Attack on man
-
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
వికారాబాద్ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై సర్పంచ్ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
‘బిజినెస్ పనిపై వచ్చాం’.. ఇంట్లోకి చొరబడి యువకుడిపై దాడి
సాక్షి, చందానగర్: ఇంట్లోకి చొరబడ్డ ఇద్దురు దుండగులు ఓ యువకుడిని కట్టేసి చితకబాదిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన శ్రీహర్ష(28), నెల్లూర్ పట్టణానికి చెందిన సాయిరాం(30) నాలుగు నెలలుగా చందానగర్‌లోని ఇంజినీర్ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, సాయిరాం సోలార్ టెక్నికల్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి 7.30కి వీరింట్లోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. శ్రీహర్ష ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ‘సాయిరాంతో బిజినెస్ పనిపై వచ్చాం.. అతను వచ్చే వరకు ఉంటాం’ అని అన్నారు. కొద్దిసేపటి తర్వాత మంచినీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తెచ్చేందుకు కిచెన్‌లోకి వెళ్తున్న శ్రీహర్షపై వారిలో ఒకడు దాడి చేయడంతో నుదుటిపై గాయమైంది. ఇద్దరు అతడిని కుర్చీలోకి తోసి కాళ్లుచేతులు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డ పెట్టి దాడి చేశారు. అనంతరం వెనుక డోర్ నుంచి పారిపోయారు. రాత్రి 9.30కి ఇంటికి వచ్చిన సాయిరాం కట్లును విప్పాడు. తర్వాత చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, వారిలో ఒకడి పేరు మల్లి అని బాధితుడు తెలిపాడు. బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఎవ్వరూ రాలేదని తేలిందని ఎస్ఐ తెలిపారు. మరే మార్గంలో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పగతోనే దాడి? ఈ నెల 16న శ్రీహర్ష, సాయిరాంలకు వారి ఇంటి పరిసరాల్లో ఉండే తాళ్లపల్లి సౌరబ్గౌడ్(28)తో గొడవ జరిగిందని, చిన్న గొడవ కావడంతో మందలించి వదిలేశామని పోలీసులు తెలిపారు. శ్రీహర్ష, సాయిరాంలు సిగరెట్ తాగుతుండగా సౌరబ్ గౌడ్ వారిని హెచ్చరించడమే కాకుండా ఇంటికి వెళ్లి దాడి చేశాడని, అనంతరం కాలనీ కమిటీ సభ్యులు ఇరువురినీ పిలిచి సర్ధిచెప్పి పంపేశారన్నారు. కాగా, సౌరబ్గౌడ్ ప్రతీకారంతోనే ఇద్దరు వ్యక్తులను పంపించి దాడి చేశాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతడిని పిలిచి విచారిస్తున్నారు. -
నడిరోడ్డుపై యువతి హల్చల్
సాక్షి, భువనేశ్వర్: రాజధాని నగరం నడి బొడ్డున ఓ యువతి దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె రాళ్లు రువ్వి యువకుడి తలను బలంగా గాయ పరిచింది. రక్తసిక్తమైన పరిస్థితుల్లో యువకుడు నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఈ సంఘటన పూర్వాపరాలు స్పష్టం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి రాళ్లతో దాడి చేసిన యువతి కనుమరుగైంది. స్థానిక రాజమహల్ ఛక్ ప్రాంతంలో మంగళవారం పట్టపగలు ఈ సంఘటన జరగడం తీవ్ర సంచలనం రేపింది. చదవండి: ప్రాణం తీసిన పబ్జీ.. వివాహిత హత్య! గంట్యాడ: మండలంలోని కె.వెలగాడ గ్రామంలో ఓ వివాహిత మంగళవారం హత్యకు గురైంది. దీనికి సంబంధించి రూరల్ సీఐ మంగవేణి తెలిపిన వివరాలు... కె.వెలగాడ గ్రామానికి చెందిన మర్రోతు భవాని(38)కి గింజేరు గ్రామానికి చెందిన శ్రీరామమూర్తితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. ఓ బిడ్డ కూడా పుట్టాడు. తరువాత భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో భవాని కె.