సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు.
గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు.
గూగుల్‌లో సెర్చింగ్..
హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు.
టికెట్ కొనలేదని చెప్పి మరీ..
జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్‌లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ.
ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే!
Comments
Please login to add a commentAdd a comment