Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్‌.. సామాన్యుడిని కాలితో తంతూ.. | Sarpanch Brutally Attack On Men In Rangareddy | Sakshi
Sakshi News home page

Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్‌.. సామాన్యుడిని కాలితో తంతూ..

Published Wed, Sep 22 2021 11:31 AM | Last Updated on Wed, Sep 22 2021 12:52 PM

Sarpanch Brutally Attack On Men In Rangareddy - Sakshi

వికారాబాద్‌ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై  సర్పంచ్‌ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్‌ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్‌ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు.

అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement