హైదరాబాద్ : లాడ్జ్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 55 వేల నగదుతోపాటు 8 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ లాడ్జ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.