జంటనగరాలకు తాగునీరందించేందుకు రూ.1670కోట్ల అంచనా వ్యయంతో రెండు నెలల క్రితం కృష్ణాజలాల పంపిణీ పథకం ఫేజ్ త్రీ పనులు ప్రారంభమయ్యాయి. కొదండాపూర్ వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి సాహెబ్‌నగర్ ప్లాంట్ వరకు 116 కిలోమీటర్ల మేర చేపట్టే పైప్‌లైన్ పనులను పది ప్యాకేజీలుగా విభజించారు. అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్న పలు కంపెనీలు రెండు నెలలుగా పనులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వయా ఏఎంఆర్‌పీ(ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) ద్వారా కృష్ణాజలాలను జంటనగరాలకు అందించే పథకంలో భాగంగా ఇప్పటికే రెండు ఫేజ్ పనులు పూర్తికాగా, థర్డ్ ఫేజ్ పనులు రెండు నెలల క్రితం ప్రారంభమయ్యాయి.
అయితే మొదటి, రెండు విడతల్లో చేపట్టిన పనుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. కానీ థర్డ్ ఫేజ్ పనుల్లో మా త్రం ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉ న్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడగా, సుమారు 50 మంది క్షతగాత్రులయ్యా రు. మూడు నెలల క్రితం చింతపల్లి రాజ్యాతండా వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డ తర్వాత ఈ ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి.
హైవేకు ఇరువైపులా పైప్‌లైన్ పనులు సాగుతుండడం తో కంపెనీలు పైపులను రోడ్డుకు ఇరువైపులా ముందుగానే తీసుకువచ్చి వేయడం.. మరోవైపు పైప్‌లైన్ పనులు కొనసాగిస్తుండడంతో హైవే కాస్తా సింగిల్ రోడ్డుగా మారింది. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేపై ప్రతిరోజూ కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగి స్తుంటాయి. అయితే పైపులను రోడ్డుకు ఇరువైపులా వేయడం, పైపులను అమర్చడం కోసం తీసిన మట్టిని రోడ్డుకు ఒక వైపునకు వేయడం, పెద్ద పెద్ద మెషీన్‌లు, క్రేన్‌ల ద్వారా హైవేపై పనులు చేపడుతుండడంతో రహదారి పూర్తిస్థాయిలో కుంచించుకుపోయింది. రాత్రి వేళ ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. వాహన ప్రమాదాలు ఎక్కువయ్యాయి.
కృష్ణ కృష్ణా.. హరే.. హరీ
Published Sat, Nov 30 2013 3:34 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement
Advertisement