
సాక్షి, మిర్యాలగూడ : అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ సైదాబాబును పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. సైదాబాబుపై పలు అవినీతి ఆరోపణలతో పాటు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్ టాక్స్ సక్రమంగా అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సై సైదాబాబు కాల్‌డేటాతో పాటు పూర్తిస్థాయి విచారణ జరిపిన ఎస్పీ రంగనాథ్ ఎస్సైని సస్పెండ్ చేయమంటూ డీఐజీకి సిఫారసు చేశారు. ఎస్పీ సిఫారసు మేరకు హైద్రాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment