saroor nagar
-
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. అధికారంలోకి రాగానే పేదల లిస్ట్ అంతా తయారు చేసి, ప్రతి పేద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. దేశంలో సంపదకు కొదవలేదని అన్నారు. ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోదీ పెట్టుబడిదారులకు పంచారు. తాము పేదలకు పంచుతామని పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు. విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తామని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలతో మోదీ నిరుద్యోగం పెంచారు.తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన కొనసాగిస్తుందని, తెలంగాణ లాంటి ఈ పాలన దేశవ్యాప్తంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.‘బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు. అది పేద ప్రజల చప్పుడు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లే. ప్రజలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు తమ చెమటను, రక్తాన్ని దారపోశారు. రాహుల్, రేవంత్ లాంటి వాళ్ళం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. అదానీ, అంబానీ లాంటి 22 మంది కోసం మోదీ రాజ్యాంగాన్ని నడిపారు. ప్రజలకు చెందిన లక్షల కోట్లను 22 మంది పెట్టుబడి దారులకు మోదీ పంచారు’ అని ధ్వజమెత్తారు.మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్వనగరంలో బీజేపీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. 15 సెకన్ల సమయం ఇస్తే ముస్లింలను తుదిముట్టిస్తామని బీజేపీ ఎంపీ అంటోందని విమర్శించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా? మనకా వీళ్ళు హిందుత్వం నేర్పేదని ప్రశ్నించారు. అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.‘ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్లపై దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. రాజ్యాంగం సంక్షోభంలో పడే సమయంలో ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేసింది. ఇందిరా మనమడు, సోనియా కొడుకు రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడడానికి తెలంగాణ గడ్డపైకి వచ్చి యుద్ధం ప్రకటించారు.తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ వైపు నిలబడాలి. రిజర్వేషన్లు కాపాడే పోరాటంలో మనమంతా రాహుల్ తో కలిసి నడవాలి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మత సామరస్యం పెంపొందించాం కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు హైదారాబాద్‌కు వచ్చాయి. బీజేపీ మత ఉచ్చులో పడకండి. 15 సెకన్లలో ముస్లింలను తుదముట్టిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీ పై అమిత్ షా, మోదీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడు’ -
అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది. శశికళను మామ దేవేందర్‌రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్‌రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్‌కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
జీఎస్టీ అధికారుల కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్.. పోలీసులు ఆ కేసును చేధించిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్.. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్లను ఫోన్లో కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణా నగర్లో ఫేక్ జీఎస్టీ నంబర్‌తో gst కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు..GST ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మణి శర్మ , ఆనంద్ లు వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు , మరో ముగ్గురు కలిసి... ఫార్చ్యూనర్ కార్ లో కిడ్నాప్ చేశారు. GST అధికారుల ఐడీ కార్డు లు చింపి..వారి పై దాడి చేశారు. మాకు సమాచారం అందగానే... దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నాము. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్.. నిందితులు టీడీపీ నేత అనుచరులు? -
అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ
అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్సర హత్య కేసులో పోలీసులు శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయి కృష్ణను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి శివార్లలోని బ్యూటీగ్రీన్ పక్కన ఉన్న గోశాలకు సాయి కృష్ణ తరచూ వచ్చేవాడు. హత్య జరిగిన రోజు అతను అప్సరతో కలిసి అక్కడికి వచ్చాడు. గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించిన సాయి కృష్ణ అక్కడి నుంచి కారులో తిరిగి శంషాబాద్ వైపు బయలుదేరాడు. గోశాల నుంచి దాదాను రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత నర్కూడ సమీపంలో శంషాబాద్–షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వెంచర్లో అప్సర తలపై రాయితో మోది హత్య చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు నిందితుడు సాయికృష్ణను గోశాల, వెంచర్ వద్దకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. వెంచర్ సమీపంలో చిన్న బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాళ్లగూడ, శంషాబాద్ బస్టాండ్ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. సరూర్‌నగర్ మండల కార్యాలయం వెనకాల అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి కూడా నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ నేతృత్వంలో ఈ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇదిలా ఉండగా పోలీసు కస్టడీ ముగియడంతో నిందితుడు సాయి కృష్ణను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
అప్సర హత్యకు 15 రోజుల ముందే గొయ్యి తవ్వి..
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న శంషాబాద్ పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఆమె హత్యకంటే 15 రోజుల ముందే సాయి ఎలాంటి స్కెచ్ వేశాడనే విషయం తెలిసి పోలీసులు సైతం కంగుతిన్నారు. అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించారు. జూన్ 3వ తేదీన హత్య జరిగిన ఘటనాస్థలి నర్కూడ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఘటన హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేసేందుకు ముందుగా సాయి వేసుకున్న ప్లాన్ సైతం తెలిసింది. ఇదీ చదవండి: అప్సర చేసింది కరెక్ట్ కాదు-సాయి భార్య అప్సర వేధింపులను సాయి తట్టుకోలేకపోయాడు. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా పని చేసే గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు. ఇదిలా ఉంటే.. నర్కూడలో క్రిమినల్ సీన్ రీకన్స్ట్రక్షన్ ముగిశాక.. సరూర్ నగర్లో అప్సర మృతదేహాన్ని పూడ్చేసిన మ్యాన్ హోల్ దగ్గరికి తీసుకెళ్లారు. రంగారెడ్డి కోర్టు రెండురోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో.. ఇవాళ, రేపు అప్సర కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అప్సర కేసు.. అప్సర మాజీ భర్త తల్లి సంచలన ఆరోపణలు -
అప్సర కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలానంతరం కేసులో ప్రధాన నిందితుడైన సాయికృష్ణను శుక్రవారం రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు. అప్సర హత్య చేయాల్సిన పరిణామాలపై విచారించడంతో పాటు హత్యా ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సాయిని కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో శంషాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ రెండు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ, రేపు అప్సర హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది. సరూర్ నగర్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి తిరిగి.. శవాన్ని పూడ్చిపెట్టిన క్రమం మొత్తం ఎలా జరిగిందనేది పోలీసులు సాయి ద్వారా తేల్చనున్నారు. కేసు పూర్వాపరం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి సరూర్ నగర్లో స్థిరపడింది అప్సర కుటుంబం. తండ్రి కాశీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లితో పాటు ఉంటూ అప్సర సినిమా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఆలయంలో పూజారిగా పని చేసే సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ ఆమెకు దగ్గరయ్యాడు సాయికృష్ణ. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తిరగడం, ఆ చనువు కాస్త వివాహితుడైన సాయితో శారీరక సంబంధానికి దారి తీసింది. జూన్ 3వ తేదీన తాను కొయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన అప్సర.. జాడ లేకుండా పోయింది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆమెను శంషాబాద్ సమీపంలో చంపి.. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పూడ్చిపెట్టినట్లు సాయి అంగీకరించాడు. అయితే అప్సర తనను బ్లాక్మెయిల్ చేయడంతో భరించలేకే తాను ఆమెను హత్య చేసినట్లు సాయి చెబుతున్నాడు. అరెస్ట్.. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ అనంతరం సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: అప్సర హత్యకు ముందు సాయికృష్ణ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి! -
అప్సర కేసు.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
సాక్షి, హైదరాబాద్: అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను ప్రేమ వివాహం చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల సంచలనం రేపుతోంది. తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ధనలక్ష్మీ చెబుతోంది. పెళ్లయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి.. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని, తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు. కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్ తల్లి అన్నారు. కస్టడీకి సాయికృష్ణ.. పోలీసుల పిటిషన్ అప్సర హత్య కేసులో వారం రోజుల పాటు సాయికృష్ణను కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ నేడు కోర్టు విచారించనుంది. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
‘కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. పరువును బజారుకీడ్చొద్దు’
సాక్షి, హైదరాబాద్: ‘అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు చనిపోయింది. ఆ బాధలో నుంచి ఇప్పటికీ మా కుటుంబం బయటికి రాలేదు. హంతకుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నా కూతురు ఆత్మశాంతికి భంగం కలిగిస్తున్నారు’ అంటూ మృతురాలు అప్సర తల్లి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు చనిపోయిన బాధలో తాము ఉంటే.. తమ పరువును బజారుకీడ్చే పనులు చేయడమేంటని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 3న సాయికృష్ణ చేతిలో హత్యకు గురైన అప్సరకు గతంలోనే వేరే వ్యక్తితో వివాహమైనట్లు ఫొటోలు, వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసి అప్సర తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంబంధం లేని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయించి తమ కుమార్తె క్యారెక్టర్‌ను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాయికృష్ణను కఠినంగా శిక్షించాల్సింది పోయి తన కుమార్తెనే తప్పు పడతారా అని అన్నారు. ఇదిలాఉండగా అప్సర మొదటి భర్త వివాహమైన కొంత కాలానికే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’! -
బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్..
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కనుగంటి అప్సర (30) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు గతంలోనే వివాహం జరిగినట్లుగా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృత్తిరీత్యా ఆలయ పూజారి అయిన నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ అప్సరను తొలుత సుల్తాన్‌పూర్‌లోని గోశాలలో అంతమొందించాలని భావించాడు. అయితే, గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించి.. కారును 2 కి.మీ. దూరం తీసుకెళ్లి నర్కుడలోని ఓ వెంచర్లో హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హత్య ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి సాయికృష్ణ ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్సర హత్యకు మూడుసార్లు విఫలయత్నం చేసిన సాయికృష్ణ.. నాలుగోసారి ఆమెను అంతమొందించాడు. కోయంబత్తూరు టూర్ అడ్డుపెట్టుకొని.. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ గుడికి వెళ్తున్న క్రమంలో సాయికృష్ణ, అప్సరలకు పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరు ఫోన్లో కాల్స్‌తోపాటు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునే వాళ్లు. గత నవంబర్‌లో అప్సర, సాయికృష్ణ గుజరాత్‌లోని సోమనాథ్, ద్వారక ఆలయాలను దర్శించుకుని, అక్కడే ఇద్దరూ ఒక్కటైనట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో తనను పెళ్లి చేసుకోకపోతే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని, సంఘాల్లో చెప్పి పరువు తీస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో ఆమెను అంతమొందించాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కోయంబత్తూరుకు తీసుకెళ్లాలని పలుమార్లు అప్సర కోరడంతో హత్యకు ఇదే అదనుగా భావించాడు. ఈనెల 3న శంషాబాద్ నుంచి కోయంబత్తూరుకు ఆఖరి బస్సు రాత్రి 11 గంటలకు ఉందని, టికెట్ కూడా బుక్ చేశానని నమ్మించి, ఆమెను ఇంటి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. రెండు గంటలపాటు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తిప్పాడు. కోయంబత్తూరుకు వెళ్లడం ఏమైందని అప్సర ప్రశ్నించడంతో.. తాను టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. సుల్తాన్‌పల్లిలోని గోశాలకు వెళ్దామని ఆమెను ఒప్పించాడు. తర్వాత నర్కుడ వైపు వెళ్లి కారు కవర్‌ను అప్సర తలకు చుట్టి ఊపిరాడకుండా చేసి, బండరాయితో తలపై మోది హత్య చేశాడు. చదవండి: అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే? తర్వాత కారు కవర్, అప్సర చెప్పులు, బండరాయిని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశాడు. అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎల్బీనగర్ నుంచి రెండు టిప్పర్ల ఎర్ర మట్టిని తెప్పించి పోశాడు. తమ్ముడు అయ్యవారి సత్యప్రసాద్ ద్వారా టిప్పర్ డ్రైవర్ అశోక్‌కు నగదు ఫోన్ పే ద్వారా రూ.16 వేలు వేశాడు. మరుసటి రోజు కూడా మ్యాన్‌హోల్ వద్ద దుర్వాసన వస్తుండటంతో మ్యాన్‌హోల్ కాంక్రీట్ మూతతో పూడ్చేశాడు. 14 రోజులు రిమాండ్‌కు.. పోలీసులు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజి్రస్టేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికృష్ణ కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. అప్సర తల మీద బండరాయితో బలంగా మోదడంతో అధికంగా రక్తస్రావం జరిగి మరణించిందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాలతో దొరికాడు.. అప్సరను హత్య చేసిన తర్వాత సాయికృష్ణ అమాయకుడిలా ఆర్జీఏఐ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన మేనకోడలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అనుమానం వచి్చన పోలీసులు శంషాబాద్ బస్టాండ్ వద్ద సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దీంతో హంతకుడు సాయికృష్ణనే అని నిర్ధారణకు వచ్చారు. అయితే పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేయాలని భావించారు. ఈనెల 3న కోయంబత్తూరు వెళ్తున్నామని అప్సరను కారులో తెచ్చిన సాయికృష్ణ రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కారు ఆపి కిందికి దిగాడు. ఇంతలోనే ఓ బస్సు అటుగా వెళ్లడంతో కారు ఎటువైపు వెళ్లిందనేది సీసీ ఫుటేజీ తొలుత లభించలేదు. ఆ తర్వాత రాళ్లగూడ వరకు వెళ్లి ఒక్కడే ఫాస్ట్‌ఫుడ్ తిన్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద కూడా అప్సర ఓసారి కారు దిగింది. వాంతి చేసుకున్న తర్వాత తిరిగి కారులో కూర్చున్నట్లు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. హత్య చేసిన తర్వాత తిరిగొస్తున్న క్రమంలో కారులో ఒక్కడే ఉన్న సీసీ ఫుటేజీ కూడా పోలీసులకు దొరికింది. అప్సర నుంచి చివరి ఫోన్ కాల్ సాయికృష్ణకు చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అప్సర హత్యకు ముందు.. గూగుల్‌లో సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు. గూగుల్‌లో సెర్చింగ్.. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. టికెట్ కొనలేదని చెప్పి మరీ.. జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ. ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే! -
హైదరాబాద్ యువ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
-
ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనుంది. గత ఏడాది వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌గాంధీ ‘రైతు డిక్లరేషన్’ప్రకటించిన విధంగానే.. సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య నిరుద్యోగులు 60 లక్షల మంది ఉంటారని.. అందులో 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారనే అంచనా మేరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రకటనలు చేయాలని నిర్ణయించామని వెల్లడించాయి. విద్య–ఉత్పాదకత సృష్టి ద్వారా చదువుకున్న అందరికీ వారి విద్యార్హతల మేరకు ఉపాధి కల్పింస్తామనే హామీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నా యి. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనితీరును తీర్చిదిద్దుతామని, ఏటా జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్టు తెలిపాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు టెలి కమ్యూనికేషన్స్ మాజీ ఇంజనీర్ శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘నాలెడ్జ్ సొసైటీ’అధ్యయన నివేదిక మేరకు.. విద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్ర యువతకు పలు వరాలు ప్రకటిస్తామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. విద్యా రంగంలోనూ ‘భరోసా’ ఉపాధి కల్పనతోపాటు విద్యా రంగంలో భరో సా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీ, ఈబీసీలకు పూర్తిస్థాయి లో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని.. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐఐటీ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించనుంది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సర్వేల్ గురుకులాన్ని ఏర్పాటు చేసి.. రెసిడెన్షియల్ విద్యకు శ్రీకారం చుట్టినది కాంగ్రెస్ పారీ్టనేనని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థను మెరుగైన సౌకర్యాలతో నడిపిస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలిపాయి. మొత్తమ్మీద యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే దిశలో ప్రియాంకా గాంధీ ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనున్నట్టు వెల్లడించాయి. అమరవీరుల కుటుంబాలకు పింఛన్లు తెలంగాణ కోసం తనువు చాలించిన అమరవీరుల కుటుంబాలకు ప్రియాంకా గాంధీ సభలో భరోసా కలి్పంచనున్నట్టు టీపీసీసీ నేతలు చెప్తు న్నారు. తొలి, మలిదశ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి నెలవారీ పింఛన్ ఇస్తామని హామీనివ్వనున్నట్టు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు రానున్న ప్రియాంక కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5:45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. 6.30 సమయంలో ఢిల్లీ బయలుదేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. సభకు ఏర్పాట్లు పూర్తి.. సభ కోసం టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువ నాయకులు మానవతారాయ్, చరణ్ కౌశిక్, మహ్మద్ రియాజ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, చారగొండ వెంకటేశ్ రెండురోజులు గా సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరు లు సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 50మంది కూర్చొనేలా విశాల వేదికను ఏర్పాటు చేశారు. స్టేజీ ముందు భాగంలో వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీ’.. ట్రాఫిక్ మళ్లింపులు వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కాంగ్రెస్ ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్నగ ర్, ఎల్బీనగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుంచి నాగోల్ వైపు మళ్లిస్తారు. -
హైదరాబాద్ నగరాన్ని మరోసారి ముంచెత్తిన వానలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని వానలు వీడటం లేదు. ఎప్పడు వర్షం పడుతుందో.. ఎప్పుడో ఎండ కొడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో నగర వాసులు బెంబేలెత్తుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో, వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని వానలు మరోసారి ముంచెత్తాయి. నగరంలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మనస్థలిపురం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, కంచన్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్కేసర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, ఆల్విన్ కాలనీ, బీహెచ్ఈఎల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. Nacharam IDA right now 😲 ⛈️#Hyderabadrains pic.twitter.com/5lSONcMg8p — Devanjan C. (@crazypoorindian) May 1, 2023 Another day, another downpour ⚠️#Hyderabadrains #freakweather pic.twitter.com/iOX285N4Uo — Anirudh J 🇮🇳 (@Anirudhj12) May 1, 2023 మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులను అప్రమత్తం చేస్తూ అర్భన్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. నగర వాసులు త్వరగా ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు హై అలర్ట్‌లో ఉండాలని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Moin Bagh the constituency of chandrayangutt assembly #Hyderabad #Telangana #hyderabadRains pic.twitter.com/IhJEeL9vF3 — Syedafroz000 (@AfrozFit) May 1, 2023 Heavy rains alert in the evening now onwards in #Hyderabad Try and reach home early and stay indoors unless it's an emergency @Director_EVDM - Pl let your teams be on high alert @GadwalvijayaTRS @KTRBRS pic.twitter.com/stxVjSLRDw — Arvind Kumar (@arvindkumar_ias) May 1, 2023 And what it left in the process 😂 pic.twitter.com/c3oX0LNG18 — Srinivasan_Krishnamurthy (@SRINIVASAN_97) May 1, 2023 -
Hyderabad: అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్
నాగోలు: కారు, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండుగులు ఓ యువకుడిని అర్ధరాత్రి కిడ్నాప్ చేసిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గడ్డిఅన్నారం డివిజన్ పిఅండ్‌టి కాలనీకి చెందిన లంక సుబ్రహ్మణ్యం (24) గురువారం అర్ధరాత్రి శ్రవణ్, దినేష్ స్నేహితులతో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారు సుబ్రహ్మణ్యం తండ్రి గురించి వాకబు చేశారు. తన తండ్రి నిద్రపోతున్నాడని చెప్పాడు. చౌరస్తా వద్దకు రావాలని చెప్పడంతో శ్రవణ్, దినేశ్‌లు అక్కడికి వెళ్లారు. ఇంతలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు సుబ్రహ్మణ్యంను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ విషయమై సుబ్రమణ్యం తండ్రి లంక లక్ష్మీనారాయణ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ గురైన సుబ్రహ్మణ్యం నల్గొండ జిల్లా చింతపల్లిలో ఉన్నారనే సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్లి సుబ్రహ్మణ్యం తో పాటు కిడ్నాప్ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్న వివరాలను సరూర్ నగర్ పోలీసులు వెల్లడించడం లేదు. కిడ్నాప్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా! -
రాంచరణ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ
సాక్షి, వికారాబాద్: సరూర్‌నగర్‌లో రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను బీజేపీ అడ్డుకుంది. సరూర్‌నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంలో మంగళవారం సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీవాణి తన అనుచరులతో వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారు. తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్‌లకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అనాథ పిల్లల పేరు మీద జేబులు నింపుకునేందుకే షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. చదువుకునే పిల్లలందరినీ రెండు గదుల్లో పెట్టి పాఠశాలను సినిమా షూటింగ్‌కి ఇవ్వడం ఏమిటని, తరగతి గది పక్కనే సినిమా షూటింగ్ నిర్వహిస్తే చదువుకునేది ఎలా అని నిలదీశారు. ఒకరోజు షూటింగ్‌కు రూ.3 లక్షల వరకు అద్దె రూపంలో తీసుకుంటున్నారని.. ఈ డబ్బంతా వీఎంహోం అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
కొత్త కోణం: అమ్మాయిల కోసమే భూదేవి హత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సరూర్‌నగర్ తల్లి, దత్తపుత్రులు హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. దత్తత తీసుకుని పెంచిన తల్లి భూదేవిని.. సాయి తేజ చంపడానికి స్నేహితుడు శివ పురిగొల్పడమే కారణమని తేలింది. మానసిక స్థితి సరిగాలేని సాయిని.. పెంపుడు తల్లి హత్యకు పురిగొల్పింది శివ అనే విషయం తాజాగా వెలుగు చూసింది. అమ్మాయిల కోసమే భూదేవిని శివ హతమార్చినట్లు వెల్లడైంది. అమ్మాయిలకు ఖర్చు పెట్టడానికే భూదేవి హత్యకు సాయిని పురిగొల్పిన శివ.. ఆపై నగదు, నగల దోపిడీకి పాల్పడ్డాడు. ఆపై హత్య విషయం ఎక్కడ బయటపడుతోందనని చివరకు స్నేహితుడైన సాయిని కూడా చంపేశాడు శివ. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. ఇక ఈ హత్యలకు డ్రైవర్ నరసింహ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. భూదేవిని నలుగురు నిందితులు కలిసి చంపినట్లు ధృవీకరించారు పోలీసులు. అయితే సాయి తేజని చంపింది శివ కుమార్ ఒక్కడే వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై.. -
ఆ హత్యను ఖండిస్తున్నాం
ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారన్న ఆక్రోశంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ చర్య అమానుషమైనది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ విలువలకు పూర్తిగా విరుద్ధమైనది. తీవ్రంగా వివక్షకు గురైన నల్లజాతి వారిని హృదయానికి హత్తుకున్న మొహమ్మద్ ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకమైనది. కులాన్ని పాటించడమంటే పవిత్ర ఖురాన్‌ను నిరాకరించడమే! ముస్లిం సమాజం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నాగరాజు కుటుంబానికి మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ విషమ సమయంలో తీవ్ర బాధితురాలైన ఆశ్రీన్ సుల్తానా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుతున్నాము. నాగరాజును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా ఆశ్రీన్ సుల్తానాకూ, నాగరాజు కుటుం బాలకూ పూర్తి రక్షణ కల్పించాలనీ, ఆశ్రీన్ సుల్తానాను ఆదుకోవాలనీ కోరుతున్నాము. ఈ సంఘటనను సాకుగా చూపి దళితులకూ ముస్లింలకూ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కొందరు మహనుభావులు. వీరి విష రాజకీయాలకు గురి కావద్దని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ( కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు) – ముస్లిం థింకర్స్ డయాస్ (సయ్యద్ సలీంపాషా, డా. ఖాజా, డా. రియాజ్, స్కైబాబ, ఖుర్షీద్, హుసేన్, డా. మాలిక్, ఇనాయతుల్లా, వహీద్ మహమ్మద్, డా. రఫీ, షఫీ, నస్రీన్ ఖాన్, డా. మహబూబ్ బాషా, షేక్ పీర్ల మహమూద్, అక్బర్ ఆర్టిస్ట్, నబి కరీమ్ ఖాన్, డా. అఫ్సర్, డా. యాకూబ్) -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. కాగా, రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’ నాగరాజు మలక్‌పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్ పోస్టాఫీస్ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడ్డారు. నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. -
ఎంబీఏ విద్యార్థి; పనిలో చేరిన రోజే అనంత లోకాలకు..
సాక్షి, చైతన్యపురి: ఆగి ఉన్న లారీని ఏస్ వాహనం ఢీకొనటంతో డైరీ కంపెనీ డెలివరి బాయ్ మృతి చెందిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట బాపునగర్‌కు చెందిన భాస్కర్ కుమారుడు ప్రవీణ్‌కుమార్ (21). ఉప్పల్‌లోని సూపర్ డైరీ కంపెనీలో డెలివరి బాయ్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం ఏస్ వాహనం (టీఎస్08యూపీ8085)లో పాలు డెలివరి చేసేందుకు ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తున్నాడు. ఏస్ వాహనాన్ని డ్రైవర్ రోషన్ నడుపుతుండగా పక్క సీట్లో ప్రవీణ్‌కుమార్ కూర్చున్నాడు. అదే సమయంలో వీఎం హోమ్ మెట్రో స్టేషన్ వద్ద టీఎస్ (08యూబీ3939) నంబర్ గల లారీ రోడ్డుపై ఆగి ఉంది. పార్కు చేసిన లారీకి పార్కింగ్ లైట్ లేకపోవటంతో అదుపు తప్పిన ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రవీణ్‌కుమార్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఏస్ వాహనం డ్రైవర్ రోషన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్‌కుమార్ మెగా కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి భాస్కర్ కారు డ్రైవర్‌గా, తల్లి ఇండ్లలో పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ఆర్థికంగా ఆసరా ఉండాలనే ఉద్దేశంతో డెలివరి బాయ్‌గా చేరాడు. డ్యూటీలో చేరిన మొదటి రోజే ప్రవీణ్‌కుమార్ చనిపోవటంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. బాధ్యుడైన లారీ డ్రైవర్, సూపర్ డైరీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతిడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ప్రేమ, 3 సార్లు ఇంటి నుంచి పారిపోయింది.. చివరికి! KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి.. -
కరోనాను జయించిన వందేళ్ల బామ్మ
హైదరాబాద్: కరోనాను జయించిన ఈ బామ్మ పేరు ఆండాళ్లమ్మ. సరూర్‌నగర్‌లోని వికాస్‌నగర్‌లో నివసిస్తున్న ఈమె శత వసంతాలు పూర్తి చేసుకుంది. కొద్దిగా వినికిడి సమస్య మినహా బీపీ, షుగర్ వంటి అనారోగ్య ఇబ్బందులు లేకపోవటం గమనార్హం. మహారాష్ట్రలో ఉండే మనుమరాలు, ఆమె భర్తకు కరోనా సోకటంతో హైదరాబాద్ తీసుకొచ్చి వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఇటీవల ఆండాళ్లమ్మ కోవిడ్ బారినపడ్డారు. అయితే కరోనా వచ్చిందని తెలిసినా ఆమె ఏమాత్రం భయపడలేదు. మనోనిబ్బరంతో డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడి కరోనాను జయించింది. ఆమె ధైర్యంగా ఉండటమే కాక, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇలా వందేళ్ల వయసులోనూ కరో నాను జయించిన బామ్మను చూసి చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలి : మోహన్ భగవత్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఎప్పుడూ సమాజం కోసమే కృషి చేస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ విజయం కోసం చేస్తున్న సంకల్పమని, సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ప్రపంచ విజయాన్నే కోరుకుంటారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ను ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. స్వార్థం కోసం కొంతమంది ప్రజల మధ్య విద్వేశాలు సృష్టిస్తున్నారని, దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం మంచిది కాదని, ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని, మన భారతీయులకు నాగరికత అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని మోహన్ భగవత్ తెలిపారు. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్లో బుధవారం జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయిన ఆర్టీసీ డ్రైవర్ అనూహ్యంగా గుండెపోటుతో మరణించాడు. మృతుడు కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అని, జిల్లాలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడని ప్రాథమికంగా గుర్తించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటుండగా.. హఠాత్తుగా బాబుకు గుండెపోటు రావడంతో.. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర కలత చెందిన బాబు గుండె పోటుకు గురై హఠాన్మరణం పొందాడని తోటి కార్మికులు పేర్కొన్నారు. డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. -
త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్
-
ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఎసి
-
సకలజనుల సమరభేరి సభకు హైకోర్టు అనుమతి