వీధుల్లోని రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముక్కు మూసుకోవాల్సిందే.. గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకెళ్లాల్సిందే. రోడ్లపైనే మురుగు, వ్యర్థపదార్థాలు పడేస్తుండటంతో పందులు సంచరిస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు .. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా మండలంలో పారిశుద్ధ్యం, అంతర్గత , ఆపరేటర్ల నిర్వాహణ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేశారు. సంపట్రావుపల్లిలో పారిశుద్ధ్యం, ఆపరేటర్ పేరుతో రూ.లక్షా 10వేలు డ్రా చేసినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. సంగినేనిపల్లిలో పారిశుధ్యం నిర్వాహణ కోసం రూ.60 వేలు, ఆపరేటర్ వేతనం కోసం రూ.8824 , తూంకుంటలో రూ.75 వేలు, గోవర్దనగిరిలో రూ.35 వేలు, కల్వరాళ్లలో రూ.40వేలు ఖర్చు చే సినట్లు అధికారులు లెక్కలు వేసి ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి డ బ్బులు డ్రా చేశారు. కానీ చాలా గ్రామా ల్లో పారిశుధ్య పనులు చేపట్టిన దాఖ లాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. విచారణ జరపాలి గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రా చేసిన నిధులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. గ్రామాల్లో ఉన్న మురికి గుంతలను పూడ్చి వృథా నీరు ఊర చివరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళనకు శ్రీకారం చుడుతాం. – శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దృష్టి సారిస్తాం గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తాం. ప్రజా ప్రతినిధులు డ్రా చేసిన నిధులపై విచారణ జరుపుతాం. గ్రామాల్లో పర్యటించి శాశ్వత పారిశుద్ధ్య నిర్వాహణ పనుల కోసం నిధుల మంజూరుకు జిల్లా అధికారులకు నివేదికలు పంపుతాం. – బద్రినాథ్, ఇన్చార్జ్ ఈఓఆర్డీ -
మురుగు.. పరుగు
కల్వకుర్తి టౌన్ : పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రెయినేజీలు లేక మురుగు రోడ్లపై పారుతుంది. కల్వకుర్తి పట్టణంలో మొత్తం 20వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో డ్రెయినేజీల నిర్మాణం సరిగా లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతామని చెబుతున్నా ప్రజాప్రతి నిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పందులకు ఆవాసంగా.. గ్రామపంచాయతీ అనుమతితో పలు కాలనీల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో ఇళ్ల మధ్యలో మురుగు నిలుస్తుంది. దాంతో పందులు సంచిరిస్తూ ఆవాసాలుగా మారుతున్నాయి. గుంపులు గుంపులుగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2.18కోట్లు కల్వకుర్తి పట్టణంలో ఇప్పటివరకు 20 కాలనీల్లో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2కోట్ల18లక్షలు నగరపంచాయతీ ఖర్చుచేసింది. యీ నిధులతో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామని పాలకులు చెబుతున్నా వివిధ కాలనీల్లో మురుగు మాత్రం రోడ్లపైనే పారుతోంది. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేకపోతున్నామని పట్టణంలోని వివిధ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపాం పట్టణంలో మురుగు రోడ్లపై పారుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. రూ.కోట్లు ఖర్చుచేసినా డ్రెయినేజీల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మురుగు కాల్వలు, రోడ్ల కోసం రూ.20కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం. – రాచోటి శ్రీశైలం, చైర్మన్, నగర పంచాయతీ -
మట్టి రోడ్లే దిక్కు..!
► డ్రెయినేజీలు లేక అవస్థలు ► సమస్యల వలయంలో భగత్‌నగర్ కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఎటు చూసినా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. అందమైన భవనాలు, పెద్ద అపార్టుమెంట్లు ఉండే ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు బూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. శివారు ప్రాంతం కావడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. 30వ డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ కాలనీ పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అసంపూర్తి పనులతో డ్రెరుునేజీలు ఉండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డివిజన్ ప్రధాన రహదారితో పాటు గల్లీ రోడ్లు సైతం మట్టి రోడ్లుగానే మిగిలిపోయారుు. పక్కనున్న కాలనీలలో ఒక్క మట్టి రోడ్డు కూడా లేకపోవడం, భగత్‌నగర్‌లో ఒక్క సీసీ రోడ్లు కనిపించకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకుల వివక్షపై ప్రశ్నిస్తున్నారు. రోడ్లు లేకపోవడం ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉండగా, ఇరుకు సందుల్లో ఉన్న ప్రధాన డ్రెరుున్లు ప్రమాదకరంగా మారారుు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నారుు. వర్షం పడిన ప్రతీసారి వరదనీరంతా ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండ కాలం వచ్చిందంటే రోడ్లు దుమ్మెత్తిపోతున్నారుు. గుంతలతో కుదుపులు భగత్‌నగర్‌లో ఎటు చూసినా గతుకుల రోడ్లే కనిపిస్తారుు. ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో స్కూల్ బస్సులు, వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారుు. గతుకుల రోడ్లతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నగరం అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పటికీ ఈ డివిజన్లో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారుు. ఇన్నాళ్లు యూజీడీ పనులు జరుగుతున్నాయనే సాకుతో అభివృద్ధి పనులు వారుుదా వేసిన అధికారులు, యూజీడీ పనులు ఈ ప్రాంతంలో పూర్తరుునప్పటికీ నూతన సీసీ రోడ్లు చేపట్టడం లేదంటున్నారు. డ్రెరుున్లు లేకపోవడం, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో పందులు, దోమలకు అడ్డాగా మారుతున్నారుు. దుర్వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన డ్రెయన్లు, సీసీరోడ్లు నిర్మించాలని కోరుతున్నారు. శివారుపై పట్టింపు కరువు భగత్‌నగర్ ఎన్జీవోకాలనీలోని ఇళ్లలోకి వెళ్లాలంటే అధ్వాన్న రహదారులే కనిపిస్తారుు. ఇళ్ల యజమానులే మట్టి పోసుకొని, బండరాళ్లు వేసుకొని దారిని చదును చేసుకున్నారు. ప్రారంభించిన డ్రెరుున్లు ఎక్కడా పూర్తిచేయలేదు. ఎటు వైపు నీళ్లు ఎటు వైపుకు వెళ్తాయే కూడా తెలియన పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాలతో మరింత ఇబ్బందులు అవుతున్నాయని ఎన్జీఓ కాలనీలో 50 వరకు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు.పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని, వెంటనే రక్షించాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భగత్‌నగర్ కాలనీవాసుల సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. -
మురుగు కాల్వలో నాలుగు శిశు మృతదేహాలు
కర్నూలు: కర్నూలులో దారుణ సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన నలుగురు ఆడ శిశువులను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. కర్నూలులోని ఆనంద్ థియేటర్ సమీపంలోని బ్రిడ్జి పక్కనే ఉన్న మురికి కాల్వలో పారిశుద్ధ్య సిబ్బంది మంగళవారం మురుగు తీస్తుండగా.. నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు లభించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పుట్టక ముందే ఆడ పిల్లలని తెలియడంతో అబార్షన్ చేసి పడేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. -
మురికి కాలువలో పసికందు
మహబూబ్‌నగర్: గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును సోమవారం మురికికాలువలో వదిలివెళ్లారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో గాంధీనగర్ కాలనీ సిల్వర్ జూబ్లీ క్లబ్ సమీపంలోని వీరేష్ ఇంటిముందు చోటుచేసుకుంది. పాప ఏడుపు గుర్తించిన వీరేష్ భార్య పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు 108 సాయంతో చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
మురుగు మరుగయ్యేనా!
జంట జలాశయాల్లో కలుస్తున్న ఎగువ ప్రాంతంలోని మురుగు మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు శూన్యం శంషాబాద్ రూరల్: నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ‘మురుగు’ పెద్ద సమస్యగా మారింది. మురుగునీరు జలాశయాల్లోకి చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో జీఓ 111 అమలులో ఉండగా ఎగువ ప్రాంతం గ్రామాల్లోని మురుగంతా వరదనీటితో పాటు జలాశయాల్లో కలుస్తోంది. ఆయా గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. దీంతో జలాశయాల్లోని నీరు కలుషితమవుతోంది. వర్షాకాలంలో వరదనీటితోపాటు మురుగంతా జలాశయాల్లోకి చేరుతోంది. శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల పరిధిలోని 84 గ్రామాల్లో జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆయా గ్రామాల మీదుగా వచ్చే వరదనీరు వాగులు, కాలువల ద్వారా జంట జలాశయాల్లో కలుస్తోంది. వీటికి ఈసీ, మూసీ వాగుల నుంచి వచ్చే వరదనీరు ప్రధానమైనది కాగా సమీపంలో ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు నేరుగా వీటిల్లోకి చేరుతోంది. గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో మురుగును స్థానికంగా ఉన్న చిన్నపాటి గుంతలు, పొలాలు, చెరువులు, కుంటల్లోకి వదిలేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మురుగు కాలువలను నేరుగా వరదకాలువలు, వాగులు, చెరువుల్లోకి కలిపేస్తున్నారు. నోటీసులతో సరి.. శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో ఇబ్బడి ముబ్బడిగా విద్యా సంస్థలు ఏర్పాటు కాగా వీటి నుంచి వెలువడే మురుగు జలాశయాల్లో కలుస్తోంది. పరీవాహక ప్రాంతంలో ఉన్న సుమారు 50 ఇంజినీరింగ్, ఇతర విద్యా సంస్థలను మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని పీసీబీ గతంలో నోటీసులు జారీ చేసింది. తర్వాత వీటి గురించి పట్టించుకునే వారు లేక ఆచరణ అమలు సాధ్యం కావడంలేదు. దీనికి తోడు గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనావాసాల సంఖ్య గత 20 ఏళ్లలో రెట్టింపు అయింది. అక్కడి జనాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికే పంచాయతీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. వీటికి తోడుగా మురుగు శుద్ధి ఇప్పుడు పెద్దసమస్యగా మారింది. నిధుల కొరతతో.. జీఓ 111 నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేదిస్తోంది. పంచాయతీ నిధులతో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చే సుకోవాలని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఒక్కో మురుగు శుద్ధి కేంద్రానికి సుమారు రూ.20 లక్షల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు గ్రామాల్లో అనువైన స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో సొంత ఖర్చులతో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు పంచాయతీలు ముందుకు రావడంలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామాల్లో మురుగును నేరుగా వరదకాలువల్లోకి వదలుతున్నారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలోని గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కృషి జరగడంలేదని సర్పంచులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సమస్య జటిలం.. జంట జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు సమస్య జటిలంగా మారింది. శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ, కవ్వగూడ, నర్కూడ, సుల్తాన్‌పల్లి, కె.బి.దొడ్డి, మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ, అజీజ్‌నగర్, అమ్డాపూర్, బాకారం, వెంక టాపూర్, నక్కలపల్లి, చిన్నమంగళారం, చిలుకూరు, రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్, వట్టినాగులపల్లి తదితర గ్రామాల్లోని మురుగు జలాశయాల్లో కలుస్తోంది. జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు రూపొందించినా అమలు కావడంలేదు. సుమారు రూ.35 కోట్ల నిధులతో మినీ ఎస్టీపీ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు గతంలోనే ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
డ్రైనేజీలో మృతదేహం లభ్యం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వెనక ఉన్న డ్రైనేజీలో ఒక మృత దేహాన్ని స్థానికులు కనుగొన్నారు. కరీంనగర్ టుటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు వావిలాలపల్లి కాలనీకి చెందిన కందుకూరి శ్రీనివాస్(45)గా గుర్తించారు. శ్రీనివాస్ గతంలో వ్యవసాయశాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేశాడు. సంవత్సరం క్రితం ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. తర్వాత మందుకు బానిసై రోజూ అదే పనిగా తాగుతున్నాడు. 2 రోజుల క్రితం డ్రైనేజీలో పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, జగిత్యాలలో ఉంటున్న భార్యాపిల్లలకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు.