సరూర్నగర్: ఒక పక్క విదేశాల్లో గాంధీ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటే.. మన దేశంలో మాత్రం ప్రతిష్టించిన గాంధీ విగ్రహలను కూల్చుతున్నారు. వివరాలు బుధవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 10లో ఉన్న గాంధీ విగ్రహన్ని గుర్తుతెలియని దుండగులు కూల్చివేశారు. అనంతరం విగ్రహన్ని చెత్తకుప్పల్లో వేసి పరారయ్యారు. విషయం తెలిసిన కాలనీ వాసులు వెంటనే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.