
ప్రతీకాత్మక చిత్రం
కోదాడ అర్బన్ : ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం తాగే విషయంలో వేసుకున్న పందెం ఓ డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన గురువారం కోదాడ లో చోటు చేసుకుంది. వివరాలు.. లారీ డ్రైవర్లు మామిడి లక్ష్మయ్య, బ్రిటిష్‌స్నేహితులు. వీరు ఉదయం లారీ అసోసియేషన్ వద్ద మద్యం తాగేం దుకు ఉపక్రమంచారు. ఆ సమయంలో వారద్దిరి మద్యం తాగే విషయంలో వాదన మొదలైంది. మామిడి లక్ష్మయ్య తాను మద్యంలో నీళ్లు కలపకుండా అరగంటలో ఫుల్‌బాటిల్ తాగుతానని బ్రిటిష్‌తో పందెం కట్టాడు. అలా తాగితే తాను రూ.5వేలు ఇస్తానని పందెం కాశాడు.
ఈ సందర్భంగా వారు తాగిన తరువాత ఏదైనా జరిగితే పందెం కాసిన వారికి సంబంధం లేదని ఒక కాగితంపై రాసుకున్నారు. అనంతరం లక్ష్మయ్య పందెం ప్రకారం ఎంసీ విస్కీ ఫుల్‌బాటిల్‌ను పావుగంటలోనే తాగి పడిపోయాడు. దీంతో బ్రిటిష్ పందెం మొత్తాన్ని లక్ష్మయ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మయ్య పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రేపటి వరకు ఎలా ఉంటుందనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. మొత్తం మీద మందుపందెం ప్రాణం మీదకు తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment