Kodhada
-
మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు.. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రులు కూడా
సాక్షి, నల్గొండ: స్నేహితుల సరదా పందెం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతిచెందగా ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు కూడా కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన బుధవారం కోదాడలో వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కొండపల్లి శ్రీనాథ్, గౌతమి దంపతులకు కృష్ణకాంత్, శివ(29) సంతానం. శ్రీనాథ్ న్యాయవాదిగా, గౌతమి ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. కృష్ణకాంత్ ఉన్నత విద్య అభ్యసించి న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగా శివ డిగ్రీ అభ్యసిస్తున్నాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఎనిమిదేళ్ల క్రితం శివ స్నేహితులతో కలిసి కోదాడ పెద్ద చెరువు గుట్టపై పార్టీ చేసుకున్నారు. మద్యం అలవాటు లేని శివతో స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం చీకటి పడడంతో బైక్‌లపై అందరూ ఇళ్లకు బయలుదేరారు. సరదా పందెంతో ప్రమాదం బారిన పడి.. కాగా, స్నేహితులందరూ బైక్‌కు లైట్లు వేసుకోకుండా ఇళ్లకు ఎవరు ముందు వెళ్తే వారు పార్టీ ఇవ్వాలని పందెం పెట్టుకున్నారు. దీంతో మార్గమధ్యలో శివ బైక్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో పాటు నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కోదాడతో పాటు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. కుమారుడి దీనస్థితి చూడలేక ఏడాది క్రితం తండ్రి శ్రీనాథ్ కన్నుమూయగా ఆరు నెలల క్రితం తల్లి కూడా మృతిచెందింది. సోదరుడి సంరక్షణలో చికిత్స పొందుతున్న శివ కూడా మృత్యువును జయించలేక మంగళవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు సోదరుడు కూడా మృతిచెందడంతో ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. -
పన్నేండేళ్ల బాలుడికి మాయదారి రోగం.. కుమారుడిని బతికించాలని వేడుకోలు
సహచర మిత్రులతో సరదాగా గడపాల్సిన ఆ బాలుడిని మాయదారి రోగం (లుకేమియా) దహిస్తోంది. రోజురోజుకూ ఒంట్లోని రక్తం తగ్గుతుండడంతో పసివాడు నరకయాతన అనుభవిస్తున్నాడు. వైద్యం చేయించే స్థోమత తండ్రికి లేకపోవడంతో మనసున్న మారాజులు ముందుకు వచ్చి కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నాడు. సాక్షి, కోదాడ(నల్గొండ): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన చేకూరి రమేష్‌కు కుమార్తె శ్రీవల్లి (14), కుమారుడు సాగర్ ఉన్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది, ఏడవ తరగతి చదుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమేష్ భార్య కొన్నేళ్ల క్రితం విడిపోయి వేరేగా ఉంటోంది. రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. సాగర్ అనారోగ్యం బారిన పడడంతో.. కొంతకాలంగా సాగర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. వంట్లో నలతగా భావించి తండ్రి స్థానికంగా వైద్యం చేయించేవాడు. అయితే, ఏప్రిల్ సాగర్ ఆరోగ్యం పూర్తిగా క్షణించిడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించడంతో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)గా వైద్యులు నిర్ధారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా 45రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. చదవండి: రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్! వైద్య పరీక్షలకే అప్పుచేసి.. రమేష్‌ది పేద కుటుంబం. అతడికి ఇతడి ఉండేందుకు ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. లారీ డ్రైవర్‌గా వెళ్లిన క్రమంలో సోదరుడి ఇంట్లో పిల్లలను ఉంచి జీవనం సాగిస్తున్నాడు. ఉన్నపలంగా కుమారుడు అనారోగ్యం బారిన పడడంతో డ్రైవర్ విధులకు వెళ్లకుండా బాలుడి బాగోగులు చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సాగర్ వైదానికి తన వద్ద ఉన్న కొద్ది మొత్తంతో పాటు అప్పు చేసి నెట్టుకొచ్చాడు. 9నెలల పాటు వైద్యం అందితేనే.. లుకేమియా(బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న సాగర్‌కు రెండు రోజులకు ఒకమారు పరీక్షలు నిర్వహించి అవరం మేరకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అలా తొమ్మిది నెలల పాటు చికిత్స అందితేనే మహమ్మారి బారి నుంచి బయటపడతానని పేర్కొంటున్నారు. అందుకు రూ. 5లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలిపారు. అంతపెద్ద మొత్తం తన వద్ద లేదని ఓ వైపు కుమారుడి వేదన చూడలేకపోతున్నానని, రోదించడం తప్ప మరే దారి కనిపించడం లేదని వాపోతున్నాడు. దయార్థ హృదయం కల వారెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తన కొడుకు ప్రాణాలు దక్కుతాయని రమేష్ ప్రాథేయపడుతున్నాడు. కొడుకు ప్రాణాలు కాపాడాలి ఒక్కగానొక్క కొడుకు మాయదారి జబ్బు బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నాది నిరుపేద కుటుంబం. పూర్తిస్థాయిలో వైద్యం అందించే స్థోమత నాకు లేదు. దానగుణం గల వ్యక్తులు స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడాలి. పూర్తిస్థాయిలో వైద్యం అందాలంటే రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. – చేకూరి సాగర్, చిన్నారి తండ్రి, ఆకుపాముల సాయం చేయాలనుకుంటే.. సాగర్ సోదరుడు బాలాజీ బ్యాంకు ఖాతా : 30543275599 ఎస్బీఐ, ఆకుపాముల బ్రాంచి ఐఎఫ్ఎస్సి కోడ్ : ఎస్బీఐయన్0002562 ఫోన్‌పే, గూగుల్‌పే నెం : 96761 37554 -
మరో మహిళతో సఖ్యత.. భారీ స్కెచ్.. డామిట్ కథ అడ్డం తిరిగింది..
సాక్షి, కోదాడ : మద్యం తాగి ఆస్తిని తగలేస్తున్నాడని.. మరో మహిళతో కూడా సఖ్యతగా మెలుగుతున్నాడని ఓ మహిళ భర్తపై కోపం పెంచుకుంది. ఆస్తిని రక్షించుకునేందుకు చివరకు అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. మరికొందరి సహకారం తీసుకుని ప్రణాళిక ప్రకారం దాడి చేసినా బాధితుడు తప్పించుకున్నాడు. డామిట్ కథ అడ్డం తిరిగినట్లు చివరకు హత్యాయత్నం కుట్రలో సూత్రధారి అయిన భార్యతో పాటు సహకరించిన మరో ఎనిమిది మంది కటకటాలపాలయ్యారు. బుధవారం రూరల్ ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వు మండలం రామాపురం గ్రామానికి చెందిన మేకల సత్యనారాయణ, అతడి భార్య కనకదుర్గకు ఆస్తి విషయంలో గొడవలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కనకదుర్గ కోదాడలో తనకు తెలిసిన ఓ యూట్యూబ్ చానల్ విలేకరిగా పనిచేస్తున్న గంధం వెంకటనారాయణను సంప్రదించింది. వారిద్దరూ సహకారం అందించాలని న్యాయవాది పాలేటి రామారావును కోరారు. మా డ్రైవర్ వీరబాబు అయితే ఇలాంటి పనులు చేస్తాడని రూ.50వేలకు హత్య చేసేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వీరబాబు తనకు తెలిసిన త్రివేణిబాబుతో పాటు హుజూర్‌నగర్‌కు చెందిన గోపి, హనీ, అనంతగిరికి చెందిన జానీ వెల్లటూరుకు చెందిన శ్రీనులకు విషయం చెప్పి అతడి ఫొటో చూపించి హత్యకు ప్లాన్ వేశారు. కారు ఆపి.. ఇనుప రాడ్లతో దాడి చేసి.. సత్యనారాయణ గత డిసెంబర్ 7న రామాపురం వెళ్తున్న విషయాన్ని నిందితులు తెలుసుకున్నారు. రామాపురం నుంచి తిరిగి కారులో కోదాడ వైపునకు వస్తున్నాడని తెలుసుకుని రాత్రి ఏడు గంటల సమయంలో కోదాడ మండలం కూచిపూడి శివారులో బైక్‌లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కారును అడ్డగించి అద్దాలు పగొలగొట్టి బయటకు లాగి రాడ్లతో తీవ్రంగా కొట్టారు. ఆ కారులో ఉన్న మరో మహిళ అరవడంతో సత్యనారాయణ చనిపోయాడులే అని అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం విషయాన్ని న్యాయవాదికి తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు విచారణ చేపట్టారు. ఈ కేసులో సెల్‌ఫోన్ కాల్‌డేటాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్యాయత్నం కేసును ఛేదించారు. హత్యలో భాగస్వాములుగా ఉన్న 9మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేస్తేనే అంబులెన్స్‌ల అనుమతి
సాక్షి, నల్గొండ: రాష్ట్ర సరిహద్దు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఏపీనుంచి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అంబులెన్స్‌ల తనిఖీ రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. సోమవారం కోవిడ్ పేషంట్ అడ్మిట్ అయ్యే వైద్యశాలలో బెడ్ ఉన్నట్లు అనుమతి పత్రాలు చూపితే పంపిన పోలీసులు రెండో రోజు మాత్రం ఇంకా కఠినంగా వ్యవహరించారు. అనుమతి పత్రాలు చూపిస్తే సరిపోదు బెడ్ ఉన్నట్లు సంబంధిత వైద్యశాలల ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్‌నుంచి తమతో మాట్లాడిస్తేనే పంపిస్తామని తెలిపారు. కొందరికి వెంటనే ఆ విధంగా ఫోన్లో స్పందించడంతో వదిలారు. మరికొద్ది మందికి ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్లు రావడం ఆలస్యం కావడంతో పోలీసులతో రోగుల బంధువులు వాగ్వాదానికి దిగారు. ఫోన్ చేసేందుకు దాదాపుగా 40 నిమిషాలు ఆలస్యం కావడంతో పక్కకు ఓ అంబులెన్స్ ఆపివేశారు. పేషంట్‌తో పాటు ఉన్న ఆక్సిజన్ సిలిండర్ సరిపడా ఉండదని, గమ్యానికి చేరుకునే సమయాన్ని అంచనా వేసి ఆక్సిజన్ పెట్టి పంపిస్తుంటారని పేషంట్ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు గంటలు గంటలు ఇక్కడ ఆపి తమను ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడపల్లి సరిహద్దు వద్ద అంబులెన్స్‌ల నిలిపివేత దామరచర్ల : రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మండలంలోని వాడపల్లి కృష్ణానది వంతెన చెక్ పోస్టు వద్ద ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను రెండో రోజు మంగళవారం కూడా నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి కరోనా బాధితులతో వస్తున్న అంబులెన్స్‌లు, ఇతర వాహనాలను నిలిపి వేస్తున్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రోగులు చేరేందుకు ముందస్తు అనుమతులు తీసుకున్న వాహనాలను మాత్రం అనుమతి ఇస్తున్నారు. ఇతర వాహనాలను తిప్పి పంపు తున్నారు. -
వైరల్‌గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో
సాక్షి, సూర్యాపేట : అధికారుల పోస్టింగులకు సంబంధించి కోదాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. ఎమ్మెల్యే ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని, వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో వారిని తప్పిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే విశిష్ట అధికారాలతో వీరందరితో పని చేయించుకోవచ్చు అధికారం మన చేతుల్లో ఉందన్నారు. తాము చెబితే ఎవరైనా వినాల్సిందే అంటూ చేసిన వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అదే సందర్భంలో ఒక ఎంపీపీ వెళ్ళిపోతే మనకు ఏం కాదు ఆ మండలంలో ఎమ్మార్వో ఎస్సై ఎంపీడీవోలతో పనులు చేయించే బాధ్యత నాది అంటూ సదరు నాయకులు కార్యకర్తలకు ఆయన భరోసా ఇస్తున్నట్లు మాట్లాడిన వీడియో వాట్సాప్ గ్రూపులో విస్తృత చర్చకు దారితీసింది. అయితే ఈ వీడియో ఇటీవల మాట్లాడింది కాదని.. గతంలో (డిసెంబర్లో) మునగాల మండలం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడిన వీడియోగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కవల ఆడపిల్లల్ని కాదనుకున్న తల్లి
సాక్షి, కోదాడ: నెలల నిండకముందే పుట్టిన ఆ కవల ఆడ పిల్లలను ఆ తల్లి వద్దనుకుంది. వైద్యశాలకు వచ్చిన అత్త చేతిలో పెట్టి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈలోగా కవలల్లో ఒకరు.. మరికొంతసేపటికి మరొకరు.. ఇద్దరూ మృతిచెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన ఆరోగ్యానికి చిలుకూరుకు చెందిన నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఏడో నెల గర్భిణిగా ఉన్న ఆరోగ్యానికి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. ఆమెకు సాధారణ ప్రసవంలో కవల ఆడపిల్లలు జన్మించారు. బరువు తక్కువతో అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు చికిత్స కోసం ఖమ్మం వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. చదవండి: క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం విషయం తెలుసుకున్న భర్త, అతని తల్లి వైద్యశాలకు వచ్చారు. అంతలో ఆరోగ్యం.. తనకు పిల్లలు వద్దంటూ వారిని అత్త చేతిలో పెట్టి తల్లి గారింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త, అత్త కలిసి కవలలతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా, అప్పటికే ఇద్దరిలో ఒకరు మృతి చెందారని వైద్యులు చెప్పారు. మృతశిశువుతో పాటు బతికున్న శిశువును తీసుకొని వెళ్తున్న క్రమంలో రెండో బిడ్డ కూడా కన్నుమూసింది. ఇద్దరినీ స్వగ్రామంలో ఖననం చేశారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని కోదాడ రూరల్ పోలీసులు చెప్పారు. -
నెత్తురోడిన రహదారులు
సాక్షి, నల్గొండ : ఉమ్మడి జిల్లాలోని రహదారులు మరోమారు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ, గరిడేపల్లి, మునగాల, వేములపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. గరిడేపల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పోలె రాంబాబు (32) చిన్నపంగ చిన్నస్వామి(55) బైక్‌పై మండల కేంద్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి నుంచి గరిడేపల్లి వైపు వస్తున్న బొలేరో గడ్డిపల్లి శివరులో ఎదురుగా వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పోలె రాంబాబు, చిన్నపంగ చిన్నస్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. బ్యాంక్ పని నిమిత్తం వెళ్లిన మామా అల్లుడు కాసేపటికే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్ఐ వై.సైదులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి.. మునగాల(కోదాడ): మండలంలోని తాడువాయి గ్రామానికి చెందిన వీరమళ్ల ఉపేందర్(30) తన ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా విజయవాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్లే స్కార్పియో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఐదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్ఐ దాసరి మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఉపేందర్ మృతదేహంపై పడి భార్య తిరుమల రోదిస్తున్న తీరును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. కారు, బైక్ ఢీ.. ఒకరు.. వేములపల్లి (మిర్యాలగూడ) : మండలంలోని బుగ్గబావిగూడెం గ్రామానికి చెందిన పుట్ట శ్రీను(34) బైక్‌పై శెట్టిపాలెం శివారులోని ఆదిత్యా రైస్ మిల్లు వైపు నుంచి ఇంటికి వెళ్లేందుకు అన్నపురెడ్డిగూడెం స్టేజి వద్ద రోడ్డును దాటుతున్నాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని పంచనామా నిర్వహిం చారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోçస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధీర్‌కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి మృతుడు పుట్ట శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్‌నాయక్ కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీను మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు అయిన శ్రీను మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. పరామర్శించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి, నాయకులు రావు ఎల్లారెడ్డి, రొండి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కారు బోల్తా.. ఇద్దరు.. నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలోని పానగల్‌కు చెందిన బొప్పని నరేశ్ (32), పల్లపు అనిల్‌రాజు(37) స్నేహితులు. పని ఉందని సోమవారం రాత్రి పదిగంటలకు ఇంటినుంచి కారులో బయటికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వస్తుండగా పట్టణ శివారులో లెప్రసీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బొప్పని నరేశ్ అక్కడికక్కడే మృతిచెందగా అనిల్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థాని కులు అతడిని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనిల్‌రాజు స్థానిక హుందాయ్ షోరూంలో పనిచేస్తుండగా, నరేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.సమాచారం మేరకు ఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్ఐ నర్సింహులు పరిశీలించారు. నరేశ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కోదాడ ఎల్ఐసీ ఆఫీస్‌లో భారీ స్కామ్
-
కన్నతండ్రిని కడతేర్చిన తనయుడు
కోదాడరూరల్ : పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తండ్రినే కత్తి తో పొడిచి దారుణంగా హతమార్చా డు. ఈ ఘటన పట్టణంలోని నయానగర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నయానగర్‌లో నివాసం ఉండే గుండెల మల్లయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.చిన్న కుమారుడు రామకృష్ణ బీ ఫార్మసీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. మద్యం అలవాటు ఉన్న మల్లయ్య తరుచూ తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడుతున్నాడు. మూడు రోజుల క్రితం కూడా ఇంట్లో గొడవ జరి గింది. ఈ విషయాన్ని మల్లయ్య సోమవారం మున్సిపల్ కో అప్షన్ సభ్యుడైన తన సొదరుడు సూర్యానారాయణ ఇంటికి వెళ్లి జరిగిన గొడవ విషయాన్ని చెప్తున్నాడు. ఇది చూసిన రామకృష్ణ తన గురించి ఎదో చెప్తున్నాడని అతని పైకి క త్తితో దూసుకొచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన సూ ర్యానారయణను పక్కకు నెట్టేసి తండ్రి ఛాతిభాగంలో వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి పరారయ్యాడు. వెంటనే తెరుకున్న సూర్యానారాయణ అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయిన మల్లయ్యను స్థానికంగా ఉన్న ఓ వైద్యశాలకు తరలిం చారు. అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా రామకృష్ణ కోపిష్టని గతంలో కూడా తండ్రితో గొడవ పడిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. నిందితుడిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని సీఐ శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన మందు పందెం
కోదాడ అర్బన్ : ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం తాగే విషయంలో వేసుకున్న పందెం ఓ డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన గురువారం కోదాడ లో చోటు చేసుకుంది. వివరాలు.. లారీ డ్రైవర్లు మామిడి లక్ష్మయ్య, బ్రిటిష్‌స్నేహితులు. వీరు ఉదయం లారీ అసోసియేషన్ వద్ద మద్యం తాగేం దుకు ఉపక్రమంచారు. ఆ సమయంలో వారద్దిరి మద్యం తాగే విషయంలో వాదన మొదలైంది. మామిడి లక్ష్మయ్య తాను మద్యంలో నీళ్లు కలపకుండా అరగంటలో ఫుల్‌బాటిల్ తాగుతానని బ్రిటిష్‌తో పందెం కట్టాడు. అలా తాగితే తాను రూ.5వేలు ఇస్తానని పందెం కాశాడు. ఈ సందర్భంగా వారు తాగిన తరువాత ఏదైనా జరిగితే పందెం కాసిన వారికి సంబంధం లేదని ఒక కాగితంపై రాసుకున్నారు. అనంతరం లక్ష్మయ్య పందెం ప్రకారం ఎంసీ విస్కీ ఫుల్‌బాటిల్‌ను పావుగంటలోనే తాగి పడిపోయాడు. దీంతో బ్రిటిష్ పందెం మొత్తాన్ని లక్ష్మయ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మయ్య పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రేపటి వరకు ఎలా ఉంటుందనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. మొత్తం మీద మందుపందెం ప్రాణం మీదకు తెచ్చింది. -
కోదాడలో కానిస్టేబుల్ వివాహేతర సంబందం గుట్టురట్టు
-
బావిలోపడి అన్నదమ్ముల దుర్మరణం
చిలుకూరు (కోదాడ) : ఆ అన్నదమ్ములిద్దరు బీఈడీ వరకు చదువుకున్నారు. గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. మండలంలోని కొండాపురంలో గురువారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లా రంగయ్యకు ఇద్దరు కుమారులు పల్లా గోపాలరావు(32), పల్లా నరేష్(28). ఇద్దరు గురువారం ఉదయం గ్రామశివారులో బేతవోలు చెరువు పక్కన గల తమ వ్యవసాయ పొలంలో పురుగు మందు పిచికారి చేయడం కోసం తమతో పాటు మందు కొట్టేందుకు గ్రామానికి చెందిన పిల్లుట్ల బాలకృష్ణను వెంట తీసుకెళ్లారు. ట్యాంక్‌తో బాలకృష్ణ మదు కొడుతుండగా గోపాలకృష్ణ బావిలో నుంచి నీళ్లు అందిస్తున్నాడు. తమ్ముడు నరేష్ నీటిని తీసుకెళ్లి ట్యాంక్‌లో పోస్తున్నాడు. ఈ క్రమంలో గోపాలరావు ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. గోపాలరావుకు ఈత రాకపోవడంతో.. మునిగి పోతున్నాడు. గమనించిన తమ్ముడు నరేష్ అన్నను కాపాడబోయి.. తనకూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ట్యాంకులో నీళ్లు పోసేందుకు ఇద్దరూ రాకపోవడంతో బాలకృష్ణ బావి వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు బావిలో పడి మృతి చెందారు. విషయాన్ని వెంటనే బాలకృష్ణ మృతుల తండ్రి రంగయ్యకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ మృతిచెందడంతో.. గ్రామస్తుల సాయంతో బావిలోని మృతదేహాలను బయటకు తీశారు. గోపాలరావుకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నరేష్‌కు భార్య ఒక కుమారుడు ఉన్నారు. నరేష్ రైతు సమన్వయ సమితి కొండాపురం గ్రామ కోఆర్డి నేటర్‌గా ఇటీవల నియామకమయ్యాడు. చెరువు వెంట బావి ఉండడం వల్లే.. వీరి వ్యవసాయ బావి చెరువు వెంట ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. పలువురు పేర్కొంటున్నారు. బావి చాలా పెద్దగా ఉండడం.. చెరువు బావి కలిసినట్లు ఉండడం వల్ల అన్నను కాపాడే ప్రయత్నంలో నరేష్ కూడా మృతి చెందాడని అంటున్నారు. గ్రామంలో విషాదఛాయలు ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తండ్రి రంగయ్య, తల్లి ఆర్తనాదాలు పలువురుని కంటతడి పెట్టించాయి. రంగయ్య సర్పంచ్‌గా అందరి పరిచయస్తుడు కావడంతో ప్రజలు పెద్దఎత్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోపాలరావు, నరేష్ భార్యాపిల్లలను చూసి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ రవి పరిశీలించారు. తండ్రి రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చిక్కిన సేవా‘చీట్’ ఫండ్ యజమాని ?
కోదాడ : వందల మంది చిట్టీ సభ్యులను నిండా ముంచి బోర్డు తిప్పేసిన కోదాడలోని సేవా చిట్‌ఫండ్ నిర్వాహకుడు కోటేశ్వరరావును పోలీసులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టుకు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని కోదాడ స్టేషన్‌కు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకున్న బాధితులు వందల మంది స్టేషన్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ చట్ట పరిధిలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అతని వద్ద ఎంత మంది చిట్టీలు కట్టారు, ఎంత మందికి చెల్లించాలనే విషయాన్ని సేకరిస్తున్నామని, బాధితులు కూడా తమ వద్ద ఉన వివరాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ.12 కోట్లు సేవాచిట్ ఫండ్ సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ. 12 కోట్ల వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 524 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది కాక తెలిసిన వారి నుంచి వడ్డీలకు తెచ్చింది ఇంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. ఇది సివిల్ వ్యవహారం కాబట్టి వడ్డీ డబ్బుల విషయంలో పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదు. కేవలం చిట్ సభ్యుల డబ్బుల విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులందరిపై కేసులు? సేవాచిట్ ఫండ్ విషయంలో పోలీసులు ఒక్క నిర్వాహకుడిపై కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇది చూసి మరే ఇతర చిట్టీల నిర్వాహకుడు.. సభ్యులను ఇబ్బంది పెట్టకుండా భయపడే విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అతని పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. చిట్ నిర్వహణలో అతనికి తోడుగా ఉన్న తమ్ముడు రమేష్, సహాయపడిన మరో ఇద్దరితో పాటు కోటేశ్వరరావు భార్య, కుమారుడు, కుమార్తెల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలిసింది పలువురు ఏజెంట్లపై కూడా... సేవా చిట్‌ఫండ్‌లో సభ్యులను చేర్పించిన ఏజెంట్లపై కూడా పోలీసులు కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. 10 మంది ఏజెంట్లు సభ్యులను చేర్పించడంలో తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడ కుండా కేవలం కమీషన్ కోసం అమాయకులను చిట్టీలలో చేర్పించడం నేరం కాబట్టీ వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని సమాచారం. కోటేశ్వరరావు పలురకాల వ్యాధులతో బాధపడుతుండడంతో ఆయనను వీలైంత త్వరగా కోర్టుకు రిమాండ్ చేసి ఆ తరువాత కోర్టు అనుమతితో మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా విచారిస్తున్నాం సేవా చిట్‌ఫండ్ నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులందరి పైన ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా రిజిస్టర్ ఉన్న చిట్‌ఫండ్ కంపెనీలలో మాత్రమే చేరాలని కోరారు. కోదాడలో ఉన్న ఇతర చిట్‌ఫండ్ సంస్థల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ కేసు కొలిక్కి వచ్చిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
అనంతగిరి (కోదాడ): బోరును సీజ్ చేస్తామని అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘట న అనంతగిరిలో సోమవారం చోటు చేసుకుంది. మం డల పరిధిలోని గోండ్రియాలకు చెందిన రైతు నెల్లూరి రాజేంద్రప్రసాద్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బోరు విషయంలో పక్కపక్క పొలాలకు చెందిన రైతులు గొడవ పడి అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో తన బోరును సీజ్ చెయ్యకుండా రాజేంద్ర ప్రసాద్ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికారులు రోజు వచ్చి తన బోరును సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం కార్యాలయానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. చట్టప్రకారం వ్యవరిస్తామని తహసీల్దార్ స్పష్టం చేయడంతో ఆయన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగారు. వెంటనే అధికారులు ఆయనను కోదాడకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కోదాడ(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జాతీయరహదారిపై గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కోదాడ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే విజయవాడకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.