డ్రైనేజీలో మృతదేహం లభ్యం | deadbody found in drinage | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలో మృతదేహం లభ్యం

Published Sun, Jan 18 2015 4:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

deadbody found in drinage

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వెనక ఉన్న డ్రైనేజీలో ఒక మృత దేహాన్ని స్థానికులు కనుగొన్నారు. కరీంనగర్ టుటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతుడు వావిలాలపల్లి కాలనీకి చెందిన కందుకూరి శ్రీనివాస్(45)గా గుర్తించారు. శ్రీనివాస్ గతంలో వ్యవసాయశాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేశాడు. సంవత్సరం క్రితం ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. తర్వాత మందుకు బానిసై రోజూ అదే పనిగా తాగుతున్నాడు. 2 రోజుల క్రితం డ్రైనేజీలో పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, జగిత్యాలలో ఉంటున్న భార్యాపిల్లలకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement