statue dismantled
-
సరూర్నగర్ లో గాంధీ విగ్రహం ధ్వంసం
సరూర్నగర్: ఒక పక్క విదేశాల్లో గాంధీ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటే.. మన దేశంలో మాత్రం ప్రతిష్టించిన గాంధీ విగ్రహలను కూల్చుతున్నారు. వివరాలు బుధవారం రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 10లో ఉన్న గాంధీ విగ్రహన్ని గుర్తుతెలియని దుండగులు కూల్చివేశారు. అనంతరం విగ్రహన్ని చెత్తకుప్పల్లో వేసి పరారయ్యారు. విషయం తెలిసిన కాలనీ వాసులు వెంటనే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!
మాస్కో: ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని ధ్వంస చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ లో గత శుక్రవారం చోటు చేసుకుంది. తాను స్వలింగ సంపర్కుడినని ఆపిల్ కంపెనీ ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కారణంగా తాము స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది.