హైదరాబాద్ : ఖాకీల కావరానికి ఇదో నిదర్శనం. అందరూ చూస్తుండగనే పట్టపగలు నడిరోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు వీరంగం సృష్టించారు. ఓ ఆటో డ్రైవర్ను కిందపడేసి మరీ కొట్టారు. బూటు కాళ్లతో విచక్షణారహితంగా తన్నారు. హైదరాబాద్ సరూర్‌నగర్ చెరువు కట్ట సమీపంలో జరిగిన ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన వారికి షాక్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే...చెరువకట్ట వద్ద వున్న ఓ మసీదు వద్ద ఓ ఆటోవాలా తన ఆటోను నిలిపాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు...అక్కడెందుకు ఆటో నిలిపావ్ రా అంటూ బీభత్సం సృష్టించారు. ఆటోవాలాను పట్టుకుని దారుణంగా కొట్టారు. ఈ దురాగతానికి పాల్పడిన ట్రాఫిక్ పోలీసులకు కనీసం నేమ్ బ్యాడ్జీలు కూడా లేకపోవడం గమనార్హం.
ఆటో డ్రైవర్పై ట్రాఫిక్ పోలీసుల వీరంగం
Published Thu, Apr 10 2014 1:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement
Advertisement