ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారిలో దడపుడుతోంది. అనుమతిలే కుండా నివాసం ఉండడంతో పాటు అద్దెబకాయిలు ఉన్నవారిని క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు కంకణం కట్టుకున్నాడు. ఇందులోభాగంగా దశలవారీగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఎప్పుడు ఖాళీ చేయాల్సివస్తుందోనని క్వార్టర్స్‌లో ఉన్నవారికి కంటిమీద కునుకులేకుండా ఉంది.
- న్యూస్‌లైన్, మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌పీ) ఉద్యోగుల కోసం 388 క్వార్టర్స్ నిర్మించారు. అయితే ఇందులో కొన్ని క్వార్టర్‌సలో కొందరు ఎలాంటి అనుమతిలేకుండా అద్దెలు చెల్లించకుండా ఉంటున్నారు. ఇలాంటివారిపై గతం లో టీడీపీ నాయకులు రతన్‌సింగ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా కేసు నంబర్ 243/2009 నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న లోకాయుక్త 2011 జూలై నుంచి డిసెంబర్ వరకు మూడు పర్యాయాలు విచారణ జరిపి నలుగురితో కూడిన కమిటీని నియమించింది.
2011 డిసెంబర్‌లో ఈ కమిటీ వారం రోజుల పాటు పరిశీలించి మిర్యాలగూడలోని క్వార్టర్స్‌పై ఉపలోకాయుక్తకు నివేదిక అందజేసింది. కాగా ఉపలోకాయుక్త కృష్ణాజీరావు 2012 సెప్టెంబర్ 1వ తేదీన మిర్యాలగూడకు వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎన్‌ఎస్‌పీ సీఈ లతో కూడిన త్రీమెన్ కమిటీని నియమించారు. అనంతరం 2013 అక్టోబర్‌లో ఈ కేసును విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. కాగా నాటి నుంచి క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు.
దశలవారీగా నోటీసులు
మిర్యాలగూడలో గతంలో 13 క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2013 మార్చి 20వ తేదీన మొదటి దఫాలో 30 క్వార్టర్స్‌లో అనధికారికంగా నివాసం ఉంటున్నట్లుగా గుర్తించిన ఎన్‌ఎస్‌పీ అధికారులు 10 క్వార్టర్స్‌లలో నివాసం ఉంటున్న మాజీ ప్రజా ప్రతినిధులను బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ తర్వాత 30 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేయగా కొందరు కోర్టులకు వెళ్లగా 2013 అక్టోబర్ 5వ తేదీన మరో మూడు క్వార్టర్స్‌ను ఖాళీ చేయించారు. కోర్టు స్టే గడువు ముగియడంతో 2014 జనవరి 6వ తేదీన మరో 42 క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా నోటీసులు అందుకున్న వారిలో 31 మంది కోర్టుకు వెళ్లి నాలుగు వారాల పాటు స్టే తెచ్చుకున్నారు. దాంతో 11 క్వార్టర్స్ ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా బుధవారం ఏడు క్వార్టర్‌స ఖాళీ చేయించారు. దీంతో ఖాళీ అయిన క్వార్టర్‌స 20కి చేరాయి.
బకాయిలు చెల్లించని వారికి నోటీసులిచ్చాం
- అంజయ్య, ఎన్‌ఎస్‌పీ ఈఈ, మిర్యాలగూడ
మిర్యాలగూడ ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌లో అద్దె బకాయిలు చాలా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చింది. దాంతో విద్యుత్ వినియోగం పెరగడం వల్ల అధికారికంగా చెల్లించాల్సి వస్తోంది. క్వార్టర్స్ కేటాయింపును దుర్వినియోగం చేయడంతో పాటు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి 42 మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో 31 మంది కోర్టుకు వెళ్లి నాలుగు వారాల పాటు స్టే తెచ్చుకున్నారు. మిగతా వారిని ఖాళీ చేయిస్తున్నాం.
బకాయిల చెల్లింపులు షురూ..
మిర్యాలగూడలోని 388 ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌లో అద్దె బకాయిలు ఇప్పటికీ రూ. 35 లక్షలున్నాయి. అధికారులు ఖాళీ చేయించకుండా ఉన్నప్పుడు రూ.1.20 కోట్లు బకాయిలు ఉన్నాయి ఖాళీ చేయిస్తారనే ఆందోళనలో బకాయిలు చెల్లిస్తున్నారు. అయినా ఇంకా రూ. 35 లక్షలు ఉన్నాయి. అద్దె బకాయిలు ఎక్కువగా సుమారు 106 క్వార్టర్స్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారికి కూడా నోటీసులు సిద్ధం చేశారు.
అక్రమ నిర్మాణాలు
ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారు అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. సుమారుగా 50 శాతానికిపైగా క్వార్టర్స్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాగా అక్రమంగా నిర్మించి అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారే తప్ప అధికారులకు మాత్రం చెల్లించడం లేదు. రోడ్డు వైపునకు ఉన్న క్వార్టర్స్ వారు మడిగెలు నిర్మించి అద్దెకు ఇవ్వడంతో పాటు దుకాణాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇష్టానుసారంగా విద్యుత్ వినియోగం చేస్తూ గతంలో నిర్మించి స్లాబ్ ప్రకారమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా బిల్లును ఎన్‌ఎస్‌పీ అధికారులు చెల్లిస్తున్నారు. దాంతో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారి విద్యుత్‌ను కూడా అధికారులే చెల్లించాల్సి వస్తోంది.
ఖాళీ అవుతున్న క్వార్టర్స్
Published Thu, Jan 30 2014 3:58 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement
Advertisement