మద్యానికి బానిసైన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగింది.
సరూర్‌నగర్ (రంగారెడ్డి) : మద్యానికి బానిసైన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. కాగా అతనికి మద్యం తాగేందుకు డబ్బులేకుండాపోయింది.
దీంతో డబ్బు సంపాదించే అవకాశం లేక మద్యం అలవాటు మానలేకపోయిన అతను సరూర్‌నగర్‌లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.