Nagarjuna Sagar road
-
రెండు నెలల్లో పెళ్ళి..సరదాగా సాగర్ చూడ్డానికి వెళ్లి..
కేటీదొడ్డి/నాగార్జునసాగర్: సాగర్‌ను చూస్తానని వచ్చి ఓ మహిళా కానిస్టేబుల్ దుర్మరణం చెందగా, ఆమెకు కాబోయే జీవిత భాగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలోని హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవేపై దయ్యాల గండి వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చేపల శ్రావణి(27)కి టాటాకంపెనీలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన జి.ప్రశాంత్‌తో ఇటీవలనే ఎంగేజ్మెంట్ అయింది. వీరికి నవంబర్‌లో వివాహం కావాల్సి ఉంది. ప్రశాంత్ కంపెనీ పనిమీద హాలియాకు రావాల్సి ఉండగా గద్వాల నుంచి ఇరువురు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో శ్రావణి కోరిక మేరకు సాగర్‌ను సందర్శించి తిరిగి హాలియాకు వెళ్తున్నారు.అప్పటికే రెండు కార్లు ఢీకొని..ప్రశాంత్ కారు దయ్యాల గండి మూలమలుపు వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ రెండు కార్లు ఒకదానికి ఒకటి స్వల్పంగా ఢీకొనడంతో ఆయా వాహనాల డ్రైవర్లు తగువుపడుతున్నారు. దీంతో హైవేకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రశాంత్ కారు కూడా ప్రమాదం జరిగిన రెండు కార్ల వెనక నిలిచిపోయింది. ప్రశాంత్ కారు వెనుక కూడా మరో కారు ఉంది. ఈ క్రమంలోనే మాచర్ల నుంచి హైదరాబాద్‌కు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి తొలుత ప్రశాంత్ వెనుక ఉన్న కారును స్వల్పంగా ఢీకొట్టగా అది పక్కకు తొలగిపోయింది. అనంతరం లారీ ప్రశాంత్ కారును వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ ప్రశాంత్ కారుపైకి ఎక్కడంతో నుజ్జునుజ్జయ్యింది. అందులో చిక్కుకున్న ప్రశాంత్, శ్రావణిని పోలీసులు అరగంట పాటు శ్రమించి క్రేన్ సమాయంతో బయటకు తీశారు. అప్పటికే శ్రావణి మృతి చెందగా, ప్రశాంత్ గాయాలతో బయటపడ్డాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన మహిళను లారీ రూపంలో మృత్యువు కబళించడం చూపరులను కలచివేసింది. ఈ మేరకు సాగర్ సీఐ బీసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్వగ్రామంలో విషాదంనల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ శ్రావణి స్వగ్రామం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల. ఆమె 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తొలుత వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. అనంతరం 2021లోని కేటీదొడ్డి పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరమని జోగుళాంబ గద్వాల ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించిన ఆయన వారికి అండగా ఉంటామని తెలిపారు. శ్రావణి మరణంతో యాపర్లలో విషాదం అలుముకుంది. -
పరవళ్లు తొక్కుతున్న నాగార్జున సాగర్.. పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
నాగార్జున సాగర్ అందాలు.. పర్యాటకుల సందడే సందడి (ఫొటోలు)
-
కృష్ణమ్మ పరవళ్లతో జలసవ్వడి.. సాగర్‌కు పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
వీధి వీధిలో విద్య..
ఆ ఊరి నుంచి ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూలుకు వెళ్లరు.. గ్రామంలోని వీధి వీధిలో విద్య అందుబాటులో ఉంటుంది.. వారికి నచ్చిన చోట కూర్చొని చదువుకోవచ్చు.. ఆంగ్లం పదాలు టకాటకా చెప్పగలరు.. గణితం కూడికలు, తీసి వేతలు, ఎక్కాలు చకచకా చదవగలరు.. ఇదీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శిల్గాపురం ప్రత్యేకత. అక్కడి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సైదయ్య ఆలోచన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తిరుమలగిరి (నాగార్జునసాగర్): కరోనా నేపథ్యంలో పాఠశాలలు బంద్ కావడంతో ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అవి వినే పరిస్థితి అంతంతే. ఆన్లైన్ పాఠాలకు సెల్ఫోన్లు, సిగ్నల్స్, డాటా అందుబాటులో లేక 50 శాతం మంది విద్యార్థుల చదువు సాగడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శిల్గాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టెబోయిన సైదయ్య ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని వీధుల్లో బ్లాక్‌బోర్డులు, ఫ్లెక్సీలు, చార్టులపై వర్ణమాల, సరళ పదాలు, ఏబీసీడీలు.., ఒత్తులు, పదాలు, ఎక్కాలు, జంతువులు, ఆంగ్లపదాల్లో జంతువులు, పండ్లు, పక్షుల చిత్రా లను ప్రతి వీధిలో ఏర్పాటు చేశారు. దీనికి పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం తీసుకున్నారు. ప్రతి వీధికి ఓ ఇన్చార్జ్ని నియమించి విద్యార్థులను చదివించే బాధ్యతను వారికి అప్పగించారు. ఇలా గ్రామంలో 65 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరవుతూ విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. ఇన్చార్జీలు వారిని ఎలా పోత్సహిస్తున్నారు అనే అంశాలను పర్యవేక్షిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రైవేట్ స్కూల్ వాహనాలు బంద్.. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కు పంపిస్తుండటంతో చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శిల్గాపురం పాఠశాలలో ఐదేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఐదేళ్ల నుంచి ఒక్క విద్యారి్థని కూడా ప్రైవేట్ పాఠశాలకు ఆ ఊరి నుంచి పంపిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుంచే పది మంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధిస్తుండటం విశేషం. -
అలా ప్రయత్నిస్తే పచ్చతోరణమే..!
బిర బిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వందల..వేల కిలోమీటర్ల ప్రయాణించి జిల్లాలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ఎంతో మంది దాహం తీరుస్తోంది. నీటి విడుదల సమయంలో సాగర్ కాలువ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అంతటి ప్రాధాన్యం ఉన్న సాగర్ కాలువల వెంబడి మొక్కలు నాటితే పచ్చదనం పరిఢవిల్లే అవకాశాలు ఉన్నాయి. సాక్షి, దర్శి టౌన్: జిల్లాలో నాగార్జున సాగర్ కాలువ 200 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కాలువ కరకట్టలు పోను ఇరువైపులా సుమారు 60 అడుగుల చొప్పున ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలాలు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురి కాగా..మరికొన్ని ప్రాంతాల్లో చిల్లచెట్లు పెరిగి వృథాగా ఉన్నాయి. ఈ స్థలాలను సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున మొక్కలు పెంచే అవకాశం ఉంది. మొక్కలు కాలువ పక్కనే ఉన్నందున తేమతోనే మొక్కలు బతికే అవకాశం ఉంది. మామిడి, ఉసిరి, నేరేడు వంటి పండ్ల మొక్కలు లేదంటే టేకు, ఎర్రచందనం, కొబ్బరి వంటివి నాటితే మంచి ప్రయోజనం ఉంటుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ప్రక్రియ చేపడితే మరి కొందరికి ఉపాధి సైతం లభించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..? కిలో మీటర్ల మేర .... జిల్లాలో సాగర్ ప్రధాన కాలువ 65 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అద్దంకి బ్రాంచ్ కాలువ 30.5 కి.మీలు, దర్శి బ్రాంచ్ కాలువ 23 కి.మీలు, ఒంగోలు బ్రాంచ్ కాలువ 54 కి.మీలు, పమిడిపాడు బ్రాంచి కాలువ 36 కి.మీలు, మోదేపల్లి మేజర్ 27 కి.మీలు, రజానగరం మేజర్ 30 కి.మీల మేర సాగుతున్నాయి. వీటిలో వాగులపై, రహదారుల వద్ద నిర్మించిన వంతెనలు ఇతరత్రా అడ్డంకులు ఉన్నా ఇవి 15శాతానికి మించి ఉండవు. మొక్కకు మొక్కకు 8 మీటర్ల ఖాళీతో మొక్కలు నాటవచ్చు. ఈ లెక్కన కాలువ కట్టకు ఒక వైపు ఎటువంటి అవరోధం లేని ప్రాంతంలో మూడు వరుసలు చొప్పున మొక్కలు పెంపకం చేపట్టవచ్చు. ఒక్కో లబ్ధిదారునికి 150 మొక్కల చొప్పున అప్పగించినా ఏడు వేల మంది వరకు లబ్ధి చేకూర్చవచ్చు. మరో వైపు కాలువకు ఇరువైపులా పచ్చని వాతావరణం ఏర్పడుతుంది. పర్యావరణానికి సైతం మేలు చేకూరుతుంది. ఎంతో మందికి ఉపాధి.. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా భూమి లేని నిరుపేదలను ఎంపిక చేసి ప్రభుత్వ భూమిలో చెట్టుపట్టాలు ఇస్తారు. ఆ భూమిలో పండ్ల జాతి, కలప జాతి మొక్కలు పెంచుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారుడు 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. వాటి పెంపకానికి ఉపాధి హామీ పథకం నుంచి ఐదేళ్ల పాటు నిధులు మంజూరు చేస్తారు. రైతులు ఫలసాయం కూడా పొంది ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చు. భూమి విక్రయించే హక్కు మాత్రం లబ్ధిదారుడికి ఉండదు. ప్రస్తుతం కూడా సాగర్ కాలువకు ఇరువైపులా మొక్కల పెంపకానికి అప్పగిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ, ఎన్ఎస్పీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటే హారితహారం అవుతుందని ప్రజలంటున్నారు. -
సాగర్ హైవేపై ప్రమాదం: ఇద్దరి మృతి
యాచారం: నాగార్జునసాగర్ – హైదరాబాద్ రహదారిపై కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో తల్లీకొడుకులు మృతిచెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం లైలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కాట్రోత్తండాకు చెందిన చందర్ ఆయన భార్య నేజీ(45), కుమారుడు నర్సింగ్(26) తమ ఆటోలో ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వైపు వెళ్తున్నారు. యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ గునుగల్ క్రీడాక్షేత్రం సమీపంలో ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న చందర్, నేజీ, నర్సింగ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న నేజీ, ఆమె కొడుకు నర్సింగ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. చందర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్ తెలిపారు. -
మృత్యు మలుపులు..!
సాక్షి, కొండమల్లేపల్లి : నాగార్జునసాగర్–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై పలుచోట్ల ఉన్న మూలమలుపులు మృత్యు పిలుపుగా మారాయి. ఆయా మూలమలుపుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఉన్న మలుపులు ప్రమాదాలకు నెలవులు అవుతున్నాయి. కొండమల్లేపల్లి మండల పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న మూలమలుపుల వద్ద ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కొంతమంది మృత్యువాత పడగా మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కేశ్యతండా, జోగ్యతండా, చెన్నారం వద్ద ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దారిగుండా రాకపోకలు సాగించే వాహనదారులు మూలమలుపుల వద్ద అవగాహ న లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం మూలమలుపు వద్ద ఈనెల 6న ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడగా మరికొందరికి గాయాలయ్యాయి. గతేడాది డిసెంబర్లో జోగ్యతండా వద్ద బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువాతపడ్డాడు. ఆయా మూలమలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. చర్యలు చేపడుతున్నాం నాగార్జుసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు బారీకేడ్లను సైతం ఏర్పాటు చేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఇప్పటికే పలుమార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాం. – శ్రీనివాస్‌నాయక్, ఎస్ఐ, కొండమల్లేపల్లి -
ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా..
మిర్యాలగూడరూరల్ : బంధువుల ఇంట్లో నిర్వహించిన ఫంక్షన్ హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా కారు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన మిర్యాలగూడ మండలం ఐలాపురం సమీపంలో మంగళవారం రాత్రి జరి గింది. రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కు చెందిన మామఅల్లుడు ఎండీ.ఖమృల్లా (57), షాబ్నగర్కు చెందిన షేక్ .రఫీ కలిసి ఇండికా కారులో మంగళవారం సాయంత్రం మాడ్గులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో నిర్వహిస్తున్న ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి రాత్రి 10:30 గంటలకు కారులో మిర్యాలగూడకు వస్తుండగా ఐలాపురం గ్రామ శివారులో ఎడమ కాల్వ కట్టపై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి కాల్వ లోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు వేగంగా ప్రవహిస్తుండడంతో కారు నీటిలో మునిగింది. డ్రైవింగ్ చేస్తున్న రఫీ తప్పించుకోగా, కారులో ఉన్న ఖమృల్లా కారుతో సహా నీటిలో మునిగిపోయాడు. రఫీ అతనిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. సంఘటన జరిగిన వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చినా రాత్రి వేళ కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి ప్రమాదం జరిగిన స్థలం నుంచి కారు సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి ఒడ్డుకు చేరిం ది. స్థానికులు, క్రేన్, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమిం చి కారును బయటకు తీశారు. కారులో ఉన్న మృతదేహాన్ని తొలుత వెలికి తీసి, అనంతరం కారును బయటకు తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఖమృల్లా జిల్లా కేంద్రం లోని కోఆపరేటివ్ ఆడిట్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసేవాడని తెలిపారు. మృతుడి కుమారుడు జహంగీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుచున్నట్లు తెలిపారు. అండర్ పాస్‌లో నీరు ఉండడంతో ... ఐలాపురం వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే క్రాసింగ్ తొలగించి ఇటీవల అండర్ పాస్ మార్గం ఏర్పాటు చేశారు. కాగా అండర్ ప్రాస్‌లో నీరు నిల్వ ఉండడంతో అందులో నుంచి కారు వెళ్తే కారు సైలెన్సర్లోకి నీరు వెళ్తుందనే ఉద్దేశంతో అండర్ పాస్ పక్కన గల కాల్వ కట్టపైనుంచి వెళ్లడం వల్లే కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అండర్ ప్రాస్‌లో నీరు ఉండడం వల్ల ఐలాపురం, రెడ్డిల్యాబ్ ఉద్యోగులు నిత్యం ఈ మార్గం నుంచే వెళ్తుంటారు. తరచు ఇక్కడ ప్రమాదాలు సంభవి స్తాయని, ఇప్పటికే 4 బైకులు కాలువలో పడి పో యాయని స్థానికులు తెలిపారు. -
రుధిరదారి..!
ప్రమాదకరంగా హైదరాబాద్ నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి ప్రాణాలు మింగుతున్న వేగం పెరుగుతున్న ప్రమాదాలు భయాందోళనలో ప్రయాణికులు కనిపించని సూచిక బోర్డులు అతివేగం, వాహన చోదకుల నిర్లక్ష్యం నిండుప్రాణాలను బలిగొంటోంది. హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై గత నెల రోజుల నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికమయ్యింది. రహదారిపై ఎక్కడో ఒక చోట నిత్యం చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళన కలిగిస్తున్నాయి. వాహనచోదకుల అతివేగం కుటుంబాల్లో విషాదం నింపుతోంది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్తే తిరిగి వచ్చేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. - చింతపల్లి నిత్యం వందల సంఖ్య లో లారీలు, ఆటో లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలతో హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి రోజు రో జుకు రద్దీగా మారుతోంది. ప్రైవేట్ వాహనాల చోదకులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. గత నెల మండలంలోని తక్కెళ్లపల్లి వద్ద పెళ్లి లారీ బోల్తా కొట్టిన సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాత పడగా 32మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గత నాలుగు రోజుల వింజ మూరు చైతన్యభారతి పాఠశాల సమీపంలో లారీ, డీసీఎం అతివేగంతో ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలు అతి వేగంగా ఢీకొట్టుకోవడంతో లారీ, డీసీఎం క్యాబిన్లలో డ్రైవర్లు చిక్కుకుపోవడంతో సుమారు రెండు గంటలపాటు పోలీసులు శ్రమించి మృతదేహాన్ని, క్షతగాత్రుడిని బయటకు తీశారు. ఈ సంఘటన చూస్తే వాహనాలు ఎంత వేగంగా వస్తున్నాయో అర్థమవుతుంది. ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు మండలంలోని రోటిగడ్డతండాకు చెందిన పెళ్లి లారీ తక్కెళ్లిపల్లి గ్రామ శివారు వద్ద అతి వేగంతో వచ్చి బోల్తా కొట్టడంతో లారీలో ఉన్న ఇద్దరు మృత్యువాత పడగా 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర రహదారిపై వింజమూరు సమీపంలో లారీ, డీసీఎం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఒకరు మృత్యువాతపడగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటంపేట వద్ద ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ట్రాక్టర్‌పై వస్తున్న ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చింతపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో కల్వర్టు వద్ద అదుపు తప్పి డీసీఎం బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వింజమూరు సమీపంలో డీసీఎం, లారీ ఢీకొట్టిన సంఘటన మరుసటి రోజు వాహనాలు రోడ్డుపైనే ఉండటంతో హైదరాబాద్ వైపు నుంచి చింతపల్లి వస్తున్న ఓ వ్యక్తి ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చింతపల్లి పెట్రోల్‌బంక్ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకొవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వరనగర్‌లో రెండు బైక్‌లు ఢీకొట్టుకోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సూచిక బోర్డులు ఏవీ ? హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ఇరుకుగా ఉంది. దీనికి తోడు వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయని వాదనలు ఉన్నాయి. మండలంలోని నసర్లపల్లి, వెంకటంపేట, కొక్కిరాల గౌరారం, వింజమూరు శివారు, చింతపల్లి పెట్రోల్‌బంక్, విరాట్‌నగర్, చైతన్యభారతి పాఠశాల, ప్రశాంతపురితండా, మదనాపురం, పోలేపల్లి గేటుల వద్ద ప్రమాదకరంగా మూలమలుపులు ఉన్నప్పటికీ అధికారులు వేగనిరోదక సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు స్పందించి సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ రహదారులపై వేగనిరోదక సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై రోజు రోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గమ్య స్థానాలకు చేరుతామా లేదా అన్న పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. రాష్ట్ర రహదారి మరమ్మతులకు గురికావడంతో అక్కడక్కడా గుంతలు ఏర్పడి, నూతనంగా కొన్ని రోజుల క్రితం చేపట్టిన త్రీ ఫేజ్ సాగర్ నీటి పైప్‌లైన్ పనుల కారణంగా రోడ్డు అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల రోడ్డు బాగా ఉన్నా వాహనాలు మితిమీరిన వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు సరిగ్గా లేకపోవడంతో మండలంలో ప్రైవేట్ వాహనాల సంఖ్య అధికమవుతుంది. భద్రత కరువైన ఈ వాహనాలలో ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దీని కారణంగా రహదారులు అధ్వానంగా మారడంతో పాటు ప్రైవేట్ వాహనాలు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటున్నారు. పంచాయతీరాజ్ అధికారులు రహదారులకు మరమ్మతులకు నిర్వహించకపోగా ఆర్టీఏ అధికారులు వాహనాలు తనిఖీ చేయడంతో ప్రమాదాలు పెరగడానికి కారణమవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలు సంభవించిన సందర్భాలలో హడావుడి చేస్తున్న అధికారులు తర్వాత నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
సరూర్ నగర్లో కాల్పుల కలకలం!
-
సరూర్ నగర్లో కాల్పుల కలకలం
హైదరాబాద్ : సరూర్ నగర్ సమీపంలోని జింకలబావి కాలనీలో కాల్పుల కలకలం రేగింది. నాగరాజు (55) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగులు నాగరాజు (55) ఇంట్లోకి వెళ్లి మరీ కాల్పులు జరిపారు. పొట్ట భాగంలో రెండు రైండ్లు, తొడమీద ఒకరౌండు కాల్చారు. ముగ్గురూ అక్కడినుంచి పారిపోయారు. నాగరాజును సమీపంలోని సాయి సంజీవని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇది మాస్ ఏరియా కావడంతో ఇక్కడకు రాకపోకలు సాగించడమే కష్టం అవుతుంది. కాగా నాగరాజు జ్యోతిష్యుడని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడు. ఆ తగాదాల నేపథ్యమేనా, వేరే కారణాలేమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లు రెండింటి పరిధిలో దుండగుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఏసీపీ సెటిల్మెంట్లు చేస్తుండటంతో ఆయనను డీజీపీ మంగళవారమే సస్పెండ్ చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు శాంతిభద్రతలను గాలికి వదిలేయడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాలుష్య నివారణ చర్యలేవి..?
మంచాల: ఫ్లొరైడ్ పీడిత ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగు నీరును అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు అడుగడుగునా కలుషితమవుతున్నాయి. వీటిని తాగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నాగార్జునసాగర్ నుండి వచ్చే కృష్ణా జలాలను గున్గల్ రిజర్వాయర్ నుండి ఈ ప్రాం తంలోని కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధించిన 134 గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం 2007లో రూ.18కోట్లను ఖర్చు పెట్టింది. ప్రత్యేకంగా 12 ట్యాంకులు, సంఫులను నిర్మించింది. నీటి సరఫరాకు 60మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వీరు ఈ కృష్ణా జలాలు ఎక్కడా లీకేజి ,వృధా, కలుషితం గాకుండా చర్యలు తీసుకోవాలి. కాని గ్రామాలకు ఎక్కడా స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందండం లేదు. లీకేజీల మయం... కృష్ణాజలాలు అనేకచోట్ల లీకేజీల రూపంలో వృధా కావడమే కాక తాగడానికి పనికిరాని విధంగా కలుషితమవుతున్నాయి. ప్రధానంగా గున్గల్నుండి లోయపల్లివరకు పైపు లైన్ పరిధిలో ఎల్లమ్మతండ-రంగాపూర్ , గున్గల్-గడ్డమల్లాయ్యగూడెం , ఆగాపల్లి- నోముల, నోముల- లింగంపల్లి మధ్య,..అలాగే జాపాల-బండలేమూర్ పైపు లైన్ పరిధిలో జాపాల ప్రభుత్వ పాఠశాల , ఆరుట్ల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ,.. మంచాల -తిప్పాయి గూడ పైపులైన్ పరిధిలో చిత్తాపూర్ వద్ద తరుచూ గేట్ వాల్వ్‌లు లీకేజీలు అయి నీరు నేలపాలవుతున్నాయి. నాగార్జున సాగర్- హైదారాబాద్ రహదారిపై ఏకంగా ప్రయాణికులు ఈ నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఆగాపల్లి-గురునానక్ కళాశాల మధ్య పారెస్టు సమీపంలో రెండు,మూడు చోట్ల గేట్ వాల్వ్‌ల వద్ద కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఒక చోట గేదెలు, గొర్రెలు,మేకలు వంటి జంతువులను గేట్ వాల్వ్ నుండే నీరు తాగిస్తున్నారు.మరో చోట ప్రయాణికులు గేట్‌వాల్వ్ వద్ద నీటిని లీక్ చేసి అందులో నుండే నీళ్లు తోడుకొని స్నానాలు చేస్తున్నారు. దుస్తులు ఉతుక్కుంటున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కృష్ణా నీటి సరఫరా విభాగం సిబ్బంది కనీస పర్యవేక్షణ కూడా ఉండడంలేదు. ఇదే విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ విజయలక్ష్మిని వివరణ కోరగా గ్రామాల్లో గేట్ వాల్వ్‌లు ఎక్కడెక్కడ లీకేజీ అవుతున్నాయో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నీతి తప్పిన మనిషి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు
నీతి తప్పిన మనిషి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. పొట్ట కూటి కోసం కిరాణా కొట్టును నడుపుకొనే అభాగ్యుల పాలిట మృత్యువుగా మారాడు. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకుని తీరా డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. పైసలు ఇవ్వకుండా పారిపోవడంతో ఆ దుండగుడిని వెంటాడిన తండ్రీ కొడుకులను విధి బలి తీసుకుంది. ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి బైకును ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరి ఉసురుపోసుకున్న ఆ ఆగంతకుడి చర్యపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. అన్నెంపున్నెం ఎరుగని ఆ తండ్రీకొడుకులు విగతజీవులైన దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనకుండా ఉండలేకపోయారు. ఈ హృదయ విదారక ఉదంతం బుధవారం మంచాల మండలంలోని ఆగాపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కిరాణ దుకాణంలో పెట్రోల్ పోయించుకున్న ఓ వ్యక్తి డబ్బులివ్వకుండా పరారయ్యాడు. అతడిని బైక్‌పై వెంబడించిన తండ్రీకొడుకులను టిప్పర్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన మండలంలోని ఆగాపల్లి సమీపంలో బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగాపల్లికి చెందిన కంభాలపల్లి దశరథ(55) గ్రామంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై చిన్న కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు కృష్ణ(27) నగరంలోని ముషీరాబాద్-1 డిపోలో డ్రైవర్. బుధవారం కృష్ణ ఇంటివద్ద ఉన్నాడు. సాయంత్రం 4:10 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి దశరథ కిరాణ కొట్టులో పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా చిన్నతుండ్ల గ్రామం వైపు పరారయ్యాడు. దీంతో దశరథ తన కొడుకు కృష్ణకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. కృష్ణ ఇంటినుంచి బైక్‌తో వచ్చి తండ్రిని ఎక్కించుకొని దుండగుడు పరారైన చిన్నతుండ్ల గ్రామం వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగాపల్లి శివారులోని జాద్మియా బావి సమీపంలోని మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ (ఏపీ21టీయూ2243) వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథ, కృష్ణ తలలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. దశరథకు భార్య రాములమ్మ, కుమారుడు కృష్ణతోపాటు నాగభూషణ్, రమేష్, రాజేష్ ఉన్నారు. కృష్ణకు భార్య స్వప్న ఉంది. ఇద్దరూ సచ్చిపోతిరి.. దశరథ, కృష్ణల మృతితో మంచాల మండలంలోని ఆగాపల్లిలో విషాదం అలుముకుంది. ఘటనా స్థలం మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో మిన్నంటింది. భర్త, కుమారుడి మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా..కృష్ణ.. ఆర్నెళ్ల కింద నీ కొలువు పర్మినెంట్ అయింది బిడ్యా.. మంచిగ బతుకుతవ్ అనుకున్న.. అంతలోనే మీ నాయినను.. నిన్ను.. ఆ దేవుడు తీసుకపోయ్యిండు బిడ్యా.. ఇద్దరూ సచ్చిపోతిరి.. మేమెవరి కోసం బతకాలి.. ఎట్ల బతకాలి.. అయ్యా.. ’ అని రాములమ్మ రోదించిన తీరు హృదయ విదారకం. తండ్రి ఫోన్ చేయడంతో ‘ఇప్పుడే.. వస్తాను’ అని కృష్ణ భార్య స్వప్నకు చెప్పి బైక్‌పై వెళ్లాడు. భర్త కోసం ఎదురుచూస్తున్న ఆమెకు 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతిచెందాడనే సమాచారం తెలియడంతో కుప్పకూలిపోయింది. ‘నేనెట్ల బతకాలయ్యా.. నీ డ్యూటి పర్మినెంట్ అయింది.. మంచిగా బతుకుదమనుకున్నం.. అంతలోనే ఆ దేవుడు నిన్ను నాకు కాకుండా తీసుకపోయిండు కదయ్యా..’ అని స్వప్న గుండెలుబాదుకుంటూ రోదించింది. -
శ్రీశైలం జలాశయంలో 871 అడుగులకు చేరిన నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం బుధవారం నాటికి 871 అడుగులకు చేరింది. జలాశయానికి కృష్ణ (జూరాల), తుంగభద్ర ( రోజా గేజింగ్ పాయింట్) నదుల నుంచి 2,92,167 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పటికే జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 146.2606 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 871.10 అడుగులుగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 21.91 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం జలాశయం నుంచి 44,048 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండు జలవిద్యుత్ కేంద్రాలలో 13 జనరేటర్లతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం ఈ ఏడాది నీటిమట్టం : 1629.96 అడుగులు ఇన్‌ఫ్లో : +109719 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో : 136909 క్యూసెక్కులు నీటి నిల్వ : 89.575 టీఎంసీలు గత ఏడాది నీటిమట్టం : 1631.59 అడుగులు ఇన్‌ఫ్లో : +154367 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో : 165509 క్యూసెక్కులు నీటి నిల్వ : 95.494 టీఎంసీలు -
నేడు సాగర్ కుడి కాలువకు నీటి విడుదల
నరసరావుపేటవెస్ట్ : నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి బుధవారం తాగునీటికోసం సాగర్ జలాలను విడుదల చేస్తున్నట్లు ఎన్ఎస్పీ చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు చెప్పారు. మంగళవారం రాత్రి సాక్షితో ఆయన ఫోన్లో వివరాలను తెలియజేస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉదయం 10.30గంటలకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారన్నారు. సాగర్‌కు పైనుంచి వచ్చే నీటి లభ్యతను బట్టి రానున్న రోజుల్లో సాగునీరు కూడా అందజేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులకు కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. -
2 ఏళ్లు.. శాతం పనులు
మాచవరం : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వలు నాలుగు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారాయి. పాతికవేల ఎకరాలకు సాగునీరందించే ఆకురాజుపల్లి మేజర్ కాల్వ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. డ్రాప్టులు, బాయిలర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పిచ్చి మొక్కలు, రబ్బరుచెట్లు మొలిచి చిట్టడవిని తలపిస్తున్నాయి. అవి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో చివరి భూములకు నీరు చేర డం లేదు. నాలుగేళ్లుగా నీరు అందక రైతులు సక్రమంగా పంటలు పండించుకోలేకపోతున్నారు. కేవలం వర్షం ఆధారంగా పంటలు పండించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాలువలను బాగు చేసేందుకు నిధులు భారీగా మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ల సాగతీత ధోరణి కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. పది కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు రెండేళ్లుగా రెండుశాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఆకురాజుపల్లి మేజర్ ద్వారా మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, బెల్లంకొండ మండలాల పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుంది. 21.78 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాల్వలకు మరమ్మతులు చేపట్టడం కోసం రెండేళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నుంచి రూ.10.08 కోట్ల నిధులు మంజూర య్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి 50 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించి, పనులు 2012 మేలో ప్రారంభించారు. ఇప్పటివరకు కెనాల్ పరిధిలో 6వ మైలు, 8వ మైలు వద్ద రెండు సిమెంట్ డ్రాప్టులను నిర్మించారు. గడిచిన 24 నెలల కాలంలో రెండు శాతం పనులు మాత్రమే జరిగినట్లు ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలిన 26 నెలల్లో 98 శాతం పనులు ఎలా పూర్తి చేస్తారో కాంట్రాక్టర్లకు, అధికారులకే తెలియాలి. కనీసం ఖరీఫ్‌లోనైనా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. సకాలంలో పూర్తి చేయిస్తాం.. ప్రపంచ బ్యాంకు నిధులతో రెండేళ్లుగా కాల్వల మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది పనుల్లో కొంత జాప్యం జరిగింది. ఎగువ నుంచి వరుసగా పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది మంగాపురం క్యాంపు వద్ద పెద్ద డ్రాప్టుల మరమ్మతులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 శాతం పనులు జరిగాయి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పలుమార్లు నోటీసులు కూడా పంపించాం. సకాలంలోనే పనులన్నింటినీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. - చరియన్, ఇరిగేషన్ డీఈ -
సాగర్ భద్రతను పరిశీలించిన ఎస్పీఎఫ్ కమాండెంట్
నాగార్జునసాగర్ భద్రతను ఎస్పీఎఫ్ కమాండెంట్ మాధవరావు శుక్రవారం పరిశీలించారు. ప్రధాన డ్యామ్‌తో పాటు ఎడమ, కుడి కాల్వలు, ఎర్త్‌డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. భద్రతా చర్యలపై ఎస్పీఎఫ్ ఆర్ఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంతో పాటు కుడి, ఎడమ కాల్వలపై గల విద్యుదుత్పాదక కేంద్రాల వద్ద చేపట్టిన భద్రత చర్యలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్ఐ భాస్కర్, జెన్కో ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రమేశ్‌బాబు, సిబ్బంది ఉన్నారు. -
జిల్లాలో అంతరాష్ట్ర సరిహద్దులు మూడు
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఎనిమిది అంతరాష్ట్ర సరిహద్దులను నిర్ణయించారు. వాటిలో మూడు సరిహద్దులు జిల్లాలోనే ఉన్నాయి. పెద్దవూర మండలం నాగార్జునసాగర్ వంతెన సమీపంలో, దామరచర్ల మండలం వాడపల్లి వంతెన, కోదాడ మండలం దోరకుంట గ్రామ శివారు ప్రాంతాలను నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 21న రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జిల్లా రవాణాశాఖ సమాయత్తమవుతోంది. వాహనాల రద్దీపై సమాచార సేకరణ మార్చి 16, 17వ తేదీల్లో సీమాంధ్ర, తెలంగాణ రవాణాశాఖ అధికారులు ఆయా రోడ్లలో ఎక్కడినుంచి ఎక్కడికి ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కలు కూడా తీశారు. మాచర్ల-నాగార్జునసాగర్‌కు మధ్యన రోజుకు 800 వాహనాలు తిరుగుతున్నట్టు అంచనా వేశారు. దామరచర్ల మండలం విష్ణుపురం-పొందుగుల మధ్య ఒంగోలు వెళ్లే జాతీయ రహదారి కావడంతో నిత్యం 8వేల వాహనాలు తిరుగుతున్నట్లు లెక్క వేశారు. ఎక్కువ వాహనాలు తిరుగుతున్న ప్రాంతంలో సిబ్బందిని అధిక సంఖ్యలో నియమించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ -ఇతర రాష్ట్రాల మధ్య వాహనాలు, తదితర తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయో అదేవిధంగా వచ్చే నెలలో జిల్లా బార్డర్‌లోని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతాయి. గతంలో ధాన్యం విక్రయించే సీజన్లలోనే వ్యవసాయ మార్కెట్ వారు తాత్కాలికంగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసేవారు. ఇప్పుడలా కాకుండా అంతరాష్ట్ర చెక్పోస్ట్టుల వద్ద అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తారు. సిబ్బంది నియామకం ఇలా.. వాహనాల తనిఖీ కోసం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితర సిబ్బందిని ఈ చెక్‌పోస్టుల్లో నియమిస్తారు. వీరు మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు, పర్మిట్ల గడువు, వాహనాల ఫిట్నెస్, లెసైన్సులు తనిఖీ చేస్తారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులతోపాటు ప్రతి ప్రైవేటు బస్సునూ చెక్ చేయనున్నారు. వాటిలో లోపాలు గుర్తిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలననుసరించి 11మంది పైచిలుకు సిబ్బందిని ఏర్పాటుచేయనున్నారు. అక్రమ వ్యాపారాలకు చెక్ అమరావతి నుంచి హైదరాబాద్‌కు, హాలియా, మూసీ తదితర వాగుల నుంచి మాచర్ల, గుంటూరు ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతుంటుంది. అంతరాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటుతో ఈ అక్రమ వ్యాపారానికి చెక్‌పడనుంది. భవన నిర్మాణాల్లో ప్లాస్టరింగ్ కోసం అమరావతి ఇసుకను వాడతారు. హాలియా, మూసీ వాగుల నుంచి ఇసుక తక్కువ ధరకు వస్తుండడంతో రోజూ లారీల్లో తరలిస్తుంటారు.అలాగే పల్నాడునుంచి మిర్యాలగూడ, హాలియా మిల్లులకు రేషన్‌బియ్యం నిత్యం సరఫరా అవుతుంటాయి. వాటికి కొంతమేరకు చెక్‌పడనున్నది. రైతులకు కష్టం.. ఇప్పటి వరకు సీజన్లలో ఆయా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేవారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు తమ ధాన్యాన్ని హలియా, మిర్యాలగూడలకు పాసుపుస్తకాలు చూయించి తీసుకువచ్చేవారు. ఆయా ప్రాంతాల్లోని మిల్లుల్లో విక్రయించి వెళ్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అలాగే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, చింతపల్లి తదితర ప్రాంతాలలో పండించిన పప్పుధాన్యం కందులు, పెసర్లు, మినుములను మాచర్ల దాల్మిల్లులకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఎటు వెళ్లాలన్నా చెక్‌పోస్టులు దాటాల్సిందే. సరిహద్దు కూలీల పరిస్థితి అంతే.. వ్యవసాయ సీజన్లో వరికోతలు, పత్తి తీయడం తదితర పనులకు మాచర్ల మండలం నుంచి కూలీలు ఆటోలలో పెద్దవూర, హాలియా మండలాలకు వస్తారు. ప్రస్తుతం పెద్దవూర పత్తిమిల్లులో పనిచేసే కూలీలు సహితం మాచర్ల ప్రాంతం నుంచి ప్రత్యేక వాహనంలో వస్తున్నారు. అలాగే నల్లగొండ శివారు తండాలు, గ్రామాలనుంచి కూలీలు మిరపకాయలు ఏరే సమయంలో ఆటోలలో గుంటూరు జిల్లాలోని పలుగ్రామాలకు వెళ్తుంటారు. చెక్‌పోస్టులు ఏర్పాటైతే ఆటోలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లే వీలుండదు. కచ్చితంగా పర్మిట్ పన్ను కట్టాల్సి ఉంటుంది. ఐదు కిలోమీటర్లకే వాహన పన్ను హిల్‌కాలనీ, పైలాన్నుంచి రైట్బ్యాంకుకు పనుల నిమిత్తం వెళ్లే వారికోసం ప్రస్తుతం ఆటోలు తిరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలో పర్మిట్ పన్ను చెల్లించనిదే ఆటోలను అటూఇటూ తిరగనివ్వరు. వీటి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం కోసం అదనంగా పన్ను చెల్లించక తప్పదేమో?. అలాగే హిల్‌కాలనీ సంఘమిత్ర నుంచే గుంటూరు జిల్లాలోని రైటు బ్యాంకు ఉద్యోగులకు వంట గ్యాస్ సరఫరా చేస్తారు. ఇక వచ్చే నెలలో గ్యాస్‌ను మరో రాష్ట్రంలోకి అనుమతిస్తారా? అనుమతిస్తే వాహనాలకు కట్టే పర్మిట్ పన్ను గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం కానున్నది. -
కోళ్లదాణాలో రూ.కోటిన్నర!
నాగార్జున సాగర్ హైవేపై నల్గొండ జిల్లా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వైపు కోళ్ల దాణాతో వెళ్తున్న వాహనాన్ని చింతపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాణా అడుగున్న ఉంచి సుమారు కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు స్వాధీనం చేసుకుని రెండు రోజులు దాటిన పోలీసులు మాత్రం ఆ విషయాన్ని దాచి పెట్టారు. ఈ విషయంపై విలేకర్లు పోలీసులను ప్రశ్నించారు. నగదు దొరికిన మాట వాస్తవమేనని... ఆ నగదు ఆర్డీవోకు అందజేశామని పోలీసులు వెల్లడించారు. అయితే భారీ మొత్తంలో నగదు పట్టుబడిన పోలీసు మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. -
జిల్లా ఓటర్లు 24,89,294
సాక్షి, నల్లగొండ : జిల్లాలో నవశకానికి నాంది పడనుంది. రానున్న ఎన్నికల్లో యువకులే ప్రభావం చూపనున్నారు. వీరి ఓట్లు సంపాదించిన వారికి విజయం తథ్యం. జిల్లాలో ఉన్న ఓటర్లలో అధిక శాతం యువతీ యువకులే. శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల తుది జాబితాను చూస్తే ఇది స్పష్టమవుతోంది. 18 నుంచి 29 ఏళ్లలోపు వారి ఓట్లు 32.67 శాతం ఉండడం విశేషం. ఓటరు బాబితాను అధికారులు గ్రామపంచాయతీల్లో, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అత్యధికం... జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,21,309 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తుంగతుర్తి నియోజకవర్గంలో నిలిచింది. ఇక్కడ 2,19,609 మంది ఓటర్లు నమోదయ్యారు. అతి తక్కువగా భువనగిరి నియోజకవర్గంలో 1,82,149 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం. -
ఖాళీ అవుతున్న క్వార్టర్స్
ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారిలో దడపుడుతోంది. అనుమతిలే కుండా నివాసం ఉండడంతో పాటు అద్దెబకాయిలు ఉన్నవారిని క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు కంకణం కట్టుకున్నాడు. ఇందులోభాగంగా దశలవారీగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఎప్పుడు ఖాళీ చేయాల్సివస్తుందోనని క్వార్టర్స్‌లో ఉన్నవారికి కంటిమీద కునుకులేకుండా ఉంది. - న్యూస్‌లైన్, మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్ఎస్పీ) ఉద్యోగుల కోసం 388 క్వార్టర్స్ నిర్మించారు. అయితే ఇందులో కొన్ని క్వార్టర్సలో కొందరు ఎలాంటి అనుమతిలేకుండా అద్దెలు చెల్లించకుండా ఉంటున్నారు. ఇలాంటివారిపై గతం లో టీడీపీ నాయకులు రతన్‌సింగ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా కేసు నంబర్ 243/2009 నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న లోకాయుక్త 2011 జూలై నుంచి డిసెంబర్ వరకు మూడు పర్యాయాలు విచారణ జరిపి నలుగురితో కూడిన కమిటీని నియమించింది. 2011 డిసెంబర్లో ఈ కమిటీ వారం రోజుల పాటు పరిశీలించి మిర్యాలగూడలోని క్వార్టర్స్‌పై ఉపలోకాయుక్తకు నివేదిక అందజేసింది. కాగా ఉపలోకాయుక్త కృష్ణాజీరావు 2012 సెప్టెంబర్ 1వ తేదీన మిర్యాలగూడకు వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎన్ఎస్పీ సీఈ లతో కూడిన త్రీమెన్ కమిటీని నియమించారు. అనంతరం 2013 అక్టోబర్‌లో ఈ కేసును విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. కాగా నాటి నుంచి క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. దశలవారీగా నోటీసులు మిర్యాలగూడలో గతంలో 13 క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2013 మార్చి 20వ తేదీన మొదటి దఫాలో 30 క్వార్టర్స్‌లో అనధికారికంగా నివాసం ఉంటున్నట్లుగా గుర్తించిన ఎన్ఎస్పీ అధికారులు 10 క్వార్టర్స్‌లలో నివాసం ఉంటున్న మాజీ ప్రజా ప్రతినిధులను బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ తర్వాత 30 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేయగా కొందరు కోర్టులకు వెళ్లగా 2013 అక్టోబర్ 5వ తేదీన మరో మూడు క్వార్టర్స్‌ను ఖాళీ చేయించారు. కోర్టు స్టే గడువు ముగియడంతో 2014 జనవరి 6వ తేదీన మరో 42 క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా నోటీసులు అందుకున్న వారిలో 31 మంది కోర్టుకు వెళ్లి నాలుగు వారాల పాటు స్టే తెచ్చుకున్నారు. దాంతో 11 క్వార్టర్స్ ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా బుధవారం ఏడు క్వార్టర్స ఖాళీ చేయించారు. దీంతో ఖాళీ అయిన క్వార్టర్స 20కి చేరాయి. బకాయిలు చెల్లించని వారికి నోటీసులిచ్చాం - అంజయ్య, ఎన్ఎస్పీ ఈఈ, మిర్యాలగూడ మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో అద్దె బకాయిలు చాలా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చింది. దాంతో విద్యుత్ వినియోగం పెరగడం వల్ల అధికారికంగా చెల్లించాల్సి వస్తోంది. క్వార్టర్స్ కేటాయింపును దుర్వినియోగం చేయడంతో పాటు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి 42 మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో 31 మంది కోర్టుకు వెళ్లి నాలుగు వారాల పాటు స్టే తెచ్చుకున్నారు. మిగతా వారిని ఖాళీ చేయిస్తున్నాం. బకాయిల చెల్లింపులు షురూ.. మిర్యాలగూడలోని 388 ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో అద్దె బకాయిలు ఇప్పటికీ రూ. 35 లక్షలున్నాయి. అధికారులు ఖాళీ చేయించకుండా ఉన్నప్పుడు రూ.1.20 కోట్లు బకాయిలు ఉన్నాయి ఖాళీ చేయిస్తారనే ఆందోళనలో బకాయిలు చెల్లిస్తున్నారు. అయినా ఇంకా రూ. 35 లక్షలు ఉన్నాయి. అద్దె బకాయిలు ఎక్కువగా సుమారు 106 క్వార్టర్స్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారికి కూడా నోటీసులు సిద్ధం చేశారు. అక్రమ నిర్మాణాలు ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారు అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. సుమారుగా 50 శాతానికిపైగా క్వార్టర్స్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాగా అక్రమంగా నిర్మించి అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారే తప్ప అధికారులకు మాత్రం చెల్లించడం లేదు. రోడ్డు వైపునకు ఉన్న క్వార్టర్స్ వారు మడిగెలు నిర్మించి అద్దెకు ఇవ్వడంతో పాటు దుకాణాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇష్టానుసారంగా విద్యుత్ వినియోగం చేస్తూ గతంలో నిర్మించి స్లాబ్ ప్రకారమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా బిల్లును ఎన్ఎస్పీ అధికారులు చెల్లిస్తున్నారు. దాంతో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారి విద్యుత్‌ను కూడా అధికారులే చెల్లించాల్సి వస్తోంది. -
అప్పుడే అగ్గి
మూసీ పరీవాహక ప్రాంతంతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని వరి రైతుకు అన్నీ కష్టాలే చుట్టుముడుతున్నాయి. గత ఏడాది తుపాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చే దశలో పంటంతా నీటిపాలైంది. ఖరీఫ్‌లో తెగుళ్ల కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గింది. కాగా రబీలోనైనా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావించిన రైతన్న ఆశలపై తెగుళ్లు నీళ్లు చల్లుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రధానంగా అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు తదితర తెగుళ్లు రైతన్నను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భూదాన్ పోచంపల్లి, న్యూస్‌లైన్: ఈ రబీ సీజన్లో మండలంలోని మూసీ పరీవాహక గ్రామాలలో సుమారు 15వేలకుపైగా ఎకరాలలో 1010 , ఐఆర్64 రకాలు సాగు చేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వరి ముదురుతీసే దశలో ఉంది. మరికొన్ని గ్రామాల్లో పొట్టకువచ్చే దశలో ఉంది. ఈ దశలో వరికి ప్రధానంగా అగ్గితెగులు, నటపిప్పి(కాండం తొలుచు పురుగు), గంధక విషప్రభావం ఉంది. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా.. తీరా చేను ఎదుగుతున్న దశలో తెగుళ్లు సోకడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళ చెందుతున్నారు. తెగుళ్ల లక్షణాలు - నివారణ చర్యలు కాండం తొలుచు పురుగు(నటపిప్పి) : ఈ పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. పిలకలు తొడిగే దశలో ఆశిస్తే మొవ్వలు ఎండిపోతాయి. అదే పూత దశలో నైతే వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి. సలహాలు వరి కొసలను తుంచడం ద్వారా కొనలమీద పెట్టిన గుడ్లను తొలగించవచ్చు. అలాగే ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా 8కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్‌ను వెదజల్లి నివారించాలి. గంధక విష ప్రభావం మూసీ నీటి వల్ల గంధక విష ప్రభావం కన్పిస్తుంది. ఈ ప్రభావం చౌటనేలల్లో అధికంగా ఉంది. వరినాటు వేసిన 3 నుంచి 4 వారాలలో ఈ ప్రభావం కన్పిస్తుంది. ప్రారంభ దశలో ముదురు ఆకులు పసుపురంగులోకి మారి ఎండిపోతాయి. తరువాత పక్క పిలకలు కూడా ఎండిపోయి.. కొన్ని పిలకలే మిగులుతాయి. మొక్క వేర్లను పరిశీలిస్తే నల్లని పొర కప్పి ఉంటుంది. దీనివల్ల ఆ మొక్క నీటిని, పోషకాలను తీసుకోలేక చనిపోతుంది. మొక్కవేళ్లకు ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా నేలలోని గంధకం, ఇనుప ధాతువులు రసాయనిక మార్పు చెంది మొక్కకు హాని కలిగించడాన్నే‘గంధక విష ప్రభావం’ (సల్ఫర్ ఇంజురి) అంటారు. ఇలా చేయాలి.. పొలంలో చిన్నకాలువలు చేసి మురుగు నీటిని తీసేయాలి. నేల పై భాగంలో పగుళ్లు ఏర్పడే వరకు పొలాన్ని ఆరబెట్టాలి. తిరిగి కొత్తనీరు పెట్టాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల వేళ్లకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చి వాడిపోయే దశలో ఉన్న మొక్కలు తిరిగి నిలదొక్కుకుంటాయి నేలను ఆరబెట్టడం వల్ల పొలంలో వేసిన నత్రజని పోతుంది. కాబట్టి మరొక మోతాదు నత్రజనిని అదనంగా వేయాలి. సల్ఫర్ ఇంజురి వచ్చే నేలల్లో గంధకం కలిగి ఉన్న సూపర్ ఫాస్పేట్, 20-20-0-13, జిప్సం వంటి ఎరువులు వేయకూడదు. ఈ సమస్య ఉన్న నేలల్లో జింక్ లోపం కన్పిస్తుంది. కాబట్టి జింక్ 2 శాతం ద్రావణాన్ని రెండు, మూడు సార్లు పిచికారీ చేసి ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు. అగ్గితెగులు.. ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నూలు కండె ఆకారంలో చివర్లు మొనదేలి ఉంటాయి. వీటి అంచులు ముదురు గోధుమరంగులో లేక నల్లగా ఉండి మచ్చల మధ్యన బూడిద లేదా తెల్లగా కన్పిస్తుంది. తెగులు ఉధృతం అయినప్పుడు ఈ మచ్చలు పెద్దవిగా కావడం వల్ల ఆకులు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. నివారణ ఇలా.. ఎకరానికి 120 గ్రాముల ట్రై సైక్లోజోల్, 300 మిల్లీ లీటర్ల కార్టాప్ హైడ్రో క్లోరైడ్ ఈ రెండింటిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి రెండు, మూడు సార్లు పిచికారీ చేయవచ్చు. మందు పిచికారీ చేసినా అదుపులోకి వస్తలేదు ఐదు ఎకరాల్లో వరిసాగుచేశా. 15 రోజుల క్రితం నటపిప్పి కనిపిస్తే మందు పిచికారీ చేశా. ఆ రోగం తగ్గక ముందే పదిరోజులుగా ఆకులపై మచ్చలు ఏర్పడి ఎండిపోతోంది. అధికారులకు చూపిస్తే అగ్గితెగులు సోకింది, మందు పిచికారీ చేయమన్నారు. వారం రోజుల క్రితం మందు కొట్టా. అయినా అదుపులోకి వస్తలేదు. ఇప్పటికే పెట్టుబడి రూ.50వేలు దాటింది. ఈసారిదిగుబడి తగ్గుతుందని ఆందోళనగా ఉంది. - జి. కృష్ణారెడ్డి, గుణంగారివాడ పరేషాన్ అవుతున్నం ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పటి వరకు రూ.54వేల పెట్టుబడి అయ్యింది. ఇటీవల అగ్గితెగులు, గంధకవిష ప్రభావంతో పంట ఎండిపోతోంది. తెలిసిన వారు చెబితే మందు చల్లా. అయినా రోగం తగ్గకపోవడంతో భువనగిరికి వెళ్లి రూ.2వేలు ఖర్చు చేసి మందుతీసుకు వచ్చి చల్లా. అయినా తగ్గడం లేదు. అధికారులేమో ఉదయం మంచు కురుస్తుంది కాబట్టి ఎండకొడితే రోగం పోతదని అంటున్నారు. - నేదురు కృష్ణారెడ్డి, జగత్పల్లి 50వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి హాలియా :హాలియా వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సాగర్ ఎడమ కాల్వ కింద హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాల్లో 70 వేల ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు రైతులు సుమారు 50 వేల ఎకరాల్లో వరినాట్లు వేయగా మరో 20 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు అనుముల మండలంలో సుమారు 16 వేల ఎకరాలు, త్రిపురారం 15వేలు, నిడమనూరు 18వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో బోరుబావుల కింద వరిసాగు చేసిన రైతులను ఓవైపు లోవోల్టేజీ సమస్య, మరోవైపు వరినారు మడులకు తెగుళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 10వేల ఎకరాల్లో.. హాలియా వ్యవసాయ డివిజన్ పరిధిలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలో సుమారు 10వేల ఎకరాల్లో వరికి అగ్గి తెగులు సోకింది. రబీలో ఐదు తడులకే నీరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ సీజన్లో వరిసాగు చేసే రైతులు నారుమడి త్వరగా పెరిగి రావాలని చెప్పి యూరియా అధిక మొత్తంలో వేశారు. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పులే వరికి అగ్గి తెగులు సోకడానికి ప్రధాన కారణమని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో వరినారుతో పాటు చేలపై మంచు కురవడం, పగటి సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ తెగులు వ్యాపిస్తుందని వారం టున్నారు. -
వయసు మీరినా.. విధుల్లోనే!
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పలువురు ఎన్‌ఎంఆర్‌లు వయసు మీరినా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు. సుమారు 70 మందికి పైగా ఎన్‌ఎంఆర్‌లకు 60 ఏళ్లకు పైబడి వయసు ఉన్నట్లు గుర్తించారు. వారిని విధుల నుంచి తొలగించాలని, వేతనాలు నిలిపివేయాలని ఎన్ఎస్పీ చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు సాగర్ పరిధిలోని ఐదు జిల్లాల ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెల 24 లోగా తమకు వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. ఎన్ఎంఆర్ల వ యసు 60 ఏళ్లు దాటగానే వారిని విధుల నుంచి తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయసు మీరిన తర్వాత కూడా పనిచేస్తున్నారు. ఎన్‌ఎంఆర్‌లు గతంలో కోర్టుకు సమర్పించిన వయసు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా 60 ఏళ్లు దాటిన వారిని తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. అసలేం జరిగిందంటే... నాగార్జునసాగర సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో కాల్వలు తవ్వే సమయంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట్ల కొందరు పనులు చేశారు. ఆ తర్వాత తమను ఎన్‌ఎంఆర్‌లుగా కొనసాగించాలని కోరుతూ వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో వారి వయసును కూడా పొందపరుస్తూ కోర్టుకు జాబితా సమర్పించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు వారిని ఎన్‌ఎంఆర్‌లను కొనసాగించాలంటూ 1987 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 600 మంది ఎన్‌ఎంఆర్‌లుగా పనులు చేస్తూ నెలకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు వేతనం పొందుతున్నారు. కాగా, వీరిలో కొందరు తమను రెగ్యులర్ చేయాలని మళ్లీ కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వ ప్రమేయం లేకుండానే అధికారులను పట్టుకొని రెగ్యులర్ చేయించున్నారు. సమాచార హక్కు చట్టంతో విషయం వెలుగులోకి... ఎన్ఎస్పీ ప్రాజెక్ట్ పరిధిలో వయసు మీరిన వారు ఎన్‌ఎంఆర్‌లుగా పని చేస్తున్నారని, వారిని తక్షణం తొలగించాలని, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని మిర్యాలగూడకు చెందిన ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. కోర్టుకు సమర్పించిన జాబితాలో పొందుపరిచిన వయసు వివరాలను మరుగున పెట్టిన పలువురు ఎన్‌ఎంఆర్‌లు.. రేషన్‌కార్డులు, ఓటర్ గుర్తింపు, ఆధార్ కార్డులలో నమోదైన వయస్సును చూపిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన జాబితాలో పేర్కొన్న వయస్సుకు, ఈ కార్డులలో ఉన్న వయస్సుకు నాలుగు, ఐదు సంవత్సరాల తేడా ఉంది. దీంతో మేల్కొన్న ఎన్ఎస్పీ ఉన్నతాధికారులు ఎన్‌ఎంఆర్‌లు కోర్టుకు సమర్పించిన వయసును పరిగణనలోకి తీసుకుని, దాని ఆధారంగా 60 ఏళ్లు పైబడిన వారిని ఇంటికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తప్పుడు పత్రాలతో ఇప్పటి వరకు వేతనాలు తీసుకున్న వారిపై పోలీసు కేసులు పెట్టి అదనంగా పొందిన వేతనాలు రికవరీ చేస్తారా.. లేక శాఖాపరమైన విచారణ చేసి ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుం టారా అనేది వేచి చూడాలి. కాగా, ఎన్ఎం ఆర్లలో వయసు మీరిన వారితో పాటు బినామీలు కూడా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారి పేరున ఇతరులు, ఒకరిపేరున మరొకరు కూడా విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపి 60 ఏళ్లు దాటినా నేటికీ విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఆర్‌లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలుంటాయని ఒక అధికారి చెప్పారు. వేతనాలు రికవరీ చేయడమా.. పోలీస్ కేసులు పెట్టడమా అనేది ఉన్నతాధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం మానిటరింగ్ పరిధిలో 30 మంది ఎన్‌ఎంఆర్‌లు ఉండగా, అందులో ముగ్గురు వయస్సు మీరిన వారు ఉన్నారని, వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. -
ఆయకట్టుకు వార‘బందీ’
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు వారబందీ ప్రధాన సమస్యగా మారింది. ఖరీఫ్‌లో వరుస తుపానులతో పంటలు దెబ్బతినగా.. దోమకాటు వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. కాగా రబీ సీజన్లో వరి పంటలకు సాగు నీటిని ఇస్తారని ఆశించిన రైతులకు వారబందీ అడ్డంకిగా మారింది. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు చేసిన ప్రకటన రైతులకు తలనొప్పిగా మారింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని 4.35 లక్షల హెక్టార్లకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రకటన చేసే నాటికి ఖరీఫ్‌లో వరి కోతలు పూర్తికాకపోవడంతో పాటు రబీనాట్లకు నార్లు సిద్ధంగా లేకపోవడంతో నాట్లు ప్రారంభం కాలేదు. ఈ నెల మొదటి వారంలో నాట్లు ప్రారం భం కావడంతో ఇప్పటి వరకు కేవలం 30 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా పూర్తిస్థాయిలో వరినాట్లు వేయడానికి మరో25 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా వారబందీ పద్ధతిలో సాగు నీటిని విడుదల చేస్తే రైతుల వరినాట్లు కష్టంగా మారే అవకాశం ఉంది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం వరి నాట్లు పెట్టేందుకే ఫిబ్రవరి 10వ తేదీ వరకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. రబీలో 50 టీఎంసీల నీరే నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రబీ సీజన్లో కేవలం 50 టీఎంసీల నీరే ఇస్తున్నట్లు ప్రకటించారు. 50 టీఎంసీల నీటితో నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలోని 4.35 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీటిని అందించనున్నారు. కానీ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోనే ఉన్న ఎత్తిపోతల పథకాలకు పరిగణనలోకి తీసుకోలేదు. ఎడమ కాలువ ఆయకట్టులో అంతర్భాగమైన 41 ఎత్తిపోతల పథకాల పరిధిలో 80వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రబీలో మరో 10టీఎంసీల నీటిని ఎడమ కాలువకు కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు ఎత్తిపోతల పథకాలను ఆయకట్టులో చూపకుండా తక్కువ నీటిని కేటాయించారు. ఫిబ్రవరి 10 వరకు నీళ్లివ్వాలని రైతుల ఆగ్రహం వారబందీ పేరుతో నీటిని నిలిపివేస్తే ఊరుకునేది లేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంబందీ షెడ్యూల్ ప్రకటించే సమయంలో రైతులతో చర్చించకుండానే నిర్ణయించారని ఫిబ్రవరి 10వ తేదీ వరకు నీటిని యధావిధిగా విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సాగు నీటి ఆయకట్టు అభివృద్ధి శిక్షణ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టులో వరినాట్లు పూర్తయ్యే వరకు వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని, ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. వరినాట్ల సమయంలో నీటిని నిలిపివేస్తే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
నిధుల ఎత్తిపోత
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన సహకార ఎత్తి పోతల పథకాలకు మహర్దశ పట్టనుంది. సాగర్ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆధునికీకరించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కృషితో కాలువ చివరి భూములకు సాగునీటిని అందించడానికి ప్రపంచబ్యాంకు ముందుకొచ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే 2008 సంవత్సరం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల కోసం రూ. 4444.41 కోట్లు వెచ్చించి చేస్తున్నారు. ఈ నిధులను ఎత్తిపోతలకు కూడా ఖర్చు చేయనున్నారు. దీనికోసం నీటి పారుదల అభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ప్రపంచ బ్యాంకు బృందం ఇటీవల ఎత్తిపోతల పథకాలను సందర్శించి సర్వే నిర్వహించింది. జిల్లాలోని 40 ఎత్తిపోతల పథకాల్లో ఎల్- 27 మినహా మిగతా 39 ఎత్తిపోతల పథకాలకు రూ.91.50 కోట్లు కేటాయించారు. అయితే రూ.100 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ రబీ సీజన్ పూర్తికాగానే పనులు మొదలుపెడతారు. మొత్తంగా 39 ఎత్తిపోతలను నాలుగు ప్యాకేజీలు విభజించారు. ఆ మేరకు నిధులు కూడా కేటాయించారు. ప్యాకేజీల వారీగానే టెండర్ల ప్రక్రియను చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల ఆయకట్టు అభివృద్ది సంస్థ (ఏపీఎస్ఐడీసీ) చర్యలు తీసుకుంటోంది. తొలగనున్న రైతుల కష్టాలు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 40 ఎత్తిపోతల పథకాల కింద స్థీరికరించిన ఆయకట్టు 68,364 ఎకరాలు. కాగా ఆధునికీకరణలో భాగంగా పనులు చేపడితే కాలువ చివరి భూములకు కూడా సాగునీరందే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 75 శాతం ఎత్తిపోతల పథకాల కింద సాగుభూమి బీడుగా మారింది. మిర్యాలగూడ నియో జకవర్గంలో 40శాతం కాలువ చివరి భూములకు నీరందడం లేదు. మిగతా ఎత్తిపోతల పథకాల్లోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. ఆధునికీకరణ పనులు పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందుతుంది. దీంతో కాలువ చివరి భూముల రైతుల కష్టాలు తీరనున్నాయి. పనులు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మూడో ప్యాకేజీ మిర్యాలగూడ నియోజకవర్గం లోని 8 ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనికి రూ.18.30 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు కూడా మార్చి నెలాఖరు వరకు పూర్తి కానున్నాయి. కాగా ఏప్రిల్ మొదటి వారంలో పనులు మొదలవుతాయి. నాలుగో ప్యాకేజీ మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాలలోని ఆరు ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనికి రూ.33 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. మొదటిప్యాకేజీ హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలోని 10 ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉండగా, రూ.19.50 కోట్లు కేటాయించారు. పనులు కూడా కొన్నిచోట్ల మొదలయ్యాయి. రెండవ ప్యాకేజీ నాగార్జునసాగర్ నియోజక వర్గంలోని 15 ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనికి రూ.20.70 కోట్లు కేటాయించారు. టెం డర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. -
రబీపైనే కోటి ఆశలు
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: వరుస ఆటుపోట్లతో కుదేలైన అన్నదాతలు రబీసాగుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2011 నుంచి గత ఖరీఫ్ వరకు కరువు, ప్రకృతి ఆగ్రహానికి గురై అన్నదాతలు అప్పులు మిగుల్చుకున్నారు. గత ఖరీఫ్‌లో మిగిలిన కొద్దిపాటి వరి పంటలకు కోతలు దాదాపుగా పూర్తి కావడంతో రబీసాగులో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరినాట్లు కూడా మొదలయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కుంటలు, రిజర్వాయర్లు పూర్తిగానిండడంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. అదే విధంగా రబీలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఎడమకాల్వకు నీటిని విడుదల చేయడం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు కూడా నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తుం డడంతో సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పరిధిలో కూడా సాగునీటిని విడుదల చేయడంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు పొలాలను దున్నుకోవడంతో పాటు వరినార్లును పెద్దఎత్తున పోసుకున్నారు. ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాలలో వరినార్లు పోశా రు. వరి, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మినుములు తదితర పంటలను సాగు చేయడానికి అన్నదాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రబీలోనైనా కాలం కలిసి వచ్చి చేసిన అప్పులు తీరిపోనున్నాయని కోటి ఆశలతో ఉన్నారు. వరిపైనే గురి.. సమృద్ధిగా భూగర్భ జలాలు పెరగడం, ఆయకట్టుకు నీటి విడుదల చేస్తుండడంతో వరిసాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 84 వేల 448 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2లక్షల 85 వేల హెక్టార్లలో సాగు కానున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందులో కేవలం వరి సాధారణ సాగు లక్షా 48 వేల 936 హెక్టార్లు కాగా మరో లక్ష హెకార్లు సాగు పెరిగి మొత్తం 2లక్షల 48 వేల 936 హెక్టార్లలో సాగు కానుండడంతో వ్యవసాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం.. జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో సబ్సిడీపై వరి విత్తనాలను అందించడానికి వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్‌లలో విత్తనాలను సబ్సిడీపై రైతులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో వరి ఎంటీయూ 1010 రకం విత్తనాలు 49 వేల క్వింటాళ్లు, వేరుశనగ కె-6రకం 10 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 382, జొన్న 95, మినుములు 1500, చిన్న శనగలు 600, పెసర 150, నువ్వులు 30, పొద్దుతిరుగుడు 30 క్వింటాళ్ల చొప్పున సబ్సిడీపై రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేశారు. అదే విధంగా రబీలో ఎరువుల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. సాధారణ సాగు కంటే మరో లక్ష హెక్టార్లలో సాగు పెరిగే అవకాశం ఉన్నందున దానికి అవసరమైన ఎరువులు దిగుమతి చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి : బి.నర్సింహారావు, జేడీఏ రబీలో రైతులు ఆరుతడి పంటలపై దృష్టిసారించి సాగు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితులలో వరి సాగు చేసుకోవాల్సి వస్తే శ్రీవరి పద్ధతిలో సాగు చేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలి. రబీలో సాగు విస్తీర్ణంగా పెరిగే అవకాశం ఉన్నందున దానికి అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశాం. ఇప్పటికే సబ్సిడీపై వరి, వేరుశనగ విత్తనాలను అందిస్తున్నాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్య లు తీసుకున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సల హాలు పాటించి దిగుబడులను సాధించాలి. -
నేడు సాగర్ కాల్వలకు నీటి విడుదల
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వకింద రబీ సాగుకు నేటినుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి తెలిపారు. నీటి విడుదలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా కుడి, ఎడమ కాల్వలకు, కృష్ణా డెల్టాకు 50 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించినట్టు చెప్పారు. ఈ రబీలో కుడి, ఎడమ కాల్వలు, డెల్టా కింద సుమారు 15.67లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఇందులో ఎడమ కాల్వ కింద 4లక్షల 31వేల 300 ఎకరాలని తెలిపారు. ఆ నీటిని ఐదు విడతలుగా విభజించి స్థానిక ఎన్ఎస్పీ అధికారులు ప్రణాళికాబద్ధంగా మేజర్ కాల్వలకు విడుదల చేస్తారన్నారు. తొలి విడతగా ఈ నెల 20వ తేదీన, 22న రెండో విడత, ఫిబ్రవరి 10న మూడో విడత, మార్చి ఒకటిన నాల్గోవిడత, మార్చి20న ఐదో దఫాగా సాగునీరు విడుదల చేస్తామని వివరించారు. మార్చి 31వ తేదీ తర్వాత నీరు విడుదల చేయడం సాధ్యపడదని తెలిపారు. ఈ లోపు రైతులు పంటలు సాగుచేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 567.60అడుగుల నీరుంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 8580 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా రాగా, 20,200 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అందులో కుడికాల్వ ద్వారా 8875 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5000 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, శ్రీశైలం రివర్స్ పంపింగ్ ద్వారా 5,125 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. -
కృష్ణ కృష్ణా.. హరే.. హరీ
జంటనగరాలకు తాగునీరందించేందుకు రూ.1670కోట్ల అంచనా వ్యయంతో రెండు నెలల క్రితం కృష్ణాజలాల పంపిణీ పథకం ఫేజ్ త్రీ పనులు ప్రారంభమయ్యాయి. కొదండాపూర్ వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి సాహెబ్‌నగర్ ప్లాంట్ వరకు 116 కిలోమీటర్ల మేర చేపట్టే పైప్‌లైన్ పనులను పది ప్యాకేజీలుగా విభజించారు. అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్న పలు కంపెనీలు రెండు నెలలుగా పనులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వయా ఏఎంఆర్పీ(ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) ద్వారా కృష్ణాజలాలను జంటనగరాలకు అందించే పథకంలో భాగంగా ఇప్పటికే రెండు ఫేజ్ పనులు పూర్తికాగా, థర్డ్ ఫేజ్ పనులు రెండు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే మొదటి, రెండు విడతల్లో చేపట్టిన పనుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. కానీ థర్డ్ ఫేజ్ పనుల్లో మా త్రం ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉ న్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడగా, సుమారు 50 మంది క్షతగాత్రులయ్యా రు. మూడు నెలల క్రితం చింతపల్లి రాజ్యాతండా వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డ తర్వాత ఈ ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. హైవేకు ఇరువైపులా పైప్‌లైన్ పనులు సాగుతుండడం తో కంపెనీలు పైపులను రోడ్డుకు ఇరువైపులా ముందుగానే తీసుకువచ్చి వేయడం.. మరోవైపు పైప్‌లైన్ పనులు కొనసాగిస్తుండడంతో హైవే కాస్తా సింగిల్ రోడ్డుగా మారింది. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేపై ప్రతిరోజూ కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగి స్తుంటాయి. అయితే పైపులను రోడ్డుకు ఇరువైపులా వేయడం, పైపులను అమర్చడం కోసం తీసిన మట్టిని రోడ్డుకు ఒక వైపునకు వేయడం, పెద్ద పెద్ద మెషీన్లు, క్రేన్ల ద్వారా హైవేపై పనులు చేపడుతుండడంతో రహదారి పూర్తిస్థాయిలో కుంచించుకుపోయింది. రాత్రి వేళ ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. వాహన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. -
రచ్చబండతో సత్వరమే సమస్యల పరిష్కారం
త్రిపురారం/నిడమనూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి, సమస్యలను సత్వరం పరిష్కరించడమే రచ్చబండ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. త్రిపురారం, నిడమనూరులో గురువారం నిర్వహించిన మూడో విడత రచ్చబండలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో ఇళ్లు, పింఛన్లు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందేవని, కాంగ్రెస్ హయాంలో పార్టీ రహితంగా అర్హులకు అందుతున్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. వలసలను నివారించేందుకు రూ.5వేల కోట్లను ఖర్చు చేసి కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ బిల్లు వస్తుందని, జనవరి నాటికి తెలంగాణ ఏర్పడడం ఖాయమన్నారు. మూడు ప్రాంతాలకు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు గాజులు తొడుక్కోలేదని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు వివిధ పథకాల ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కలెక్టర్ చిరంజీవులు, జెడ్పీ సీఈఓ వెంకట్రావ్, డ్వామా పీడీ కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామలింగయ్య యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, త్రిపురారం మండల ప్రత్యేక అధికారి సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్ రవిశంకర్, పీఆర్ ఏఈ హర్షా, ధన్సింగ్ నాయక్, మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, సర్పంచ్ ఆలంపల్లి రమణజానయ్య, సొసైటీ చైర్మన్లు అనుముల నర్సిరెడ్డి, బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌రెడ్డి, నరేందర్, గోపగాని శ్రీనివాస్, అనుముల నర్సింహారెడ్డి, రాంచందర్ నాయక్, దామోదర్, ఏపీఓ యాట వెంకటేశ్వర్లు, ఏపీఎం నాగేందర్ పాల్గొన్నారు. -
‘టెయిల్‌పాండ్’ పనులకు ఆటంకం
అడవిదేవులల్లి(దామరచర్ల), న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో మండలంలోని అడవిదేవులపల్లి గ్రామశివారులో చేపట్టిన టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. డ్యాంపై నుంచి సుమారు 10ఫీట్ల ఎత్తులో వరద పోటెత్తడంతో చేపట్టిన పనులన్నీ దెబ్బతిన్నాయి. నాగార్జునసాగర్ డ్యాంకు దిగువన 21 కిలోమీటర్ల దూరంలో మండలంలోని అడవిదేవులపల్లి గ్రామ శివారులో రూ.474 కోట్ల తో టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను 2006లో చేపట్టారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా వంతెన నిరించాల్సి ఉంది. 20 పిల్లర్లు, 21 గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు 2009లో పూర్తికావాలి. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంత మేర పనిచేశాడు. నిధులు సరిపోవడంలేదని వీటిని పెంచితేనే కొనసాగిస్తామని 2012 అక్టోబర్‌లో పనులు నిలిపివేశాడు. రూ.700కోట్లు కేటాయిస్తేనే పనులు చేపడతామన్నాడు. దీంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ చేసిన ప్రతిపాదనకు జెన్కో అధికారులు అంగీకరించడంతో 2013 మేలో తిరిగి పను లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 21క్రస్ట్‌గేట్లకు గాను 8 గేట్లు పూర్తయ్యాయి. 20 పిల్లర్ల పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టుపై వంతెన పనులు కొనసాగుతున్నాయి. 50మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కూలిన కాపర్ డ్యాం నైరుతి రుతుపవనాల వల్ల కురిసిన వర్షాల కారణంగా నాగార్జునసాగర్ డ్యాం నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 1న టెయిల్‌పాండ్ ప్రాజెక్టు వరద తాకిడికి గురికావడంతో పనులకు ఆటం కలిగింది. అలాగే ఇటీవల తుపాను వల్ల కురిసిన వర్షంకారణంగా కూడా భారీ వరదలు వచ్చాయి. డ్యాంపై నుంచి సుమారు 8ఫీట్ల ఎత్తులో నీరు ప్రవహించింది. అయితే సుమారు 100 రోజుల నుంచి పనులు నిలిచిపోయాయి. అయితే కృష్ణానదిలోని నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన కాపర్‌డ్యాం ఎగువ, దిగువ భాగాల్లో కొంత కూలిపోయింది. అలాగే డ్యాం దిగువన వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరదల వల్ల కొట్టుకుపోయింది. భారీ క్రేన్ వరదల తాకిడికి ధ్వంసమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కొట్టుకుపోయింది. ఇదిలా ఉండగా వరద తాకిడికి గురై కూలిపోయిన కాపర్‌డ్యాం పనులు, ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వారం రోజుల్లో ప్రాజెక్టు పనులు పునఃప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఏడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం - పీడీవీఎల్ కుమార్, ప్రాజెక్టు ఎస్ఈ డ్యాం నిర్మాణ పనులను 2014 జూలై 31నాటికి పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ పీడీవీఎల్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. 21 క్రస్ట్‌గేట్లలో 8 గేట్లు పూర్తికాగా 13గేట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టుపై వంతెన నిర్మాణ పనుల వేగవంతంగా చేపడతామన్నారు. వంతెనపై 20 వెంట్లలో 12 వెంట్లు పూర్తయినట్లు చెప్పారు. -
సాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు
పైలాన్‌కాలనీ(నాగార్జున సాగర్), న్యూస్‌లైన్: అన్నదాతల ఆశల సౌధమైన నాగార్జునసాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు పొంచి ఉంది. కాల్షియం నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన ఎన్ఎస్పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో డ్యామ్ గోడల రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతోంది. భవిష్యత్‌లో ఇది డ్యామ్ భద్రతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. కాల్షియం తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు.. సాగర్ డ్యామ్ గోడల్లోకి వచ్చే ఊటనీటిని తొలగించడానికి అంతర్భాగంలో 250కి పైగా రంధ్రాలను ఏర్పాటు చేశారు. ఊట నీరును ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల డ్యామ్ గోడల్లో కాల్షియం పేరుకుపోకుండా నివారించడానికి వీలుంటుంది. ఈ రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతే ఊట నీరు రంధ్రాల్లోకి కాకుండా డ్యాం గోడల్లోకి వెళ్తుంది. నీటితోపాటు కాల్షియం కూడా గోడల్లోకి వెళ్తే పగుళ్లుపడే ప్రమాదం ఉంది. చివరికి డ్యామ్ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాల్సి ఉంది. 15సంవత్సరాల క్రితం ఒకసారి మాత్రమే కాల్షియాన్ని తొలగించారు. మళ్లీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అవకతవకలే.... డ్యామ్ రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియం తొలగించేందుకు 15 సంవత్సరాల క్రితం ఎన్ఎస్పీ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆయన నాసిరకం పరికరాలతో డ్రిల్లింగ్ చేయగా కాల్షియంతో పాటు డ్యాం లోపలి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. స్పందించిన ముఖ్యమంత్రి కాల్షియం తొలగింపులో జరిగిన అవకతవకలపై విచారణకు సుబ్బరాంరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు. కోర్ శాంపిల్ తీయకుండానే అధికారులు డ్రిల్లింగ్ చేయడం వల్ల రంధ్రాల్లో ఎంత కాల్షియం పేరుకుపోయిందో కూడా అధికారులకు అర్ధం కాలేదు. కాల్షియం తొలగింపులో అవకతవకలు జరిగినట్టు సుబ్బరాంరెడ్డి విచారణలో వెల్లడికావడంతో ఎన్ఎస్పీ అధికారులకు మెమోలు కూడా జారీ అయ్యాయి. త్వరలోనే పనులు - సుదర్శన్‌రావు, డీఈ, నాగార్జునసాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ గోడల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది పదిహేను రోజుల్లో కాల్షియం తొలగించే పనులు చేపడుతాం. -
క్వార్టర్ల ఖాళీకి ముహూర్తం ఎప్పుడో?
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) క్వార్టర్స్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిచండానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. క్వార్టర్స్ ఖాళీ చేయాలని వాటిలో నివాసం ఉంటున్న వారికి గత నెలలో ఎన్ఎస్పీ అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఖాళీ చేయించడానికి అధికారులకు మాత్రం ముహూర్తం కుదరడం లేదు. కొందరు ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో అక్రమంగా నివాసం ఉంటున్నారని, అద్దె కూడా చెల్లించనందున వారిని ఖాళీ చేయించాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, బీజేపీ నాయకులు వనం మదన్మోహన్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ నాయకులు రతన్‌సింగ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో 2013 జూలై 9 ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 30 లోగా క్వార్టర్స్ ఆక్రమించుకున్నవారు ఖాళీ చేయాలని హైకోర్టు పేర్కొంది. అదేవిధంగా 2013 జూన్ 10వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ప్రకారం క్వార్టర్స్ ఆక్రమించుకున్న వారు అద్దె బకాయిలు అక్టోబర్ 30వ తేదీలోగా చెల్లించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్ఎస్పీ అధికారులు మొదటి విడతగా 31 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకోని వారి ఇళ్లకు సైతం అంటించారు. ఖాళీ చేయకుంటే రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహకారంతో క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకోనున్నట్లు నోటీసులలో కూడా పేర్కొన్నారు. అయినా కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేసే గడువు ముగిసింది. పోలీసుల సహకారం కోరిన అధికారులు ఎన్ఎస్పీ క్వార్టర్స్ అక్రమించుకొని నివాసం ఉంటున్న వారిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయించడానికి గాను ఎన్ఎస్పీ అధికారులు పోలీసుల సహకారం కోరారు. గురువారం ఆరు ఎన్ఎస్పీ క్వార్టర్స్‌ను ఖాళీ చేయించడానికి వెళ్లిన అధికారులు ఖాళీ చేయించకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్‌కు వద్ద వెళ్లి సహకారం కోరినట్లు తెలిసింది. కాగా డివిజన్లో ఉన్న పోలీసులు వివిధ పనుల నిమిత్తం డ్యూటీలలో ఉన్నందున అదనపు పోలీసులు వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలిసింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్వార్టర్స్ ఖాళీ చేయించడానికి ఎన్ఎస్పీ అధికారులు వేచి చూస్తున్నారు. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ ఎన్ఎస్పీ క్వార్టర్స్ ఆక్రమణ వివాదం మరోవైపు విజిలెన్స్ విచారణలో కూడా ఉంది. ఉపలోకాయుక్త కృష్ణాజీరావు క్వార్టర్స్ అక్రమణ విషయాన్ని విజిలెన్స్‌ను అప్పగించారు. దీంతో విజిలెన్స్ అధికారులు మొత్తం క్వార్టర్స్‌లో అధికారులు ఎంతమంది ఉంటున్నారు. ఇతరులు ఎంతమంది ఉంటున్నారు. ఎన్ని క్వార్టర్స్ ఆక్రమణకు గురయ్యాయనే విషయం విచారణ చేయనున్నారు. కాగా పూర్తి సమాచారాన్ని నవంబర్ 5వ తేదీ లోగా విజిలెన్స్ అధికారులు లోకాయుక్తకు పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. రెండు రోజుల్లో ఖాళీ చేయిస్తాం అక్రమంగా క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్న వారికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసులు సైతం ఇచ్చాము. గడువు ముగిసినందున మరో రెండు రోజుల్లో పోలీసుల సహకారంతో ఖాళీ చేస్తాము. ఖాళీ చేయించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నందున వారి సహకారం కావాలని కోరాం. -గోపాల్, ఎన్ఎస్పీ ఈఈ, మిర్యాలగూడ -
అందని వేతనాలు
హుజూర్నగర్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో ఏపీఎన్జీఓలు చేస్తున్న సమైక్య ఉద్యమం ఫలితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఎస్పీ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గడచిన నెల వేతనం రాలేదు. ఇక.. ఈ నెల కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో 120మంది ఉద్యోగులు ఆందోళన చెందు తున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని జగ్గయ్యపేట డివిజన్ కింద హుజూర్నగర్, కోదాడ, నందిగామ, జగ్గయ్యపేట సబ్డివిజన్లు ఉన్నాయి. హుజూర్నగర్, కోదాడ సబ్డివిజన్లు తెలంగాణ ప్రాంతానికి చెందినవి కావడం అలాగే జగ్గయ్యపేట, నందిగామలు ఆంధ్రాప్రాంతం పరిధిలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం హుజూర్నగర్, కోదాడ సబ్డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన చెల్లింపులు ఆంధ్రాప్రాంతమైన జగ్గయ్యపేట డివిజన్ నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు. ఈ రెండు సబ్డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న సుమారు 120 మంది ఉద్యోగులకు ఆగస్టు వేతనం అందలేదు. కనీసం సెప్టెంబర్ నెల వేతనమైనా అందుతుందో లేదోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే వేతనాలు అందే పరిస్థితి కనపడడం లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు డివిజన్ల పరిధిలోని ఎన్ఎస్పీ ఉద్యోగులైన లస్కర్లు, ఎన్‌ఎంఆర్‌లు, అటెండర్లు, ఇంజనీర్లకు ప్రతినెలా సుమారు రూ.15 లక్షలు వేతనాల కింద అందజేస్తున్నారు. దసరా, బక్రీద్ వంటి పర్వదినాల్లో కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విధులకు హాజరవుతున్నా వేతనాలు అందకపోవడంతో కుటుం బాలు గడవడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యంగా లస్కర్లు, ఇంజనీర్లు రోజూ ఎన్ఎస్పీ కాలువలపై పర్యవేక్షణ చేసేందుకు విధి నిర్వహణలో భాగంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి ఉంటున్నందున కనీసం పెట్రోల్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వేతనాలు అందజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
నీరు పుష్కలం.. వదిలింది నామమాత్రం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : శ్రీశైలం జలాశయం పొంగిపొర్లుతున్నా... జీడిపల్లి రిజర్వాయర్ మాత్రం నోరెళ్లబెడుతోంది. హంద్రీ-నీవాకు అధికారికంగా కేటాయించిన మిగులు జలాలను విడుదల చేయడంలోనూ కిరణ్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. హంద్రీ-నీవాకు రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. 350 క్యూసెక్కులు మాత్రమే కాలువల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఫలితంగా జీడిపల్లి రిజర్వాయర్ నిండటం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి రోజూ సగటున 1.2 లక్షల క్యూసెక్కుల జలాలు నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం పాలవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో సమృద్ధిగా జలాలు అందుబాటులో ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర విభజన జరిగాక కరువు పరిస్థితులు ఉత్పన్నమైతే హంద్రీ-నీవాకు చుక్క నీరు కూడా విడుదల చేసే అవకాశాలు ఉండవని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టీకరిస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల మిగులు జలాలను కేటాయించారు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరినప్పటి నుంచి 120 రోజుల్లోగా హంద్రీ-నీవాకు కేటాయించిన జలాలు విడుదల చేయాలని అప్పట్లోనే నిర్దేశించారు. ఆ ఆదేశాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం జూలై 9 నాటికే 854 అడుగులకు చేరుకుంది. హంద్రీ-నీవాకు కేటాయించిన జలాలను అదే రోజు నుంచి విడుదల చేయాల్సివుంది. అయితే... సరిగ్గా నెల రోజుల తర్వాత ఆగస్టు 7న కేవలం 700 క్యూసెక్కుల నీటిని కాలువల్లోకి ఎత్తిపోశారు. వారం రోజుల క్రితం నీటి విడుదలను సగానికి తగ్గించారు. ప్రస్తుతం రోజుకు 350 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం 2,03,178 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా(ఇన్‌ఫ్లో).. 2,16,675 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల(అవుట్‌ఫ్లో) చేశారు. అయితే... హంద్రీ-నీవాకు మాత్రం 350 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఆదివారం నాటికి జీడిపల్లి రిజర్వాయర్‌లోకి 0.51 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఈ రిజర్వాయర్ నిండాలంటే మరో 1.184 టీఎంసీలు చేరాలి. ప్రస్తుత తరహాలోనే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తే జీడిపల్లి రిజర్వాయర్ నిండడానికి మరో 54 రోజులు పడుతుంది. అప్పటికి శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా తగ్గతుంది. వరద నీరు ఆగిపోతే హంద్రీ-నీవాకు నీటిని విడుదలను ఆపేస్తారు. అప్పుడు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరే అవకాశం ఉండదు. వరద నీరు శ్రీశైలం డ్యాంలోకి భారీగా చేరే సమయంలోనే హంద్రీ-నీవాకు పూర్తి సామర్థ్యం మేరకు విడుదల చేసివుంటే.. కేవలం మూడు రోజుల్లోనే జీడిపల్లి రిజర్వాయర్ నిండేది. పూర్తి సామర్థ్యం మేరకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇప్పుడే ఇలా వుంటే, రాష్ట్ర విభజన జరిగి.. జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చుక్క నీటిని కూడా హంద్రీ-నీవాకు విడుదల చేసే అవకాశాలే ఉండవని నీటిపారుదలశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది హంద్రీ-నీవా ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. -
వలస బతుకుల్లో కుదుపు
చింతపల్లి/కొండమల్లేపల్లి(నల్లగొండ)/ వంగూరు/అమ్రాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై గురువారం రాత్రి నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలోని రాజ్యతండా వద జరిగిన రోడ్డు ప్రమాదం పాలమూరు జిల్లాలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో వంగూరు మండలం డిండి చింత పల్లికి చెందిన కొమ్మెర వెంకటయ్య (40), ఉప్పాల వెంకటమ్మ(35), అమ్రాబాద్ మండలం పదరకు చెందిన వేముల నాగులు(29), గుంజ మల్లయ్య(59), వేముల మల్లయ్య(48) ఉప్పునుంత ల మండలం పెనిమిల్లకు చెందిన ఎల్లస్వామి (27) ఉన్నారు. కాగా ఉప్పాల వెంకటయ్య, రమేశ్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన కూలీలు హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు గురువారం దేవరకొండ మండలం తెలుగుపల్లిలో తెలిసిన వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తుఫాన్ వాహనంలో హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. చింతపల్లి మండలం వెంకటంపేట సమీపంలో రాజ్యాతండా మూలమలుపులో ఎదురుగా వస్తున్న టాటాఏస్ అతివేగంగా వీరు ప్రయాణిస్తున్న జీపును ఢీకొంది. అదే సమయంలో టాటాఏస్ వెనుక వస్తున్న మరో లారీ ఈ రెండు వాహనాలను ఢీ కొనడంతో టాటాఏస్, తుఫాన్ వాహనాల్లో ఉన్న 12 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 16మంది తీవ్రం గా గాయపడ్డారు. వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అతివేగమే ప్రాణం తీసిందా? హైదరాబాద్ తిరిగివస్తున్న వారు దారిలో కొండమల్లేపల్లి వద్ద కొద్ది సేపు ఆగి మద్యం సేవించడమేగాక తమతో పాటు డ్రైవర్‌కు కూడా తాగించారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని పోలీసులు పోలీసులు పేర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు వారు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యేలు... దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల బంధువులను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు శుక్రవారం పరామర్శించారు. మృతదేహాలను స్వగ్రామాలకు పంపించేందుకు పోలీసులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. తక్షణమే పోస్టుమార్టం నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. -
రక్షకులా... భక్షకులా..?
హాలియా, న్యూస్‌లైన్: సాధారణ పౌరుడైనా ఇతరుల వద్ద డబ్బులు బలవంతంగా లాక్కుంటే అది తప్పు, చట్టరీత్యా నేరం. కానీ అదే పోలీసులు ఇసుక లారీ డ్రైవర్ల వద్ద బలవంతంగా డబ్బు లు లాక్కుంటే అదే న్యాయం. ఇదీ అనుముల మండలంలో జరుగుతున్న తంతు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచే చేను మేస్తోం ది. ఇసుక అక్రమ రవాణాను అటికట్టాల్సిన పోలీసులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయంలో ఇసుక లారీల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఇసుక డంపుల వద్ద లారీలను పట్టుకోవడంతో పాటు మండల సరిహద్దులో ఇసుక లారీలను ఆపి భా రీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఈ నె ల 27న మండలంలోని పులిమామిడి స్టేజీ సమీపంలో 11 లారీలను పట్టుకుని రూ.90 వేల ను, ఇసుక వ్యాపారం చేస్తున్న మరో ప్రైవేట్ ఉపాధ్యాయుడి వద్ద రూ.10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీస్బాసులకు పట్టకపోవడం గమనార్హం. జోరుగా ఇసుక రవాణా మండలంలో వాగు 30 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. పులిమామిడి మొదలు రాజవరం వరకు మారేపల్లి, అన్నారం, బంటోరిగూడెం, రామడుగు, చింతగూడెం, కుపాసిపల్లి, పా లెం, ఇబ్రహీంపేట, అనుముల, హాలియా, పేరూరు, చల్మారెడ్డిగూడెం మీదుగా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులో లక్షల టన్నుల ఇసుక ఉంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, పక్కనే పులిచింతల ప్రాజెక్టు నిర్మిస్తుండడం, సాగర్ కాల్వల ఆధునికీకరణ పుణ్యమా అని ఇసుకకు గిరాకీ పెరిగింది. దీంతో నాయకులు, వ్యాపారులు, దళారుల కళ్లు ఇసుకపై పడింది. దీంతో ఆయా వర్గాల వారు హాలియా వాగు వెంట ఉన్న గ్రామాల్లో గద్దల్లా వాలిపోతున్నారు. హాలియా వాగు వెంట ఉన్న పోలాల యజమానులతో పాటు రెవెన్యూ అధికారులకు ఆమ్యామ్యాల ఆశజూపి నయానో, భయాన్నో లొంగతీసుకుని జోరుగా ఇసుకవ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల లారీల్లో ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు రవాణా చేయడంతో హాలియా వాగు సగం లూటీ అయ్యింది. సుమారు రూ.100 కోట్ల ఇసుక తరలిపోయింది. వారిని కాదని.. బాధ్యతలు వీరికిస్తే.. ఇసుక రవాణా నియంత్రించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలను పోలీసులకు అప్పగించింది. అయితే ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌రావు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.హాలియా వాగు నుంచి ఇసు క అక్రమ రవాణా నియంత్రించేందుకు పులి మామిడి, పెద్దగూడెం గ్రామాల సమీపంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీస్ సిబ్బందే ఇసుక వ్యాపారులతో బేరసారాలకు దిగడం గమనా ర్హం. ఇసుక లారీ దొరికితే హోంగార్డు స్థాయిలో రూ.500, కానిస్టేబుల్ రూ.1000 నుంచి రూ.5000 వేలు, ఆపైస్థాయి వారైతే రూ.5000 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లకు అడ్డా పెద్దవూర ‘వై’ జంక్షన్ పెద్దవూర ‘వై’ జంక్షన్ కూడా అక్రమ వసూళ్లకు అడ్డగా మారింది. హాలియా నుంచి ఇసుక లారీలు పెద్దవూర మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడి ‘వై’ జంక్షన్ వద్ద పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 10 రోజుల క్రితం ఈ జంక్షన్ వద్ద పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఒకరు దళితనాయకుడు, ఆయన అనుచరుడి సహాయంతో రూ.50 వేలు వ సూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలా చేస్తే చర్యలు తప్పవు : సీఐ ఆనంద్‌రెడ్డి, హాలియా మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేం దుకు తగు చర్యలు తీసుకుంటున్నామని హాలి యా సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు ఇసుక మాఫియాకు సహకరించిన దాఖలాలు లేవన్నారు. అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పులిచింతల వద్ద తగ్గిన వరద ఉధృతి
మేళ్లచెరువు, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి దిగువ కృష్ణా నదిలోకి నీటి విడుదల నిలిపివేయడంతో పులిచింతల ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్ట్ క్రస్ట్ లెవల్ పైనుంచి 5 అడుగుల ఎత్తులో వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ 14 క్రస్ట్‌గేట్లను ఎత్తి దాదాపు 30 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు వదులుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి ప్లాంటు కూడా వరద నీటిలో మునిగే ఉంది. ఎగువ కృష్ణా నది నుంచి వరద నీరు నెమ్మదిగా వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ వద్ద నీరు ప్రశాంతంగా పారుతోంది. ప్రాజెక్ట్‌పైన బ్రిడ్జి, గేట్ల పైభాగంలో సివిల్, మెకానికల్ పనులు కొనసాగుతున్నాయి. అడ్లూరును వదలిన వరద నీరు అడ్లూరు గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు వెనక్కు తగ్గింది. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు 4 అడుగుల ఎత్తులో ప్రవహించిన కృష్ణమ్మ వెనక్కు తగ్గింది. దీంతో గ్రామంలోకి రాకపోకలకు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా అడ్లూరు, చింత్రియాల, కిష్టాపురం, వెల్లటూరు శివారులోని పొలాల్లోకి చేరిన నీరు కూడా తగ్గడంతో రైతులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కృష్ణానది వల్ల ప్రమాదం తప్పిపోయినట్లేనని ముంపు గ్రామస్తులు పేర్కొంటున్నారు.