నడిరోడ్డులో చితకబాదారు | private financiers attack on man at saroor nagar | Sakshi
Sakshi News home page

నడిరోడ్డులో చితకబాదారు

Published Thu, Jul 6 2017 4:53 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

నడిరోడ్డులో చితకబాదారు

నడిరోడ్డులో చితకబాదారు

హైదరాబాద్‌: అప్పుతీసుకున్న వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దాడికి దిగిన ఘటన సరూర్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. వడ్డీ కట్టలేదన్న కారణంతో నడిరోడ్డులో జయశంకర్‌పై అనే వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దేవేందర్‌ రెడ్డి, జంగారెడ్డి దాడికి దిగారు. జయశంకర్‌పై పిడిగుద్దులు కురిపించారు. బ్యాటుతో విచక్షణారహితంగా బాదారు. అడ్డొచ్చిన జయశంకర్‌ తల్లిపై కూడా దాడి చేశారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

రెండు నెలల్లో అప్పు మొత్తం తీర్చేస్తానని చెప్పినా వినకుండా తనపై దాడి చేశారని బాధితుడు జయశంకర్‌ మీడియా ముందు వాపోయాడు. అసలు వద్దని వడ్డీ మాత్రమే కట్టాలని తనను వేధించారని తెలిపాడు. రోజూ తనను వెంబడిస్తున్నారని, కారులోంచి బయటకు లాగి తనపై పది మంది దాడి చేశారని వెల్లడించాడు. తన తల్లిని కూడా విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచరులుగా దేవేందర్‌ రెడ్డి, జంగారెడ్డి చెప్పుకుంటున్నారని తెలిపాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement