హాలియా, న్యూస్‌లైన్: సాధారణ పౌరుడైనా ఇతరుల వద్ద డబ్బులు బలవంతంగా లాక్కుంటే అది తప్పు, చట్టరీత్యా నేరం. కానీ అదే పోలీసులు ఇసుక లారీ డ్రైవర్ల వద్ద బలవంతంగా డబ్బు లు లాక్కుంటే అదే న్యాయం. ఇదీ అనుముల మండలంలో జరుగుతున్న తంతు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచే చేను మేస్తోం ది. ఇసుక అక్రమ రవాణాను అటికట్టాల్సిన పోలీసులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయంలో ఇసుక లారీల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఇసుక డంపుల వద్ద లారీలను పట్టుకోవడంతో పాటు మండల సరిహద్దులో ఇసుక లారీలను ఆపి భా రీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఈ నె ల 27న మండలంలోని పులిమామిడి స్టేజీ సమీపంలో 11 లారీలను పట్టుకుని రూ.90 వేల ను, ఇసుక వ్యాపారం చేస్తున్న మరో ప్రైవేట్ ఉపాధ్యాయుడి వద్ద రూ.10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీస్‌బాసులకు పట్టకపోవడం గమనార్హం.
జోరుగా ఇసుక రవాణా
మండలంలో వాగు 30 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. పులిమామిడి మొదలు రాజవరం వరకు మారేపల్లి, అన్నారం, బంటోరిగూడెం, రామడుగు, చింతగూడెం, కుపాసిపల్లి, పా లెం, ఇబ్రహీంపేట, అనుముల, హాలియా, పేరూరు, చల్మారెడ్డిగూడెం మీదుగా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులో లక్షల టన్నుల ఇసుక ఉంది.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, పక్కనే పులిచింతల ప్రాజెక్టు నిర్మిస్తుండడం, సాగర్ కాల్వల ఆధునికీకరణ పుణ్యమా అని ఇసుకకు గిరాకీ పెరిగింది. దీంతో నాయకులు, వ్యాపారులు, దళారుల కళ్లు ఇసుకపై పడింది. దీంతో ఆయా వర్గాల వారు హాలియా వాగు వెంట ఉన్న గ్రామాల్లో గద్దల్లా వాలిపోతున్నారు. హాలియా వాగు వెంట ఉన్న పోలాల యజమానులతో పాటు రెవెన్యూ అధికారులకు ఆమ్యామ్యాల ఆశజూపి నయానో, భయాన్నో లొంగతీసుకుని జోరుగా ఇసుకవ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల లారీల్లో ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు రవాణా చేయడంతో హాలియా వాగు సగం లూటీ అయ్యింది. సుమారు రూ.100 కోట్ల ఇసుక తరలిపోయింది.
వారిని కాదని.. బాధ్యతలు వీరికిస్తే..
ఇసుక రవాణా నియంత్రించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలను పోలీసులకు అప్పగించింది. అయితే ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌రావు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.హాలియా వాగు నుంచి ఇసు క అక్రమ రవాణా నియంత్రించేందుకు పులి మామిడి, పెద్దగూడెం గ్రామాల సమీపంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీస్ సిబ్బందే ఇసుక వ్యాపారులతో బేరసారాలకు దిగడం గమనా ర్హం. ఇసుక లారీ దొరికితే హోంగార్డు స్థాయిలో రూ.500, కానిస్టేబుల్ రూ.1000 నుంచి రూ.5000 వేలు, ఆపైస్థాయి వారైతే రూ.5000 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ వసూళ్లకు అడ్డా
పెద్దవూర ‘వై’ జంక్షన్
పెద్దవూర ‘వై’ జంక్షన్ కూడా అక్రమ వసూళ్లకు అడ్డగా మారింది. హాలియా నుంచి ఇసుక లారీలు పెద్దవూర మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడి ‘వై’ జంక్షన్ వద్ద పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 10 రోజుల క్రితం ఈ జంక్షన్ వద్ద పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఒకరు దళితనాయకుడు, ఆయన అనుచరుడి సహాయంతో రూ.50 వేలు వ సూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అలా చేస్తే చర్యలు తప్పవు :
సీఐ ఆనంద్‌రెడ్డి, హాలియా
మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేం దుకు తగు చర్యలు తీసుకుంటున్నామని హాలి యా సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు ఇసుక మాఫియాకు సహకరించిన దాఖలాలు లేవన్నారు. అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రక్షకులా... భక్షకులా..?
Published Thu, Aug 29 2013 12:28 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement
Advertisement