
కోళ్లదాణాలో రూ.కోటిన్నర!
నాగార్జున సాగర్ హైవేపై నల్గొండ జిల్లా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వైపు కోళ్ల దాణాతో వెళ్తున్న వాహనాన్ని చింతపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాణా అడుగున్న ఉంచి సుమారు కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు స్వాధీనం చేసుకుని రెండు రోజులు దాటిన పోలీసులు మాత్రం ఆ విషయాన్ని దాచి పెట్టారు.
ఈ విషయంపై విలేకర్లు పోలీసులను ప్రశ్నించారు. నగదు దొరికిన మాట వాస్తవమేనని... ఆ నగదు ఆర్డీవోకు అందజేశామని పోలీసులు వెల్లడించారు. అయితే భారీ మొత్తంలో నగదు పట్టుబడిన పోలీసు మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.