Shocking Details Out In Apsara Case After Crime Scene Reconstruction - Sakshi
Sakshi News home page

సాయి షాకింగ్‌ మర్డర్‌ స్కెచ్‌! అప్సర హత్యకు 15 రోజుల ముందే గొయ్యి తవ్వి..

Published Fri, Jun 16 2023 7:02 PM | Last Updated on Fri, Jun 16 2023 7:28 PM

Shocking Details Out In Apsara Case After Crime Scene Reconstruction - Sakshi

అప్సరను వేధింపులను సాయి తట్టుకోలేకపోయాడా?.. చంపడం ఒక్కటే.. 

సాక్షి, హైదరాబాద్‌: అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న శంషాబాద్‌ పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఆమె హత్యకంటే 15 రోజుల ముందే సాయి ఎలాంటి స్కెచ్‌ వేశాడనే విషయం తెలిసి పోలీసులు సైతం కంగుతిన్నారు.  

అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రారంభించారు. జూన్‌ 3వ తేదీన హత్య జరిగిన ఘటనాస్థలి నర్కూడ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఘటన హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేసేందుకు ముందుగా సాయి వేసుకున్న ప్లాన్‌ సైతం తెలిసింది. 
ఇదీ చదవండి: అప్సర చేసింది కరెక్ట్‌ కాదు-సాయి భార్య

అప్సర వేధింపులను సాయి తట్టుకోలేకపోయాడు. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్‌ వేసుకున్నాడు. సరూర్‌ నగర్‌లో తాను పూజారిగా పని చేసే గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు. 

ఇదిలా ఉంటే.. నర్కూడలో క్రిమినల్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిశాక.. సరూర్ నగర్‌లో అప్సర మృతదేహాన్ని పూడ్చేసిన మ్యాన్ హోల్ దగ్గరికి తీసుకెళ్లారు. రంగారెడ్డి కోర్టు రెండురోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించడంతో.. ఇవాళ, రేపు అప్సర కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.  

ఇదీ చదవండి: అప్సర కేసు.. అప్సర మాజీ భర్త తల్లి సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement