Rs. One and Half Crore
-
చెన్నైలో రూ. కోటిన్నర నగదు పట్టివేత
నగరంలోని మన్నడిలోగల ఒక ఇంటిలో దాచిన రూ.1.5 కోటి నగదును సెంట్రల్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మన్నడిలో గల ఒక ఇంటిలో నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఉన్నట్టు కేంద్ర ఎక్సైజ్ విభాగానికి సమాచారం అందింది. సమాచారం మేరకు కేంద్ర ఆర్థిక నేరాల విభాగ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మన్నడిలోగల ఆ ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆ ఇంటిలో రూ.1.5 కోటి నగదు ఉన్నట్టు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిలో ఉన్న వ్యక్తుల వివరాలను అధికారులు తెలియచేయలేదు. -
కోళ్లదాణాలో రూ.కోటిన్నర!
నాగార్జున సాగర్ హైవేపై నల్గొండ జిల్లా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వైపు కోళ్ల దాణాతో వెళ్తున్న వాహనాన్ని చింతపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాణా అడుగున్న ఉంచి సుమారు కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు స్వాధీనం చేసుకుని రెండు రోజులు దాటిన పోలీసులు మాత్రం ఆ విషయాన్ని దాచి పెట్టారు. ఈ విషయంపై విలేకర్లు పోలీసులను ప్రశ్నించారు. నగదు దొరికిన మాట వాస్తవమేనని... ఆ నగదు ఆర్డీవోకు అందజేశామని పోలీసులు వెల్లడించారు. అయితే భారీ మొత్తంలో నగదు పట్టుబడిన పోలీసు మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.