మృతదేహాన్ని బయటకు తీస్తున్న స్థానికులు ఖమృల్లా (ఫైల్) , కారును బయటకు తీస్తున్న పోలీసులు
మిర్యాలగూడరూరల్ : బంధువుల ఇంట్లో నిర్వహించిన ఫంక్షన్ హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా కారు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన మిర్యాలగూడ మండలం ఐలాపురం సమీపంలో మంగళవారం రాత్రి జరి గింది. రూరల్ ఎస్‌ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కు చెందిన మామఅల్లుడు ఎండీ.ఖమృల్లా (57), షాబ్‌నగర్‌కు చెందిన షేక్ .రఫీ కలిసి ఇండికా కారులో మంగళవారం సాయంత్రం మాడ్గులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో నిర్వహిస్తున్న ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి రాత్రి 10:30 గంటలకు కారులో మిర్యాలగూడకు వస్తుండగా ఐలాపురం గ్రామ శివారులో ఎడమ కాల్వ కట్టపై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి కాల్వ లోకి దూసుకెళ్లింది.
కాల్వలో నీరు వేగంగా ప్రవహిస్తుండడంతో కారు నీటిలో మునిగింది. డ్రైవింగ్ చేస్తున్న రఫీ తప్పించుకోగా, కారులో ఉన్న ఖమృల్లా కారుతో సహా నీటిలో మునిగిపోయాడు. రఫీ అతనిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. సంఘటన జరిగిన వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చినా రాత్రి వేళ కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి ప్రమాదం జరిగిన స్థలం నుంచి కారు సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి ఒడ్డుకు చేరిం ది. స్థానికులు, క్రేన్, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమిం చి కారును బయటకు తీశారు. కారులో ఉన్న మృతదేహాన్ని తొలుత వెలికి తీసి, అనంతరం కారును బయటకు తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఖమృల్లా జిల్లా కేంద్రం లోని కోఆపరేటివ్ ఆడిట్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసేవాడని తెలిపారు. మృతుడి కుమారుడు జహంగీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుచున్నట్లు తెలిపారు.
అండర్ పాస్‌లో నీరు ఉండడంతో ...
ఐలాపురం వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే క్రాసింగ్ తొలగించి ఇటీవల అండర్ పాస్ మార్గం ఏర్పాటు చేశారు. కాగా అండర్ ప్రాస్‌లో నీరు నిల్వ ఉండడంతో అందులో నుంచి కారు వెళ్తే కారు సైలెన్సర్‌లోకి నీరు వెళ్తుందనే ఉద్దేశంతో అండర్ పాస్ పక్కన గల కాల్వ కట్టపైనుంచి వెళ్లడం వల్లే కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అండర్ ప్రాస్‌లో నీరు ఉండడం వల్ల ఐలాపురం, రెడ్డిల్యాబ్ ఉద్యోగులు నిత్యం ఈ మార్గం నుంచే వెళ్తుంటారు. తరచు ఇక్కడ ప్రమాదాలు సంభవి స్తాయని, ఇప్పటికే 4 బైకులు కాలువలో పడి పో యాయని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment