కన్నతండ్రిని కడతేర్చిన తనయుడు | Son Attack On Father Died In Nalgonda District | Sakshi
Sakshi News home page

కన్నతండ్రిని కడతేర్చిన తనయుడు

Published Tue, Feb 12 2019 11:25 AM | Last Updated on Tue, Feb 12 2019 11:39 AM

Son Attack On Father Died In Nalgonda District - Sakshi

కోదాడరూరల్‌ : పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తండ్రినే కత్తి తో పొడిచి దారుణంగా హతమార్చా డు. ఈ ఘటన పట్టణంలోని నయానగర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నయానగర్‌లో నివాసం ఉండే గుండెల మల్లయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.చిన్న కుమారుడు రామకృష్ణ బీ ఫార్మసీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. మద్యం అలవాటు ఉన్న మల్లయ్య తరుచూ తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడుతున్నాడు. మూడు రోజుల క్రితం కూడా ఇంట్లో గొడవ జరి గింది. ఈ విషయాన్ని మల్లయ్య సోమవారం మున్సిపల్‌ కో అప్షన్‌ సభ్యుడైన తన సొదరుడు సూర్యానారాయణ ఇంటికి వెళ్లి  జరిగిన గొడవ విషయాన్ని చెప్తున్నాడు.

ఇది చూసిన రామకృష్ణ తన గురించి ఎదో చెప్తున్నాడని అతని పైకి క త్తితో దూసుకొచ్చి  దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన సూ ర్యానారయణను పక్కకు నెట్టేసి తండ్రి ఛాతిభాగంలో వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి పరారయ్యాడు. వెంటనే తెరుకున్న సూర్యానారాయణ అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయిన   మల్లయ్యను స్థానికంగా ఉన్న ఓ వైద్యశాలకు తరలిం చారు. అతన్ని  పరిశీలించిన వైద్యులు  అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా రామకృష్ణ కోపిష్టని గతంలో కూడా తండ్రితో గొడవ పడిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. నిందితుడిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని సీఐ శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement