సరూర్ నగర్ సమీపంలోని జింకలబావి కాలనీలో కాల్పుల కలకలం రేగింది. నాగరాజు (55) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగులు నాగరాజు (55) ఇంట్లోకి వెళ్లి మరీ కాల్పులు జరిపారు. పొట్ట భాగంలో రెండు రైండ్లు, తొడమీద ఒకరౌండు కాల్చారు. ముగ్గురూ అక్కడినుంచి పారిపోయారు. నాగరాజును సమీపంలోని సాయి సంజీవని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇది మాస్ ఏరియా కావడంతో ఇక్కడకు రాకపోకలు సాగించడమే కష్టం అవుతుంది. కాగా నాగరాజు జ్యోతిష్యుడని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడు. ఆ తగాదాల నేపథ్యమేనా, వేరే కారణాలేమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లు రెండింటి పరిధిలో దుండగుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఏసీపీ సెటిల్మెంట్లు చేస్తుండటంతో ఆయనను డీజీపీ మంగళవారమే సస్పెండ్ చేశారు.