వెలగాడలో కన్నవారింటికి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో మృతురాలికి గ్రామంలోని చౌడవాడ ఎర్రిబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ఎర్రిబాబు తనతో కాదని భవానికి వేరొకరితో కూడా సంబంధం ఉన్నట్టు అనుమానించి హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తలపై పారతో కొట్టి హత్య చేశాడు. పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం.. విషయం తెలుసుకున్న సీఐ మంగవాణితో పాటు ఎస్ఐ బి.గణేష్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పారతో హత మార్చినట్టు ఒప్పుకున్నట్టు తెలిపారు. హత్యకు వాడిన పారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి భార్య కూడా గతంలో అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి చెందినట్టు వెల్లడించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి. మృతురాలికి ఇరవై సంవత్సరాల వయసు గల కొడుకు భరత్ ఉన్నాడు. మృతురాలి తండ్రి మల్లునాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. -
వృద్ధుడిని బంధించి.. విలువైన వజ్రం అపహరణ
కడప అర్బన్: కడప శివార్లలోని ఓ ఇంటిలో అద్దెకు దిగిన ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేశారు. బాధితుడిని నిర్బంధించి, అతడి వద్ద రూ.లక్షల విలువైన వజ్రాన్ని తీసుకుని పరారయ్యారు. కడపలోని చిలకలబావి వీధికి చెందిన భుట్టో ఎలక్ట్రానిక్స్ నిర్వాహకుడు ఆసిఫ్ ఆలీఖాన్. అతడి తండ్రి ఖాదర్ బాషా(60) 2009లో చెన్నైలో 113 కేరట్ల బరువున్న ఎల్లో సఫైర్ డైమండ్‌ను (జాతి రత్నం) రూ.25,000కు కొనుగోలు చేశాడు. ఖాదర్ బాషాకు నిందితుల్లో ఒకడైన షాహీద్ హుసేన్తో పరిచయం ఏర్పడింది. షాహీద్ హుసేన్ రత్నాల వ్యాపారంలో మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఖాదర్‌బాషా వద్ద విలువైన డైమండ్ ఉందని తెలుసుకున్నాడు. షాహీద్ హుసేన్ ఈ నెల 15న కడప శివార్లలో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. 16న ఉదయం ఖాదర్‌బాషా నిందితులు అద్దెకు ఉంటున్న ఇంటికి వజ్రం తీసుకుని వెళ్లాడు. ఖాదర్‌బాషా నుంచి నిందితులు వజ్రాన్ని బలవంతంగా లాక్కుని పిడిగుద్దులు గుద్దారు. దుప్పటిలో కప్పి, ప్లాస్టర్‌తో చుట్టి బాత్రూంలో పడేశారు. కొంతసేపటికి ఖాదర్‌బాషా స్పృహలోకి వచ్చి తన పిల్లలకు ఫోన్ చేశాడు. వారు వచ్చి ఖాదర్‌బాషాను రిమ్స్‌లో చేర్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
మనిషి రాక్షసుడవుతున్న వేళ..!
చిత్తూరు అర్బన్: మనిషిలో మానవత్వం చచ్చిపోతున్నప్పుడు రాక్షసుడిగా మారుతాడు. ఇది ముమ్మాటికీ నిజమేనని చిత్తూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న ఉదంతాలు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా ఒక్కడిపై గుంపుగా దాడి చేసి, చితకబాదుతూ, ఆ దృశ్యాలను సెల్ కెమెరాలో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందుతుండటం ఆందోళన కలిగించే అంశం. అంతేకాకుండా పెద్ద హీరోయిజంలా సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఏం చెప్పదలచుకున్నారు..? చిత్తూరుకు చెందిన సాగర్ చికెన్ సెంటర్ యజమాని చిట్టిబాబునాయుడు ఈనెల 13న ప్రవర్తించిన తీరు చూస్తే అసలు వీళ్లు మనుషులేనా? అనే అనుమానం కలుగుతోంది. పనికి రాలేదనే నెపంతో పెనుమూరుకు చెందిన వేణుగోపాల్‌ను మూడు గంటల పాటు తన అనుచరులతో కలిసి కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిట్టిబాబుతో పాటు నలుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా.. అందరూ ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటోంది. ఒక దశలో వేణుగోపాల్ మర్మాంగంపై కర్రతో పొడవడానికి చిట్టిబాబు ప్రయత్నించడం, చికెన్ సెంటర్లో పనిచేసే వ్యక్తులు వేణుగోపాల్‌ను వెనుక నుంచి ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్నడం, విరిగిన చేయిని మరోచేతితో పట్టుకుని బాధితుడు దండం పెడుతున్నా వీరి వదలకుండా పదే..పదే హింసించడం చూస్తే ఎవరికైనా రక్తం మరగకమానదు. ఇక ఈనెల 20న చిత్తూరులోని మిట్టూరుకు చెందిన గీతూరెడ్డి అనే మహిళ, ఆమె కుమారుడు శరత్‌కుమార్ సాదిక్ అనే యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు చూసినవారు కడుపు తరుక్కుపోతోందంటున్నారు. సాదిక్ అతని స్నేహితుడి మధ్య ఓ యువతి విషయమై వివాదం రేగింది. దీనిపై పంచాయతీ చేయడానికి సాదిక్‌ను గీతూరెడ్డి తన ఇంటికి పిలిపించింది. తన గురించి ఇతరులకు ఎందుకు చెడుగా చెబుతావంటూ అతడిపై చేయి చేసుకుంది. అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాత గీతూరెడ్డితోపాటు ఉన్న శరత్ స్నేహితులు ఏడుగురు ఓ కల్యాణమండపం వద్ద మరోసారి సాదిక్‌ను చితకబాదారు. మొహం, కడుపుపై కాళ్లతో తన్నడం, పిడి గుద్దులు కురిపించడం, కింద పడ్డా పైకిలేపి మరీ కాళ్లతో తన్నడం.. ఈ మొత్తాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టురా! అని మరొకరు అనడం చూస్తుంటే రాన్రాను మనిషిలో మానవత్వం ప్రశ్నార్థకమవు తోంది. పైగా కొట్టిన పిల్లల్లో నలుగురు మధ్య తరగతి, ఉద్యోగాలు చేసుకుంటున్న తల్లిదండ్రుల పిల్లలు.. మైనర్లు ఉండటం గమనార్హం! బంధాలకు విలువేదీ? ఇప్పుడు ప్రతి ఇంటాస్మార్ట్ ఫోన్ ఉంటోంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరిగా మాట్లాడరు. పిల్లలు తోబుట్టువులతో ఆడుకోరు. అందరూ కూర్చుని భోంచేసిన ఘటనలు అరుదు. పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇంట్లో పడేసి స్మార్ట్ఫోన్లు తీసుకుని వాట్సప్, ఫేస్‌బుక్‌లలో గంటల కొద్దీ గడపడం. కొందరైతే హింసాత్మకమైన గేమ్‌లను తరచూ ఆడుతూ వాటి ప్రభావానికి గురై హింసాప్రవృత్తితో మసలుకుంటున్నారు. కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సరైన ప్రేమానురాగాలు లేకపోవడం, పిల్లలకు విలువల చెప్పకపోవడమే ఈ తరహా ఘటనలకు ప్రధాన కారణమవుతోంది. పేరెంట్స్‌దే బాధ్యత పిల్లల ప్రవర్తన విషయంలో ఇంట్లోని పెద్దల తీరు కూడా ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడం, ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం, తిట్టుకోవడం..ఇత్యాది ఘటనలను చూస్తూ పిల్ల ల మనస్తత్వం కూడా మారిపోతోంది. పరుగులు తీస్తున్న యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం, వారి నుంచి ఆశించిన ప్రేమ లభించకపోవడంతో పిల్లలు దారి తప్పుతున్నారు. బయటివ్యక్తుల వద్ద అనుచరులుగా తిరగడం, వారిపై అభిమానం చూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టులకు నెగటివ్ కామెంట్లు పెడితే దాడులు చేసి జైలుపాలవుతున్నారు. ఇప్పటికైనా పిల్లలకు ప్రేమానురాగాలు పంచడం, ఇంటికి వెళ్లగానే వారితో సరదాగా ముచ్చటిస్తూ, మంచీ–చెడు చెప్పించడం..లాంటివి చేస్తే సమాజానికి మంచి పౌరులను అందించినవారుతారని అటు మానసిన వైద్యనిపుణులు, ఇటు పోలీసులు చెబుతున్నారు. -
బావమరిది చెవి కొరికిన బావ
కాగజ్‌నగర్‌టౌన్(సిర్పూర్) ఆదిలాబాద్ : శుభకార్యానికి పిలవడానికి ఇంటికి వచ్చిన బావమరిదిని బావ చెవి ఊడిపోయేలా కొరికిన ఘటన గురువారం కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని కాపువాడకు చెందిన ఎండీ అజీమ్‌ను చిన్నపాటి శుభకార్యానికి పిలవడానికి బావమరిది చాంద్‌పాషా ఇంటికి వెళ్లాడు. చిన్నచిన్న కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో బావ అజీమ్ ఒక్కసారిగా అతనిపై దాడిచేసి చాంద్‌పాషా చెవి కొరికేశాడు. బాధితుడు అరుపులు కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు, కుటుంబీకులు, కాలనీవాసులు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చెవి పూర్తిగా తెగిపోయింది. ఆపరేషన్ చేసే పరిస్థితి లేదని డాక్టర్లు కుటుంబీకులకు తెలిపారు. బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ వెంకటేశ్వర్ కేసు నమోదు చేశారు. -
భగ్గుమన్న పాత కక్షలు
సూర్యాపేట క్రైం : పాతకక్షలు మనసులో పెట్టుకుని టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడిపై బీజేపీ యువజన విభాగం నాయకులు కత్తులతో దాడిచేశారు. ఈ ఘటన చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం బా లాజీనగర్కు చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు అన్నపూర్ణ నరేందర్‌గౌడ్ శుక్రవారం చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులో కొందరు యువకులు ఆడుతున్న క్రికెట్ చూసేందుకు అక్కడికి బైక్‌పై వెళ్లాడు. అప్పటికే వెంబడిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలోని బీజేపీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు సందీ ప్నేత, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు దోసకాయల ఫణినాయుడు, సందీప్, నాగరాజులు కుడకుడ వద్దకు చేరుకున్నారు. బైక్‌పై కూర్చొని క్రికెట్ చూ స్తున్న నరేందర్గౌడ్పై ఒక్కసారిగా పది మందికి పైగా కలిసి కత్తులతో దాడి చేశారు. çస్పృహ తప్పి పడిపోయిన నరేందర్‌గౌడ్‌ను అక్కడే క్రికెట్ ఆడుతున్న యువకులు నేరుగా డీఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న సీసీఎస్‌ఐ సీఐ వెంటనే నరేందర్‌గౌడ్‌ను చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు నరేందర్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. తనపై బీజేపీ నాయకులు సందీప్‌నేత, దోసకాయల ఫణినాయుడు, సందీప్, నాగరాజుతో పాటు మరో పది మంది తనపై కత్తులతో దాడిచేశారని తెలి పాడు. గతంలో బీజేపీ కార్యకర్తపై తాను బ్లేడ్‌తో దాడిచేశానన్న కక్షతోనే తనపై దాడికి దిగారన్నారు. గురువారం కూడా ఫణినాయుడుతో గుర్తుతెలియని వ్యక్తులు ఘర్షణలో తన ప్రమేయం లేదని తెలిపాడు. దాడి చేసిన వారిని శిక్షించాలి కత్తుల దాడిలో గాయపడి నరేందర్‌గౌడ్ ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలు సుకున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వైవిలు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేం దర్‌పై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. అలజడులు సృష్టించడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధికోసమే హత్యారాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను మానుకోవాలని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో కౌన్సిలర్లు షేక్ తాహేర్‌పాషా, ఉప్పల ఆనంద్, తూడి నర్సింహ్మరావు, జీడి భిక్షం, కోడి సైదులుయాదవ్, రేపాల పాండు, కడారి సతీష్‌యాదవ్ ఉన్నారు. -
డూప్లికేట్ కెమెరా విక్రయించాడని..
ముషీరాబాద్/చిక్కడపల్లి : ఓఎల్ఎక్స్లో డూప్లికేట్ కెమెరా విక్రయించాడనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్ జెమిని కాలనీకి చెందిన ఆకాష్‌సింగ్ నెల రోజుల క్రితం ఓఎల్ఎక్స్లో తన కెమెరాను విక్రయానికి పెట్టగా, కిషన్‌బాగ్‌కు చెందిన కరన్‌వీర్‌సింగ్ రూ.15వేలకు కొనుగోలు చేశాడు. దానిని రిపేర్‌షాపులో చూపించగా డూప్లికేట్ అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన కరణ్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గురువారం చిక్కడపల్లిలోని ఓ కెమెరా రిపేర్ దుకాణం వద్దకు రావాలని ఆకాశ్‌సింగ్ చెప్పడంతో కరన్‌వీర్‌సింగ్ అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన అక్కడే ఉన్న పేపర్లు కట్ చేసే బ్లేడ్‌తో ఆకాశ్‌సింగ్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుమలగిరిలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసిపి ప్రదీప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో చిక్కడపల్లి డిఐ రాకేష్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ సైనికుడిపై దాడి
వేపగుంట(గోపాలపట్నం) : ఉత్సవంలో తన సోదరుడి కుమారుడిపై దాడి చేస్తున్నారేంటని అడిగిన మాజీ సైనికుడిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్డులో మోదాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలివి. నరవ గ్రామంలో ఈ నెల 12న పైడితల్లమ్మ ఉత్సవంలో ఊరేగింపు జరుగుతుండగా, భాస్కర్ అనే యువకుడిపై కొందరు వివాదా నికి దిగి దాడి చేశారు. ఇదేంటని భాస్కర్ పెదనాన్న చింతల రామారావు(ఆర్మీ మాజీ ఉద్యోగి) ప్రశ్నించడంతో ఆయనపైనా దాడికి దిగారు. వరహాలరావు అనే వ్యక్తి రాడ్డుతో ఆయన తలపై మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. వివాదానికి కారణమైన వారిలో వరహాలరావుతో పాటు కోటేశ్వరరావు, శ్రీను, శివ అనే వ్యక్తులు ఉన్నట్లు రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి జరిగిన రోజు తనను తీవ్ర భయాందోళనకు గురి చేశారని ఆందోళన వెలిబుచ్చారు. -
తాగిన మైకంలో ఒకరిపై దాడి
ఆసిఫాబాద్‌క్రైం: తాగిన మైకంలో దాడి చేసిన ఘటన మండలంలోని దాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బోందల శంకరయ్య(35) తరచూ మండలంలోని దాంపూర్‌లో నివాసముండే నాందేవ్ ఇంటికి వస్తుండేవాడు. ఈక్రమంలో గురువారం దాంపూర్ వచ్చిన శంకరయ్య, నాందేవ్‌తో కలసి మద్యం తాగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న గొడ్డలితో నాందేవ్, శంకరయ్య తల, కుడుపు భాగంలో బలంగా దాడి చేశాడు. గమనించిన స్థానికులు శంకరయ్యను 108 అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌లోని ప్రభు త్వాసుప్రతికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. గొడవకు గల కారణాలు తెలియరాలేదు. బంధుమిత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పగపట్టిన పిల్లి.. మనిషిపై దాడి
-
నడిరోడ్డులో చితకబాదారు
హైదరాబాద్: అప్పుతీసుకున్న వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దాడికి దిగిన ఘటన సరూర్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. వడ్డీ కట్టలేదన్న కారణంతో నడిరోడ్డులో జయశంకర్‌పై అనే వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దేవేందర్ రెడ్డి, జంగారెడ్డి దాడికి దిగారు. జయశంకర్‌పై పిడిగుద్దులు కురిపించారు. బ్యాటుతో విచక్షణారహితంగా బాదారు. అడ్డొచ్చిన జయశంకర్ తల్లిపై కూడా దాడి చేశారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు నెలల్లో అప్పు మొత్తం తీర్చేస్తానని చెప్పినా వినకుండా తనపై దాడి చేశారని బాధితుడు జయశంకర్ మీడియా ముందు వాపోయాడు. అసలు వద్దని వడ్డీ మాత్రమే కట్టాలని తనను వేధించారని తెలిపాడు. రోజూ తనను వెంబడిస్తున్నారని, కారులోంచి బయటకు లాగి తనపై పది మంది దాడి చేశారని వెల్లడించాడు. తన తల్లిని కూడా విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచరులుగా దేవేందర్ రెడ్డి, జంగారెడ్డి చెప్పుకుంటున్నారని తెలిపాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. -
బేస్‌బాల్ బ్యాట్‌తో చితక్కొట్టిన బ్యూటీ.. అరెస్టు
న్యూయార్క్: ఓ పార్టీలో వ్యక్తిని బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టినందుకు అందాల భామ వానెస్సా బార్సెలో మిస్ మియామి లేక్స్ 2017ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులోనే ఆమె ఈ పని చేసినట్లు పోలీసులు చెప్పారు. వానెస్సా తన నివాసం హైలేహ్ అపార్టుమెంటులో పెద్ద మొత్తంలో పార్టీని ఏర్పాటుచేసి దానికి అతిథులను ఆహ్వానించిది. వచ్చిన అతిథుల్లో ఒకరితో గొడవపడింది. కాస్తంత మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ అతిథిని తన పార్టీలో నుంచి వెళ్లిపోవాలని గెంటేసింది. అతడు అలా వెళుతుండగానే ఆమెకు సంబంధించిన ఓ వ్యక్తి నేరుగా అతడిని మెట్లపై నుంచి తోసేశాడు. అతడు కిందపడగానే పక్కనే ఉన్న అల్యూమినియం బేస్ బాల్ బ్యాట్‌తో వానెస్సా దాడి చేసింది. అతడి భుజాలపైనా, వీపుపైనా తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ దాడిలో అతడి ఎడమ కన్ను చాలా దెబ్బతిన్నది. ఈ మేరకు హత్యాయత్నం పేరిట వానెస్సాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు సంబంధించిన న్యాయవాది మాత్రం ఆమె ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలోనే అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. మరోపక్క, ఈ ఘటనపై వానెస్సా స్పందిస్తూ కేసు దర్యాప్తులో ఉండగా మధ్యలో ఎలాంటి ప్రకటనలు చేయకూడదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. -
దాడి చేసిన సర్పంచ్‌పై కేసు పెట్టాలి
సంగారెడ్డి అర్బన్: తనకు అనుకూలంగా ఓ కేసు విషయమై తప్పుడు సాక్ష్యం చెప్పాలని గ్రామ సర్పంచ్ ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ సర్పంచ్ బాల్‌రాజ్ సదాశివపేటకు చెందిన తుల్జారాంను తప్పుడు సాక్ష్యం చెప్పాలని కోరాడు. దానికి అతను నిరాకరించడంతో బాల్‌రాజ్ తన అనుచరులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తుల్జారాంను రక్షించారు. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్‌కు తుల్జారాం ఫిర్యాదు చేయగా, ఈ విషయమై జేసీ శరత్ స్పందిస్తూ ఈ విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అలాగే వ్యక్తిగతంగా ఎస్పీని కలవాలని సూచించారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. ⇒ హత్నూర మండలం పల్పనూర్ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ⇒ మనూర్ మండలం కసర్గుత్తి గ్రామానికి చెందిన శాంతాబాయి వికలాంగుల పింఛన్ కోసం, శంకరంపేట(ఆర్)కు చెందిన రాములు వికలాంగుల కోటాలో ట్రైసైకిల్ మంజూరుకు వినతి. ⇒ మెదక్ మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాట్రోత్ గోపాల్ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బోర్ మోటారు మంజూరుకు డిమాండ్. ⇒ కొండపాక గ్రామానికి చెందిన ఎంగయ్య తన భూమి రికార్డుల ప్రకారం సరిచేయాలని కోరారు. ⇒ న్యాల్కల్ మండలం తుజాల్‌పూర్‌కి చెందిన మణెమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రుణం ఇప్పించాలని కోరారు. ⇒ ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కంకర క్రషర్ మిషన్ నడుపుతున్నందున చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ⇒ మెదక్ మండలం ఔసలిపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ, సోని, సుజాత, కళావతి, లక్ష్మీలకు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ⇒ అనావృష్టి వల్ల రైతులకు తగిన దిగుబడి రానందు వల్ల పూర్తి స్థాయిలో రైతులు బ్యాంక్ రె న్యువల్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి బ్యాంక్ లోన్స్ రెన్యువల్స్ చేయలేకపోతున్నారని, రెన్యువల్ చేయలేని రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు రంగాగౌడ్, పాపయ్యలు జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్‌ను కోరారు.