lorry drivers
-
అన్న మాటలకు ఉప్పొంగిన అభిమానం
-
డ్రైవర్లంటే చంద్రబాబుకి అంత చులకనా.. 40 రోజుల్లో మెమెంటో చూపిస్తాం..
-
రోజంతా అల్లాడించి...రోడ్డెక్కిన ట్రక్కులు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్వత్రా నో స్టాక్...! రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్‌తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు. అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు. -
క్లీనర్ లేని లారీ.. నడిపేవారేరీ!
సాక్షి, అమరావతి బ్యూరో: లారీలకు రథసారథుల కొరత ఏర్పడింది. దాదాపు 15 ఏళ్లుగా డ్రైవర్ల కొరత ఎక్కువవుతోంది. ఇచ్చే జీతం కంటే.. వారికొచ్చే కమీషన్లు, ట్రిప్పుల మామూళ్లు వంటి వాటితో డ్రైవర్ల ఆదాయం మెరుగ్గా ఉండేది. మొదట్లో లారీలపై క్లీనర్లుగా చేరి ఆపై డ్రైవర్లు అయ్యేవారు. భార్యాపిల్లలకు, కుటుంబాలకు వారాల తరబడి దూరంగా ఉండాల్సి వచ్చినా.. ఆదాయం బాగుండటంతో డ్రైవర్ వృత్తి వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఆ వృత్తి చేపట్టేవారు తగ్గిపోయారు. పాత తరం డ్రైవర్లు వృద్ధాప్యానికి చేరుకోవడం, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికంగా సంభవించడం, వారి సంతానం ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడం, వీరి పిల్లలు చదువుకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు, ఇతర వృత్తులు, వ్యాపారాల వైపు మళ్లడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం వంటివి డ్రైవర్ల కొరతకు కారణమవుతున్నాయి. ఇది లారీ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో సరుకు రవాణా చేసే లారీలు 3 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 35 శాతం లారీలకు డ్రైవర్ల కొరత ఉందని యజమానులు చెబుతున్నారు. (చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..) ఇతర రాష్ట్రాల నుంచి.. లారీ యజమానులు స్వరాష్ట్రంలో డ్రైవర్లు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో అధిక జీతాలిచ్చి మరీ డ్రైవర్లను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి డ్రైవర్లు వస్తున్నారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు (ట్రాలీ డ్రైవర్లకు) చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమయానికి వీరు కూడా అందుబాటులో లేక యజమానులు అవస్థలు పడుతున్నారు. స్థానిక డ్రైవర్లు, వయసు మీరిన కొందరు దూర ప్రాంతాల కంటే లోకల్ లారీల్లో తిరగడానికే ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో డ్రైవర్ల శిక్షణ కేంద్రం లారీ డ్రైవర్ల కొరత ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడకు 32 కిలోమీటర్ల దూరంలోని అంపాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 2005లో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. 20 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు రూ.5.50 కోట్లు వెచ్చించింది. రోజుకు 8 గంటల చొప్పున 32 రోజుల పాటు పూర్తిస్థాయి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బయట డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఈ శిక్షణకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తే ఇక్కడ కేవలం రూ.6 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఈ ఇన్స్టిట్యూట్ కృష్ణా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లో డ్రైవర్ల కొరతను కొంతవరకు తీరుస్తోంది. క్లీనర్ల వ్యవస్థకు చెల్లు.. ఒకవైపు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండగా మరోవైపు క్లీనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ప్రతి లారీకి డ్రైవర్‌తో పాటు క్లీనర్ తప్పనిసరి. కానీ క్లీనర్‌గా చేరడానికి మునుపటిలా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఒక్క డ్రైవర్‌తోనే ‘బండి’ లాగిస్తున్నారు. (చదవండి: సీఎంపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదు) -
ట్యాంకర్లలో అయిల్ తక్కువగా నింపుతున్నారు
-
ప్రాణం మీదకు తెచ్చిన మందు పందెం
కోదాడ అర్బన్ : ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం తాగే విషయంలో వేసుకున్న పందెం ఓ డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన గురువారం కోదాడ లో చోటు చేసుకుంది. వివరాలు.. లారీ డ్రైవర్లు మామిడి లక్ష్మయ్య, బ్రిటిష్‌స్నేహితులు. వీరు ఉదయం లారీ అసోసియేషన్ వద్ద మద్యం తాగేం దుకు ఉపక్రమంచారు. ఆ సమయంలో వారద్దిరి మద్యం తాగే విషయంలో వాదన మొదలైంది. మామిడి లక్ష్మయ్య తాను మద్యంలో నీళ్లు కలపకుండా అరగంటలో ఫుల్‌బాటిల్ తాగుతానని బ్రిటిష్‌తో పందెం కట్టాడు. అలా తాగితే తాను రూ.5వేలు ఇస్తానని పందెం కాశాడు. ఈ సందర్భంగా వారు తాగిన తరువాత ఏదైనా జరిగితే పందెం కాసిన వారికి సంబంధం లేదని ఒక కాగితంపై రాసుకున్నారు. అనంతరం లక్ష్మయ్య పందెం ప్రకారం ఎంసీ విస్కీ ఫుల్‌బాటిల్‌ను పావుగంటలోనే తాగి పడిపోయాడు. దీంతో బ్రిటిష్ పందెం మొత్తాన్ని లక్ష్మయ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మయ్య పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రేపటి వరకు ఎలా ఉంటుందనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. మొత్తం మీద మందుపందెం ప్రాణం మీదకు తెచ్చింది. -
స్తంభించిన రవాణా
-
లారీ.. సవారీ..
రాయవరం (మండపేట): వస్తు, సామగ్రి రవాణాలో లారీలదే ప్రథమ స్థానం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లారీ పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తోంది. ఇంతటి కీలకమైన లారీ పరిశ్రమ, దానిని నమ్ముకున్న కార్మికులు, యజమానులు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నారు. లారీ నడపడానికి డ్రైవర్లు లభించక, పెరిగిన డీజిల్, పన్నులు చెల్లించలేక యజమానులు లారీలను అమ్ముకుంటున్నారు. జిల్లాలో 32వేల లారీలు.. లారీ పరిశ్రమలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఒకప్పుడు ద్వితీయ స్థానంలో ఉండగా, విజయవాడ ప్రథమస్థానంలో ఉండేది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, అనపర్తి, అమలాపురం తదితర ప్రాంతాల్లో లారీలు అధికంగా ఉన్నాయి. 30 లారీ యూనియన్ అసోసియేషన్లు ఉన్నాయి. జిల్లా నుంచి కలకత్తా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, చత్తీస్ఘడ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వీటిపై ఆధారపడి సుమారు రెండు లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారు. ఒక లారీపై 13 రకాల వృత్తులు చేసే కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. యువత అనాసక్తి.. రవాణా రంగంలో కీలకమైన లారీ రంగంలోకి డ్రైవర్లుగా ప్రవేశించడానికి యువత ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లు క్లీనరుగా పనిచేస్తే డ్రైవరుగా పదోన్నతి లభించేది. గతంలో కేవలం లారీ నడపడం వస్తే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేవారు. ప్రస్తుతం లైసెన్స్ మంజూరుకు ఉన్న నిబంధనలు కఠినతరమయ్యాయి. పదో తరగతి చదివిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్ పొందడానికి మామూళ్లు ముట్టజెప్పనిదే లైసెన్స్ చేతికి రావడం లేదన్న విమర్శలున్నాయి. హెవీ లైసెన్స్ కావాలంటే ఆర్టీవో కార్యాలయంలో రూ.16 నుంచి 20వేల వరకు ఖర్చవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు వేలాది రూపాయలు వెచ్చించి లైసెన్స్ పొందడానికి ముందుకు రావడం లేదు. లారీలు సుదూర ప్రాంతాలకు వెళితే నెలల తరబడి ఇంటికి రావడం కుదరక పోవడం, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుతుండడం, లారీలు నడిపే సమయంలో దారిదోపిడీలతో ప్రాణభయం ఉండడంతో పలువురు ఇష్టం చూపడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో డ్రైవర్లపై ప్రజలు భౌతిక దాడికి పాల్పడడం, సంఘటన స్థలంలోనే నష్టపరిహారం కోరడం తదితర కారణాలు, తమ ప్రమేయం లేకుండా ప్రమాదాలు జరిగితే తమ లైసెన్సులు రద్దవుతాయని మరికొంతమంది లారీలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో డ్రైవర్ల కొరతతో 30శాతం లారీలు ఆఫీసుల వద్దే నిలిచి పోతున్నాయి. నిర్వహణ భారమే.. లారీ నిర్వహణ ఖర్చులు యజమానికి భారంగా మారుతున్నాయి. మూడు నెలలకు ఒకసారి రూ.20వేలుగా ఉన్న ఇన్సూరెన్స్ రూ.50వేలకు చేరింది. లారీ పర్మిట్‌కు రూ.20వేలు, రాష్ట్రాల సరిహద్దుల్లో పాసింగ్కు రూ.రెండు వేలు ఉంటుంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో డీజిట్ ధర నాలుగు శాతం అధికంగా ఉంది. డీజిల్ రూపంలో నెలకు రూ.18వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వలన టైర్లు, విడిభాగాల ధరలు అధికమయ్యాయి. రూ.30వేలు ఉన్న జత టైర్ల ధర జీఎస్టీ ప్రభావంతో 45వేలు, రూ.ఐదు వేలు ఉన్న 20కేజీల గ్రీజు డబ్బా ధర రూ.ఏడు వేలకు చేరింది. విడి భాగాలపై 12శాతం, లారీల నిర్వహణపై 28శాతం జీఎస్టీ పన్నులు విధించారు. ఒక లారీకి 36 రకాల పన్నులు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశా, కలకత్తా మార్గంలో రవాణాశాఖ అధికారులు నిబంధనల పేరుతో చేస్తున్న దాడులు ఇబ్బందికరంగా ఉన్నట్టు లారీ యజమానులు వాపోతున్నారు. మరోవైపు రహదారులు అధ్వానంగా ఉండడం కూడా లారీ డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. -
కొడుకును కడతేర్చిన తండ్రి
ఎర్రుపాలెం: కన్న కొడుకును తండ్రి హత్య చేసిన సంఘటన ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి లక్ష్మయ్య, ప్రభాకర్(30) తండ్రీ కొడుకులు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరూ లారీ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. రోజూ ఇద్దరు మద్యం సేవించి గొడవలకు దిగడం పరిపాటి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి లక్ష్మయ్య తన భార్యతో కలిసి అదే గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడు. అయితే ప్రభాకర్ భార్య అంజలితో మనస్పర్థలుండటంతో ఆమె ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. తండ్రి లక్ష్మయ్య అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్తున్నానని భార్యకు చెప్పి.. కొడుకు ప్రభాకర్ నిద్రిస్తున్న సొంత ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలపై కర్రతో తీవ్రంగా కొట్టాడు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రభాకర్ మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్ భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసి.. కేసు నమోదు చేశారు. మధిర సీఐ శ్రీధర్‌కి సమాచారం ఇవ్వడంతో ఆయన హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి విచారించారు. హత్య కేసులో సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
లారీలు సీజ్: పోలీసుల అదుపులో డ్రైవర్లు
గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 58 లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం లారీ డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం డిపో వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనిట్ ముందు లారీ డ్రైవర్లు శుక్రవారం నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడి యూనిట్‌కు సరఫరా జరుగుతోంది. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలను రోడ్డుపై నిలపడానికి పోలీసులు అనుమతించడం లేదు. అదే సమయంలో డిపోలోకి రావడానికి అధికారులు ఒప్పుకోవడం లేదు. వీరి వైఖరికి నిరసనగా సుమారు 50 లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో మద్యం డిపో అధికారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. -
మూడు రోజులుగా అక్కడే పడిగాపులు
-
తను మరణించినా.. ఐదుగురికి అవయవదానం
విశాఖపట్టణం: విశాఖకు చెందిన ఓ మహిళ బ్రెయిన్ డెడ్ కాగా ఆమె అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ కలుగనుంది. వివరాలివీ... విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆర్.రమణమ్మ(48) ఈనెల 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక కేర్ ఆస్పత్రిలో చేర్పించగా రాత్రి 8 గంటల సమయంలో బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. జీవన్‌దాన్ అధికారులు రమణమ్మ ఇద్దరు కుమారులతో మాట్లాడి, ఆమె అవయవదానానికి అంగీకరింపజేశారు. ఆమె రెండు కిడ్నీలను విశాఖలో కేర్, అపొలో ఆస్పత్రుల్లో అవసరమున్న ఇద్దరు రోగులకు ఇచ్చేందుకు సమ్మతించారు. నేత్రదానానికి కూడా సమ్మతించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు లివర్, ఊపిరితిత్తులను అమర్చడానికి సమ్మతించారు. దీంతో ఆ మేరకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం హెలికాప్టర్లో లివర్, ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాగా, రమణమ్మ కుటుంబం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం నుంచి విశాఖకు వలస వచ్చింది. ఆమె భర్త లారీ క్లీనర్ కాగా కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా కుమారులు కృష్ణంరాజు, శ్రీనివాసరాజు లారీ డ్రైవర్లుగా స్థిరపడ్డారు. -
హైవే కిల్లర్స్..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఖరీదైన లోడుతో రోడ్డెక్కాలంటే లారీడ్రైవర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు లారీని హైజాక్ చేసి హత్య చేస్తారోనని భయపడుతున్నారు. అందుకు వరస సంఘటనలే నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా లారీలు హైజాక్‌కు గురవుతున్నాయి. దొంగలముఠా చేతిలో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. సినీపక్కీలో జరుగుతున్న లారీల హైజాక్ ముఠాలోని కొందరిని గురువారం తడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే లారీ హైజాక్ చేసే ముఠాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు రోజుల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీలు సామాన్లు తరలించే లారీ దొరవారిసత్రం వద్ద హైజాక్ గురైంది. లారీ డ్రైవర్‌ను దొంగలముఠా నమ్మించి మద్యం తాపించి హత్య చేసి క్యాబిన్లో దాచారు. వీరిని కావలి పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా గతంలో మరో లారీని హైజాక్ చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను చంపి గూడూరు వద్ద పాతిపెట్టిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇకపోతే నెల్లూరు నవలాకులతోట వద్ద సోమవారం వేణుగోపాల్‌రావు లారీ కనిపించకుండా పోయింది. ఆ లారీ రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా వద్ద కనిపించింది. అయితే అందులో సామాన్లు, టైర్లు పట్టుకెళ్లారు. వారెవరనేది తెలియరాలేదు. ఏడాది క్రితం తడ పరిధిలోని సరిహద్దు పంచాయతీలు, పెరియవట్టు, పన్నంగాడు వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు లారీలు అపహరణకు గురయ్యాయి. ఇందులో కలకత్తా నుంచి చాక్లెట్ల లోడుతో ఓ మినీ లారీ, ఇండోర్ నుంచి ఇనుప కడ్డీల లోడుతో వెళుతున్న మరో లారీని అపహరించుకు వెళ్లారు. ఇందులో ఇనుప కడ్డీల లారీ సరుకు లేకుండా చిత్తూరు జిల్లా పరిధిలో రోడ్డు పక్కన ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోడు లారీకి సంబంధించి పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకు రెండు లారీలను ఒకే ముఠా అపహరించిందని భావించిన పోలీసులు ఈ ముఠా అరెస్టు తర్వాత ఇది రెండు వేర్వేరు ముఠాల పనిగా గుర్తించారు. కానీ ఇనుపలోడ్డు లారీకి సంబంధించిన దొంగల ఆచూకీ మాత్రం లభించలేదు. హైజాక్ ముఠాలు... లారీలను హైజాక్ చేసే ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై, ఒంగోలు, పలమనేరుకు చెందిన ముఠాలు ఇటువంటి పనుల్లో ఆరితేరిన వారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరు స్టీలు సామాన్లు, ఐరన్ ఓర్, ఇనుప సామగ్రితో దూర ప్రాంతాలకు తరలివెళ్తున్న లారీలే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. ఈ ముఠాలు లోడు చేస్తున్న వివిధ పరిశ్రమల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. డ్రైవర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతడిని ట్రాప్ చేస్తారు. అలా కుదరని పక్షంలో కిడ్నాప్‌చేసి హత్యచేసి లారీని అపహరించుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు జిల్లా పలమనేరు ముఠా లారీలను అపహరించుకెళ్లేవారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాకు శ్రీరాములు లీడర్‌గా వ్యవహరించేవాడు. పలమనేరు ముఠాను గతంలో తమిళనాడు ప్రాంతంలోని తూతుకూడి పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన మున్నా ముఠా కూడా లారీలను హైజాక్ చేసే వారని తెలిసింది. ఒక్కో ముఠాలో సుమారు 10 మంది సభ్యులు ఉంటారని తెలిసింది. వీరిలో కొందరు రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో కాపుకాచి ఉంటారు. లారీ లోడుతో బయలుదేరుతూనే ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు. పథకం ప్రకారం లారీని హైజాక్ చేస్తారు. మాట వినని లారీ డ్రైవర్, క్లీనర్‌ను కత్తితోనో.. ప్లాస్టిక్ వైర్లతో హత్యచేసి రహస్య ప్రాంతాల్లో పాతిపెట్టి లారీతో ఉడాయిస్తారని నిఘావర్గాలు వెల్లడించాయి. తాజా గా తడ వద్ద పట్టుబడ్డ హైజాక్ ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన వివిధ లారీల చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తెలిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తదితర ప్రాంతాలలో జరిగిన ఇలాంటి నేరాలతో వీరికి ఉన్న సంబందాలు ఉన్నాయా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. -
ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన
కుషాయిగూడ (హైదరాబాద్‌సిటీ) : లారీ డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల దందాలను నిరసిస్తూ చక్రిపురం ఇసుక లారీల అడ్డా వద్ద బ్రిక్స్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రోడ్డు పక్కన నిలిపిన లారీలకు సైతం వేల రూపాయలు చలానాలు రాస్తున్నారని ఆరోపించారు. మామూళ్లు ఇవ్వకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతూ వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి నెల మామూళ్లు చెల్లించగానే ట్రాఫిక్ పోలీసులు జారీ చేస్తున్న కార్డులు, వారు విధిస్తున్న జరిమానా పత్రాలను మీడియాకు చూపారు. కార్యక్రమంలో ప్రతినిధులు నాను నాయక్,బిచ్చానాయక్, ప్రశాంత్,బాలజీ, పాండు, బిక్షపతి, లింగానాయక్, మాన్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆసరా’ లేదని దిగులు చెందవద్దు
సిద్దిపేట జోన్: పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగినా పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రక్రియను మళ్లీ ప్రారంభించామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసరా పథకం కింద పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో నిర్వహించిన సభల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ ప్రక్రియ గత నెలలోనే నిర్వహించాల్సి ఉందన్నారు. అర్హులందరికి ఆసరా వర్తింపజేసే విషయంలో జాప్యం జరిగినా నెల రోజుల పాటు విస్తృతంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టామన్నారు. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని, జాబితాలో అర్హులు తమ పేరు లేదంటూ దిగులు చెందవద్దన్నారు. అవసరమైతే వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పథకం కింద 20 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 4 వేల కోట్లను కేటాయించిందని, మరోవైపు ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. జనవరి నెలలో బియ్యం కోటాను 6 కిలోలకు పెంచుతూ కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా రేషన్ బియ్యాన్ని అందిస్తామన్నారు. ఇందు కోసం రూ. 3 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద వర్గాల సంక్షేమానికి మొత్తంగా రూ. 7 వేల కోట్లతో బియ్యం, పింఛన్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట ప్రాంతాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు రైల్వే లైన్‌ను సాధ్యమైనంత త్వరలో సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, మున్సిపల్ మేనేజర్ నరేందర్, టీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, నయ్యర్, మల్లికార్జున్, షఫీకూర్ రహమాన్, సాయిరాం, కనకరాజు, సంపత్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, శేషుకుమార్, శ్రీనివాస్‌గౌడ్, రవితేజ, ప్రభాకర్ పాల్గొన్నారు. లారీ డ్రైవర్లకు బీమా -మంత్రి హామీ సంగారెడ్డి అర్బన్: లారీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయడానికి తన వంతు కృషి చేస్తానని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సంగారెడ్డిలో తెలంగాణ లారీ ఓనర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండబోవన్నారు. డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నిరుపేద లారీ కార్మికులకు సొంత స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ లారీ కార్మికుల జీవితం ప్రమాదంతో కూడుకున్నదని, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లారీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాసిత్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌చారి, జలాలుద్దిన్ బాబా, లియాఖత్, అసోషియేషన్ నాయకులు నయీమొద్దీన్ ఎజాస్పాష, అబూబాకత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. -
దారికాచి.. కత్తులతో బెదిరించి
షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులో శుక్రవారం అర్ధరాత్రి దారిదోపిడీ దొంగలు హల్చల్ చేశారు. మూడు లారీలను ఆపి కత్తులు, గొడ్డళ్లు చూపిస్తూ లారీ డ్రైవర్ల వద్ద అందిన కాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డుపై మూడు అడుగుల ఎత్తున గడ్డి కనిపించింది. అదే సమయంలో షాద్‌నగర్ నుంచి పరిగి వైపు వెళ్తున్న మూడు లారీలు వాటిని దాటలేక ఆగిపోయాయి. అక్కడే చెట్ల పొదల్లో దాగి ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లారీ డ్రైవర్లకు కత్తులు, గొడ్డలి చూపిస్తూ బెదిరించారు. వాహనాల లైట్లు ఆర్పించిన అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులివ్వాలని హెచ్చరించారు. ప్రాణభయంతో వారివద్ద ఉన్న సుమారు రూ.16వేల నగదును దొంగల చేతిలో పెట్టగా క్షణాల్లో వాటిని తీసుకొని పొదల్లోకి వెళ్లి పారిపోయారు. సంఘటననుంచి తేరుకున్న లారీ డ్రైవర్లు తమ సెల్‌ఫోన్ ద్వారా 100 నంబరుకు డయల్ చేసి పోలీసులకు విషయం తెలియచేశారు. సంఘటన స్థలానికి కొందుర్గు ఎస్ఐ సత్యనారాయణ చేరుకొని పరిశీలించారు. ఎస్ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి వచ్చే వరకు రోడ్డుపై ఉన్న గడ్డిని తొలగించకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఆర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం ఆయన సిబ్బందితో ట్రాఫిక్ క్లియర్ చేయించి సమీపంలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో విచారించారు. లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పలమనేరు, నరహరిపేట చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు
రూ.1.12 లక్షలు స్వాధీనం ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు పలమనేరు/గుడిపాల: పలమనేరు, గుడిపాల సమీపంలో టని ఆర్టీవో, ఏసీటీవో చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. లెక్కకు మించి డబ్బులున్నట్టు గుర్తిం చారు. ఓ ప్రైవేటు ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నా రు. నాలుగు నెలల క్రితం పలమనేరు చెక్‌పోస్టులో ఏసీ బీ అధికారులు దాడులు జరిపి రూ.లక్ష వరకు లెక్కకు మించిన డబ్బును సీజ్ చేయడంతో పాటు కొందరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో పలమనేరులోని ఏసీటీవో, పక్కనే ఉన్న ఆర్టీవో చెక్‌పోస్టులలో రెండు బృందాలుగా సోదాలు నిర్వహించారు. అక్కడున్న రికార్డులను పూర్తిగా పరిశీలించారు. ఈ రెండు చెక్‌పోస్టులలోనూ లెక్కకు మించి రూ.70 వేలు అధికంగా ఉన్నట్టు గుర్తిం చారు. దీనిపై సంబంధిత చెక్‌పోస్టు అధికారులు ఏసీటీవో గుర్రప్ప, ఆర్టీవో సుధాకర్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. లారీ డ్రైవర్లు, వాహన యజమానుల నుం చి అధిక మొత్తంలో వసూలు చేయడంతోనే అదనంగా నగదు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రైవే ట్ ఏజెంట్ మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు. రికార్డుల పరిశీలన పూర్తిస్థాయిలో జరిగాక బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్‌రావ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా గుడిపాలలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ విజయపాల్, సీఐలు రామ్‌కిషోర్, సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్ ఆదివారం తెల్లవారుజామున దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చెక్‌పోస్టులో రవాణా, కమర్షియల్, సివిల్ సప్లరుు, ఫారెస్ట్, ఎక్సైజ్, మార్కెట్ శాఖలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం లో ఉన్న ఏసీటీవో గెస్ట్‌హౌస్‌లో అనధికారికంగా ఉన్న రూ.19,190లను అధికారులు పట్టుకున్నారు. అలాగే వాహనదారులు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో రూ. 8,580 మామూళ్లు ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు కూర్చొగా రూ.14,110 వచ్చింది. మొత్తం రూ.42 వేలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. అవినీతిపై సమాచారం ఇవ్వండి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చేవారు 9440446190, 9440446120, 9440446191, 9440446138 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. -
లారీ డ్రైవర్లపై దోపిడి దొంగలు దాడి
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అరుగోలను సమీపంలో గత అర్థరాత్రి దోపిడి దొంగలు హల్చల్ సృష్టించారు. మచిలీపట్నం - హనుమాన్ జంక్షన్ రహదారిపై వెళ్తున్న లారీని ఆపి దొంగలు నగదు డిమాండ్ చేశారు. తమ వద్ద చాలా తక్కువ మొత్తంలో నగదు ఉందని లారీలోని ఇద్దరు డ్రైవర్లు దొంగలకు తెలిపారు. దాంతో ఆగ్రహాంచిన దొంగలు డ్రైవర్లతోపాటు లారీలోని క్లీనర్‌పై దాడి చేశారు. అనంతరం దోపిడి దొంగలు అక్కడి నుంచి పరారైయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో వారిని విజయవాడ తరలించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. -
లారీ క్లీనర్ దారుణ హత్య
బిట్రగుంట, న్యూస్‌లైన్: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఇద్దరు లారీ డ్రైవర్లు తమ వద్ద పనిచేసే క్లీనర్‌ను దారుణంగా హత్య చేశారు. పది మందీ చూస్తుండగానే కర్రలతో మోది, నేలకేసి బాది అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశారు. కప్పరాళ్లతిప్ప కూడలిలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బె ంగాల్ నుంచి రెండు లారీలు టీపొడి లోడుతో బెంగళూరు వెళుతున్నాయి. ఈ రెండు లారీలకు క్లీనర్‌గా అదే రాష్ట్రం హౌరాలోని బజ్రోనాథ్ లాహరి లేన్ ప్రాంతానికి చెందిన ముఖుల్ ఘాజీ (28), డ్రైవర్లుగా రఘునాథ్ రాయ్, హరేంద్ర సింగ్ ఉన్నారు. గౌరవరం దాబా హోటళ్ల వద్ద మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ముగ్గురూ కలసి పూటుగా మద్యం సేవించి భోజనాలు చేశారు. ఈ క్రమంలో క్లీనర్, డ్రైవర్లకు మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణగా మారింది. లారీలు కప్పరాళ్లతిప్ప వద్దకు వచ్చేసరికి వివాదం పెద్దది కావడంతో తిప్ప వద్ద పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే లారీలు నిలిపివేశారు. అనంతరం క్లీనర్ ముఖుల్ ఘాజీపై డ్రైవర్లు రఘునాథ్ రాయ్, హరేంద్ర సింగ్ దాడికి దిగారు. కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. డ్రైవర్లు ఇద్దరూ క్లీనర్ కాళ్లు, చేతులూ పట్టుకుని నేలకేసి పలుమార్లు బాదటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం గమనించిన స్థానికులు, ఆటోడ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించి క్లీనర్‌ను ఆటోలో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని లారీలను స్టేషన్‌కు తరలించారు. ఎస్సై మాలకొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సమ్మె బాట!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని తిరుచ్చి నుంచి దక్షిణాదిలోని పలు జిల్లాలకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఇక్కడ ఏ ఆందోళన మొదలైనా ఇతర రీజియన్లకు పాకుతుంది. దీపావళి సందర్భంగా ఇవ్వాల్సిన బోనస్ కోసం ఇక్కడి లారీ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. అధికారులు దిగిరాక తప్పలేదు. అయితే, బోనస్ నినాదంతో ఆందోళనకు ఉసిగొల్పిన పలువురు డ్రైవర్లపై వేటు వేశారు. వీరిని మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ డ్రైవర్లు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. వీరికి మద్దతుగా ఇతర రీజియన్లలోని డ్రైవర్లు గళం విప్పుతున్నారు. ఈ ఆందోళనలతో తరచూ గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో గత వారం ఐవోసీ ఉన్నతాధికారి శివరాజన్ నేతృత్వంలో చర్చలకు నిర్ణయించారు. అయితే, తిరుచ్చి కేంద్రానికి చెందిన ఐవోసీ అధికారులు గానీ, లారీ యజమానులు గానీ రాలేదు. కాంట్రాక్టు కింద పనిచేస్తున్న డ్రైవర్లు మాత్రం వచ్చి నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో సోమవారం ముత్తు స్వామి, కుమరేషన్, పాండియన్, సుబ్రమణ్యం తదితర నలుగురు డ్రైవర్లను ఉన్నట్టుండి తొలగించారు. దీంతో డ్రైవర్లలో ఆగ్రహం రేగింది. ఒకరి తర్వాత మరొకర్ని తొలగిస్తూ వెళుతుండటాన్ని తీవ్రంగా పరిగణించారు. సమ్మె బాట పట్టారు. ఎక్కడి లారీలను అక్కడే నిలిపి వేశారు. దీంతో ఈ కేంద్రం నుంచి పలు జిల్లాలకు వెళ్లాల్సిన యాభై వేల సిలిండర్ల సరఫరా ఆగింది. తమ వాళ్లను విధుల్లోకి తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని డ్రైవర్లు ప్రకటించడంతో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం నెలకొంది. పండుగ సమీపిస్తున్న సమయంలో దక్షిణాదిలో బయలు దేరిన ఈ డ్రైవర్ల సమ్మె బాట ఉత్తరాది జిల్లాలకు పాకిన పక్షంలో గ్యాస్ కొరతను వినియోగదారులు ఎదుర్కోవాల్సిందే. -
ఆటో,లారీ ఢీ.. ఒకరి దుర్మరణం
మేళ్లచెరువు, న్యూస్‌లైన్ : ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేళ్లచెరువు నుంచి ఐదుగురి ప్రయాణికులతో ఓ ఆటో హుజూర్నగర్ వైపు బయలు దేరింది. గ్రామశివారులోకి వెళ్లగానే మేళ్లచెరువు వైపు వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ, ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇట్టిమళ్ల శ్రీను (30)కి తీవ్ర గాయాలు కాగా, వి.వెంకటయ్య, ఆర్.వన మ్మ, నేరెళ్ల హుస్సేన్, శ్రీనుబాబు, ఆటో డ్రైవర్ ఒగ్గు విశాఖకు గాయాలయ్యాయి. స్థానికులు 108, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్నగర్ వైద్యశాలకు తరలించారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన ఇట్టిమళ్ల శ్రీను మార్గమధ్యలో మృతి చెందాడు. మండలంలోని రామాపురానికి చెందిన ఇతడికి భార్య తులశమ్మ ఉన్నది. కాగా గాయపడిన వారికి హుజూర్నగర్ వైద్య శాలలో చికిత్స నిర్వహిస్తున్నారు. మృతుడి బంధువు పాశం రాములు ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సక్రాం తెలిపారు -
రక్షకులా... భక్షకులా..?
హాలియా, న్యూస్‌లైన్: సాధారణ పౌరుడైనా ఇతరుల వద్ద డబ్బులు బలవంతంగా లాక్కుంటే అది తప్పు, చట్టరీత్యా నేరం. కానీ అదే పోలీసులు ఇసుక లారీ డ్రైవర్ల వద్ద బలవంతంగా డబ్బు లు లాక్కుంటే అదే న్యాయం. ఇదీ అనుముల మండలంలో జరుగుతున్న తంతు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచే చేను మేస్తోం ది. ఇసుక అక్రమ రవాణాను అటికట్టాల్సిన పోలీసులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయంలో ఇసుక లారీల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఇసుక డంపుల వద్ద లారీలను పట్టుకోవడంతో పాటు మండల సరిహద్దులో ఇసుక లారీలను ఆపి భా రీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఈ నె ల 27న మండలంలోని పులిమామిడి స్టేజీ సమీపంలో 11 లారీలను పట్టుకుని రూ.90 వేల ను, ఇసుక వ్యాపారం చేస్తున్న మరో ప్రైవేట్ ఉపాధ్యాయుడి వద్ద రూ.10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీస్బాసులకు పట్టకపోవడం గమనార్హం. జోరుగా ఇసుక రవాణా మండలంలో వాగు 30 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. పులిమామిడి మొదలు రాజవరం వరకు మారేపల్లి, అన్నారం, బంటోరిగూడెం, రామడుగు, చింతగూడెం, కుపాసిపల్లి, పా లెం, ఇబ్రహీంపేట, అనుముల, హాలియా, పేరూరు, చల్మారెడ్డిగూడెం మీదుగా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులో లక్షల టన్నుల ఇసుక ఉంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, పక్కనే పులిచింతల ప్రాజెక్టు నిర్మిస్తుండడం, సాగర్ కాల్వల ఆధునికీకరణ పుణ్యమా అని ఇసుకకు గిరాకీ పెరిగింది. దీంతో నాయకులు, వ్యాపారులు, దళారుల కళ్లు ఇసుకపై పడింది. దీంతో ఆయా వర్గాల వారు హాలియా వాగు వెంట ఉన్న గ్రామాల్లో గద్దల్లా వాలిపోతున్నారు. హాలియా వాగు వెంట ఉన్న పోలాల యజమానులతో పాటు రెవెన్యూ అధికారులకు ఆమ్యామ్యాల ఆశజూపి నయానో, భయాన్నో లొంగతీసుకుని జోరుగా ఇసుకవ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల లారీల్లో ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు రవాణా చేయడంతో హాలియా వాగు సగం లూటీ అయ్యింది. సుమారు రూ.100 కోట్ల ఇసుక తరలిపోయింది. వారిని కాదని.. బాధ్యతలు వీరికిస్తే.. ఇసుక రవాణా నియంత్రించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలను పోలీసులకు అప్పగించింది. అయితే ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌రావు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.హాలియా వాగు నుంచి ఇసు క అక్రమ రవాణా నియంత్రించేందుకు పులి మామిడి, పెద్దగూడెం గ్రామాల సమీపంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీస్ సిబ్బందే ఇసుక వ్యాపారులతో బేరసారాలకు దిగడం గమనా ర్హం. ఇసుక లారీ దొరికితే హోంగార్డు స్థాయిలో రూ.500, కానిస్టేబుల్ రూ.1000 నుంచి రూ.5000 వేలు, ఆపైస్థాయి వారైతే రూ.5000 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లకు అడ్డా పెద్దవూర ‘వై’ జంక్షన్ పెద్దవూర ‘వై’ జంక్షన్ కూడా అక్రమ వసూళ్లకు అడ్డగా మారింది. హాలియా నుంచి ఇసుక లారీలు పెద్దవూర మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడి ‘వై’ జంక్షన్ వద్ద పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 10 రోజుల క్రితం ఈ జంక్షన్ వద్ద పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఒకరు దళితనాయకుడు, ఆయన అనుచరుడి సహాయంతో రూ.50 వేలు వ సూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలా చేస్తే చర్యలు తప్పవు : సీఐ ఆనంద్‌రెడ్డి, హాలియా మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేం దుకు తగు చర్యలు తీసుకుంటున్నామని హాలి యా సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు ఇసుక మాఫియాకు సహకరించిన దాఖలాలు లేవన్నారు. అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.