
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకరయ్య
ఆసిఫాబాద్‌క్రైం: తాగిన మైకంలో దాడి చేసిన ఘటన మండలంలోని దాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బోందల శంకరయ్య(35) తరచూ మండలంలోని దాంపూర్‌లో నివాసముండే నాందేవ్ ఇంటికి వస్తుండేవాడు.
ఈక్రమంలో గురువారం దాంపూర్ వచ్చిన శంకరయ్య, నాందేవ్‌తో కలసి మద్యం తాగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న గొడ్డలితో నాందేవ్, శంకరయ్య తల, కుడుపు భాగంలో బలంగా దాడి చేశాడు.
గమనించిన స్థానికులు శంకరయ్యను 108 అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌లోని ప్రభు త్వాసుప్రతికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. గొడవకు గల కారణాలు తెలియరాలేదు. బంధుమిత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.