శ్రీశైలం జలాశయంలో 871 అడుగులకు చేరిన నీటిమట్టం | 871 feet of water to reach the Srisailam reservoir | Sakshi
Sakshi News home page

శ్రీశైలం జలాశయంలో 871 అడుగులకు చేరిన నీటిమట్టం

Published Thu, Aug 7 2014 1:06 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM

871 feet of water to reach the Srisailam reservoir

శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం బుధవారం నాటికి 871 అడుగులకు చేరింది. జలాశయానికి కృష్ణ (జూరాల), తుంగభద్ర ( రోజా గేజింగ్ పాయింట్) నదుల నుంచి 2,92,167 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పటికే జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 146.2606 టీఎంసీలకు చేరింది.
 
  ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 871.10 అడుగులుగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 21.91 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం జలాశయం నుంచి 44,048 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండు జలవిద్యుత్ కేంద్రాలలో 13 జనరేటర్లతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు.
 
 తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం
 
 ఈ ఏడాది                                                     
 నీటిమట్టం : 1629.96 అడుగులు                    
 ఇన్‌ఫ్లో      : +109719 క్యూసెక్కులు                   
 ఔట్‌ఫ్లో     : 136909 క్యూసెక్కులు                    
 నీటి నిల్వ   : 89.575 టీఎంసీలు                    
 
 గత ఏడాది                                                     
 నీటిమట్టం : 1631.59 అడుగులు                    
 ఇన్‌ఫ్లో      : +154367 క్యూసెక్కులు                   
 ఔట్‌ఫ్లో     : 165509 క్యూసెక్కులు                    
 నీటి నిల్వ   : 95.494 టీఎంసీలు     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement