నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి బుధవారం తాగునీటికోసం సాగర్ జలాలను విడుదల చేస్తున్నట్లు ఎన్‌ఎస్పీ చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు చెప్పారు.
నరసరావుపేటవెస్ట్ : నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి బుధవారం తాగునీటికోసం సాగర్ జలాలను విడుదల చేస్తున్నట్లు ఎన్‌ఎస్పీ చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు చెప్పారు. మంగళవారం రాత్రి సాక్షితో ఆయన ఫోన్‌లో వివరాలను తెలియజేస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉదయం 10.30గంటలకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారన్నారు.
సాగర్‌కు పైనుంచి వచ్చే నీటి లభ్యతను బట్టి రానున్న రోజుల్లో సాగునీరు కూడా అందజేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులకు కూడా ఆహ్వానించినట్టు చెప్పారు.