pipe line works
-
గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట కందకం దెబ్బతినేలా కోట వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నుంచి అనుమతి లేకుండా నిర్మాణ పనులెలా చేస్తారని ప్రశ్నించింది. కోట వద్ద పైపులైన్ పనుల నిర్మాణం గురించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాహితవ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారణ చేపట్టింది. కోట చుట్టూ నిర్మాణ పనులు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ప్రాముఖ్యత ఉన్న గోల్కొండ కోట 500 ఏళ్ల నాటిదని, అలాంటి చారిత్రక కట్టడం వద్ద పైపులైన్ పనులని ఏవిధంగా చేపట్టారో, ఎవరి అనుమతి తీసుకుని చేస్తున్నారో తెలియజేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. చార్మినార్, గోల్కొండ వంటివి కాకుండా ఇంకేమైనా జాతీయ రక్షిత కట్టడాల గురించి తెలియజేయాలని ఏఎస్ఐ, జీహెచ్ ఎంసీలను ఆదేశించింది. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించిందని, రాష్ట్రం మాత్రం చారిత్రక కట్టడాల్ని పట్టించుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జరుగుతున్నాయా.. లేదా.. కోట వద్ద పనులు జరుగుతున్నాయో లేదో మధ్యాహ్నం 2.30 గంటలకు చెప్పాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తిరిగి విచారణ ప్రారంభం కాగానే జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఎలాం టి పనులు జరగడం లేదని చెప్పారు. అక్కడే ఉన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ఉద్దేశించి.. హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కట్టడాల జాబితాలో కొత్త వాటిని చేర్చేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించట్లేదని ధర్మాసనం ప్రశ్నిం చింది. హెరిటేజ్ మాన్యుమెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి కట్టడాల రక్షణకు తీసుకునే చర్యలు, ప్రాధాన్యత ఉన్న భవనాల జాబితాలను ఏఎస్ఐ, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా నివేదించాలని ఆదేశించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్‌కూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వాదనలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను జనవరి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా(అమికస్‌క్యూరీగా) సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని ధర్మాసనం నియమించింది. -
20 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు రూ. 1,300 కోట్లు
సాక్షి, బళ్లారి : తుంగభద్ర బోర్డు పరిధిలోని బళ్లారి – కర్నూలు జిల్లాల మధ్య ఎల్ఎల్సీ (లో లెవల్ కెనాల్) ద్వారా 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు చేసేందుకు ఏకంగా రూ.1,300 కోట్లు కేటాయిస్తూ ఎన్నికల ముంగిట జారీ అయిన జీవో వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తుంగభద్ర బోర్డు అనుమతి లేకుండా సాధారణ పనికి ఇంతపెద్ద మొత్తంలో నిధుల కైంకర్యానికి గత చంద్రబాబు ప్రభుత్వం వ్యూహం రచించడం పట్ల నీటి పారుదల శాఖ నిపుణులు విస్తుపోతున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పలువురు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారని సమాచారం. తుంగభద్ర డ్యాం నుంచి ప్రారంభమయ్యే ఎల్ఎల్సీ 250 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కాలువ అధ్వానంగా మారడంతో 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆధునికీకరణ పనుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. కాగా, మిగిలిన 180 కిలోమీటర్ల మేర పనులు మొదలవ్వలేదు. ఈ కాలువ మొత్తం లైనింగ్, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి మరో రూ.1,200 కోట్ల నిధులు అవసరమవుతాయి. అలాంటిది కేవలం 20 కిలోమీటర్ల పైప్‌లైన్ కోసం రూ.1,300 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడటంలో ఆంతర్యం కమీషన్ల బాగోతమేనని నీటి పారుదల రంగానికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. లాభం కంటే నష్టమే ఎక్కువ ఆధునికీకరణకు నోచుకోని ఎల్ఎల్సీని పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిని పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులకు మాత్రం రూ.1,300 కోట్లు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న (జీవో ఆర్టీ నంబర్–153) జీవో జారీ చేసింది. చివరన ఉన్న కోడుమూరు ప్రాంతానికి నీటిని నేరుగా తీసుకెళ్లేందుకు పైప్ లైన్ వేస్తున్నామని అప్పట్లో చంద్రబాబు సర్కారు చెప్పినప్పటికీ ఈ పనులు చేపడితే బళ్లారి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని విస్మరించి గత ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల ప్రస్తుతం లైనింగ్ పనులు చేపట్టేందుకు ఇబ్బందికరంగా మారిందని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎల్ఎల్సీ ద్వారా ప్రస్తుతం 1,800 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఈ పైప్‌లైన్ వేస్తే 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ వరకు నీటి సరఫరాను 600 క్యూసెక్కులకు తగ్గించి పైప్‌లైన్‌కు మళ్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఇన్‌ఫ్లో తగ్గి రైతులు నష్టపోతారని, ఇందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని అంటున్నారు. పైగా పైప్‌లైన్ వేయడానికి భూసేకరణకు మరో రూ.200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కర్ణాటకలోని సిరిగేరి వద్ద 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ కర్నూలు జిల్లా హళగుంద వరకు బోర్డు పరిధిలోకి వస్తుంది. ఈ దృష్ట్యా బోర్డు అనుమతి తీసుకుని జీవోను విడుదల చేయాలి. అయితే అప్పట్లో టీడీపీలో చేరిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకునికి పనులు కట్టబెట్టేందుకే చంద్రబాబు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం రాగానే ఆ మేరకు నిధులు కేటాయిస్తామని అప్పట్లో చెప్పినట్లు తెలిసింది. -
నెరవేరని రాజన్న ఆశయం
సాక్షి, మొగల్తూరు (పశ్చిమ గోదావరి): నాలుగు గ్రామాల ప్రజలకు తాగు నీరందిస్తానని దివంగత నేత తీర ప్రాంత ప్రజల గుండెలోల చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాజీవ్ పల్లెబాటలో భాగంగా 2009 జనవరిలో మండలంలో పర్యటించిన సందర్భంలో రూ.33 కోట్లతో మొగల్తూరులో భారీ మంచి నీటి ప్రాజెక్టుకు దివంగత నేత హామీ ఇచ్చారు. ఆయన అకాల మృతి అనంతరం ప్రభుత్వాలు మారినా పట్టించుకున్న నాదుడు లేడు. రూ.13 కోట్లతో చేపట్టిన పనులు రూ.13 కోట్లు వెచ్చించి సుమారు 30వేల మంది ప్రజల దాహర్తి తీర్చేందుకు ఉద్దేశించి మొగల్తూరు గొల్లగూడెంలో తవ్విన చెరువు. పంచాయతీకి చెందిన చెరువునే ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి చెరువు చుట్టూ రివిట్ మెంట్ కట్టారు. అయితే నాలుగు గ్రామాలకు తాగు నీరందించాల్సి ఉండగా కేవలం మొగల్తూరుకు తప్ప ఏ గ్రామానికి అందదు. నాలుగు గ్రామాలకు తాగునీరు మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు సుమారు 40 శివారు ప్రాంతాలకు తాగు నీరందించేందుకు రూ. 13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రాజెక్టును సుమారు 20 ఎకరాల్లో నిర్మించేందుకు భూసేకరణకు ప్రయత్నించినా పనులు పూర్తి కాలేదు. అయితే నిధులు మురుగుపోతున్నాయనే ఉద్దేశంతో మొగల్తూరు పంచాయతీ ప్రాజెక్టు చెరువుతోపాటు పంచాయతీకి చెందిన మరో రెండు చెరువులు కలుపుకుని తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. దీనిలో భాగంగా మొగల్తూరులోని పాలకమ్మ చెరువు రోడ్డులో గల కోమటి చెరువులో నీటిని నిల్వ చేసి గొల్లగూడెం చెరువు ద్వారా ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైప్‌లు ద్వారా నీరందించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పూర్తి కాని పైప్‌లైన్ పనులు ఇక ఫిల్టర్ అయిన నీటిని ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రిజర్వు చేసుకుని పైప్‌లు ద్వారా గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న రామన్నపాలెంలో 8, మొగల్తూరులో 7, శేరేపాలెంలో 3, కొత్తపాలెంలో 2 ఓహెచ్‌ఆర్‌లు ద్వారా అందించాల్సిన పైప్‌లైన్ పనులు పూర్తికాలేదు. శేరేపాలెంలో పైప్‌లైన్ పనులు పూర్తిఅయినా నీరందటంలేదు. కొత్తపాలెం గ్రామంలో మాత్రం కొద్దిగా వస్తున్నాయని, నాసిరకం పైపులు కారణంగా నీరందడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రామన్నపాలెం గ్రామంలో కొంతమేర పైప్లైన్లు వేసి వదిలేయడంతో ఆగ్రామానికి పూర్తిగా నీరు సరఫరా కావడంలేదు. కేవలం మొగల్తూరు గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో నీరందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే తాగునీటి ప్రాజెక్టుపై పాలకులు శ్రద్ధ చూపడం లేదని ఈ సారి సమస్యలను తీర్చే నాయకుడునే ఎన్నుకుంటామని ప్రజలు చెబుతున్నారు. తాగు నీరందడం లేదు మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరందడంలేదు. గ్రామంలోని పంచాయతీ చెరువు ఉన్నా తాగేందుకు పనికి రావడంలేదు. దీంతో రోజూ కొనుక్కుని తమ దాహాన్ని తీర్చుకుంటున్నాం. – ఏగి రాజశేఖర్, శేరేపాలెం నాసిరకంగా పనులు ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టడంతో చిన్న దెబ్బతగిలినా పైపులు పగిలి పోతున్నాయి. కాంట్రాక్టరు అధికారం పక్షానికి దగ్గిర వ్యక్తి కావడంతో పనులు నాసిరకంగా పూర్తిచేసినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. – కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపాలెం ఇప్పటికీ మాకు నీరందదు మొగల్తూరు భారీ ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి కూడా నీరందిస్తామని దివంగత నేత ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ మాగ్రామానికి పైప్ లైన్ పనులు పూర్తి చేయలేదు. జగన్ అధికారంలోకి వస్తేనే మాకు నీరు అందుతుంది. – కాటూరి చంద్రమోహన్, రామన్నపాలెం జగన్ రావాలి – తాగు నీరందాలి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జలయజ్ఞం పథకంలో మంచి నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. మా గ్రామానికి స్వచ్ఛమైన నీరందాలంటే జగన్ రావాలి, తాగు నీరందాలి. – కొత్తపల్లి బాబి, శేరేపాలెం -
నెరవేరని హామీ.. తీరని దాహార్తి
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వవ్వేరు పైలెట్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేశారు. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టడంతో మూణ్ణాళ్లకే పైపులైన్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2015 మార్చి 3న మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి ప్రజాప్రతినిధులు సమస్యను తీసుకెళ్లగా, వారం రోజుల్లోగా మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ప్రజల దాహార్తి తీరలేదు. మండలంలోని అన్ని పంచాయతీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏడేళ్ల క్రితం రూ.3.75 కోట్లతో జొన్నవాడ వద్ద పెన్నానదిలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించి నివేదికలు పంపారు. ఆ తరువాత ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. వవ్వేరు వద్ద రూ.2.5 కోట్లతో ప్రాజెక్ట్‌ను నిర్మించి కనిగిరి రిజర్వాయర్ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. కనిగిరి రిజర్వాయర్ నీటిని శుద్ధిచేసి పైప్‌లైన్ ద్వారా ట్యాంకులకు అందించి సరఫరా చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాసిరకంగా పైప్‌లైన్ నిర్మాణం పైలెట్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నాసిరకంగా చేశారు. ప్రాజెక్ట్ నుంచి వాటర్‌ట్యాంకులకు నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు నాసిరకమైనవి వేశారు.దీనికితోడు భూమిలో రెండు అడుగుల లోతులో మాత్రమే పైప్‌లను అమర్చారు. దీంతో పైపులైన్లు తరచూ పగిలిపోతూ పైలెట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. దాహం..దాహం వేసవిలో మండల ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మేజర్ పంచాయతీతో పాటు నాగాయగుంట, మునులపూడి, కట్టుబడిపాళెం, పెనుబల్లి, కాళయకాగొల్లు, మినగల్లు, జొన్నవాడ, తదితర గ్రామాల్లో తాగునీరు అందడం కష్టంగా మారుతోంది. దీంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారం శూన్యం 2015 మార్చి 3న జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి పైలెట్ ప్రాజెక్టు సమస్యను ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తీసుకొచ్చారు. వేసవిలో దాహార్తిని తీర్చడమే లక్ష్యమని చెప్పే మీరు, నిరుపయోగంగా ఉన్న పైలెట్ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్పందించిన పోలంరెడ్డి మాట్లాడుతూ వారంలోగా ప్రాజెక్ట్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో పైలెట్ ప్రాజెక్ట్ పూర్తిగా వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి అల్లాడుతున్నాం పైలెట్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు ట్యాంకులకు అందడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. మెయింట్‌నెన్స్ కింద లక్షలు విడుదలవుతున్నా ప్రజలకు మాత్రం తాగునీరు అందడం లేదు. – ఈదూరు నరేంద్రబాబు, కట్టుబడిపాళెం మాటలు తప్ప చేతలేవీ నేతలు, అధికారులు మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా పైలెట్ ప్రాజెక్ట్ నీటిని అందిస్తామని చెబుతూ ఉన్నారు..వింటూనే ఉన్నాం. ప్రతి వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఫలితం లేదు. – చంద్రగిరి రాజశేఖర్, నాగాయగుంట సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం పైలెట్ ప్రాజెక్టు పరిస్థితిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతాం. పైప్లైన్లు మరమ్మతులకు గురైన విషయం నా దృష్టికి వచ్చింది. మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. –డీవీ.నరసింహారావు, ఎంపీడీఓ -
‘మంజీర’కు కొత్త లైన్లు!
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీటినిసరఫరా చేసేందుకు సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి తాగునీటి పైపులైన్లు వేశారు. పైపులు శిథిలావస్థకు చేరుకుంటుం డడంతో లీకేజీల మూలంగాతాగునీరు వృథాగా పోతోంది. పాత పైపులైన్ల స్థానంలో రూ.30 కోట్లతో కొత్త లైన్లువేయాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు ప్రతిపాదనలుసమర్పించింది. మున్సిపల్ విభాగం నుంచి అధికారిక ఉత్తర్వు ్డలు వెలువడిన వెంటనే పనులు చేపట్టేందుకు మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంజీర జలాశయంలో నీరు అడుగంటిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా నిలిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మంజీర నది నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు సుమారు నాలు గు దశాబ్దాల క్రితం పైపులైన్లు వేశారు. వీటి నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు చూస్తోంది. ప్రస్తుతం మంజీర ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లోని 3.22లక్షల జనాభాకు తాగునీరు అందుతోంది. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. లీకేజీల మూలంగా జనావాసాలకు నీటి సరఫరా ఆలస్యం కావడం, తక్కువ మొత్తంలో నీటి సరఫరా జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు పటాన్చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పైపులైన్ల మీదుగా రోడ్లు వేయగా, పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో రోడ్లు కుంగే ప్రమాదం ఉందని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకుంటున్న పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాలని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.30 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, పురపాలక శాఖ నుంచి అధికారిక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వెలువడిన రెండు మూడు వారాల వ్యవధిలోనే 900 మి.మీ వ్యాసం కలిగిన పైపులైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల రోడ్లను తవ్వాల్సి ఉండడం, ట్రాఫిక్‌ను దారి మళ్లించాల్సి రావడంతో అనుమతి కోసం ఇప్పటికే వాటర్ వర్క్స్ బోర్డు జీహెచ్ఎంసీకి లేఖ రాసింది. ఆరు నెలల్లో పైపులైను పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రస్తుతమున్న విధానంలోనే తాగునీటిని సరఫరా చేస్తారు. ఎడారిని తలపిస్తున్న ‘మంజీర’ మంజీర , సింగూరు జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేందుకు నాలుగు దశల్లో పైపులైన్లు నిర్మించారు. సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి ఫేజ్–1, ఫేజ్–2లో పైపులైన్లు వేశారు. తర్వాతి కాలంలో మంజీర జలాలకు డిమాండ్ పెరగడంతో సింగూరు జలాశయం నుంచి ఫేజ్–3, ఫేజ్–4 పేరిట మరో రెండు పైపులైన్లు నిర్మించారు. వర్షాభావంతో సింగూరు, మంజీర జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఫేజ్ 1, 2 ద్వారా 150 ఎంఎల్డీ, ఫేజ్ 3, 4 ద్వారా 860 ఎంఎల్డీ నీరు ప్రతీ రోజూ హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. 29.91 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న సింగూరు జలాశయంలో ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. 1990 ఫిబ్రవరి నాటి జీఓఎంఎస్ 93 ప్రకారం సింగూరు జలాశయంలో కనీసం 518 అడుగుల మేర నీరుంటేనే హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 512 అడుగులకు నీటి మట్టం పడిపోయినా, మంజీర పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఏప్రిల్ నాటికి మంజీర జలాశయం పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉండడంతో ఒకటి రెండు రోజుల్లో మంజీర ఫేజ్–1, ఫేజ్–2 ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
తుందుర్రు ఉద్రిక్తం
వీరవాసరం/నరసాపురం రూరల్: తుందుర్రు పరిసర గ్రామాలు ఉద్రిక్తంగా మారాయి. నరసాపురం మండలం కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల మధ్యలో జరుగుతున్న ఆక్వాఫుడ్‌పార్క్ పైప్‌లైన్ పనులు ఆపాలంటూ గురువారం ఉదయం సెల్‌టవర్లు ఎక్కిన ఆందోళనకారులు రాత్రిపొద్దుపోయే వరకూ దిగిరాలేదు. అధికారులు వచ్చి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామాల్లో ఆందోళన నెలకొంది. అసలేం జరిగిందంటే.. తుందుర్రు గ్రామంలో ఆక్వా ఫుడ్ పార్క్ పైప్‌లైన్ పనుల నిమిత్తం పోలీసులు గురువారం భారీగా మోహరించారు. పనులు ప్రారంభించారు. దీనిని నిరసిస్తూ.. తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతి గురువారం ఉదయం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో సెల్ టవర్‌పైకి ఎక్కి నిరసన ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకుని కొప్పర్రు గ్రామంలోనూ జొన్నల గరువుకు చెందిన కొయ్యే సంపతరావు, పెదపౌల్ సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో ఈ గ్రామాలతోపాటు తుందుర్రు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా ప్రాంతాలకు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం 7 గంటలసమయంలో సెల్ టవర్ ఎక్కిన ఆరేటి సత్యవతి, సంపతరావు, పెదపౌలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా.. లెక్కచేయలేదు. రాత్రి కావస్తున్నా సెల్‌టవర్ నుంచి దిగిరాలేదు. పైప్‌లైన్ పనులు నిలుపుదల చేస్తామని హామీ ఇస్తేనే సెల్ టవర్ నుంచి దిగివస్తామని, లేదంటే సెల్‌టవర్‌పైనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని తేల్చిచెప్పారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న వీరవాసరం తహసీల్దార్ ఎం.ముక్కంటి ఆందోళనకారులతోనూ, మత్స్యపురి, తుందుర్రు గ్రామస్తులతోనూ చర్చించారు. సబ్కలెక్టర్గానీ, డీఎస్పీగానీ వచ్చి హామి ఇవ్వాలని తహసీల్దార్ ముక్కంటికి స్థానికులు తెలియజేశారు. విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలియజేస్తానని తహసీల్దార్ తెలిపారు. ఇదే సందర్భంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఏమీ చేయలేక పోతున్నారని ఒక మహిళ టవర్ ఎక్కి కొన్ని గంటలపాటు దీక్షకు కూర్చుంటే స్పందించడం లేదంటూ ఆయాశాఖాధికారులను మత్స్యపురి, తుందుర్రు గ్రామస్తులు నిలదీశారు. రాస్తారోకో చేశారు. పోలీసుల పహారా ఇదిలా ఉంటే తుందుర్రు పరిసర గ్రామాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆందోళనకారులకు మద్దతు తెలిపేందుకు బయట నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో నుంచి ప్రజలనూ బయటకు వెళ్లనీయడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే తుందుర్రు, జొన్నలగరువు గ్రామాలలో సుమారు 200 మందికి పైగా పోలీసులు మోహరించి పైపులైన్ పనులు దగ్గరుండి చేయిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. -
పైపులో కూరుకు పోయిన వ్యక్తి
భువనేశ్వర్/కటక్ : పైప్‌లో కూరుకుపోయిన ఓ వ్యక్తి గంటల తరబడి ఊపిరాడని పరిస్థితుల్లో ప్రాణాలతో మృత్యుపోరాటం చేసి బతికి బయటపడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. కటక్ మహానగరం పంపింగ్ స్టేషను పైపు మరమ్మతు పనులు జరుగుతుండగా సిబ్బంది ఓ వ్యక్తి ఆకస్మికంగా 25 అడుగుల లోతు పైపులో కూరుకు పోయాడు. తోటిసిబ్బంది తప్పిదంతో ఈ ఘటన సంభవించింది. పైప్‌లైన్‌లో అడ్డు తొలగించే పనిలో వ్యక్తి నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో 25 అడుగుల లోతుకు కొట్టుకుపోయాడు. విషయం ప్రసారం చేయడంతో అనుబంధ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అందరి సమష్టి కృషితో పైపులో కూరుకు పోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా పోలీసు (వైర్లెస్) ప్రధాన కార్యాలయం ఎదురుగా కటక్ మహానగరం బిడానాసి ప్రాంతంలో ఈ ఆందోళనకర సంఘటన సంభవించింది. చాహత్ బజార్లో ఉంటున్న 45 ఏళ్ల ప్రాణ కృష్ణ ముదులి అనే సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా పైపులో కూరుకు పోయాడు. దాదాపు 6 గంటల పాటు ఈ పైపులో ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కొట్టుమిట్టాడు. ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్), అగ్ని మాపక దళం సంయుక్త సహాయక చర్యలతో ఈ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీయగలిగారు. -
బ్యారికేడ్లు ఢీకొని గొయ్యిలో పడ్డ వ్యక్తి
హైదరాబాద్: సివరేజీ పైప్‌లైన్ పనులు జరుగుతున్న చోట ఓ వ్యక్తి బ్యారికేడ్లు ఢీకొని 22 అడుగుల లోతు గొయ్యిలో పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెక్లెస్‌రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సివరేజీ పైప్‌లైన్ పనులు నడుస్తున్నాయి. విదేశీ టెక్నాలజీ సాయంతో కేవలం మ్యాన్‌హోల్స్ వద్ద గోతులు తీసి సొరంగ మార్గం ద్వారానే యంత్రాలు పంపి పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయ్యాయి. ఈ పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మ్యాన్‌హోల్ వద్ద 22 అడుగుల గొయ్యి తీసి పనులు చేస్తున్నారు. కాగా గత గురువారం ఓ ద్విచక్రవాహనదారుడు వాహనం అదుపుతప్పి సదరు గొయ్యిలో పడిపోయాడు. అతని వాహనం పక్కనే ఉన్న గ్రిల్స్‌పై పడగా.. మనిషి మాత్రం అందులో పడ్డాడు. అప్పటికే సదరు గొయ్యిలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్, ముక్తార్‌లపై వాహనదారుడు పడడంతో ఒక్కసారిగా అందరూ గట్టిగా కేకలు వేశారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు వారిని బయటకు తీశారు. బయటకు రాగానే బాధితుడు అతని వాహనాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులకు కూడా సమాచారం లేకపోవడంతో విషయం బయటకు పొక్కలేదు. శనివారం అందులో పనిచేస్తున్న కార్మికులు విషయం పలువురికి చెప్పడంతో మీడియాకు తెలిసింది. అనంతరం అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఘటన జరిగినట్లు నిర్ధారించారు. బాధితుడి వివరాలు తెలియరాలేదు. -
ఎక్కడివి అక్కడే..
మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. పైప్లైన్ల ఏర్పాటుకు తీస్తున్న గుంతలను సరిగా పూడ్చకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.. గుంతలకోసం తవ్వే క్రమంలో తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన నెల రోజుల క్రితం తీసిన భగీరథ గుంతలు ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ పైపు లెన్ల నిర్మాణం కోసం గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న ఇళ్లను సైతం కూల్చారు. గ్రామంలో ఈ పైపులైన్‌ను ఇష్ట రాజ్యంగా వెశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. అవసరం లేకున్నా చాలా చోట్ల ఇల్లు కూల్చినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 9 మీటర్లు దూరంలో పైపు లైన్ నిర్మాణం చేయాలని నిబంధన ఉన్నా కొన్ని చోట్ల 11 మీటర్లు దూరంలో వేశారు . దీంతో చాలా చోట్ల ఇల్లు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. అన్నపురెడ్డిపల్లి నుండి మాదారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పైపులు, మట్టి కుప్పలు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భగీరథ పైపు లైన్లు నిర్మాణానికి సూమరు 6 అడుగుల లోతుతో గుంతలను తీసి ఉంచడంతో చిన్న పిల్లలు, జంతువులు ప్రమాదవ శాత్తు పడిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. త్వరలో గ్రామంలో జరిగే శివరాత్రి పండగ నాటికి గుంతలను పూడ్చకపోతే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆలయ సిబ్బంది అంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు వేడుకుంటున్నారు. త్వరగా పూడ్చాలి పైపులైన్ కోసం తీసిన గుంతలను త్వరగా పూడ్చాలి. ఈ గుంతల్లో చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. శివాలయంలో త్వరలో జాతర జరగనుంది. జాతరకు వేలలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలి. – యాదాల జమలయ్య పరిహారం ఇవ్వాలి భగీరథ పైపులైన్ నిర్మాణాల్లో పాడైపోతున్న ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. నెల క్రితం గ్రామంలో పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చాం. అయినా స్పందన కనిపించడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. – నరసింహారావు -
జలదరింపు..
వైరా: గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాపై పట్టింపు కరువైంది. కుళాయిల ద్వారా స్వచ్ఛ జలాన్ని అందించాల్సి ఉండగా.. పైపులైన్ల లీకేజీలు, క్లోరినేషన్‌పై పర్యవేక్షణ లేకుండాపోయింది. తరచూ లీకేజీలతో మురుగు, వ్యర్థ జలాలు పైపులైన్లలోకి చేరి.. అవే సరఫరా అవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్నిచోట్ల పైపులైన్ల వద్ద నిలిచిన మురికి నీటిని చూస్తే.. మనం తాగేది ఈ జలాలేనా..? అని ఒళ్లు జలదరించాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కిట్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మూలన పడ్డాయి. గ్రామీణ ప్రజలందరికీ రక్షిత తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో 2009లో అప్పటి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి తాగునీటిని పరీక్షించే నీటికిట్లను పంపిణీ చేసింది. ఒక్కో కిట్టుకు రూ.3వేలు వెచ్చించింది. 2011–15 వరకు నాలుగు దశల్లో సర్పంచ్‌లతోపాటు కార్యదర్శులకు, వాటర్మెన్లకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇప్చించారు. కానీ.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక, వీటిని ఉపయోగించడం పై పూర్తిస్థాయి అవగాహన లేక నిరుపయోగంగా మారాయి. నీటి సరఫరా అస్తవ్యస్తం.. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు లేవు. పైపులైన్లు, గేట్‌వాల్వ్‌లు లీకేజీ అ యినప్పుడు వ్యర్థ జలాలు పైపులైన్లలోకి చేరుతున్నాయి. మినరల్ వాటర్ కొనలేని వారు.. ఈ జలాలనే తాగాల్సి వస్తోంది. నీటి ట్యాం కుల్లో పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పొడి వేసి చేతులు దులుపుకుంటున్నారు. తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే ఆ నీటి ని తాగడానికి ఉపయోగించొద్దు. నీటిని పరీక్షిస్తేనే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎంతుందో తెలుస్తుంది. వర్షాకాలంలో నీరు అధికంగా కలుషితమయ్యే అవకాశాలు ఉన్నందున రక్షణ చర్యలు చేపట్టి, సురక్షిత తాగు నీటిని ప్రజలకు అందించాల్సి ఉంది. ఈ విషయంలో అ«ధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎనిమిది రకాల పరీక్షలు.. గ్రామాల్లోని చేతి పంపులు, వాటర్ ట్యాంకుల్లోని నీటి నమూనాను సేకరించి కలుషితాన్ని గుర్తించేందకు నీటి పరీక్ష కిట్లు ఉపయోగపడతాయి. ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, పీహెచ్, టోటల్ ఆల్కానిటీ టెస్టులతోపాటు సుమారు ఎనిమిది రకాల పరీక్షలు చేసి ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలి. కొన్నిసార్లు నీళ్లు తాగలేం.. కొన్నిసార్లు పంపుల నీళ్లు బాగా మురికిగా వస్తుంటాయి. ఎంత జల్లెడ పట్టినా.. మట్టి పేరుకుపోతోంది. నలకలు బాగా వస్తున్నాయి. చిన్న పిల్లలు తాగితే.. ఏమైనా అవుతుందని భయపడుతున్నాం. – ఎస్.సుభద్ర, దాచాపురం, వైరా మండలం అధికారులు స్పందించాలి.. గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతోంది. ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తక్షణమే అధికారులు స్పందించాలి. – కంకణాల అర్జున్‌రావు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు -
తవ్వేస్తున్నారు
‘అనంత’లో ఇష్టారాజ్యంగా పైపులైన్ పనులు ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు ధ్వంసం మరమ్మతుల పేరుతో అ‘ధన’పు వ్యూహం రూ.25 నుంచి రూ.30 కోట్ల మేర నిధుల దుర్వినియోగం మామూళ్ల మత్తులో ‘అనంత’ పాలకులు సాక్షిప్రతినిధి, అనంతపురం: ఈ ఫొటో చూశారా...అనంతపురం రెవెన్యూ కాలనీలోని రామాలయం ఎదురుగా ఉన్న రోడ్డు. తాగునీటి కొళాయి కనెక్షన్ పేరుతో రోడ్డును పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. దీంతో కాలనీలోని రోడ్డు నామరూపాల్లేకుండా పోతోంది. ఈరోడ్డుపై ఆటోలు, కార్లు, టూవీలర్లపై ప్రయాణం చేయాలన్నా.. చివరకు నడిచి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. రెవెన్యూ కాలనీలోనే కాదు...ఎర్రనేల కొట్టాలు, రాంనగర్‌లోనూ ఇదే విధంగా పనులు జరుగుతున్నాయి. అనంతపురంలో నీటి సమస్య తీర్చేందుకు రూ.134 కోట్లతో ప్రభుత్వం టెండర్ పిలిచింది. ఐహెచ్పీ(ఇండియన్ హ్యూమ్ పైప్స్) కంపెనీ ప్రతిపాదిత ధర కంటే అధిక మొత్తం కోట్ చేసింది. చివరకు రూ.147 కోట్లకు ఐహెచ్పీకి టెండర్ దక్కింది. 368 కిలో మీటర్ల పైపులైన్, 10 తాగునీటి ట్యాంకులు (ఓహెచ్‌ఆర్) నిర్మించాలి. అగ్రిమెంట్ తేదీ నుంచి రెండేళ్లలోపు ఈ పనులు పూర్తి చేయాలి. 2016 ఏప్రిల్ 1న పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. రోడ్డుకు ఎడమవైపున ఉన్న తాగునీటి పైపులైన్ నుంచి కుడివైపున ఉన్న వారి ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు రోడ్డును ధ్వంసం చేస్తున్నారు. కాలనీలో ప్రతీ ఇంటికీ కనెక్షన్ ఇచ్చేందుకు రోడ్లను వరుసగా పగలగొట్టడంతో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. మున్సిపల్ సిబ్బంది రోడ్డును ధ్వంసం చేయకుండా రోడ్డుకింద మట్టిని తవ్వి పైపులైన్ పనులు పూర్తి చేస్తున్నారు. పెద్దపెద్ద కొండలకు కూడా సొరంగం వేసి, పైపులైన్లు ఏర్పాటు చేసే టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న ఐహెచ్పీ సాంకేతికతను అందిపుచ్చుకోకుండా రోడ్లను ధ్వంసం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతుకుల ప్రయాణం తప్పదా.. జిల్లా కేంద్రంలో 62,097 నివాసాలు (అపార్ట్మెంట్లతో పాటు) ఉన్నాయి. వీటిలో 32 వేల కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో రోడ్లు ధ్వంసం చేసి 21 వేల కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అనంతపురం నగరంలోని రోడ్లన్నీ గతుకులుగా మారిపోతాయి. 5(ఇంటు) 15 మీటర్ల మేర రోడ్డు వేయాలంటే రూ.లక్ష ఖర్చవుతుంది. ఈలెక్కన రోడ్లన్నీ తిరిగి నిర్మించాలంటే కనీసం రూ.150 కోట్ల నిధులు అవసరం. ప్రస్తుతం పగలగొడుతున్న రోడ్ల పనులకు ‘ప్యాచ్‌వర్క్’ చేయాలి. కాంక్రీట్ వర్క్ పూర్తి చేసి 21 రోజులపాటు క్యూరింగ్ చేయాలి. ఇది చేసినా ప్యాచింగ్ నిలవదు. ఈ రోడ్డులో వెళ్లినా అడుగుకో స్పీడ్‌బ్రేకర్‌పై ప్రయాణం చేసినట్లవుతుంది. ఇలా కాంక్రీట్ వర్క్‌కు రూ.18 కోట్లు కేటాయించారు. రోడ్డుకు ఇబ్బంది లేకుండా పైపులైన్ నిర్మిస్తే భారీగా నిధులు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ పనుల్లోనూ తిరకాసే పైపులైన్ నిర్మాణంలో మొదట ఇసుక వేసి, తర్వాత పైపులు వేయాలి. నీటి పరఫరా అయినప్పుడు ఆ ఒత్తిడికి పైపు పగిలిపోకుండా ఇసుక కొంత వరకు రక్షణ కల్పిస్తుంది. ఇసుక లేకుండానే పనులు చేస్తున్నారు. ఇదేమంటే ప్రత్యేకంగా జీఓ తెచ్చుకున్నామని చెప్తున్నారు. ఇసుక వేయకపోవడంతో రూ.3 కోట్ల మేర ఏజెన్సీకి నిధులు ఆదా అవుతాయి. అలాగే రోడ్ల పక్కన పైపులైన్ పనుల కోసం గోతులు తవ్వారు. వీటిని నిర్మాణ సంస్థే పూడ్చి చదును చేయాలి. కానీ ఈ పనులను చేయడం లేదు. వీటిని ఇంటి యజమానులే చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లిప్తత ఏడాదిగా పనులు గందరగోళంగా జరుగుతున్నా ‘అనంత’ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదు. పనులకు ముందే రూ.7.50 కోట్లు కీలక ప్రజాప్రతినిధులకు అందడంతోనే పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రజాప్రతినిధి తన అస్మదీయులైన కార్పొరేటర్ల ద్వారా అధికారపార్టీ కార్పొరేటర్లకు కూడా నిధుల పంపకాలు జరిగాయని తెలుస్తోంది. దీంతోనే పైపులైన్ పనులు ఎలా జరుగుతున్నా అందరూ మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో దాదాపు రూ.25 నుంచి రూ.30 కోట్లు దుర్వినియోగమవుతున్నాయి. -
కృష్ణ కృష్ణా.. హరే.. హరీ
జంటనగరాలకు తాగునీరందించేందుకు రూ.1670కోట్ల అంచనా వ్యయంతో రెండు నెలల క్రితం కృష్ణాజలాల పంపిణీ పథకం ఫేజ్ త్రీ పనులు ప్రారంభమయ్యాయి. కొదండాపూర్ వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి సాహెబ్‌నగర్ ప్లాంట్ వరకు 116 కిలోమీటర్ల మేర చేపట్టే పైప్‌లైన్ పనులను పది ప్యాకేజీలుగా విభజించారు. అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్న పలు కంపెనీలు రెండు నెలలుగా పనులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వయా ఏఎంఆర్పీ(ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) ద్వారా కృష్ణాజలాలను జంటనగరాలకు అందించే పథకంలో భాగంగా ఇప్పటికే రెండు ఫేజ్ పనులు పూర్తికాగా, థర్డ్ ఫేజ్ పనులు రెండు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే మొదటి, రెండు విడతల్లో చేపట్టిన పనుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. కానీ థర్డ్ ఫేజ్ పనుల్లో మా త్రం ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉ న్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడగా, సుమారు 50 మంది క్షతగాత్రులయ్యా రు. మూడు నెలల క్రితం చింతపల్లి రాజ్యాతండా వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డ తర్వాత ఈ ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. హైవేకు ఇరువైపులా పైప్‌లైన్ పనులు సాగుతుండడం తో కంపెనీలు పైపులను రోడ్డుకు ఇరువైపులా ముందుగానే తీసుకువచ్చి వేయడం.. మరోవైపు పైప్‌లైన్ పనులు కొనసాగిస్తుండడంతో హైవే కాస్తా సింగిల్ రోడ్డుగా మారింది. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేపై ప్రతిరోజూ కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగి స్తుంటాయి. అయితే పైపులను రోడ్డుకు ఇరువైపులా వేయడం, పైపులను అమర్చడం కోసం తీసిన మట్టిని రోడ్డుకు ఒక వైపునకు వేయడం, పెద్ద పెద్ద మెషీన్లు, క్రేన్ల ద్వారా హైవేపై పనులు చేపడుతుండడంతో రహదారి పూర్తిస్థాయిలో కుంచించుకుపోయింది. రాత్రి వేళ ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. వాహన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. -
మెగా..దగా
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: మెగా దగాతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.28కోట్లతో చేపట్టిన పైపులైన్ పనులు నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2009లో యూఐడీఎస్ఎస్ఎంటీ పథకం కింద పట్టణంలో 99 కిలోమీటర్ల పైపులైన్‌తోపాటు ఆరు నీటి ఉపరితల ట్యాంక్‌ల నిర్మాణానికి మెగా సంస్థ పనులను దక్కించుకుంది. పైపులైన్ పనులను లెవెల్స్ లేకుండా చేయడంతోపాటు జాయింట్ వర్కులు నాసిరకంగా చేయడంతో ఒత్తిడికి తట్టుకోలేక ఎక్కడికక్కడ పైపులు తెగిపోతున్నాయి. దీంతో మంచినీరు వృధాగా పోతోంది. 2011కు పనులు పూర్తి చేసి మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు కానరావడం లేదు. బిల్లులేమో 80శాతానికిపైగా తీసుకున్న మెగా సంస్థ పనుల్లో నాణ్యత చూపించకపోవడంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితుల్లో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతునే ఉంది. పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ఒక్కో జాయింట్ వర్క్ చేయడానికి మున్సిపల్ ఫిట్టర్లు, వర్కర్లు ఒకటి నుంచి రెండు రోజుల వరకు శ్రమించాల్సి వస్తోంది. పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పక్కనపెట్టి కేవలం జాయింట్ పనులకే సబ్బంది సమయమంతా సరిపోతోంది. ఒక్క ట్యాంక్‌కు కూడా అందని నీరు రూ. కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన మోడంపల్లె, బొల్లవరం, అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్, సంజీవయ్యనగర్‌లోని ఎస్సీ హాస్టల్ సముదాయంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌లతోపాటు ఆర్ట్స్ కాలేజిలో నిర్మించిన ఏ ఒక్క ట్యాంక్‌కు ఇప్పటి వరకు మెగా పైపులైన్ ద్వారా నీటిని అందించలేదు. దీంతో ప్రజలు తీవ్రంగా నీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కమిషనర్‌తో పాటు వాటర్‌వర్క్స్ అధికారులు మెగా పైపులైన్ పనుల్లో జరిగిన నాణ్యత లోపాలపై పనులను పర్యవేక్షిస్తున్న ఎస్ఈ మోహన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టణంలోని మోడంపల్లె, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, త్రీటౌన్ సర్కిల్, ప్రకాష్‌నగర్, బొల్లవరం తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు మెగా పైపులైన్ పగిలిపోతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం రాజీవ్ సర్కిల్, ఎద్దుల వెంకటసుబ్బమ్మ పాఠశాల ముందు పైపులైన్ పగిలిపోవడంతో దాదాపు రూ.20వేలు ఖర్చు చేసి పనులు చేపట్టిన అధికారులకు శ్రమ వృధా అయింది. తిరిగి గురువారం పైపులైన్ జాయింట్లు ఒత్తిడికి తట్టుకోలేక పగిలిపోయాయి. నేడు ఈఎన్సీ రాక ప్రజల దాహార్తిని శాశ్వత ప్రాతిపదికన తీర్చేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి ఈఎన్సీ చంద్రశేఖర్ ప్రొద్దుటూరుకు రానున్నారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి రూ.158 కోట్లు విడుదలయ్యాయి. చెన్నమరాజుపల్లె గ్రామం వద్ద ఉన్న కుందూ నది నుంచి ప్రొద్దుటూరు రామేశ్వరంలోని వాటర్ సంపు వద్దకు పైపులైన్ ద్వారా నీటిని తీసుకురానున్నారు. అలాగే చెన్నమరాజుపల్లె వద్ద 250 ఎకరాల భూమిని సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మాణానికి సేకరించనున్నారు. ఈఎన్సీ ప్రొద్దుటూరుకు వచ్చి వీటన్నింటినీ పరిశీలించనున్నారు.